వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 6
స్వరూపం
- 1809 : బ్రిటను కు చెందిన ప్రసిద్ధ ఆంగ్ల కవి టెన్నిసన్ జననం.(మ.1892).
- 1881 : నోబెల్ బహుమతి గ్రహీత, పెన్సిలిన్ కనిపెట్టిన శాస్త్రవేత్త సర్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జననం.(మ.1955).(చిత్రంలో)
- 1912 : భారతదేశ కేంద్ర మంత్రిగా సేవలందించిన కొత్త రఘురామయ్య జననం.(మ.1979).
- 1925 : తొలి భారతీయ రాజకీయ సంస్థలలో ఒకటైన ఇండియన్ నేషనల్ అసోసియేషన్‌ను స్థాపించిన సురేంద్రనాథ్ బెనర్జీ మరణం.(జ.1848).
- 1933 : భారత టెస్ట్ క్రికెట్ ఆటగాడు ఎ.జి. కృపాల్ సింగ్ జననం (మ.1987).
- 1934 : తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరుపొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జననం (మ.2011).
- 1945 : రెండవ ప్రపంచ యుద్ధం లో అమెరికా , జపాను లోని హిరోషిమా నగరం మీద అణుబాంబు ప్రయోగించింది. ప్రపంచ హిరోషిమా రోజు" గా పాటిస్తారు.
- 1981 : భారతదేశానికి చెందిన వెయిట్‌లిఫ్టింగ్ క్రీడాకారుడు, తెలుగు రంగస్థలం, సినిమా నటుడు దండమూడి రాజగోపాలరావు మరణం (జ.1916).
- 1991 : వరల్డ్ వైడ్ వెబ్ (www) ఇంటర్నెట్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి వచ్చిన రోజు. అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి టిమ్ బెర్నర్స్ లీ.