వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/Palagiri
మీ మద్దతు ఇక్కడ తెలుపుము (ఆగష్టు 20, 2013) ఆఖరి తేదీ : (ఆగష్టు 27, 2013)
Palagiri (చర్చ • దిద్దుబాట్లు) - పాలగిరి గారు అత్యంత సాంకేతికపరమైన విషయాలను కూడా చక్కని తెలుగులో అందించి తెవికీ విస్తృతిని పెంచారు. దిద్దుబాట్లు చేయటమే కాకుండా వికీ నియమాలు, పద్ధతులు తెలుసుకొని నిర్వహణ కార్యక్రమాలలో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. కొత్తసభ్యులను ఆహ్వానించడం, చర్చల్లో క్రియాశీలకంగా పాల్గొనటం, ఇటీవలి మార్పులను గమనిస్తూ దుశ్చర్యలను అరికట్టడం మొదలైనవి ఈయన చేపట్టిన నిర్వహణా పనుల్లో కొన్ని. మొలకలను విస్తరించడంలో కూడా క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. పాలగిరి గారు కన్నడ వికీపీడియాలో కూడా క్రియాశీలకంగా పనిచేయటం విశేషం. కన్నడ, తెలుగు వికీపీడియాలకు చక్కని వారధి కాగలరు. తెవికీని చక్కగా నిర్వహిస్తూ, రాబోవు కాలంలో ముందుకు నడిపించగలరని ఆశిస్తూ, పాలగిరి గారిని నిర్వాహకత్వానికి ప్రతిపాదిస్తున్నా. --వైజాసత్య (చర్చ) 05:56, 20 ఆగష్టు 2013 (UTC)
పాలగిరి గారు తమ అంగీకారము ఇక్కడ తెలియ చేయవలెను.
- మొదటగా నేను తెవికీ లో చేసినది తక్కువే అయ్యినప్పటికి నన్ను నిర్వహాకుడిగా ప్రతిపాదించినందులకు వైజాసత్యాగార్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.అలాగే నేను సమ్మతి తెలుపుటకు ముందే నామీద సదభిప్రాయంతో మద్ధతు తెలిపిన సభ్యులు,మరియు నిర్వాహకులు రమణ,రహమనుద్దీన్,ప్రణయరాజ్,గండరగండడు మరియు అహమ్మద్ నిస్సార్ గార్లకు,ప్రత్యేకంగా సుజాతగార్కి,(ఎందుకంటే విక్షనరీలో ఒకవిషయంలో ఆమెతో విభేదించినప్పటికి,అవేమి మనస్సులో వుంచుకోక సహృదయంలో మద్ధతు తెలిపారు)అందరికి నా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.కాని మీరందరు నన్ను క్షమించాలి.నాకు నిర్వాహకుడిపట్ల కొన్ని అభిప్రాయా లున్నాయి.సభ్యుడు,నిర్వాహకులు,అధికారులు అందరు స్వచ్ఛందంగా పనిచేస్తున్నప్పటికి, సభ్యులకన్న మిగతా యిద్దరు ఎక్కువ క్రియాశీలకంగా,చురుకుగా,ఉత్సాహంగా వుండాలి.ప్రతిరోజు వికిలో సరిగా మార్పులను గమనించి తగినట్లుగా పాల్గొనవలెను.సభ్యులకు అందుబాటులో వుండి అవసరరానికి తగినట్లు చర్యలు తీసుకోవడం,సలహాలు ఇవ్వగలగటం చెయ్యగలిగి వుండాలి. నిర్వాహకపదం పేరుచివర అలంకరంగా మిగిలిపోరాదు. ఒకవిధంగా రమణ గారిలా వికికీ సంబంధించిన అన్ని విషయాలలో చురుకుగా వున్నవారే ఇలాంటి వారికి అర్హులు.నామటుకు నాపాత్ర నావ్యక్తిగత వ్యాసాలకే పరిమితం.మిగతా వాటిలో అంతగా పాల్గొనినదిలేదు.మధ్యలో నేను రచనలు చెయ్యనికాలం 5-6 నెలలున్నది.గత 3-4 నెలలుగా నేను తెలుగువికీలో చేసిన రచనల సంఖ్యకూడా తక్కువ.సంయమనంకూడా నాలో తక్కువ.కంప్యూటరు జ్ఞానం కూడా పరిమితం.కావున నేను వీటన్నింటిని గమనంలోకి తీసికొని అదనంగా ఏమి సేవలు అందించలేనని భావించడం వలన, సమ్మతించడం లేదు.
