Jump to content

వికీపీడియా చర్చ:అనువాద పరికరం - తరచూ వచ్చే సందేహాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

Birth date and age మూస అనువాదంలో సమస్య

[మార్చు]

Template:Birth date and age అనే ఆంగ్ల మూస తెలుగులోకి మూస:Birth date and age దింపి ఉన్నప్పటికి అనువాదంలో 1 ఆగస్టు 1998 (age 25)అని అనువదిస్తుంది.దీనిలో వయస్సు లేదా వయసు అని అనువదించకుండా age అనే ఉంచుతుంది. అయినా డేట్ పార్మెట్ తెలుగు వికీ శైలికి అనుగుణంగాలేదు.యర్రా రామారావు (చర్చ) 15:01, 17 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@యర్రా రామారావు గారూ, సమస్య ఆ మూసలో గానీ, దానికి సంబంధించిన మాడ్యూలులో గానీ, ఆ మూసలో ట్రాన్స్‌క్లూడు చేసిన ఇతర మూసల్లోగానీ ఉందండి. అక్కడ తేదీ ఆకృతిని తెవికీకి అనుగుణంగా మారిస్తే అంతా సర్దుకుంటుంది.__ చదువరి (చర్చరచనలు) 02:56, 18 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారూ, పైన సూచించినట్లుగానే, సమస్య పై మూసకు సంబంధించిన మాడ్యూల్:Age లో కనిపించిందండి. గతంలో దీన్ని మనకు అవసరమైన విధంగా అనువాదాలు, తేదీ ఆకృతి సవరణలూ చేసుకున్నాం. అయితే ఈ మధ్య కొత్త కూర్పును దిగుమతి చేసుకునేటప్పటి నుంచి అవన్నీ పోయాయి. (సమస్య ఈ మాడ్యూలులో ఉన్నందువల్లనే మూస:Birth date and age లో మాత్రమే తేదీ ఆకృతి అలా వస్టోంది. ఈ మాడ్యూలుతో సంబంధం లేని మూస:Birth date అనే మూసలో, తేదీ ఆకృతి బాగానే చూపిస్తోంది). ఈ సమస్యను చక్కదిద్దేందుకు కింది పనులు చెయ్యాలి:
  1. పేజీని ఈ పాత కూర్పుకు తీసుకువెళ్ళాలి.
  2. ఆ తరువాత పేజీలో range = 'no', అనేదాని కోసం వెతికి దాన్ని range = 'dash', గా మార్చాలి
ఈ పనులు చేసే అనుమతి ప్రస్తుతం నిర్వాహకులకు మాత్రమే ఉంది. __చదువరి (చర్చరచనలు) 05:22, 20 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారూ, సమస్యఎక్కడుందో పరిశీలించి తెలిపినందుకు ధన్యవాదాలు.నేను సరిచేసాను.పరిశీలించగలరు యర్రా రామారావు (చర్చ) 08:50, 20 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

Convert మూస అనువాదంలో సమస్య

[మార్చు]

Template:convert అనే ఆంగ్ల మూస తెలుగులోకి మూస:convert మూసను దింపి ఉన్నప్పటికి అనువాదంలో ప్రాంతం 12,780.26 కి.మీ2 (4,934.49 చ. మై.) అని అనువదిస్తుంది.ఈ సమస్యను పరిష్కరించాలి. యర్రా రామారావు (చర్చ) 09:02, 20 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

మరియు,యొక్క వాడకం

[మార్చు]

అనువాదం చేసున్నప్పుడు వచ్చే మరియు (and) ,యొక్క (of ) లు ఈ మధ్య సాధారణగా వాడుకలో ఉన్నప్పటికీ , స్వాభావికం కాదు కాబట్టి తెలుగు వికీపీడియాలో ఈ నిబంధన చేర్చినా కూడా , దానిని గౌరవిస్తూనే ఒక్కోసారి తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి అనువాదం చేసే టప్పుడు సరైన వాక్య నిర్మాణం జరిగటానికి మరియు,యొక్క వాడకం అవసరం పడవచ్చు కావున వీటిని తీసివేసి అనువాద పరికర అనువాద పరికరం చేసే యాంత్రిక అనువాదం ప్రచురించినా కూడా సందర్భం బట్టీ మరియు,యొక్క లు వాడవచ్చు అని నా అనుకోలు

ఉదాహరణ: The painting on the wall depicted a serene landscape of rolling hills and a tranquil lake.

