వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2022/కార్యశాలలు
ఈ కార్యక్రమంలో భాగంగా వికీలో అనుభవం గల వాడుకరులు ఎవరైనా సరే వికీ శిక్షణా శిభిరం నిర్వహించే వెసులుబాటు కల్పిస్తున్నాము. ఇందులో భాగంగా హైదరాబాద్ మినహాయించి రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు ప్రాంతాల్లో శిక్షణా శిబిరాలు నిర్వహించవచ్చును, ఒక్కో రాష్ట్రంలో రెండేసి నిర్వహించాల్సి ఉంది.
నిర్వహణ మార్గదర్శకాలు
- స్థానిక వికీపీడియన్లు తమ సొంత ప్రదేశానికి దగ్గరలోని ఊర్లోనే ఈ కార్యశాలలు జరపాలి.
- కార్యక్రమ స్థలానికి దగ్గరలో ఉన్న వికీపీడియను/న్లు ఈ కార్యశాలకి వెళ్లే విధంగా వారి సమ్మతి తెలుసుకోవాలి. ( అలా మనం చిన్న చిన్న గుంపులుగా కలిసే వీలు ఏర్పడుతుందని నా అభిప్రాయం)
- కార్యక్రమానికి నిర్వాహకులు, న్యాయ నిర్ణేతలు లేదా వికీ శిక్షణ అందించడంలో అనుభవం గల వారిలో ఎవరో ఒక్కరు మాత్రమే కార్యక్రమానికి హాజరు అవ్వచ్చు. (స్థానిక వికీపీడియను తానె స్వయంగా శిక్షణ నిర్వహించగలిగితే ఇలా ఒకరు వెళ్ళ వలసిన అవసరం లేదు)
- కార్యక్రమ పేజీ ఒకటి రూపొందించాలి
- ఆ పేజీ ద్వారా కార్యక్రమంలో జరిగే అంశాలు, పాల్గొనే వారి వివరాలు, చిత్రమాలిక, కార్యక్రమం జరపడం వలన చేరుకున్న లక్ష్యాలను గురించి వివరించాలి.
సూచనలు
- ఈ కార్యశాలలు అన్ని కూడా వీలైనంత మేరకు సెలవు రోజులలో జరపటం మంచిదని భావిస్తున్నాము, తద్వారా ఔత్సాహికులు ఈ కార్యశాలలకు హాజరు కావటం సులభంగా ఉంటుంది.
అయితే ఎవరైతే ఈ శిభిరాలు నిర్వహించదలిచారో ఇక్కడ మీ అభ్యర్థన చేర్చండి, ప్రాజెక్టులో మనకి అందుబాటులో ఉన్న సదుపాయాలతో యెంత మేరకు సహకారం అందించగలమో తెలుపుతాము.
ప్రతిపాదనలు
[మార్చు]- రామారావు గారి ప్రతిపాదన మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకానొక కీలకమైన నగరం అయిన విజయవాడలో స్థానిక వికీపీడియన్‌గా నేను ఒక కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి నాకున్న అనుభవం మేరకు శాయశక్తులా దాని విజయానికి ప్రయత్నించగలను. అయితే, నేనిప్పుడు ఇరుక్కున అనేక పనుల వల్ల నిర్వాహకుల్లో ఒకరు ఆ కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను పంచుకుంటే ఈ పనిని స్థానికంగా చేయగలనని తెలియజేస్తున్నాను. నిర్వాహకుల సమయాన్ని ఇలా తీసుకుని ఇబ్బందిపెట్టాలని కాదు, కానీ నాకున్న పరిమితుల వల్ల ఇలా కోరవలసివస్తోందని గ్రహించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 03:57, 3 అక్టోబరు 2022 (UTC)
- పవన్ సంతోష్ గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఏ రోజుల్లో జరపదలిచారో తెలిపితే వీలును బట్టి నేను కానీ నిర్వాహకులు/ఔత్సాహికుల్లో ఒకరు మీకు తోడ్పడగలము. NskJnv 06:16, 3 అక్టోబరు 2022 (UTC)
- పవన్ సంతోష్ గారు, విజయవాడ లో జరిపే కార్యశాల గురించి చర్చిద్దామా! ఏయే రోజున ఈ కార్యశాల జరపదలిచారో తెలపగలరు. NskJnv 18:51, 16 అక్టోబరు 2022 (UTC)
