Jump to content

వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ/2018/అంశాలు

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

మారియో మిరాండ

[మార్చు]

కొత్తగా ఇచ్చిన జాబితాలో థిమాటిక్ అంశాలు అని 379వ అంశం క్రింద మారియో మిరాండ వ్యాసానికి ఆంగ్ల వికీపీడియా లింకు ఇచ్చారు. ఈ వ్యాసం ఇప్పటికే 9545 బైట్లతో 391 పదాలను కలిగి ఉంది. ఈ వ్యాస పరిమాణాన్ని ఇంకా పెంచవలసిన అవసరం ఉందా?--స్వరలాసిక (చర్చ) 06:44, 26 మార్చి 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పోటీ నియమం అయితే అదేనండీ. మరో 9 వేల బైట్లు, 300 పదాల సమాచారం చేర్చడం. ఈ వ్యాసంలో నాణ్యతాపరంగా మూలాలు వగైరాల పరంగా జరగాల్సిన అభివృద్ధి కూడా ఉంది. --పవన్ సంతోష్ (చర్చ) 05:38, 1 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

జాబితాలో లేని కొత్తగా వ్యాసాలు

[మార్చు]

మీరు సూచించిన జాబితాలో లేని కొత్తగా వ్యాసాలు లేదా జాబితాలో ఉన్న వర్గాలలో కొత్తగా వ్యాసాలు సృష్టించి వ్రాయవచ్చునా ? లేదో తెలుపగలరు. ఇదివరకు పోటీ వ్యాసాలకు కొత్త వ్యాసాలు వ్రాసాను. JVRKPRASAD (చర్చ) 00:50, 1 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