ఇ - తె గూగుల్ యాంత్రిక అనువాదం: గోడపై ఉన్న పెయింటింగ్ కొండలు మరియు ప్రశాంతమైన సరస్సు యొక్క నిర్మలమైన ప్రకృతి దృశ్యాన్ని చిత్రీకరించింది.

మరియు,యొక్క లు తీసివేస్తే: గోడపై ఉన్న పెయింటింగ్ కొండలు  ప్రశాంతమైన సరస్సు నిర్మలమైన ప్రకృతి దృశ్యాన్ని చిత్రీకరించింది.

తె-ఇ బింగ్ యాంత్రిక అనువాదం:The painting hills on the wall depicted a serene landscape of a serene lake.

: Kasyap (చర్చ) 07:33, 28 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@Kasyap గారూ ఈ చర్చ లేవదీసినందుకు ధన్యవాదాలు. సమస్యను సవివరంగా చర్చించేందుకు ఈ ఉదాహరణ తెచ్చారు తప్ప ఈ వాక్యం లోని తప్పేమిటో మీకు తెలీకేమీ కాదని నాకు తెలుసు.
-----------
ప్రత్యయాలేవి?
యాంత్రిక అనువాదంలోంచి "మరియు", "యొక్క" అనే రెండు పదాలను తీసేసి వాక్యం రాసారు. కానీ అందులో ప్రత్యయాలేవి? ప్రత్యయాల్లేకుండా ఇలా పదాలను ఒకదాని పక్కన ఒకటి పేర్చుకుంటూ పోతే అర్థవంతమైన వాక్యం అవదు గదా! ఇదే వాక్యంలో ఓ రెండు కామాలు, రెండు ప్రత్యయాలూ పడేస్తే ఇలా ఉంటుంది:
"గోడపై ఉన్న పెయింటింగ్, కొండలతో, ప్రశాంతమైన సరస్సుతో నిర్మలంగా ఉన్న ప్రకృతి దృశ్యాన్ని చిత్రీకరించింది."
ఇప్పుడిది మనకే కాదు, బింగ్‌కు కూడా బాగానే అర్థమౌతుంది. (ఈ వాక్యం ఇప్పటికీ అంత సహజంగా లేదు, ఇంకా సహజంగా రాయొచ్చు). అంతేకాదు, "పెయింటింగ్" పక్కన పెట్టిన కామా లేకుండానూ, ఉంచీ -రెండు రకాలుగా బింగ్ చేత చదివించండి. ఎంత తేడా ఉందో గమనించండి.
-----------------
పైన కశ్యప్ గారు రాసిన దానిలో మొదటి వాక్యం చూడండి..
"అనువాదం చేసున్నప్పుడు వచ్చే మరియు (and) ,యొక్క (of ) లు ఈ మధ్య సాధారణగా వాడుకలో ఉన్నప్పటికీ , స్వాభావికం కాదు కాబట్టి తెలుగు వికీపీడియాలో ఈ నిబంధన చేర్చినా కూడా , దానిని గౌరవిస్తూనే ఒక్కోసారి తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి అనువాదం చేసే టప్పుడు సరైన వాక్య నిర్మాణం జరిగటానికి మరియు,యొక్క వాడకం అవసరం పడవచ్చు"
చాలా పొడవైన సంయుక్త వాక్యం ఇది. కానీ, ఈ వాక్యంలో - వాక్య నిర్మాణం కోసం - ఎక్కడా "మరియు" వాడలేదు, గమనించండి. "మరియు" లేకుండా మనం రాయగలిగాం కదా.. యంత్రం ఎందుకు రాయలేదు? ఎందుకంటే.. మనకు తెలుగొచ్చు, దానికి రాదు. అది చిలక పలుకులు పలుకుతుందంతే. కాకపోతే యంత్రం కాబట్టి వేగంగా రాసేస్తుంది. మనం ఆ వేగాన్ని వాడుకోవాలి, తప్పులను సరిచేసి ప్రచురించుకోవాలి. మనం చేసే దిద్దుబాట్ల నుండి అది నేర్చుకుంటుందంట. కాబట్టి మనం దానికి సరైన తెలుగు నేర్పాలి.
-----------