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండువ కార్యశాల పల్నాటి జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణంలో జరపటానికి స్థానిక వికీపీడియనుగా నేను ఏర్పాటుచేసి నాకున్న అనుభవం మేరకు శాయశక్తులా దాని విజయానికి ప్రయత్నించగలను.--యర్రా రామారావు (చర్చ) 05:50, 3 అక్టోబరు 2022 (UTC)
- నమస్కారం @యర్రా రామారావు గారూ... రంగస్థల దర్శకనటులు, మా గురువులు ఎస్.ఎం. బాషా గారి స్వస్థలం నరసరావుపేట. తన స్వగృహాన్ని 'మై మూన్ మకాన్' పేరుతో సాహిత్య, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దారు. కార్యశాలకు వేదిక కావాలనుంటే బాషా గారితో నేను మాట్లాడి ఆ వేదిక ఇచ్చేలా ప్రయత్నం చేస్తాను. వారికి వికీపీడియా గురించి కూడా మంచి అవగాహన ఉంది. వారి ద్వారా మరికొంతమంది కూడా కార్యశాలకు వచ్చే అవకాశం ఉంటుందని నా అలోచన.-- Pranayraj1985 (చర్చ) 08:19, 3 అక్టోబరు 2022 (UTC)
- ప్రణయ్ రాజ్ గారూ మీ స్పందనలకు ధన్యవాదాలు.నా ఆలోచనలో కూడా అదే ఉంది.అంతే గాదు మీరూ తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని నేను మనస్పూర్తిగా అభ్యర్ధిస్తున్నాను. యర్రా రామారావు (చర్చ) 08:28, 3 అక్టోబరు 2022 (UTC)
- నమస్కారం @యర్రా రామారావు గారూ... రంగస్థల దర్శకనటులు, మా గురువులు ఎస్.ఎం. బాషా గారి స్వస్థలం నరసరావుపేట. తన స్వగృహాన్ని 'మై మూన్ మకాన్' పేరుతో సాహిత్య, సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దారు. కార్యశాలకు వేదిక కావాలనుంటే బాషా గారితో నేను మాట్లాడి ఆ వేదిక ఇచ్చేలా ప్రయత్నం చేస్తాను. వారికి వికీపీడియా గురించి కూడా మంచి అవగాహన ఉంది. వారి ద్వారా మరికొంతమంది కూడా కార్యశాలకు వచ్చే అవకాశం ఉంటుందని నా అలోచన.-- Pranayraj1985 (చర్చ) 08:19, 3 అక్టోబరు 2022 (UTC)
- నమస్కారం యర్రా రామారావు గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఏ తేదీల్లో జరపదలిచారో తెలపగలరు. NskJnv 06:18, 3 అక్టోబరు 2022 (UTC)
- సాయికిరణ్ గారూ ఈ కార్యశాల జరిపేతీరు లేదా జరిగేతీరు మీద ముందుగా కొన్ని సందేహాలు ఉన్నవి. వాటిని కూలంకషంగా ఆలోచించి నివృత్తి చేసుకోవాలిసిన లేదా చేయాలిసిన అవసరం ఉంది.
- ఒక్కో కార్యశాలకు ఆర్థికంగా ఎంత తోడ్పాటు అందించబడుతుందునే అనే దానిమీద సృష్టత లేదు.
- కార్యశాలకు అందించే ఆర్థిక తోడ్పాటు ఎప్పుడు చెల్లించబడిందనే దానిమీద సృష్టత లేదు.
- కార్యశాలను ఎవరు నడిపించాలి లేదా ఎవరు నడిపిస్తారు అనే దానిమీద సృష్టత లేదు. (ఇక్కడ గమనించాల్సింది ఒకటుంది. స్థానిక వికీపీడియన్ కేవలం అక్కడ కావాల్సిన వసతులు, ఇతర వ్యవహారాలు మాత్రమే చూడటానికి సాధ్యపడిందికానీ, అతనే కార్యశాలనిర్వహించాలంటే సాధ్యపడేది కాదు.అందువలన తప్పనిసరిగా కనీసం ఇద్దరైనా అనుభవం ఉన్న వాడుకరులు కార్యశాల నిర్వహణ సారధ్యం వహించాలి)
- కార్యశాలకు కనీసం ఎంతమంది హాజరుకావాలి అనే దానిమీద సృష్టత ఉండాలి.