వికీపీడియా:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు టైగర్ రచనా పోటీలోని నియమాల్లో "వ్యాసాలు ఇచ్చిన అంశాల జాబితాలోనిది అయివుండాలి. మీరు ఒక వర్గం నుంచి మరిన్ని అంశాలు ఉండాలని భావిస్తే, చర్చ పేజీలో కోరండి. వీలున్నంత వరకూ చేరుస్తాం." అని ఉంది కదండీ. మీకు ఏదైనా వర్గం నుంచి మరిన్ని వ్యాసాలు ఒక భాషలో కావాల్సి వస్తే ఇక్కడ జరుగుతున్న చర్చ (ఇలాంటి చర్చ మరికొందరు చేశారు. కేవలం అమెరికన్ పాప్ కల్చర్ గురించిన వ్యాసాలే కాక మిగతావి వుండాలని ఆ రెండో జాబితా అయిన థీమాటిక్ అంశాలు చేర్పించినవారిలో నేనూ, వాడుకరి:విశ్వనాధ్.బి.కె. కూడా ఉన్నాం) చదివి, మీరు కోరుకున్న వర్గాల్లోంచి వ్యాసాలు కావాల్సివస్తే అక్కడ రాయొచ్చు. --పవన్ సంతోష్ (చర్చ) 05:32, 1 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
"ఒక వర్గం నుంచి మరిన్ని అంశాలు ఉండాలని భావిస్తే" అని వ్రాసి ఉండటం వలన 'ఆంశాలు ' అనేది ఏమిటో అర్థం కాకుండా ఉన్నది. అందువలన ఏదైనా వర్గం నుంచి మరిన్ని కొత్త వ్యాసాలు ఒక భాషలో వ్రాయలనుకుంటే అని ఉంటే అందరికీ ఇంకా బాగా అర్థం అవుతుంది. కాబట్టి కొత్త వ్యాసాలు వ్రాయవచ్చును అని అర్థం అయ్యింది. కోరుకున్న వర్గాల్లోంచి కొత్త వ్యాసాలు కావాల్సివస్తే లేదా వ్రాయదలిస్తే అక్కడ వెళ్ళి మీరు చెప్పినట్లే వాడుకరులదరూ చేస్తున్నట్లు ఉన్నదా ? నాకు కనబడలేదు. అలా కొత్తవ్యాసం వ్రాస్తున్నాను అని ఎవరూ వ్రాయలేదు అక్కడ. ఎవరైనా అలా చేస్తే లింకు చూపిస్తే అక్కడ నేను వ్రాయదలచుకున్న కొత్త వ్యాసాలు జాబితా ఇస్తాను.JVRKPRASAD (చర్చ) 05:43, 1 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
సాధ్యమైనంత క్లుప్తంగా, స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. చూడండి:
  • కాబట్టి కొత్త వ్యాసాలు వ్రాయవచ్చును అని అర్థం అయ్యింది. - ఈ జాబితాలో ఉన్న వ్యాసాలే రాయాలి, జాబితాలో లేని కొత్తవి రాయకూడదు. మీకు కావాల్సిన వర్గం నుంచి జాబతాలోకి కొత్తవి చేర్చాలంటే నిర్వాహకులను meta:Talk:Supporting Indian Language Wikipedias Program/Contest/Topics వద్ద కోరాలి. వాడుకరులు అందరూ కొత్త వ్యాసాలు అంశాల జాబితా నుంచే రాస్తున్నారు. నేను చెప్పింది ఫలానా రకం వ్యాసాలు కావాలి అని అడగడం గురించి. దయచేసి పైన ఉన్న చర్చ పేజీలో చర్చలు పరిశీలించండి. --పవన్ సంతోష్ (చర్చ) 06:17, 1 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఇంతటితో నావైపు నుంచి ఈ చర్చ ముగిస్తున్నాను. స్పష్టంగా మరోమారు చెప్పేది ఒకటే జాబితాలో లేని కొత్త వ్యాసాలు సమర్పిస్తే నిబంధనలు అంగీకరించవు, జాబితాలో ఒక వర్గం (ఉదాహరణకు మహిళల గురించి, నదుల గురించి) నుంచి మరిన్ని వ్యాసాలు కావాలనుకుంటే పైనున్న లింకులో రాయండి ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 06:23, 1 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఎవరికీ వారు నాకు సంబంధం లేదు అన్నట్లుగా ఉంటే అనుమానాలు ఎవరిని అడగాలి ? కొత్తవాళ్ళకు దీన్నిబట్టి ఎటువంటి ప్రోత్సాహం ఉందో వాళ్లకు బాగా అర్థం అవుతుంది. మీరు ఇచ్చే సమాధానాలు బట్టి మనస్తత్వం తేలికగా అర్థం అవుతుంది. మీ తప్పులు ఉంటే సరిచేసుకోండి, సరిచేయించుకోండి, అంతే అని అర్థం చేసుకుంటే దేనికైనా మంచిది. అది వదిలి వేసి ఏదో దానికి సమాధానం ఇవ్వడం వలన ప్రయోజనం ఏముంటుంది ? JVRKPRASAD (చర్చ) 11:53, 2 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

0:మీకు సంబంధించినది కాదు:0 నేను మొదటి నుండి సమస్యలు చెబుతునే ఉన్నాను. వాటికి పరిష్కారం చూడరు. కానీ అనవసర చర్చలు చేసేస్తారు. చివరికి ఆ చర్చలు విచిత్రంగా ముగుస్తాయి. తర్వాత ఒకరి తర్వాత ఒకరు వరుస క్రమంలో చివరి అధికారగణం వరకు ఒక సమస్య మీద వేరే విధంగా చర్చలు చేసి, నేను పుట్టినప్పుడు "ఆవేశంతో బట్టలు లేకుండా ఏడుస్తూ ఉండగా మేము చూసాము" అని చూడకపోయినా చూశామని ఒక అచ్చు ముద్ర వేసి వదులుతారు. ఆ రాజముద్ర "ఆవేశంతో బట్టలు లేకుండా ఏడుస్తూ ఉండగా మేము చూసాము" జీవితకాలం వేసేస్తారు, మనిషి చనిపోయేవరకు అలంకరిస్తారు. చాలా విచిత్రం విన్యాసాలు. మీ తప్పులు తెలుసుకోవాలంటే, ఏదైనా బాగుపడాలంటే, సద్విమర్శలు ముందు స్వీకరించడం ఎవరికైనా మంచిది.JVRKPRASAD (చర్చ) 11:53, 2 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

