ఉండేల మాలకొండారెడ్డి

వికీపీడియా నుండి
(ఉండేల మాలకొండ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఉండేల మాలకొండారెడ్డి
చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వెబ్‌సైటు లో ఉండేల మాలకొండారెడ్డి చిత్రము
పుట్టిన తేదీ, స్థలం (1932-08-23) 1932 ఆగస్టు 23 (వయసు 91)
ప్రకాశం జిల్లా ఇనిమెర్ల
వృత్తిరచయిత, అధ్యాపకుడు, విద్యావేత్త, పారిశ్రామికవేత్త
జాతీయతభారతీయుడు
కాలం20వ శతాబ్దం
విషయంతెలుగు సాహిత్యము
జీవిత భాగస్వామిసరస్వతి
Website
http://www.cbit.ac.in/?q=node/686

ఉండేల మాలకొండారెడ్డి ప్రముఖ కవి, ఒక ఇంజనీరు. ఆయన తెలుగు రచయిత, కవిగా ప్రసిద్ధి చెందాడు..[1] అతడు చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గండిపేట, హైదరాబాదు నకు వ్యవస్థాపకుడు.

జీవిత విశేషాలు[మార్చు]

ఈయన 1932 ఆగస్టు 23ప్రకాశం జిల్లా లోని ఇనిమెట్ల గ్రామంలో జన్మించాడు. అల్లూరు, నెల్లూరులలో పాఠశాల చదువుముగించి మద్రాసు గిండీ ఇంజనీరింగు కళాశాలలో బి.యి. డిగ్రీ చదివాడు. ఎడిన్‌బరో యూనివర్శిటీ (బ్రిటన్) నుండి స్ట్రక్చరల్ ఇంజనీరింగులో డాక్టరేట్ సాధించాడు. 1955-57లో పి.డబ్ల్యూ.డి.లో సివిల్ ఇంజనీర్‌గా పనిచేశాడు. తరువాత నాలుగు సంవత్సరాలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆతర్వాత ఇరవై సంవత్సరాలు వరంగల్ లోని ప్రాంతీయ ఇంజనీరింగ కళాశాల (ఆర్.ఈ. సి) లో ప్రొఫెసర్‌గా పనిచేశాడు. 1979లో చైతన్యభారతి ఇంజనీరింగ్ కళాశాల (సి.బి.ఐ.టి) ను స్థాపించాడు.ఆ కాలేజీకి మొట్టమొదటి ప్రిన్సిపాల్‌గా ఉన్నాడు. ఆ సంస్థకు ఫౌండర్ సెక్రెటరీగా, ఛైర్మన్ (2000-2003) గా, అడ్వైజర్‌గా సేవలనందించాడు. జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా 1996-2004ల మధ్య పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల అసోసియేషన్‌కు కార్యదర్శిగాను, జాతీయ స్థాయిలో ఫెడరేషన్ ఆఫ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజస్ అసోసియేషన్స్‌కు అధ్యక్షుడిగాను ఉన్నాడు. సుజన యూనివర్సల్ ఇండస్ట్రీస్‌కు, సుజన మెటల్స్ ప్రాడక్ట్స్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఇతడు స్ట్రక్చరల్ ఇంజనీరింగులో ఎన్నో పరిశోధనాపత్రాలు దేశ విదేశ జర్నల్స్‌లో ప్రచురించాడు. 1986లో అంతర్జాతీయ వైద్య మహానగర్ మెడిసిటీని స్థాపించాడు. హైదరాబాదులో హోటల్ సిద్ధార్థ, నందనం అపార్ట్‌మెంట్స్, వరంగల్‌లో సిద్ధార్థనగర్, చైతన్యపురి వంటివాటిని నిర్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సెనెట్ సభ్యుడిగా గౌరవించబడ్డాడు. ఎ.పి.సైన్స్ అకాడమీకి ఫెలోసభ్యుడిగా ఉన్నాడు.[2][3][4] [5]

సాహిత్యరంగం[మార్చు]

ఇతడు చిన్నతనం నుండే కవిత్వం చెప్పనారంభించాడు. ఎన్నో గ్రంథాలను ప్రచురించాడు.