మీరందరు క్షమిస్తారని ఆశిస్తున్నాను.పాలగిరి (చర్చ) 23:28, 20 ఆగష్టు 2013 (UTC)
- పాలగిరి గారు ఈ ప్రతిపాదనను అంగీకరించనందువలన ప్రతిపాదన విరమించబడినది --వైజాసత్య (చర్చ) 02:15, 11 సెప్టెంబర్ 2013 (UTC)
మద్దతు
[మార్చు]- పాలగిరి గారి నిర్వాహకత్వానికి నా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను. నిర్వాహకులుగా వారు మరింత మెరుగ్గా రాణిస్తారని ఆశిస్తున్నాను. -- కె.వెంకటరమణ చర్చ 06:08, 20 ఆగష్టు 2013 (UTC)
- రహ్మానుద్దీన్ (చర్చ) 06:15, 20 ఆగష్టు 2013 (UTC)
- పాలగిరి గారు తెలుగు వికీపీడియాకు చేస్తున్న సేవలు అనేకం. మరిన్ని సేవలు అందిచాలని కోరుకుంటూ... నిర్వాహకత్వానికి నా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాను. Pranayraj1985 (చర్చ) 06:45, 20 ఆగష్టు 2013 (UTC)
- పాలగిరి గారూ తెవీకికి విశేషంగా కృషి చేసారు. రచనా సామర్ధ్యం ఉన్న పాలగిరిలాంటి వికీపీడీయన్ల అవసరం తెవికీకి ఎంతో ఉంది. వీరి కృషి ఇలాగే కొనసాగాలని కూరుకుంటూ వారి నిర్వాహకత్వానికి మద్దతు తెలుపుతున్నాను.--t.sujatha (చర్చ) 07:19, 20 ఆగష్టు 2013 (UTC)
- బహుముఖ ప్రజ్ఙాశాలులు , పెద్దలు మాన్యశ్రీ పాలగిరి రామక్రిష్ణా రెడ్డి గారి నిర్వాహక హోదా కొరకు నా మద్దతు తెలియజేసుకుంటున్నాను.--గండర గండడు (చర్చ) 08:49, 20 ఆగష్టు 2013 (UTC)
- పాలగిరి గారు దక్షత కలిగిన వారు. వారి నిర్వాహకత్వానికి నా సంపూర్ణ మద్దతు. అహ్మద్ నిసార్ (చర్చ) 09:15, 20 ఆగష్టు 2013 (UTC)
- పాలగిరి గారికి విజ్ఞానశాస్త్రంలొ లోతైన సమాచారం తెలియడమే కాకుండా; దానిని అందరికీ పంచాలని కోరిక వికీపీడియాలోకి తీసుకొని వచ్చింది. మీరు మాకు మార్గదర్శకులుగా మారడానికి; మరెందరో యువకుల్ని వికీలో శాస్త్ర విజ్నానానికి చెందిన వ్యాసాల్ని చేర్చడంలో సహాయం చేయడానికి ఈ నిర్వహకత్వం ఉపయోగపడుతుంది కాని మీకు ఇబ్బందికరంగా ఉండదని భావించి నా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను.Rajasekhar1961 (చర్చ) 04:20, 21 ఆగష్టు 2013 (UTC)