వికీప్రాజెక్టు/ప్రాజెక్టు టైగర్ అంశాలు

[మార్చు]
  1. జాబితాలో సూచించిన వ్యాసాలు పాతవ్యాసాలలోని వ్యాకరణం, అక్షరదోషాలు, తప్పుడు సమాచారం అభివృద్ధి చేయాలని ఎక్కడ తెలియజేసారు ? మీరు 300 కొత్త పదాలు అదనంగా ఒక వాడుకరి చేర్చాలి అని మాత్రం చెప్పలేదా ? వ్యాసంలోని మొత్తం సమాచారం ఉదా: ఒక అక్షరంలో దాని పొట్టలో చుక్క, దాని అడుగు ఒత్తు, దాని పై రేఫం లేకపోతే అక్షర దోషం ఉందని తప్పు ఎంచుతామని చెప్పారా ?
  2. పాత వ్యాసంలో దోషాలు ఉంటే అనుమతించము తిరస్కరిస్తాము అని చెప్పారా ?
  3. కొత్త వాడుకరులకు ఎంతో అయోమయంగా ఉంది. ఎవరు కొత్త వ్యాసాలు వ్రాస్తారు, ఎవరు అదనపు సమాచారం చేరుస్తారు.
  4. ఒక వాడుకరి చేర్చిన 300 పదాలు అదనపు సమాచారం అది వికీ నియమ నిబంధనలకు అనుగుణంగా ఉంటే సరిపోదా ?
  5. ఏదైనా ఒక పాత వ్యాసంలో మీకు కనిపిస్తున్న దోషాలు ఒక సహాయక గ్రూపును ఏర్పాటు చేసి వారితో సరి చేయించలేరా ?
  6. ఒక వ్యాసాన్ని అనుమతికి ఇప్పుడు అంత కఠిన నియమములు పాటిస్తున్నప్పుడు,ఇంతకు ముందు పంజాబ్ కప్పు తెలుగులో ఈ పోటీకి నియమించబడ్డ ఉన్న జూనియర్ జడ్జి గారు ఎలా కొట్టుకు (ఇతర ప్రాంత తెలుగు వాడుక పదాలు:దొబ్బుకు, నెగ్గుకు, నూక్కుని,గెలుచుకు) వచ్చారో తెలియదా ? లేక మర్చిపోయారా ?JVRKPRASAD (చర్చ) 08:17, 3 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

0:ఈ పోటీకి సంబంధం లేదు ఈ క్రింది వాక్యాలు:0

  1. ఇలాగే యాజమాన్యం పద్ధతులు ఉంటే గత 10 సం.లు నుండి ఎన్నెన్నో రకాలుగా తెవికీ కోసం చేసిన ప్రయత్నాలు ఏమాత్రం అభివృద్ధి చెందినదనేది ఎవరికీ తెలియదా ?
  2. నేను కావాలనుకుంటే సలహాలు, సూచనలు, లోపాలు, ఇలా అనేకం తెవికీ లోని అనేకం వాటికి సద్విమర్శలు ప్రతి విషయములో చెప్పగలను. కాని, సవ్యంగా అర్థం చేసుకుంటారా ? JVRKPRASAD (చర్చ) 08:17, 3 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రాజెక్టు టైగర్ రచనా పోటీకి కొత్త అంశాలకై ప్రతిపాదన

[మార్చు]

అందరికీ నమస్కారం,
ప్రాజెక్టు టైగర్ రచనా పోటీకి కావాల్సిన అంశాల విషయమై తెలుగు వికీపీడియా నుంచి సాముదాయికంగా (వ్యక్తిగతంగా కాకుండా) ప్రతిపాదనలు పంపించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాను.

