వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2012 01వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుంటూరు జిల్లా


గుంటూరు జిల్లా 11,391 చ.కి.మీ. ల విస్తీర్ణములో వ్యాపించి, 48,89,230 (2011 గణన) జనాభా కలిగిఉన్నది. జిల్లాకు తూర్పు, ఈశాన్యాన కృష్ణా నది ప్రవహిస్తూ జిల్లాను కృష్ణా జిల్లా నుండి వేరు చేయుచున్నది. ఆగ్నేయాన బంగాళాఖాతము, దక్షిణాన ప్రకాశం జిల్లా, పశ్చిమాన మహబూబ్ నగర్ జిల్లా, మరియు వాయువ్యాన నల్గొండ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. దీని ముఖ్యపట్టణం గుంటూరు

ఈ జిల్లాకు అతి పురాతన చరిత్ర వుంది. మౌర్యులు, శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు పరిపాలించారు. పల్నాటి యుద్ధం ఇక్కడే జరిగింది. మొగలు సామ్రాజ్యం, నిజాం పాలన, ఈస్ట్ ఇండియా కంపెనీ ఆ తరువాత మద్రాసు ప్రసిడెన్సీలో భాగమైనది. స్వాతంత్ర్య సమరంలో పెదనందిపాడు పన్నుల ఎగవేత, సైమన్ కమీషన్ వుద్యమం లాంటి ఎన్నో చారిత్రక ఘట్టాల ఈ జిల్లాలో జరిగాయి. స్వాతంత్ర్యం తరువాత ఆంధ్రరాష్ట్రంలో, ఆ తదుపరి ఆంధ్రప్రదేశ్ లో భాగమైంది.

విద్యా కేంద్రంగా అనాది నుండీ పేరు పొందింది.నాగార్జున విశ్వవిద్యాలయం, బాపట్ల వ్యవసాయ కళాశాల, పలు ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలు, పలు ప్రైవేట్ విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు వున్నాయి. వరి, పొగాకు, ప్రత్తి మరియు మిర్చి జిల్లా యొక్క ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు. కృష్ణ ముఖ్య నది. చంద్రవంక, నాగులేరు, గుండ్లకమ్మ జిల్లాలో ముఖ్య వాగులు. జిల్లా లోని ముఖ్య చారిత్రక స్థలాలలో పేరుపొందినవి అమరావతి, భట్టిప్రోలు, ఉండవల్లి గుహలు మరియు గుంటూరు లోని మ్యూజియం,

చరిత్ర

గుంటూరు ప్రాంతంలో పాత రాతి యుగము నాటినుండి మానవుడు నివసించినాడనుటకు ఆధారములు కలవు. పాత రాతియుగపు (పేలియోలిథిక్) పనిముట్లు గుంటూరు జిల్లాలో దొరికాయి. వేంగీ చాళుక్య రాజు అయిన అమ్మరాజ (922-929) యొక్క శాసనాలలో గుంటూరు గురించిన ప్రధమ ప్రస్తావన ఉన్నది. 1147 మరియు 1158 నాటి రెండు శాసనాలలో కూడ గుంటూరు ప్రసక్తి ఉన్నది.


ఇంకా....పూర్తివ్యాసం పాతవి