రచనలు[మార్చు]

తెలుగు కవితలు[మార్చు]

  • మాలకొండనోట మంచిమాట[6] (శతకం)
  • దైవానికి మతంలేదు
  • మానవగీత
  • నేతాజీ (1946)
  • వివేకానందుడు (1953)
  • కాంతి చక్రాలు (1959)
  • మొగలి రేకులు (1981)
  • ఒడెసిల రాళ్ళు (1986)
  • విలపించే ఉత్తరం (1992)
  • "సత్యం శివం సుందరం"[7] (1996)

ఆంగ్ల కవితలు[మార్చు]

  • Gloating Grass (1988) presented at 10th World Congress of Poets at Bangkok
  • Special Number (1992) International Poets Academy, Madras

సేవలు[మార్చు]

  • సివిల్ ఇంజనీర్, పి.డబ్ల్యూ.డి, ఆంధ్ర ప్రదేశ్. (1955–57)
  • లెక్చరర్, ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్, హైదరాబాదు. (1957–61)
  • ప్రొఫెసర్, సివిల్ ఇంజనీరింగ్, రీజనల్ ఇంజనీర్ంగ్ కాలేజ్, వరంగల్ కు అధిపతి.Warangal (1961–1979)
  • వ్యవస్థాపక ప్రిన్సిపాల్,, సెక్రటరీ, చైతన్యభారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాదు. (1979–1990)
  • ఛైర్మన్, చైతన్య భారతి ఎడ్యుకేషనల్ సొసైటీ. (2000–2003)
  • ఎక్జిక్యూటివ్ సెక్రటరీ, మెడిసిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఘనపూర్, మేడ్చల్ మండలం రంగారెడ్డి జిల్లా (since 2002)
  • మెంబర్, ఎక్జిక్యూటివ్ కౌన్సిల్, J.N.T. University, Hyderabad (since 1996)

పురస్కారాలు[మార్చు]

  • 1991 పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం
  • 2003 ఇందిరాగాంధీ నేషనల్ అవార్డ్
  • 2008 సనాతన ఛారిటబుల్ ట్రస్ట్ వారి శివానంద ఉత్తమ సిటిజెన్ అవార్డు
  • ఎక్సెలెన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డు
  • బాల సరస్వతి - 1951
  • కవికీర్తి - 1986
  • మైఖైల్ మధుసూదన్ అవార్డు - 1990
  • దాశరథి అవార్డు - 1990
  • Creative Writing Award of Telugu University - 1991
  • R.C.C. Design Competition Award by Indian Concrete Journal, Bombay - 1954
  • Best Technical Paper Award of Institution of Engineers, A.P. -1972
  • Entrepreneur in Technical Education by ATA USA Award -1998
  • American Biographical Institute Directory of distinguished Leadership Member-1998
  • Fellow of A.P. Science Academy - 2003
  • Indira Gandhi National Award - 2003
  • Excellence in Science and Technology Award by ATA USA - 2004

బిరుదులు[మార్చు]

  1. కవికిరీటి
  2. బాలసరస్వతి
  3. విద్యాభూషణ్

ఇవి కూడా చదవండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Andhra Pradesh. "A blend of art and science". The Hindu (online). Archived from the original on 10 ఆగస్టు 2011. Retrieved 7 June 2012.
  2. ఉండేల, మాలకొండారెడ్డి (1996). సత్యం శివం సుందరం (2 ed.). అమెరికా: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా. p. xiv.
  3. వెబ్ మాస్టర్. "Dr. V. Malakonda Reddy". Chaitanya Bharathi Institute of Technology. CBIT. Archived from the original on 10 నవంబరు 2014. Retrieved 19 January 2015.
  4. S., RANGAN (June 5, 2011). "A blend of art and science". ది హిందూ. Retrieved 19 January 2015.
  5. వెబ్ మాస్టర్. "Business Leaders Latest News Companies Markets Economy & Forex Commodities Malakonda Reddy Vundela, PhD". 4-traders. Retrieved 19 January 2015.[permanent dead link]
  6. ఉండేల, మాలకొండారెడ్డి. "మాలకొండనోట మంచిమాట". వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 19 January 2015.
  7. ఉండేల, మాలకొండారెడ్డి (1996). సత్యం శివం సుందరం. అమెరికా: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా.

ఇతర లింకులు[మార్చు]