- అసలు క్లిష్టమైన సమస్య. ఈ కార్యశాలలో పాల్గొనుటకు ఎవరిని ఎలా రప్పించుకోవాలి అనే దానిమీద సృష్ఠత లేదు.దీనిమీద నిర్దుష్ట సూచనలు లేదా మార్గదర్శకాలు పొందుపరచలేదు.
- వికీపీడియాలో ముందుగా లాగిన్ అయిన వాడుకరులను రప్పించుకోవాలంటే, కార్యశాల జరిగే ప్రదేశానికి చేరువులో ఉన్న లాగిన్ అయిన వాడుకరుల వివరాలు ఎలా తెలుసుకోవచ్చు?వారిని ఎలా రప్పించుకోవాలి.
- ఒకవేళ లాగిన్ కాకపోయినా పర్వాలేదు అనుకుంటే స్థానికంగా ఉన్నవారిని ఎవరిని ఆహ్వానించాలి.
- కార్యశాల ఏ సమయం నుండి ఏ సమయం వరకు జరపాలి అనే వివరం మీద సృష్టత ఉండాలి.
- కార్యశాలలో నిర్వహణ కార్యక్రమాల మీద నిర్దుష్ట పట్టిక మీద సృష్టత ఉండాలి.
- యర్రా రామారావు (చర్చ) 17:09, 5 అక్టోబరు 2022 (UTC)
- సాయికిరణ్ గారూ ఈ కార్యశాల జరిపేతీరు లేదా జరిగేతీరు మీద ముందుగా కొన్ని సందేహాలు ఉన్నవి. వాటిని కూలంకషంగా ఆలోచించి నివృత్తి చేసుకోవాలిసిన లేదా చేయాలిసిన అవసరం ఉంది.
- నమస్కారం యర్రా రామారావు గారు,
- కార్యశాలలకు ఒక్కో దానికి 10000 రూపాయలు వరకు ఖర్చు చేయవచ్చు.
- కార్యశాలకు అందించే తోడ్పాటు కార్యశాల నిర్వహించే వాడుకరికి కార్యశాలకు వారం రోజుల ముందే అందించగలము. అయితే ఆ వాడుకరి కార్యక్రమం పూర్తి అయిన రెండు రోజుల లోపు ఖర్చులకి సంబంధించిన రసీదులు అందజేయాలి.
- కార్యశాలకి ఇద్దరు వాడుకరులు సారధ్యం వహిచడానికి అవకాశం ఉంది. అయితే వీలుని బట్టి, అవసరాన్ని బట్టి మనం ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుంటే బహుతుమతుల ప్రధానోత్సవ వేడుకకి ఎక్కువ మంది వాడుకరులు హాజరవ్వడానికి సదుపాయం అందించవచ్చని నా అభిప్రాయం.
- కార్యశాలకి కనీసం 20 మంది వాడుకరులు హాజరయితే బాగుంటుంది, అయితే ఇది తప్పనిసరి కాదు.
- కార్యశాలకి రచనల పట్ల ఉత్సాహం ఉన్న వారిని గుర్తించి ఆహ్వానం పంపితే బాగుంటుంది, దీనికి సంబంధించి తెలుగు వికీ ట్విట్టర్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రచారం చేస్తాము. అలాగే సదరు వాడుకరులంతా తమ తమ సమూహాల్లో పంచుకుంటే బాగుంటుంది. కార్యశాలకి హాజరయిన వారికి సెర్టిఫికెట్లు కూడా అందిద్దాం.
- కార్యశాల ఏ సమయంలో అయినా జరపవచ్చు, ఉదయం లేదా మధ్యాహ్నం కనీసం మూడు గంటల వ్యవధితో జరపాలి. సెలవు రోజుల్లో జరిపితే మంచిది, ఒకవేళ మిగతా రోజుల్లో నిర్వహించదలచిన పర్లేదు.
