వికీపీడియా చర్చ:2015 లక్ష్యాలు
లక్ష్యాల ఆకృతి
[మార్చు]చాకలిపద్దులా కాకుండా లక్ష్యాలను వివిధ కోణాలనుండి వేరుచేస్తే మరింత ఉపయోగం గా వుంటుంది. వికీపీడియా:2015 లక్ష్యాలు వికీపీడియా:2012 లక్ష్యాలు ఉదాహరణగా చూసి తగుమార్పులు చేస్తే బాగుంటుంది.--అర్జున (చర్చ) 08:31, 8 మే 2015 (UTC)
- @అర్జున, బహుశా మీరు వికీపీడియా:2012 లక్ష్యాలు పేజీని ఉటంకిస్తున్నారనుకుంటాను. చాకలి పద్దు కేవలం ఇక్కడ చర్చ కదిలించడానికి ఉత్పేరకం మాత్రమే. చర్చలతో ఈ పేజీ రూపుదిద్దుకోవలని నా అభిప్రాయం. కానీ మరికాస్త పరిపుష్టం చేస్తాను --వైజాసత్య (చర్చ) 07:53, 9 మే 2015 (UTC)
- -@వైజాసత్య , మీ ఉద్దేశం అర్ధమైంది. ఇప్పుడు రూపం బాగున్నది. --అర్జున (చర్చ) 15:20, 9 మే 2015 (UTC)
నా అభిప్రాయాలు
[మార్చు]మీ ప్రతిపాదన బాగుంది. ముందుగా నిర్వహణ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహణ అంటేనే భారంగా మారింది. నిర్వహణ చేసేవారిపై దుమ్మెత్తి పోసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. నేనూ ఒకప్పుడు నిర్వహణలో భాగంగా తెవికీ మొత్తాన్ని గమనించి సరిదిద్దేవాణ్ణి. నిర్వహణలో భాగంగా కొన్ని వ్యాసాలు, బొమ్మలు, వర్గాలు తొలగించడం, సరిదిద్దడం అవసరమే. కాని ఎదుటివారి నుంచి ప్రతికూలత ఎదురౌతుంది. ఇలాంటి సందర్భాలలో మిగితా నిర్వాహకులు కూడా జోక్యం చేసుకొని మొదటగా చెప్పిన నిర్వాహకుడు చెప్పినది సరైనదేననీ, నిర్వహణలో భాగంగా అలా చేయడం తప్పనిసరి అనీ, సర్దిచెబితే వారు కూడా ఆ విషయం అర్థం చేసుకోగలుగుతారు. వారికి కూడా నియమాలపై అవగాహన ఏర్పడుతుంది. కాని గత 2, 3 సంవత్సరాల నుంచి మెరుగైన నిర్వహణ లేకుండుటచే ఈ కాలంలో సభ్యులుగా చేరి ఇప్పుడు చురుకుగా దిద్దుబాటు చేస్తున్న సభ్యులు నియమాలను, ఇతర సభ్యుల స్పందనలను, చర్చలలో సారాంశాన్ని పట్టించుకోకపోవడం వల్ల వారి చర్యలు ఇతర సభ్యులకు ఇబ్బందిగా మారాయి. క్రియాశీల వాడుకరులకు వికీపద్దతులపై శిక్షణ వల్ల ఈ సమస్య కొంతైనా తీరవచ్చు. అలాగే ప్రోత్సాహక చర్యలు మంచి ఫలితాన్నే ఇస్తాయి, గతంలో ఇచ్చాయి కూడా. కాని కొంతకాలానికి ఇలాంటి ప్రోత్సాహకాలు తిరగబడి వ్యతిరేక ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభించాయి. ఒకప్పుడు అసలైన కృషిచేసిన వారికే ప్రోత్సాహక చర్యలందించేవారు. కాని ఎప్పుడైతే దిద్దుబాట్ల ఆధారంగా ప్రోత్సాహం