వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్
Jump to navigation
Jump to search
వికీపీడియాలో తెలుగు వెబ్సైట్ మూలాల విశ్లేషణ
[మార్చు]ఇటీవల వికీపీడియాలో మూలాల విశ్లేషణ పరిశోధన నా గమనింపుకి వచ్చింది ("Best Sources in Telugu Wikipedia". bestref.net. Retrieved 2020-07-20.). దాని ప్రకారం మూలం తరచుదనం ప్రకారం అత్యధిక 25 మూలాలలో తెలుగు సైట్లు క్రింద ఇచ్చాను.
# | Website | Score in June 2020 | 1m changes | వెబ్సైటు భాష |
8 | ourtelugunadu.com | 1,877 | -2 | తెలుగు |
13 | sakshi.com | 1,295 | +31 | తెలుగు |
14 | andhrajyothy.com | 1,281 | +50 | తెలుగు |
15 | eenadu.net | 991 | +6 | తెలుగు |
తెలుగు వెబ్సైట్ మూలాల స్థితి గురించి అభిప్రాయాలు
[మార్చు] సహాయం అందించబడింది
పైన తెలిపినట్లు, ఈ మూలాల విశ్లేషణ లో ప్రముఖ దినపత్రికల మూలాలు 1000 కి అటుఇటుగా వుండడం చూడవచ్చు. 70000వ్యాసాలు గల తెవికీకి ఇవి నాకు చాలా తక్కువగా అనిపించింది. మన సభ్యులలో , ప్రస్తుత స్థితిగతులు, రాజకీయ వ్యవహారాలపై ఆసక్తిగల వారు చాలా తక్కువ. ఇంతకు ముందు కొంత మంది సభ్యులు వార్తల్లో విషయాల గురించి తెవికీలో వ్యాసాలను పెంచడానికి ప్రతిపాదనలు చేసినట్లు గుర్తు. మీరు మీ అనుభవంలో తెలిసినదాన్ని బట్టి మీ అభిప్రాయాలు పంచుకోండి. --అర్జున (చర్చ) 05:43, 22 జూలై 2020 (UTC)
- 2011 ప్రాంతంలో దినపత్రికలు పాతసంచికలు శాశ్వతలింకులుగా నిర్వహించనందున, నేరుగా ఆర్కైవ్ లో భద్రపరచి ఆర్కైవ్ లింకు చేర్చమని ప్రాజెక్టులో సూచన చేయబడింది. కావున పై విశ్లేషణ అటువంటి లింకులను ఆర్కైవ్ .ఆర్గ్ విభాగానికి ఆపాదించుతుంది. అంతవరకు ఈ విశ్లేషణకు పరిమితి వుంది. --అర్జున (చర్చ) 06:55, 23 జూలై 2020 (UTC)
- "ప్రస్తుత స్థితిగతులు, రాజకీయ వ్యవహారాలపై ఆసక్తిగల వారు చాలా తక్కువ." - ఈ అంచనాకు ఎలా వచ్చారో నాకు తెలవదు. సరే అది పెద్ద చర్చనీయాంశం అని నాకు అనిపించడం లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తాను. తెలుగు పత్రికలను మూలంగా ఉదహరించడం తక్కువగా ఉండడానికి నాకు కనిపించిన కారణాలు ఇవి:
- మన పేపర్లకు ఆర్కైవు విలువ లేదసలు. ఈనాడు చూడండి.. మూణ్ణెల్ల కిందటి సమాచారం కావాలంటే లింకులు అంతర్జాలంలో దొరకవు. యూఆరెల్‌ను ఓవర్రైటు చేసిపారేస్తారు వాళ్ళు. పత్రికలకు ఎంతో ఆర్కైవు విలువ ఉంటుంది. ఈ పత్రికలు తమ పాత సంచికలన్నిటినీ అందుబాటులో పెడితే (వాటిని సెర్చబుల్‌గా పెడితే మరీ మంచిది) మనందరం చందా కట్టి మరీ చేరవచ్చు.
- పై కారణాన కొన్ని ముఖ్యమైన తెలుగు పేపర్లు సెర్చబుల్లే కాదు. ముఖ్యంగా ఈనాడు. ఆంధ్రజ్యోతి, సాక్షి కాస్త నయం అనుకుంటాను. ఇప్పుడింకా నయం. కొన్నేళ్ళ కిందటి దాకా ఈనాడు అసలు యూనికోడులోనే ఉండేది కాదు.
- అనువాదాలు: ఇంగ్లీషు నుండి అనువదించిన వ్యాసాల్లో సహజంగానే తెలుగు పేపర్ల లింకులు ఉండవు.
