Jump to content

వికీపీడియా చర్చ:యాంత్రికానువాదాల నాణ్యతా నియంత్రణ/వడపోత పదాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

తప్పొప్పుల పదాలుకు కొన్ని సూచిక లంకెలు

[మార్చు]
చదువరి గారూ, తెలుగు వికీపీడియాలో పదాల తప్పొప్పుల పట్టికకు తోడు, ఇతర వెబ్సైట్లుకు చెందిన జర్నలిస్టు మిత్రులారా, ఇదిగో తప్పొప్పుల పట్టిక, అలాగే తెలుగులో తప్పొప్పుల పట్టిక అనే లింకులు ఉన్నవి.ఇవి ఏమైనా ఉపయోగపడగలవేమో గమనించగలరు.--యర్రా రామారావు (చర్చ) 17:38, 31 జనవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారూ, ఈ విషయం గురించి ఆలోచిస్తున్నందుకు ధన్యవాదాలు. దోషాలు దొర్లకుండా చేసే ప్రయత్నంలో భాగమే ఈ వడపోత ప్రతిపాదన. మీరు చెప్పిన పేజీలు ఉపయోగపడతాయి. కానీ, కింది విషయాలను మనం గమనించాలి:
  1. బోలెడన్ని పదాలతో హెచ్చరిక వడపోత పెట్టుకోగలం గానీ, నిరాకరణ వడపోత పెట్టుకోలేం.
  2. హెచ్చరిక వడపోతలో అన్నేసి పదాలను చేర్చితే, హెచ్చరిక ఏ తప్పు పదం గురించి ఇస్తున్నామో వాడుకరికి చెబితే బాగుంటుంది. మరి వడపోత ఆ తప్పు పదాన్ని (లేదా పదాలను) తెచ్చుకోగలదో లేదో చూడాలి. పదాన్ని ఉదహరించకుండా ఉత్త జనరిక్ సందేశం ఉంటే పెద్దగా ఉపయోగం ఉండదనుకుంటాను.
  3. అసలు మామూలుగానే హెచ్చరిక వడపోతలతో పెద్ద ప్రయోజనం ఉంటుందనిపించడం లేదు.

వేరే సాంకేతికపరమైన ఇబ్బందులేమైనా ఉంటాయేమో తెలీదు. కానీ మీరు చెబుతున్న పదాల జాబితాలను ఒక నిఘంటువు లోకి ఎక్కించి, వికీ ఎడిటరుకు జోడిస్తే బాగుంటుంది. __చదువరి (చర్చరచనలు) 01:12, 1 ఫిబ్రవరి 2020 (UTC)[ప్రత్యుత్తరం]