  • నియమం ఏమిటి?: "వ్యాసాలు ఇచ్చిన అంశాల జాబితాలోనిది అయివుండాలి. మీరు ఒక వర్గం నుంచి మరిన్ని అంశాలు ఉండాలని భావిస్తే, చర్చ పేజీలో కోరండి. వీలున్నంత వరకూ చేరుస్తాం." అన్నది నియమం.
  • ఏం జరిగింది?: ముందు గూగుల్ సెర్చిలో ప్రాచుర్యంలోని అంశాల వ్యాసాలు 2000 ఇచ్చారు. ఆ తర్వాత దాని విషయమై నేను, విశ్వనాథ్ సహా పలువురు భారతీయ వికీపీడియన్లు ప్రధానంగా ఇవన్నీ పాప్ కల్చర్ (బాలీవుడ్, హాలీవుడ్ నటులు, ఇంగ్లీష్ సినిమాలు, వీడియో గేమ్‌లు వగైరా) నుంచే ఉన్నాయని, భారతీయ భాషల్లో వికీపీడియా కోసం వచ్చేవారు ఇవి చదువుతారన్న నమ్మకం లేదని, ఇంతకన్నా ముఖ్యమైన అంశాలు (ఉదాహరణకు మహిళల జీవితచరిత్రలు, చరిత్ర, సైన్సు, పుస్తకాలు, యాత్రాప్రదేశాలు, తీర్థయాత్రాస్థలాలు, వగైరా) ఉన్నాయని వాటిని పరిగణించాలని ఎవరికి తోచిని పద్ధతిలో వారు చెప్పారు. వీటన్నిటినీ పరిశీలించి కొన్ని కామన్ అంశాలను స్వీకరించి ప్రాజెక్టు సమన్వయం చేస్తున్నవారు మహిళలు (మహిళల జీవితచరిత్రలు, ఫెమినిజం, జండర్ హక్కులు, మహిళల ఆసక్తులు, ఆరోగ్యం వగైరా), కళలు మరియు సాహిత్యం (భారతీయ రచయితలు, కళాకారులు, పుస్తకాలు, ఇతర కళాంశాలు, వగైరా), సైన్స్ & టెక్నాలజీ (శాస్త్రవేత్తలు, భావనలు, సిద్ధాంతాలు, టెక్నాలజీ, గాడ్జెట్లు), చరిత్ర, ఆరోగ్యం అన్న 5 అంశాలలోంచి ఆయా భాషల ప్రాంతాల వారు ఎక్కువమంది ఏయే అంశాలు వెతుకుతున్నారో అవి తెచ్చిస్తామంటూ, మరో 701 అంశాలు తెచ్చారు. వాటిని మనకు ఇవ్వగా థీమాటిక్ అంశాలు పేరిట తెచ్చుకున్నాం. దీనికి అదనంగా అసలు గూగుల్లో వెతికేవాళ్ళు ఏం వెతుకుతున్నారు అన్నదానికి సంబంధం లేకుండా మరో జాబితా (ముఖ్యమైన జనరల్ స్టడీస్, సైన్సు అంశాల జాబితా) ఒకటి తయారుచేస్తున్నారు మలయాళ వికీపీడియన్ విశ్వప్రభ ఆధ్వర్యంలో మరికొందరు. దీనికి ఆమోదం లభించింది, ఇంకా జాబితా రాలేదు. ఆ అంశాలేమిటో ఇక్కడ చూడండి. ఆ విధంగా మనకు రెండు దఫాలుగా రెండు రకాల అంశాలు 2000+701 వచ్చాయన్నమాట. ఇలానే భారతీయ భాషల్లో మిగిలిన వికీపీడియాలకు కూడా 2700 వరకూ అంశాలు ఇచ్చారు, ఇవే అంశాల ప్రాతిపదికన (న్యాయమైన పోటీ ఉండాలి కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి విషయాల మీద జాబితా ఇవ్వకూడదు అందుకని)
  • మనం ఏం చేయొచ్చు?: మనవారికి ఇప్పటికీ ఈ జాబితా సంతృప్తికరంగా లేదని నాకు అర్థమైంది. ఉదాహరణకు వెంకటరమణ గారికి సైన్సుకు సంబంధించి మరిన్ని అంశాలు ఉంటే బావుంటుందని భావిస్తున్నారు. జేవీఆర్కే ప్రసాద్ గారు ఇందులో మరిన్ని హిందూమతానికి, రైల్వేలకు సంబంధించిన అంశాలు ఉండాలి అనిపించింది. ఇది వారి అభిరుచుల మేరకు, ఆసక్తులు, తెలుగు వికీపీడియాలో ఉండాల్సినవని వారు నమ్మిన అంశాల మేరకు చెప్తున్నవని భావించవచ్చు. ఈ ఎడిటథాన్ మీద తమ స్వచ్ఛంద కృషిని వెచ్చిస్తున్న ఈ స్వచ్ఛంద వాడుకరులకు మాకు ఇవి ఆసక్తి అని చెప్పడం కనీస హక్కు అని పోటీ నియమాలూ గుర్తిస్తున్నాయి. ఇవి కాక మనం ఎన్నో ఏళ్ళుగా అనేక అంశాలపై కృషిచేశాం. ఆ కృషి కొనసాగించేందుకు ఇది ఒక అవకాశంగా ఉపయోగించుకుంటే బావుంటుంది కూడాను. (ఉదాహరణకు తప్పక ఉండాల్సిన వ్యాసాలు, ప్రపంచ దేశాల వ్యాసాలు, గూగుల్ అనువాద వ్యాసాలు, సినిమాల వ్యాసాలు వగైరాలు) మనవారికి వ్యక్తిగతంగానూ, సమదాయికంగానూ కూడా రెండు రకాల అంశాలు వేసుకుని జాబితా చేద్దాం. దాని సాధ్యాసాధ్యాలు మాట్లాడుకుందాం. అడిగితే అన్ని భాషలకూ కలిపి జాబితాలు ఇవ్వగలరే తప్ప మనకు వ్యక్తిగతంగా విడిగా ఇవ్వరనీ నా అవగాహన. ఉదాహరణకు మనం ఆంధ్రప్రదేశ్ పర్యాటకం అని అడక్కూడదు, ఆంధ్రప్రదేశ్ గురించి దేశమంతా ఎందుకురాయాలి? ఆయా ప్రాంతాల పర్యాటకం అని అడగొచ్చు. కాబట్టి ఆ అంశాలన్ని కూడా దృష్టిలో పెట్టుకుందాం. చివరకు చర్చించి నిర్ణయం చేస్తే, మనం సముదాయ అభిప్రాయంగా అక్కడ బలంగా వినిపిద్దాం.