ప్రారంభమైందో అప్పుడే తెవికీలో కొందరు సభ్యులకు గణాంకాలపై మోజు పెరిగింది. కొందరి సభ్యుల గణాంకాల మోజు తెవికీకి ఎంతగా ఇబ్బంది పెట్టిందంటే ఇతరులు దిద్దుబాట్లు కూడా చేయలేనంతగా భారంగా మారింది. కేవలం బాటు ద్వారా చేయాల్సిన దిద్దుబాట్లు హ్యూమన్ టచ్‌తో సాధించడం వల్ల ఇటీవలి మార్పులలో దిద్దుబాట్లన్నీ అవే ఆక్రమించి తెవికీని సందర్శించడానికే అసహ్యం వేసేది. కేవలం దిద్దిబాట్ల ఆధారంగా పతకాలు ఇవ్వడం సరైనది కాదని నేను పలుసార్లు చర్చలలో వ్యాఖ్యానించడం వల్ల పతకాలు ఆగిపోయిననూ అప్పటికే దిద్దుబాట్ల రుచి చూడటం వల్ల "నర రక్తం రుచిజూచిన మృగరాజు"వలె దిద్దుబాట్లు జోరు మాత్రం నిర్విరామంగా కొనసాగీ, కొనసాగీ పలువురు సభ్యులు స్పందించడం వల్ల ఇప్పుడిప్పుడే తుదిదశకు చేరుకుంటోంది. ఇతర సభ్యులు కూడా మొదటే ఇలాంటి చర్చలకు స్పందించియుంటే పరిస్థితి ఇంతగా విషమించేది కాదేమో. ఈ "దిద్దుబాట్ల" కాలం తెవికీ చరిత్రలో చీకటియుగంగా భావించవచ్చు. ఇక సాంకేతిక అంశాలపై వస్తే ఒకప్పుడు దేవా గారిలా ఇప్పుడు అర్జునగారు చక్కగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు కూడా శిక్షణ ద్వారా సాంకేతికాంశాపై పట్టు సాధిస్తే మంచిది. మొదటి పేజీ నిర్వహణలో కూడా వారివారి అభిరుచిని బట్టి తలా ఒక శీర్షిక బాధ్యతను తీసుకుంటే "మొపే" నిర్వహణ కూడా మెరుగౌతుంది. చిన్న వ్యాసాలతో పాటు అనువాదం లేని చాలా వ్యాసాలను పూర్తిగా తొలగించడం మంచిది. సభ్యులు పేజీ ప్రారంభకులుగా ఉండటానికి ఆసక్తి చూపడం కన్నా వారికి ఆ వ్యాసాలపై పట్టు ఉన్నప్పుడే ప్రారంభించడం మంచిది. నేను పరిశీలించిన చాలా వ్యాసాలలో తప్పు సమాచారం ఉంది. కొన్ని వ్యాసాలలో ఎంతగా తప్పులున్నాయంటే ఆ వ్యాసాలు చదివితే విజ్ఞానసర్వస్వంలోని వ్యాసం బదులు హస్యకథ చదివినట్లవుతోంది. ఇక చివరగా నేను చెప్పేదీ, అందరికీ అనుభమైనదీ ఏమిటంటే ఏ చర్చ కూడా ఫలితాన్ని ఇవ్వకపోవడం. ప్రతీ చర్చ అర్థాంతరంగా ఆగిపోవడం తెవికి దృష్ట్యా సమంజసమైన విషయం కాదు. దీనివల్ల తదుపరి చర్చలలో పాల్గొనడానికే సభ్యులు ఆసక్తి చూపరు. ఇలాంటి అంశాలపై అనుభవమున్న సభ్యులు దృష్టిసారిస్తే, ఇతర సభ్యులు సహకరిస్తే తెవికీకి తప్పకుండా మళ్ళీ స్వర్ణయుగం వస్తుంది. సి. చంద్ర కాంత రావు- చర్చ 18:56, 8 మే 2015 (UTC)
- సి. చంద్ర కాంత రావు గారు, మీ స్పందనలతో నేను ఏకీభవిస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 00:20, 9 మే 2015 (UTC)
