వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 23
Appearance
- 634 : ఇస్లాంను స్వీకరించినవారిలో ప్రథముడు అబూబక్ర్ మరణం.
- 1872 : ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం జననం (మ.1957).(చిత్రంలో)
- 1890 : తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు పురుషోత్తమ చౌదరి మరణం.(జ.1803)
- 1900 : కవి,పండితుడు మరియు గ్రంథ రచయిత మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ జననం.(మ.1974)
- 1918 : భారత దేశానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త అన్నా మణి జననం.(మ.2001)
- 1932 : తెలుగు రచయిత, కవి ఉండేల మాలకొండ రెడ్డి జననం.
- 1953 : ఉత్తరాంధ్రకు చెందిన కథా, నవలా రచయిత అట్టాడ అప్పల్నాయుడు జననం.
- 1966 : చంద్రుని కక్ష్య నుండి భూమి యొక్క చిత్రాన్ని లూనార్ ఆర్బిటర్ 1 తీసింది.
- 1971 : అనేక సీ వరల్డ్ ప్రదర్శనలలో అద్భుతమైన ప్రదర్శనలిచ్చిన షామూ మరణం.
- 1994 : ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ ఆరతి సాహా మరణం.(జ.1940)