ఇది ఈ కార్యక్రమం తెలుగులో సమన్వయం చేస్తున్న ఇద్దరం కలిసి ఆలోచించిన ప్రతిపాదనగా గుర్తించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 04:58, 3 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

రాసేవాటిని కింద ఇచ్చిన రెండు రెండు ఉపవిభాగాల్లో అభ్యర్థనకు సంబంధించిన దానిలో రాయండి. --పవన్ సంతోష్ (చర్చ) 05:01, 3 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

సముదాయ కృషికి సంబంధించిన అంశాలు

[మార్చు]

ఈ కింద అంశాలను చేర్చేప్పుడు అవి ఇప్పటికే తెలుగు వికీపీడియా సముదాయం సమిష్టి కృషిలో భాగంగా చేసివున్నారా, అవి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశాలని భావించారా అన్నది పరిశీలించుకోండి

  • ఈ ప్రతిపాదన సమన్వయకర్తగా, జ్యూరీ సభ్యునిగా చేయడం లేదు, ఓ సముదాయ సభ్యునిగానే చేస్తున్నాను. సముదాయం సమిష్టిగా ఎన్నోమార్లు కృషిచేసిన అంశాల్లో ఒకటైన గూగుల్ అనువాద వ్యాసాలను దీనికి నేను ప్రతిపాదిస్తున్నాను. ఈ వ్యాసాలను ఆమూలాగ్రం చదివి, దిద్దుకుంటూ కూచోవాల్సిన అవసరం లేదు. మొత్తం సమస్యాత్మకమైన సమాచారాన్ని ఒకేమారు తొలగించేసి, 9 వేల బైట్లు అభివృద్ధి చేసి నాణ్యతను సాధారణ స్థాయికి తీసుకురాగలిగితే సరిపోతుంది. అలానే మనం గతంలో కొన్ని నెలల పాటు ఏవి ప్రాధాన్యం ఉన్న అంశాలని ప్రతిపాదించుకున్నాం. అంతటి కృషి మనం చేసివుండడం వల్ల, 2009లోనే గూగుల్ ఇవన్నీ తెలుగు వికీపీడియా నుంచి జనం కోరుకుంటున్న వ్యాసాలు, ఇవి ఉంటే ట్రాఫిక్ పెరుగుతుందని నిర్ణయించే వీటిని చేర్చడం వల్ల ఈ అంశం చాలా చాలా ప్రాధాన్యత సంతరించుకున్నదని నమ్ముతున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 05:06, 3 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
  • ప్రాజెక్ట్ టైగర్ ద్వారా దేశవ్యాప్తంగా అన్ని వికీలలోనూ నాణ్యత, సమాచార అభివృద్ధి జరుగుతోంది. అయితే దానితో పాటుగానే దాదాపు అన్ని వికీపీడియాలలోనూ ఉన్న కామన్ సమస్య అయిన జెండర్ గ్యాప్ ఎంతమేరకు అడ్రస్ అవుతోందనేది ప్రశ్న. ఇప్పటికి తెవికీతో సహా ఎన్నో భారతీయ భాషా వికీపీడియాలు మహిళలకు సంబంధించిన వ్యాసాలపై దృష్టి సారించి, ఎంతో కృషి చేశాయి. ప్రస్తుత జాబితాలో మహిళా వ్యాసాలు ఉన్నప్పటికీ, కేవలం మహిళా వ్యాసాలతోనే ప్రత్యేక జాబితా ఉండాలన్నది నా అభిప్రాయం. ఇది తెవికీకి మాత్రమే ప్రత్యేకమైన ప్రతిపాదన కాక, దేశవ్యాప్తమైనది అని నా ఉద్దేశ్యం. నిజానికి ఇలాంటి ప్రత్యేక జాబితా ఉండకపోతే మనకు తెలియకుండానే, ఈ ప్రాజెక్టు ద్వారా వ్యాసాల విషయంలో జెండర్ గ్యాప్ మరింత పెరుగుతుందేమో చెప్పలేం. పైగా ఈ ప్రత్యేక జాబితా ద్వారా ఈ అంశంపై ఆసక్తి ఉన్న వాడుకరులకు వెతుక్కుంటూ రాయాల్సిన అవసరం ఉండదు.

--Meena gayathri.s (చర్చ) 12:34, 11 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

వ్యక్తిగతంగా అభిరుచి ఉన్న అంశాలు

[మార్చు]

పాఠకులకు ఆసక్తికరంగా ఉంటుందనీ, మీకు వ్యక్తిగతంగా రాసేందుకు ఉత్సాహపూరితంగా ఉంటాయని భావించే ఏ అంశాన్నైనా పాయింటుగా పెట్టి ఇక్కడ ప్రతిపాదించవచ్చు

  • జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన తెలుగు వారు, తెలుగు చలనచిత్రాలు
  • పద్మభూషణ్, పద్మవిభూషణ్ మొదలైన జాతీయస్థాయి పురస్కారాలు గెలుపొందిన భారతీయులు.
  • జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి చలనచిత్ర పురస్కారాలు పొందిన భారతీయ సినిమాలు.
  • అంతర్జాతీయ స్థాయి అవార్డులను పొందిన భారతీయులు, విదేశీయులు.