పోతే.. సహజమైన తెలుగును పక్కన పెట్టి, ఇంగ్లీషును అనుకరించే ప్రయత్నం చెయ్యకూడదు. "మరియు" అలాంటిదే అని నా అభిప్రాయం. మాట్లాడేటపుడు ఎవరైనా సరే, "మరియు" వాడగా నేనైతే చూళ్ళేదు. మరి, రాయడానికి ఎందుకు? "మరియు" అనే మాట వాడకుండా రాయలేని వాక్యం తెలుగులో ఉంటుందని నాకు తెలియదు.
(ఈ విషయంలో మనం ఎంత తెలివిగల వాళ్ళమో నిరూపించుకోవాలంటే - మరియు/లేదా అనే వ్యాసంలో "మరియు"ను గతంలో ఎంతలా వాడేవారో చూపించడానికి ఇచ్చిన మూలాన్ని చూపించాలి. ఇంగ్లీషులో "అండ్" వాడుకను చూస్తే తెలుగులో "మరియు" వాడుక గురించి తెలిసిపోతుందంట)
ఒక్కో భాషకు ఒక్కో రకమైన పద్ధతి ఉంటుంది. ఇంగ్లీషులో "అండ్" అనేది ఆవశ్యకం, తెలుగులో కాదు. ఇంగ్లీషులో లింగాన్ని బట్టి క్రియ మారదు, మనకు మారుతుంది. ఇంగ్లీషులో గౌరవ వాచకాల్లేవ్, మనకున్నై. ఇంగ్లీషులో పెద్దపెద్ద వాక్యాలను చక్కగా నిర్మించవచ్చు, మనకది కష్టం. తెలుగులో అవలీలగా చెప్పగల సంగతిని ఇంగ్లీషులో చెప్పడం కష్టం, సూటిగా చెప్పలేం. ఉదాహరణకు,
"మరియు/లేదా అనేది వికీపీడియాలో ఎన్నవ వ్యాసం?"
అనే ప్రశ్నను ఇంగ్లీషులో ఎలా వేస్తారు? __ చదువరి (చర్చరచనలు) 00:30, 29 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
ధన్యవాదములు @Chaduvari గారూ, నేను ఈ ఉదాహరణలు కేవలం తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి యంత్రిక అనువాద నాణ్యత మరియు, యొక్క లో మెరుగు అవ్వటం మీద రాసాను, గూగుల్ లో తెలుగు లో లేకపోయినా కామా వాడకం వలన చేర్చినది.
గోడపై ఉన్న పెయింటింగ్, కొండలతో, ప్రశాంతమైన సరస్సుతో నిర్మలంగా ఉన్న ప్రకృతి దృశ్యాన్ని చిత్రీకరించింది.
గూగుల్: The painting on the wall depicts a serene landscape with hills and a calm lake.
బింగ్: The painting on the wall depicted a serene landscape with hills and a serene lake. Kasyap (చర్చ) 09:12, 30 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]
@Kasyap గారూ,
అనువాదాన్ని ప్రచురించినందుకు ధన్యవాదాలు. తెలుగు వాక్యాన్ని మీరు యంత్రం ద్వారా ఇంగ్లీషు లోకి చేసిన అనువాదాల్లో నేను గమనించినవి ఇవి:
  • మొదట్లో వ్యాకరణయుక్తంగా లేని తెలుగు వాక్యాన్ని యంత్రం తప్పుగా అనువదించింది.
  • రెండోసారి, అదే తెలుగు మూలాన్ని తగు ప్రత్యయాలను చేర్చి, వ్యాకరణ యుక్తంగా ఉండేలా సవరించాక, ఇంగ్లీషు లోకి చేసిన యాంత్రికానువాదం మెరుగ్గా, తప్పుల్లేకుండా, అర్థవంతంగా ఉంది.
తేడా ఒక్కటే - మూలం వ్యాకరణయుక్తంగా ఉండడం!
కాబట్టి అనువాదంలో "మరియు" తీసెయ్యమంటే అర్థం, తెలుగుకు సహజంగా ఉండేలా దాన్ని తీసెయ్యడం మాత్రమే కాదు, వ్యాకరణ యుక్తంగా మార్చాలి అని అర్థమౌతోంది.
నేను అర్థం చేసుకున్నది తప్పైతే చెప్పండి, సవరీంచుకుంటాను.__ చదువరి (చర్చరచనలు) 14:27, 30 ఆగస్టు 2023 (UTC)[ప్రత్యుత్తరం]