- చంద్ర కాంత రావు గారూ, జరిగిన దానిని గురించి మీతో అంగీకరిస్తాను. లక్ష్యాలను నిర్ణయించడంలోనూ, సాకారం చేయటంలో క్రియాశీలకంగా పాల్గొని తోడ్పతారని ఆశిస్తున్నాను. --వైజాసత్య (చర్చ) 07:56, 9 మే 2015 (UTC)
- సి. చంద్ర కాంత రావు గారు, మీ స్పందనలతో నేను ఏకీభవిస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 00:20, 9 మే 2015 (UTC)
పవన్ సంతోష్ స్పందన
[మార్చు]ఈ స్పందనలో భాగంగా ప్రస్తుతం ఇతర సభ్యులు ఈ దిశగా చేసిన కృషికి నా ఆలోచనలు కూడా చేర్చడమూ, అలానే అవి కాక ఇంకొన్ని ప్రతిపాదనలు చేయడమూ చేస్తాను.
ప్రస్తుత ప్రతిపాదనలు
[మార్చు]- వంద విశేష వ్యాసాలు అన్నది చాలా పెద్ద లక్ష్యం, నిజానికి ఇది కుదరదేమోనని నా అంచనా. ఐతే ఇక్కడ సమస్య వంద అన్న అంకెతో కాదు, విశేష వ్యాసాలతో. ఎందుకంటే ఆంగ్లంలోనే విశేష వ్యాసాలనేవి నిజానికి ఓ అబ్స్ట్రాక్ట్ విషయమని నా లెక్క. వాటిపై పనిచేయగా చేయగా వాటి విషయంపై స్పష్టత వస్తుందే కానీ నియమాలు మీకేం స్పష్టత ఇవ్వలేవు. ఉదాహరణకు బ్రిల్లియంట్లీ రిటెన్ అన్నారు, దాన్ని మనం ప్రస్తుతం ఉన్న సామాగ్రితోనూ, మానవ వనరులతోనూ అంచనా కట్టలేం. అలాగని విశేష వ్యాసాల స్థాయిని బాగా తగ్గించడమూ సరికాదు. దీనికి నా సూచన విశేష వ్యాసాలు కాకుండా మంచి వ్యాసాలు చేసుకోవడం. వంద మంచి వ్యాసాలు సాధించదగ్గ విషయమేనని నా లెక్క.
- త్రిసభ్య కమిటీ సూచన చాలా బావుంది. ఇది తెవికీ స్థితిగతులను, ఉన్న సముదాయం సామర్థ్యాలను అంచనాలో పెట్టుకుని చేసిన ఉత్తమమైన ప్రతిపాదన. వేర్వేరు రంగాల్లో లోతైన ఆసక్తీ, నాణ్యతపై రాజీలేని తత్త్వం ఉన్న ఎందరో కార్యకర్తలు ఉండడం బాగా పెద్ద వికీల విషయంలో సాధ్యం. ఐతే తెవికీ లాంటి మధ్యస్థమైన వికీల విషయానికి వస్తే ఇదే కరెక్టు.
- ఐతే అడ్డంకిగా గుర్తించిన ఉత్సాహం కరువు అన్న విషయాన్ని పరిష్కరించేందుకు సరైన మార్గం మరో ముఖ్యప్రతిపాదనలోని ఆన్-బోర్డింగ్ ప్రక్రియే. అంటే కొత్తగా వికీపీడియాలో ఆసక్తి కనబరుస్తున్న మీనాగాయత్రి, విజయ విశ్వనాథ్ గారు వంటివారినీ దీన్లో భాగంగా స్వీకరించి వారికి మొదటి నుంచీ నాణ్యతపైనా, బాధ్యతల స్వీకారంపైనా ఆసక్తి కలిగించేలా ప్రయత్నించాలి. ఇందుకుగాను వారికి గుర్తింపుని నాణ్యతను, సమర్థతను, బాధ్యతను ఆధారం చేసుకునే కల్పించాలి.
