అక్షాంశ రేఖాంశాలు: 17°19′17.44″N 78°24′35.32″E / 17.3215111°N 78.4098111°E / 17.3215111; 78.4098111

ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
(ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
రకంజాతీయ విశ్వవిద్యాలయం
స్థాపితం1964 జూన్ 12
ఛాన్సలర్ఎస్. రఘువర్ధన్ రెడ్డి
వైస్ ఛాన్సలర్ఎ. పద్మా రాజు
స్థానంలాం, గుంటూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
కాంపస్పట్టణ ప్రాంతం
పాత పేరుఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం
అనుబంధాలుయు.జి.సి.
జాలగూడుwww.angrau.ac.in

ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా, తాడికొండ మండలంలోని లాం గ్రామం కేంద్రంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ విశ్వవిద్యాలయం.

చరిత్ర

[మార్చు]
The Vice President, Shri M. Venkaiah Naidu addressing the 49th Convocation of Acharya N.G. Ranga Agricultural University (ANGRAU), in Nellore, Andhra Pradesh
నెల్లూరు లోని ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ, 49వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తున్న ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు.

విశ్వవిద్యాలయ జాలస్థలంలో ఇచ్చిన సమాచారం ప్రకారం ఆచార్య ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయం (ANGRAU) ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా 1964 జూన్ 12న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్టం 1963 ద్వారా స్థాపించబడింది. 1996 నవంబరు 7న, విశ్వవిద్యాలయం పేరును వ్యవసాయవేత్త, నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా పేరుతో, 'ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం'గా పేరు మార్చబడింది.

ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఒ.పుల్లారెడ్డి ప్రథమ ఉపసంచాలకునిగా పనిచేశాడు. విశ్వవిద్యాలయానికి అధికారికంగా 1965, మార్చి 20న అప్పటి భారత ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి ప్రారంభించాడు. 1966, జూన్ 23న ఇందిరా గాంధీ విశ్వవిద్యాలయభవన సముదాయానికి ప్రారంభోత్సవం చేసింది.

అర్ధశతాబ్ది పూర్తి చేసుకోబోతూండగా రాష్ట్ర విభజన కారణంగా, తెలంగాణ కొరకు, తెలంగాణ ప్రాంతంలోని విశ్వవిద్యాలయ భాగాలను ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరుతో వేరు చేశారు. అవశేష విశ్వవిద్యాలయానికి నవ్యాంధ్ర రాజధానికి దగ్గరలోని తాడికొండ మండలంలోని చేరువలో ఉన్న లాం గ్రామం కేంద్రమైంది.[1]

విశ్వవిద్యాలయం అందిస్తున్న కోర్సులు

[మార్చు]
డిగ్రీ కోర్సులు

బి.ఎస్.సి. (వ్యవసాయం), బి.ఎస్.సి. (ఉద్యానవనం), బి.టెక్ (వ్యవసాయ ఇంజినీరింగ్), బి.వి.ఎస్.సి (పశువైద్యం), బి.ఎస్.సి. (సి.ఎ & బి.ఎమ్), బి.ఎచ్.ఎస్.సి (గృహవిజ్ఞాన శాస్త్రం), బి.టెక్ (పుడ్ సైన్సు).

పి.జి. కోర్సులు

ఎమ్.ఎస్.సి (వ్యవసాయం), ఎమ్.వి.ఎస్.సి (పశువైద్యం), ఎమ్.ఎ.బి.ఎమ్, ఎమ్.ఎస్.సి (అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ), ఎమ్.ఎస్.సి (ఎన్విరాన్ మెంటల్ సైన్సు అండ్ టెక్నాలజీ), ఎమ్.ఎస్.సి (గృహవిజ్ఞాన శాస్త్రం), ఎమ్.ఎస్.సి (పుడ్ సైన్సు అండ్ టెక్నాలజీ).

రీసెర్చ్ కోర్సులు

వ్యవసాయం, పశువైద్యం, గృహవిజ్ఞాన శాస్త్రాలలో పి.ఎచ్.డి.

పాలిటెక్నిక్ కోర్సులు

వ్యవసాయంలో డిప్లొమా, ఉద్యానవన శాస్త్రంలో డిప్లొమా, గృహవిజ్ఞాన శాస్త్రంలో డిప్లొమా.

అవార్డులు

[మార్చు]
  • ఈ విశ్వవిద్యాలయం వ్యవసాయాభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా 2007 సంవత్సరానికి సర్దార్ పటేల్ ఔట్ స్టాండింగ్ ఐ.సి.ఎ.ఆర్. ఇనిస్టిట్యూట్ అవార్డు లభించింది.[2]

పత్రిక

[మార్చు]

వ్యవసాయం [3] అనబడే తెలుగు మాస పత్రికని ప్రచురిస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. "ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం". Archived from the original on 2019-04-13. Retrieved 2019-04-13.
  2. వ్యవసాయ వర్సిటీకి 'సర్దార్ పటేల్' అవార్డు, అన్నదాత ఆగష్టు 2008 పత్రిక.
  3. "వ్యవసాయం". Archived from the original on 2010-02-11. Retrieved 2010-06-12.

వెలుపలి లంకెలు

[మార్చు]