- ప్రస్తుతానికి నాకు తోచినవివి. __చదువరి (చర్చ • రచనలు) 07:04, 23 జూలై 2020 (UTC)
- చదువరి గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. 2015 నుండి ఈనాడుతో సహా పత్రికలన్నీ యూనికోడ్ లో లభ్యమవుతున్నాయి. వేబేక్ మెషీన్ అంతకు ముందలనుండే అందుబాటులో వుంది. 2014లో వే బేక్ మెషీన్ లేక విహరిణి ఎక్స్టెన్షన్ తో ఆర్కైవ్ లో భద్రపరచడం గురించి ప్రాజెక్టు ద్వారా తెలిపాము. కావున వార్తలలో విషయాలపై ఆసక్తి గల సభ్యులు కృషి చేస్తే, తెలుగు పేపర్లు పాతనిల్వలు నిర్వహించకపోవడం ఇకముందు పనులకి పెద్ద అడ్డంకి కాదని నా అభిప్రాయం, ఒకవేళ పత్రికలు పాతనిల్వలు నిర్వహించినా వాటికి స్వేచ్ఛా అందుబాటు కాక చెల్లింపు పద్ధతిలో అందుబాటులోకి తెస్తున్నారు (ఉదా: సాక్షి ). --అర్జున (చర్చ) 04:31, 24 జూలై 2020 (UTC)
- అర్జున గారూ, మీకు అర్థమయ్యేలా చెప్పినట్టు లేదు నేను. అసలు మూణ్ణెల్ల తరువాత సమాచారమంటూ దొరికితే గదండీ దాన్ని విహరిణి ఎక్స్టెన్షన్ తోనో మరోదానితోనో ఆర్కైవు చెయ్యగలిగేది !!? __చదువరి (చర్చ • రచనలు) 04:41, 24 జూలై 2020 (UTC)
- చదువరి గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. 2015 నుండి ఈనాడుతో సహా పత్రికలన్నీ యూనికోడ్ లో లభ్యమవుతున్నాయి. వేబేక్ మెషీన్ అంతకు ముందలనుండే అందుబాటులో వుంది. 2014లో వే బేక్ మెషీన్ లేక విహరిణి ఎక్స్టెన్షన్ తో ఆర్కైవ్ లో భద్రపరచడం గురించి ప్రాజెక్టు ద్వారా తెలిపాము. కావున వార్తలలో విషయాలపై ఆసక్తి గల సభ్యులు కృషి చేస్తే, తెలుగు పేపర్లు పాతనిల్వలు నిర్వహించకపోవడం ఇకముందు పనులకి పెద్ద అడ్డంకి కాదని నా అభిప్రాయం, ఒకవేళ పత్రికలు పాతనిల్వలు నిర్వహించినా వాటికి స్వేచ్ఛా అందుబాటు కాక చెల్లింపు పద్ధతిలో అందుబాటులోకి తెస్తున్నారు (ఉదా: సాక్షి ). --అర్జున (చర్చ) 04:31, 24 జూలై 2020 (UTC)
యర్రా రామారావు అభిప్రాయాలు
[మార్చు]- నాకు తెలిసినంతవరకు మూలాలులేని వ్యాసాలు అధికశాతం గత నాలుగైదు సంవత్సరాల క్రిందట సృష్టించబడిన వ్యాసాలలోనే ఉన్నవి. అవి ఇప్పటికి అలానే ఉన్నవి.వాటి పరిస్థితిపై ఎటువంటి ఆలోచనలు చేయుటలేదు.వాటికి లేకపోయినా పర్వాలేదా?వాటిపై మూలాలు గురించి ఇప్పటివరకు ఎందుకు ఆసక్తి కనపర్చలేకపోయామో అర్థం కాని ప్రశ్నగా మిగిలి ఉంది.ఆ వ్యాసాలుకు మూలాలు పెట్టాలని ఈ రోజు ప్రయత్నిస్తే కొన్నిటికి మూలాలు దొరికే పరిస్థితి కనపడుటలేదు. దొరికిన మూలం గమనిస్తే వికీ వ్యాసంలోని సమాచారం, అది ఒకటే రకంగా ఉన్న వ్యాసాలు చాలా గమనించాను.ఏది కాపీరైట్ ఉల్లంఘన జరిగిందో తేల్చకోలేని పరిస్థితి నాకు ఎదురైంది.
- ఇప్పుడు ఎవరైనా ఒక కొత్త వాడుకరి, మీరు సృష్టించిన వ్యాసానికి మూలాలు పెట్టవలసినదిగా కోరినప్పుడు అనేక చెప్పలేని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.అవిగాక పాత వ్యాసాలు చూపించి లోగడ వాటికి ఇప్పటికీ లేవుగదా!అని ప్రశ్నిస్తే మన దగ్గర సమాధానం లేదు.
- వ్యాసం మొత్తం బాగున్నా ఎటువంటి మూలాలు లేవు దానిని తొలగించాలా?వద్దా అనే దానికి సరైన వికీ నిర్వచనం లేదు.
- ప్రస్తుతం సృష్టిస్తున్న వ్యాసాలపై ఆశించినంతగా కాకపోయినా, మూలాలు పర్వేక్షణపై గమనింపు,తగిన చర్యలు పర్వాలేదనుకుంటున్నాను.
- వ్యాసం సృష్టించినంత ఉషారు కొంతమంది వాడుకరులు మూలాలు కూర్పులో చూపుటలేదు.దీనికి ఏకారణమైనా కావచ్చు.