- కొత్త ప్రాజెక్టులకు విరామాన్ని నేనూ సమర్థిస్తున్నాను. ఒక పని సంస్కృతి, సహకారం చేసుకునే లక్షణాలు అలవడకుండా ఓ ప్రాజెక్టును ఊరికే సృష్టించడం సరికాదు.(ఇలాంటి పని నేనూ ఒకసారి చేశానులెండి.)
- సముదాయపు అభివృద్ధిలో మొదట చెప్పదలచిన విషయమేంటంటే, ఈ పనిని తప్పనిసరిగా మంచి/విశేష వ్యాసాల అభివృద్ధి వంటి వాటితో synerge అయ్యేలా ప్రయత్నించాలి.
- నిర్వాహకులు కనీసం 5శాతం సమయం ఆంగ్లవికీలో పనిచేయాలన్న సూచన బావుంది. ఆంగ్లవికీ నాణ్యతలో బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్న వ్యవస్థ కనుక ఈ సూచన వచ్చివుంటుంది. కానీ పలువురు భాషాభిమానులు, ఆత్మగౌరవపరులు ఆక్షేపించవచ్చు కనుక ఆ వాక్యంలో సరైన అర్థం వచ్చే చేర్పులు చేస్తే బావుంటుంది.
- సోషల్ మీడియాలో తెవికీ చరిత్రలో ఈరోజు రికార్డు స్థాయిలో మన ప్రణయ్ నిర్వహిస్తున్నారు. గతంలో ఓసారి రహ్మాన్ బాపు గారి పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన వ్యాసాలకు ఏమైనా కంట్రిబ్యూట్ చేస్తారా అంటే అప్పటికి వికీలో ఖాతా తీసుకుని ఓ మూడురోజులు అవ్వని నేను ఆయన సాహిత్యరంగంలో చేసిన కృషిని విస్తరించాను. నా స్నేహితుల్లో ఒకరైన కట్టా శ్రీనివాసరావు గారు కలివికోడిని గురించి చాలా వివరాలు రాస్తూపోగా ఈ విషయాలే వికీలో రాయండని నేను ప్రోత్సహించాను. ఐతే ఇవన్నీ విడివిడి ప్రయత్నాలు. రహ్మాన్, నేనూ వీటిని ప్రణయ్ లాగా ఉద్యమస్థాయికి తీసుకుపోలేకపోయాం(సమయం అనేది ఉండనే ఉంది). ఇటువంటివి బెస్ట్ ప్రాక్టీసెస్ గా స్వీకరించి సోషల్ మీడియా స్ట్రాటజీని రూపొందించవచ్చు.
కొత్త ప్రతిపాదనలు
[మార్చు]- ప్రస్తుతం వికీకీ, మీడియాకీ దాదాపుగా సంబంధాలు లేనట్టే. మీరు కవిసంగమం వంటి సంస్థల సంగతే చూస్తే ఆ సంస్థలకు పేరు రావడానికి ఉన్న ముఖ్యకారణాల్లో ఆ సంస్థలోని క్రియాశీలక సభ్యుల్లో మీడియా వారు ఉండడమే. మనం ఓ కొత్త సభ్యుణ్ణి వికీకి తీసుకురావాలనే కోణంలో చేసే ప్రయత్నాలు ప్రస్తుతం మీడియాలోని ఆసక్తికరమైన వ్యక్తులు వికీ ఇన్‌సైడర్లు కావడం ఒకటి. ఐతే ఈ విధమైన కంట్రిబ్యూషన్లు చాలా సంస్థల్లో నిషిద్ధం. వారి ప్రతి వాక్యం ఆ సంస్థకే అంకితం కావాలన్న నిబంధన ఉంటుంది. ఈ విషయాన్ని ఎలా డీల్ చేయాలో కూడా చూసి ప్రయత్నించాలి.