- కార్యశాల నిర్వహణపై అక్టోబరు 12 లోపు నిర్దుష్ట పట్టిక అందజేస్తాను.
అక్టోబరు 14/15 తారీఖులలో మొదటి కార్యశాల నిర్వహించి, దానిని జరగబోయే వాటికి ఉదాహరణగా చూపటానికి ప్రయత్నిస్తాను.
ధన్యవాదాలు.
NskJnv 13:55, 7 అక్టోబరు 2022 (UTC)
- యర్రా రామారావు గారు, పల్నాడులో జరిపే కార్యశాల గురించి చర్చిద్దామా! ఏయే రోజున ఈ కార్యశాల జరపదలిచారో తెలపగలరు. NskJnv 18:51, 16 అక్టోబరు 2022 (UTC)
- తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పట్టణంలో స్థానిక వికీపీడియనుగా ఒక కార్యశాల ఏర్పాటుచేసి, నాకున్న అనుభవం మేరకు శాయశక్తులా దాని విజయానికి ప్రయత్నిస్తాను. NskJnv 06:13, 3 అక్టోబరు 2022 (UTC)
- అనుకున్నట్టుగానే అక్టోబరు 15న ఉట్నూరు పట్టణంలో కార్యశాల విజయవంతమైంది, అయితే వచ్చిన వారిలో అందరు కొత్త వాళ్ళు కావటం మూలాన ప్రాజెక్టులో కృషి చేసేంత విషయాలు చర్చించడం కష్టమైంది.
కానీ వచ్చిన వారందరితోను వికీలో ఖాతా తెరిపించాను, దాదాపుగా ఒక 3-5 గురు వాడుకరులు చిత్రాలు ఎక్కించి కొన్ని వ్యాసాలలో ఇతర మార్పులు కూడా చేశారు. వచ్చిన వారందరు కూడా భాష పట్ల మక్కువ కలిగిన వారు కావటం వలన, కార్యక్రమం చక్కగా సాగింది. ఈ పూర్తి కార్యక్రమ వివరాలు ఇక్కడ చేర్చాను, ఆ పేజీలో కూడా ఇంకా ఏమైనా ప్రస్తావించాల్సిన అంశాలు ఉంటె తెలపగలరు.
కార్యక్రమానికి హాజరైన వారిలో సింహభాగం ఇంకోక సారి పూర్తిగా రోజంతా కార్యశాల నిర్వహించమని కోరారు, వీలైతే మిగిలి ఉన్న ఇంకో కార్యశాల ఇక్కడ జరపడానికి ప్రయత్నిస్తాను.
ధన్యవాదాలు
NskJnv 18:51, 16 అక్టోబరు 2022 (UTC)
- పవన్ సంతోష్, యర్రా రామారావు గార్లకి నమస్కారం, మనం అనుకున్నట్టుగా కార్యశాలల నిర్వహణపై మీరు ఇంకా స్పందించలేదు కనుక, అలాగే ప్రాజెక్టు గడువు ముగియడానికి వస్తుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని మిగిలి ఉన్న కార్యశాలలు కూడా నేనే స్వయంగా నిర్వహించడానికి నిశ్చయించుకున్నాను. మీరు కానీ, సముదాయం నుండి ఇంకా ఔత్సాహికులు ఎవరైనా రెండు రోజుల్లో స్పందిస్తే వారికి తప్పక అవకాశం కల్పిస్తాము.
అయితే ఇక జరగబోయే కార్యశాలలు హైదరాబాద్లో జరిపిన పరవాలేదు.
NskJnv 09:59, 19 అక్టోబరు 2022 (UTC)
కార్యశాల ప్రదేశాలు
[మార్చు]తెదీలతో సహా కార్యశాల వివరాలు ఇక్కడ రాయగలరు.
- అక్రోబరు 16 న మొదటి కార్యశాల, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పట్టణంలో జరిపాము.
- అక్టోబరు 30న ఆదిలాబాద్ పట్టణంలో రెండవ కార్యశాల నిర్వహిస్తాము.