వింధ్య విశాఖ మేడపాటి
వింధ్య విశాఖ మేడపాటి | |
---|---|
జననం | వింధ్య విశాఖ మేడపాటి ఏప్రిల్ 18, 1992 |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | టెలివిజన్ వ్యాఖ్యాత, స్పోర్ట్స్ ప్రెజెంటర్, వీడియో జాకీ, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2011 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | విశాల్ కుమార్ |
తల్లిదండ్రులు | ఎం. సత్తిరెడ్డి, మమత చక్రవర్తి |
వింధ్య విశాఖ మేడపాటి, టెలివిజన్ వ్యాఖ్యాత, స్పోర్ట్స్ ప్రెజెంటర్, వీడియో జాకీ, మోడల్. తెలుగులో స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా పేరొందింది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తో తెలుగులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ను నిర్వహించిన తొలి మహిళగా గుర్తింపు పొందింది.[1][2] ప్రస్తుతం స్టార్ స్పోర్ట్స్, హోస్ట్ కోర్డి లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్, 2019 క్రికెట్ ప్రపంచ కప్ వంటి టోర్నమెంట్లకు వ్యాఖ్యాతగా పనిచేస్తోంది. వింధ్య స్వేచ్ఛ వెల్ఫేర్ ఫౌండేషన్ సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.[3]
ప్రారంభ జీవితం, కుటుంబం
[మార్చు]వింధ్య 1992, ఏప్రిల్ 18న సికింద్రాబాద్‌లో జన్మించింది. ఈమె తండ్రి ఎం. సత్తిరెడ్డి రైతు కాగా తల్లి మమత చక్రవర్తి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. వింధ్య మారేడ్ పల్లిలోని కస్తూర్బా గాంధీ మహిళా డిగ్రీ, పిజి కళాశాల నుండి డిగ్రీ విద్యను చదివి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఏ. ఇంగ్లీష్ (మాస్టర్స్ డిగ్రీ) పూర్తి చేసింది.[1]
వృత్తిజీవితం
[మార్చు]మోడలింగ్ మీద ఆసక్తివున్న వింధ్య 2011లో ఫ్యాషన్ బిగ్ బజార్ వారి మిస్ కవర్ గర్ల్ హైదరాబాద్, కళామందిర్ హైదరాబాద్ ఫ్యాషన్ వీక్‌లో వాక్డ్ ది ర్యాంప్ రన్నరప్‌గా నిలిచింది. 2011, నవంబరులో హెచ్‌ఎమ్‌టివిలో న్యూస్ రీడర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన వింధ్య, 2013లో స్టార్ మా మ్యూజిక్‌లో విజేగా చేరి మార్నింగ్ లైవ్ షో 'చాయ్ బిస్కట్' కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. 2014లో జీ తెలుగులో 'ఫ్యామిలీ సర్కస్' అనే కామెడీ షోను, 2016 నుండి 2017వరకు ఈటీవీ ప్లస్‌లో 'హంగామా' అనే మరో కామెడీ షో నిర్వహించింది. టీవీ9లో హాట్ వీల్స్, ఈటీవీ 2లో సఖీ, మా టీవీలో మా ఊరి వంట మొదలైన కార్యక్రమాలు నిర్వహించింది.[1] 2017, జూలైలో, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా చేరి, ప్రో కబడ్డీ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్‌తో సహా ఇతర టోర్నమెంట్‌లకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ప్రస్తుతం ఈటీవీలో దంపతులకు కోసం 'నువ్ రెడీ నేను రెడీ' అనే ఒక గేమ్ షోను నిర్వహిస్తోంది.
సినీ'మా' అవార్డులు, ఫిల్మ్ ఫేర్ అవార్డులు, సంతోషం సినీ అవార్డులు, జీ కుటుంబం అవార్డులు, జీ సినీ అవార్డులు 2017 వంటి అవార్డు ఫంక్షన్లకు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించింది.
టెలివిజన్ కార్యక్రమాలు
[మార్చు]సంవత్సరం | కార్యక్రమం | విభాగం | ఛానల్ |
---|---|---|---|
2012 | లూట్ మార్ | వ్యాఖ్యాత | వి6 న్యూస్ |
2013 | చాయ్ బిస్కట్ | వ్యాఖ్యాత | స్టార్ మా మ్యూజిక్ |
హాట్ వీల్స్ (ఆటోమోటీవ్ షో) | వ్యాఖ్యాత | టీవీ9 | |
2014 | ఫ్యామిలీ సర్కస్ | వ్యాఖ్యాత | జీ తెలుగు |
2016 | వీకెండ్ మస్తీ | వ్యాఖ్యాత | టీవీ9 |
డ్రీమ్ డిజైన్స్ (ఇంటీరియర్ డిజైన్ షో) | వ్యాఖ్యాత | హెచ్ ఎమ్ టివి | |
మా వూరి వంట (వంటల కార్యక్రమం) | వ్యాఖ్యాత | స్టార్ మా | |
కెవ్వు కబడ్డీ | పోటిదారు (డార్లింగ్ డెవిల్స్) | జెమినీ టీవీ | |
హంగామా (కామెడీ షో) | వ్యాఖ్యాత | ఈటీవీ ప్లస్ | |
2017 | కెబిడి లైవ్ (2017 ప్రో కబడ్డీ లీగ్) | స్పోర్ట్స్ ప్రజెంటర్ | స్టార్ మా గోల్డ్ |
2018 | కెంట్ క్రికెట్ లైవ్ (2018 ఇండియన్ ప్రీమియర్ లీగ్) | స్పోర్ట్స్ ప్రజెంటర్ | స్టార్ మా గోల్డ్ |
కెబిడి లైవ్ (2018-2019 ప్రో కబడ్డీ లీగ్) | స్పోర్ట్స్ ప్రజెంటర్ | స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు | |
2019 | మారుతి సుజీకి క్రికెట్ లైవ్ (2019 ఇండియన్ ప్రీమియర్ లీగ్) | స్పోర్ట్స్ ప్రజెంటర్ | స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు |
ఫిలిప్స్ హుయీ క్రికెట్ లైవ్ (ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ 2019) | స్పోర్ట్స్ ప్రజెంటర్ | స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు | |
కెబిడి లైవ్ (2019 ప్రో కబడ్డీ లీగ్) | స్పోర్ట్స్ ప్రజెంటర్ | స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు | |
2020 - ప్రస్తుతం | నువ్వు రెడీ నేను రెడీ | వ్యాఖ్యాత | ఈటీవీ |
అవార్డులు, గుర్తింపులు
[మార్చు]- 2019 ఐపీఎల్‌కు ఉత్తమ మహిళా వ్యాఖ్యాతగా పద్మోమోహన టీవీ అవార్డు
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 సాక్షి, క్రీడలు (క్రికెట్) (25 April 2018). "ఐపీఎల్‌లో తెలుగమ్మాయి". Archived from the original on 24 October 2020. Retrieved 13 December 2020.
- ↑ The Hans India, Featured, Womenia (18 April 2018). "Sporting Success!". Archived from the original on 13 December 2020. Retrieved 13 December 2020.
{{cite news}}
: CS1 maint: multiple names: authors list (link) - ↑ సాక్షి, ఫ్యామిలీ (19 April 2021). "ఇతడిని పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి ఏంటి? అనుకున్నా." Sakshi. Archived from the original on 19 April 2021. Retrieved 19 April 2021.