- వికీపీడియాలో తెలుగుపై ఆసక్తివున్న నిపుణులు, పరిశోధకులు ఇన్సైడర్లు కావడం చాలా ముఖ్యం. ఉదాహరణకు ఈమాట పత్రికలో అత్యంత ప్రామాణిక వ్యాసాలు రాసే సురేష్ కొలిచాల వంటివారు. ఐతే వారికి వ్యాసాలు రాసే వీలు లేనంతమాత్రాన వదలక, వారి సేవలను సోదర సమీక్ష వంటి వాటిలో వినియోగించుకుంటే ఎలా వుంటుందన్న కోణంలో చర్చలు చేయాలి. నా అవగాహన ప్రకారం ఎక్కడ, ఎలా మొదలుపెట్టీనా చివరకు వారిని పూర్తిస్థాయి క్రియాశీలక సభ్యులుగా వికీ స్ఫూర్తే చేస్తుంది.
- తెవికీ గురించి, అంతర్జాతీయంగా వికీపీడియా సాధిస్తున్న విషయాల గురించి సందర్భోచితంగా పత్రికల సంపాదకీయాల పేజీల్లోని వ్యాసాల స్థాయిలోనివి రాసి ప్రచురణకు పంపుతూండాలి. వికీలో జరుగుతున్న విశేషాల్లో ముఖ్యమైనవేవి పత్రికల్లో వార్తలుగా ఒదుగుతాయో చూసుకుని వాటీని పంపాలి. ఉదాహరణకు: నిర్మాణపరంగా వికీపీడియా ఓ గొప్ప ఫీట్. వందలమందిని ఇలా ఓ బంధంతో కట్టివుంచేందుకు, వారు నిస్వార్థమైన సేవ చేసేందుకు మూలకారణం ఏంటన్న విషయంపై కొంత మనమే మంచి వ్యాసాలు రాసి, వాటిని సంపాదకీయాలకు పంపవచ్చు. అలానే ఇటీవల పుస్తకం.నెట్లో తెలుగు సమాచారం అందుబాటులోకి ప్రాజెక్టు గురించి వ్యాసం రాశాను. తెవెలో అర్జునరావు గారు గతంలో రాశారు.
- ఆన్లైన్లో చాలా పుస్తకాలున్నాయి. ఇప్పటివరకూ మనవాళ్ళు వీటిని దింపుకుని వ్యాసాలు అభివృద్ధి చేసే విషయంలో అంతగా దృష్టి సారించలేదు. దీన్ని కూడా పరిశీలించాలి.
ఇవీ ప్రస్తుతానికి నా ఆలోచనలు.--పవన్ సంతోష్ (చర్చ) 13:36, 9 మే 2015 (UTC)
పవన్ సంతోష్ వ్యాఖ్యలపై నా స్పందన
[మార్చు]సమయం తీసుకొని ప్రతిపాదనలకు స్పదించినందుకు ధన్యవాదాలు
- 1. విశేష వ్యాసాలపై మీ వ్యాఖ్య అర్ధమైంది. వంద మంచి వ్యాసాలు తయారైనా అది గొప్ప విజయమే.
- ౩. అవును, ముందు నుండి సరైన శిక్షణ ఇస్తే ఇది తప్పక సాధించగలం
- 5. సముదాయపు అభివృద్ధి, లక్ష్యాలు ముడిపడి ఉండేట్టు ఇరు కార్యక్రమాలు కొనసాగించాలి.
