తెలుగు వికీపీడియా ఆవిర్భావ దినోత్సవం రోజైన డిసెంబర్ 10న వికీపీడియాకు సంబంధించి ఏదైన ఒక కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని పలువురు సభ్యులు కోరడం జరిగింది. అయితే డిసెంబర్ 10 సెలవు రోజు కాకపోవడంతో ఎక్కువమంది పాల్గొనడానికి అవకాశం ఉండదనే ఉద్ధేశ్యంతో, డిసెంబర్ రెండవ ఆదివారం (13.12.2015) నాడు హైదరాబాదుకు చెందిన తెవికీపీడియన్లతో.. డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి రాష్ట్ర మ్యూజియంలో మరియు పబ్లిక్ గార్డెన్ లోపల మరియు బయట ఉన్న విగ్రహాల, చారిత్రాత్మక నిర్మాణాల ఫోటో హంట్ (ఫోటోలు తీసి కామన్స్ లోకి ఎక్కించే) కార్యక్రమం నిర్వహించబడుతుంది.