మొదలైనవి ఈ జాబితాలో చేర్చాలని కోరుతున్నాను.--స్వరలాసిక (చర్చ) 06:52, 3 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]



  • భారత సైనిక దళాలు
  • భారతదేశం వద్ద ఉన్న ఆధునిక ఆయుధాలు, ప్రయోగ వ్యవస్థలు
  • స్వతంత్ర భారతం చేసిన యుద్ధాలు
  • భారతదేశంలో బ్రిటిషువారు చేసిన యుద్ధాలు
  • భారత విదేశీ సంబంధాలు
  • భారత వైజ్ఞానిక పరిశోధన సంస్థలు
  • భారత ప్రభుత్వ రంగ సంస్థలు
  • ఖగోళ విజ్ఞాన వ్యాసాలు
  • సింధులోయ నాగరికతకు సంబంధించిన వ్యాసాలు
  • ప్రాచీన భారతదేశంలో విలసిల్లిన సామ్రాజ్యాలు, పాలకులు
  • పురాతత్వ శాస్త్రం (ఆర్కియాలజీ)
  • పురాజీవశాస్త్రం (పేలియోంటాలజీ)
__చదువరి (చర్చరచనలు) 15:41, 3 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

  • రసాయన పదార్థాలు
  • రసాయన మూలకాలు
  • భౌతిక శాస్త్ర అంశాలు
  • ఖగోళ విజ్ఞాన వ్యాసాలు
  • ఆంధ్రప్రదేశ్ చారిత్రక ప్రదేశాలు
  • గణిత శాస్త్ర వ్యాసాలు.
--కె.వెంకటరమణచర్చ 16:39, 3 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

నేను కొద్దిరోజులుగా ఈ విభాగం చూడలేదు. అయినా కొన్ని అంశాలను తెలియచేస్తున్నాను.. ఇక్కడ ఇస్తున్న సంస్కృత తెలుగు కావ్య, సాహిత్య అంశాలను మెటా పేజీలో కూడా తెలియచేసాను..అవి -https://en.wikipedia.org/wiki/Category:Sanskrit_writers Sanskrit writers], Vedic and Sanskrit literature, History of literature in India, Telugu-language literature..విశ్వనాధ్ (Viswanadh) (చర్చ)


ప్రతిపాదితాంశాల నివేదన

[మార్చు]

ప్రతిపాదించిన ఈ అంశాలను నేను ప్రాజెక్టు టైగర్ తెలుగు జ్యూరీ పసుపున, తెలుగు వికీపీడియన్ల అభ్యర్థనగా ఇక్కడ ప్రాజెక్టు టైగర్ నిర్వాహకబృందానికి నివేదించాను. దీనికి అనుగుణంగా కొత్త జాబితాలను అందించినట్టైతే ఆ విషయాన్ని ఇక్కడే తెలిపరిచి మరీ జాబితాలో చేరుస్తాం. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 13:38, 11 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