- వ్యాసానికి మూలం లేకపోతే కూర్పు చేయమంటాం.కూర్పు చేస్తే ఈ మూలం నమ్మతగ్గది కాదంటాం.అసలు వ్యాసాలకు ఎటువంటి మూలాలు పెట్టాలి?ఎటువంటి వెబ్సైట్ లనుండి తీసుకోవాలి? ఎటువంటి వెబ్సైట్ లనుండి తీసుకోకూడదు అని తెలిపే సరియైన సమాచారం ఉండాలి.
- ఎదైనా ఒక సందేహానికి సమాచారం తెలుసుకోవాలంటే క్లుప్తంగా సింగిల్ విండో సిస్టంగా ఉండాలి.పలానా పేజీలో చూడండి.అక్కడకి వెళ్లిన తరువాత మరెక్కడిగా వెళ్లమనేటట్లుగా ఉండకూడదు.
- అసలు ఇప్పటివరకు ఎన్ని వ్యాసాలకు మూలాలు ఉన్నవి!ఎన్నిటికి లేవు అనే జాబితా, గణాంకాలు ఉంటే బాగుంటుంది.
- వ్యాసానికి కనీసం ఎన్ని మూలాలు ఉండాలి అనేది క్లియర్ కట్ గా ఉంటే బాగుంటుంది.లేకపోతే ఏంటి అనే దానికి తగిన చర్య వివరాలు కూడా సరిగా ఉండాలి.
- ఇక నా స్వంత అభిప్రాయానికి వస్తే మూలాలు లేని వ్యాసం,వ్యాసంగా పరిగణించకూడదు.కనీసం రెండు మూలాలైనా ఉండాలి. ఇచ్చిన ఆ మూలాలపై పర్వేక్షణ కూడా ఉండాలి.అవి లేని వాటిని తగిన వ్యవధిఇచ్చి మూలాలు కూర్పు చేయని పక్షంలో తొలగించాలి.--యర్రా రామారావు (చర్చ) 07:15, 23 జూలై 2020 (UTC)
- యర్రా రామారావు గారు, చక్కని ప్రశ్నలు, ఆలోచనలు తెలిపారు. ధన్యవాదాలు. మీ ప్రశ్నలకు కొంత సమాధానంగా ప్రాజెక్టు పేజీని తాజాకరించాను. మీరు మరియు ఆసక్తి గల ఇతర సభ్యులు, దానిని మెరుగుపరచడానికి, సంబంధించిన పనులలో పాలు పంచుకోవచ్చు. ఇక తెలుగు వికీపీడియా పర్యావరణం లో బలహీనతలున్నందున, ఇక్కడ అత్యంత అవసరమైతే తప్ప విధానాలు చేయడం కష్టం. అందుకని ఆంగ్లవికీ విధానాలు వాడుకొనడం మంచిదని నా అభిప్రాయం. --అర్జున (చర్చ) 04:26, 24 జూలై 2020 (UTC)
- అర్జున గారూ ఓపికతో నా అభిప్రాయాలు చదివి, అర్థం చేసుకుని, వాటికి అనుగుణంగా కొన్ని సవరణలు చేసినందుకు ధన్యవాదాలు.--యర్రా రామారావు (చర్చ) 05:56, 24 జూలై 2020 (UTC)
- యర్రా రామారావు గారు, నేరుగా మూలాల దోషాలు , External links వికీట్రెండ్స్ ప్రాజెక్టు పరిధికి ఆవలది కావున, ఆ గణాంకాలు ఇక్కడ చేరుస్తున్నాను.
- మూలాల దోషాలు తొలగించడం మూలాల_లోపాలున్న_పేజీలు (1297) , CS1 errors: external links (65),
- దీనిలో ప్రాధాన్యం పేజీలకు మాస్ వ్యూస్ లో పేజీవీక్షణల ప్రాధాన్యం( పేజీలో సంబంధిత వర్గం: పేజీ URL ప్రవేశపెట్టిన తరువాత) ప్రకారం చేయటం మంచిది.
- External links లేని పేజీలను వాటిని వీలైతే సరియైన మూలాలతో సవరించడం (2020-07-24 నాడు 16067లో తొలి వేయి పేజీలు (quarry లింకు), మొత్తం నిర్దిష్ట పేజీలు 69748 (quarry లింకు))
- పేజీవీక్షణల ప్రాధాన్యం ప్రకారం పని చేయటానికి మాస్ వ్యూస్ తో quarry ఫలితాలు లింకు చేయాలి. ( లో source:quarry గా quarryid మరియు te.wikipedia.org చేర్చి తొలి 500పేజీల ప్రాధాన్యతను చూడవచ్చు quarry కోడ్ మార్చి (పేజీ శీర్షిక తొలి అక్షరం ఎంపిక వడపోత ద్వారా తదుపరి పేజీలు) అలా మొత్తము పేజీలలో ప్రాధాన్యత పేజీలు ఎంచుకోవచ్చు. --అర్జున (చర్చ) 13:56, 25 జూలై 2020 (UTC)
- మూలాల దోషాలు తొలగించడం మూలాల_లోపాలున్న_పేజీలు (1297) , CS1 errors: external links (65),