Jump to content

ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ కళాశాల, బాపట్ల

వికీపీడియా నుండి
(బాపట్ల వ్యవసాయ కళాశాల నుండి దారిమార్పు చెందింది)
బాపట్ల వ్యవసాయ కళాశాల ప్రవేశం

బాపట్ల వ్యవసాయ కళాశాల, ఇది 1945 జూలై 11 న మద్రాస్ ప్రెసిడెన్సీ పాలన కాలంలో స్థాపించబడింది.[1] దీని నిర్వహణ ఆచార్య N.G.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో సాగుతుంది. నడపబడుతుంది.ఇది బాపట్ల నుండి సూర్యలంక వెళ్ళే దారిలో ఉంది.ఇది ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటి వ్యవసాయ కళాశాలగా, దక్షిణభారతదేశంలో రెండవదిగా గుర్తించబడింది. ఇది మొదట ఆంధ్ర విశ్వవిద్యాలయం కింద ఉండేది.1964 లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించాక దానిపరిధి కిందకు వచ్చింది.ఆంధ్రప్రదేశ్‌లోని ఆచార్య ఎన్ జి రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్యర్యంలో నిర్వహించుచున్న ఎనిమిది కళాశాలలో ఇది పురాతనమైంది.[1]

చరిత్ర

[మార్చు]

బాపట్ల వ్యవసాయ కళాశాల, ఇది 1945 జూలై 11 న మద్రాస్ ప్రెసిడెన్సీ పాలన కాలంలో స్థాపించబడింది.బాపట్ల - గుంటూరు రహదారిపై 1950 లో 328 ఎకరాల విస్తీర్ణం కళాశాలకు కేటాయించబడింది.దీని మొదటి ప్రిన్సిపాల్‌గా సి ఆర్ శ్రీనివాస అయ్యంగార్ పనిచేసాడు.[2] ఈ కళాశాల 1945 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది.ఆంధ్ర విశ్వవిద్యాలయం, వాల్తేరు నుండి 1948 లో మొదటి గ్రాడ్యుయేటింగ్ తరగతి వారి డిగ్రీని పొందింది.అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు వ్యవసాయ విద్యను అందించడం, వ్యవసాయ గ్రాడ్యుయేట్లను వివిధ పునర్నిర్మాణ పథకాలకు నిపుణులుగా తయారుచేయడం అనే లక్ష్యంతో ఇది ప్రారంభించబడింది.1951 లో పరిశోధనల ద్వారా ఎం.యస్సీ (అగ్రికల్చరల్) పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సును ప్రవేశపెట్టటానికి కళాశాల గుర్తింపు పొందింది.1964 జూన్ 12 న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించిన తరువాత ఇది అందులో ఒక భాగమైంది.1982 లో వ్యవసాయ శాస్త్ర, మొక్కల పాథాలజీ, 1968 లో జన్యుశాస్త్రం, మొక్కల పెంపకం,1970 లో ఎంటమాలజీ, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ, 1976 లో అగ్రికల్చరల్ ఎకనామిక్స్, 1978 లో ప్లాంట్ ఫిజియాలజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు ప్రారంభించబడ్డాయి.1993 లో ప్లాంట్ పాథాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, ఎంటమాలజీలో పిహెచ్‌డి కోర్సులు ప్రారంభమయ్యాయి.[3] ఎం.వి. రెడ్డి ప్రొఫెసర్, ప్రిన్సిపాల్ 1980 నుండి 1983 వరకుపనిచేసాడు.వ్యవసాయ కళాశాల బాపట్ల అసోసియేట్ డీన్‌గా డి.లోకనాధ రెడ్డిని 2017 సెప్టెంబరు 1 న నియమించారు. ఈ కళాశాల స్థాపించినప్పటి నుండి 2009-10 నాటికి 6846 అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, 1430 పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.

కళాశాల ఉత్సవాలు

[మార్చు]

1970 -71 లో సిల్వర్ జూబ్లీ, 1994-95 లో గోల్డెన్ జూబ్లీ, 2006 లో డైమండ్ జూబ్లీ ఉత్సవాలు జరుపుకుంది.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "Agricultural College | Bapatla". web.archive.org. 2018-07-21. Archived from the original on 2018-07-21. Retrieved 2020-07-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Agricultural College | Bapatla". web.archive.org. 2016-03-10. Archived from the original on 2016-03-10. Retrieved 2020-07-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "Agricultural College Bapatla, Andhra Pradesh". vymaps.com. Retrieved 2020-07-09.

వెలుపలి లంకెలు

[మార్చు]