  • ప్రతిపాదించిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే, మిగతా భారతీయ భాషలకు చెందిన నిర్వాహకులు, పాల్గొన్న సభ్యుల ప్రతిపాదనలూ పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టు టైగర్ జాతీయ నిర్వాహకులు ఇప్పటికే ఉన్న జాబితాకు తోడుగా మరో మూడు విభాగాలుగా జాబితాలు ఇస్తున్నారు.
  1. ప్రపంచవ్యాప్త ప్రాధాన్యత కలిగిన అంశాలు : ప్రతీ వికీపీడియాలోనూ ఉండవలసిన పదివేల వ్యాసాల జాబితా ఒకటి మెటాలో ఎప్పటినుంచో విస్తరిస్తూ, ప్రాతిపదికలు కోటాలు ఏర్పరుచుకుంటూ రూపొందించారు. విజ్ఞానంలోనూ, మానవ కార్యకలాపాల్లోనూ అత్యంత ప్రాధాన్యత కలిగిన పదివేల వ్యాసాలను జాబితా వేశారు. వ్యక్తులు (2000 వ్యాసాలు), చరిత్ర (800 వ్యాసాలు), భౌగోళికం (1000 వ్యాసాలు), కళలు (600 వ్యాసాలు), మతం-తత్త్వశాస్త్రం (350 వ్యాసాలు), మానవ పరిణామశాస్త్రం, మనస్తత్వశాస్త్రం, నిత్యజీవన వ్యవహారాలు (800), సమాజం, సామాజిక శాస్త్రం (900 వ్యాసాలు), జీవశాస్త్రం, ఆరోగ్యం (1100 వ్యాసాలు), భౌతిక శాస్త్రం (1350 వ్యాసాలు), సాంకేతికత (800 వ్యాసాలు), గణితశాస్త్రం (300 వ్యాసాలు) విభాగాల నుంచి (వీటిలో ఉప విభాగాలూ ఉన్నాయి) ఈ వ్యాసాలు ఎంచి ఏర్పరిచారు. అంశాల వద్ద జాబితా ఇచ్చాం.
  2. జాతీయ స్థాయి ప్రాధాన్యత కలిగిన అంశాలు: ప్రాజెక్టు టైగర్ ప్రారంభం అయ్యాకా పలు వికీపీడియాల నుంచి పలువురు చేస్తున్న చర్చల ఫలితంగా ఈ జాతీయ ప్రాధాన్యత జాబితా రూపొందింది. దీనిలో భారతదేశానికి ప్రత్యేకించి అవసరమైన అంశాల జాబితాల నుంచి రాసే అవకాశం కల్పిస్తూ విజ్ఞానశాస్త్రం, చరిత్ర, భౌగోళికం, భారతదేశం - పరిపాలన, భారతదేశం - జీవితచరిత్రలు, భారతదేశం - సంస్థలు, భారతదేశం - ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అన్న విభాగాల్లోంచి అంశాలు ఇవ్వడం జరిగింది. వీటినీ వివరంగా అంశాల పేజీలో జాబితా వేసి, తగ్గ లింకులు ఇచ్చాను గమనించగలరు.
  3. స్థానిక ప్రాధాన్యత కలిగిన అంశాలు: సముదాయంలోని నిర్వాహకులు స్థానికంగా ప్రాధాన్యత కలిగిన అంశాలను సముదాయంలో జరిగిన చర్చ అనుసరించి 500 అంశాలను ఎంచుకుని జాబితా ఇవ్వవచ్చు. ఈ జాబితా ఇంకా రూపకల్పన చేయలేదు. ఈ శీర్షిక కిందే మన తెవికీపీడియన్లు వ్యక్తిగతంగానూ, సాముదాయికంగానూ అడిగిన అంశాలను చూసి, వాటిలో కొన్ని విషయాలు ఇప్పటికే పై రెండు జాబితాల్లోనూ కవర్ అయిపోయినవి మినహాయించి (ఉదాహరణకు చదువరి గారు అడిగినవాటిలో యుద్ధాలు, స్వరలాసిక గారు అడిగిన అంతర్జాతీయ పురస్కారాలు పొందినవారు అన్నదానిలో కొంతభాగం (నోబెల్), వెంకటరమణ గారు కోరిన రసాయన మూలకాలు, రసాయన పదార్థాలు వంటివి జాతీయ స్థాయి ప్రాధాన్యత జాబితాలో, ప్రసాద్ గారు కోరిన హిందూ మతం అంశాల్లో ఓ 27 ప్రపంచవ్యాప్త ప్రాధాన్యత కలిగిన అంశాల్లో ఇప్పటికే కవర్ చేశారు) ప్రాధాన్యత బట్టి ఈ 500 వ్యాసాల జాబితాను ఇస్తాం. సముదాయ అవసరాలు, ప్రయత్నాలు, పాల్గొనేవారి ఆసక్తులతో పాటుగా, స్థానిక పాఠకులకు ఆసక్తిదాయకమైన అంశాలు ఇందుకు పరిగణించే అవకాశం ఉంది.
ఈ అంశాన్ని సహ-సభ్యులు గమనించగలరు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 09:01, 16 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]