- 6. ఆంగ్లవికీలో పనిచెయ్యటం వళ్ళ, వివిధ నియమాలు పద్ధతులపై అవగాహన పెరగటమే కాకుండా, కొత్త ఆలోచనలు, పద్ధతులు ఇక్కడికి తీసుకువచ్చేందుకు దోహదం చేస్తుంది. అంతేకాక తెలుగు వికీపీడియన్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది.
- 7. ఈ విషయమై నాకున్న అవగాహన చాలా తక్కువ. సోషల్ మీడియాలో ఉత్సాహంగా పనిచేస్తున్న సభ్యులు తగిన విధంగా ఈ వ్యూహం తయారుచేసి, అమలుచేయటంలో తోడ్పడతారని ఆశిస్తున్నాను.
- 1. ఈ కవిసంగమం ఏమిటి? స్వఛ్ఛంద సంస్థ అయితే సంస్థేతర కాంట్రిబ్యూషన్లను ఎందుకు నిషేధిస్తుంది? పిడకలవేట పక్కనపెడితే అసలు విషయం అర్ధమైంది. మీడియాతో అవినాభావ సంబంధాలు ఏర్పరచుకోవాలి. మంచి సూచన
- 2 ప్రస్తుత పరిస్థితి ఏమిటో కానీ సురేష్ కొలిచాల లాంటి వాళ్ళు ఇది వరకు చాలా దగ్గరిగానే వికీని పరిశీలించేవాళ్ళు. వికీపీడియాలో తెలుగు వర్ణమాల వ్యాసాలు వ్రాసింది ఆయనే (వాడుకరి:Lekhak). సముదాయ పందిరి దుష్టసమాసమని నాకు తెలియజేసింది కూడా ఆయనే (అప్పటి దాకా దుష్టసమాసమనే కాన్సెప్టే నాకు తెలియదు). అప్పుడప్పుడు కొన్ని వర్గాల పేర్లు చూసినప్పుడు నాకు ఆయనే గుర్తికొస్తారు. వాళ్ళను మళ్ళీ ఇక్కడ తప్పకుండా పాల్గొనేట్టు చేయవచ్చు. సోదర సమీక్ష కంటే సహచర సమీక్ష బాగుంటుందేమో? అవును అలాంటి విషయాల్లో తప్పకుండా వారి సహాయం తీసుకోవచ్చు.
- ౩ అవును, బాగుంది.
- 4 మంచి వ్యాసాలు తయారుచేసే ప్రక్రియలో చాల వనరులు అవసరమైతాయి. అప్పుడు వాటిపై తప్పకుండా దృష్టిసారిస్తారు
--వైజాసత్య (చర్చ) 03:19, 11 మే 2015 (UTC)
- వైజాసత్య గారూ కవిసంగమం గురించి పేర్కొన్న కామెంట్లో నేను కొంత స్పష్టత లేకుండా రాసినట్టున్నాను. నేను అనదలుచుకున్నదేంటంటే మీడియా సంస్థలు(మరీ ముఖ్యంగా పత్రికలు) తమ ఉద్యోగులు ఇతరత్రా ఏమీ రాయకూడదన్న నియమాలు కలిగివుంటాయి. అందుకనే ఈనాడులో పనిచేసిన జంపాల వారు తన స్వంతపేరు వదిలి రిటైర్ అయ్యే వరకూ సహవాసి అన్న కలంపేరిటనే అద్భుతమైన అనువాదాలు చేస్తూపోయారు. ఐతే కవిసంగమం ఓ ఫేస్బుక్ కవుల సంస్థ. మీరనుకున్నట్టే అలాంటి నియమాలేవీ వాళ్ళకు లేవు. వారు ఎలా ప్రాచుర్యం పొందారో ఉదహరించానంతే. ఇక సురేష్ కొలిచాల తెవికీలో పనిచేశారని ఇప్పుడే తెలుసుకున్నాను. ఏదేమైనా అటువంటి వారు చాలా విలువైన ఆస్తి. సహచర సమీక్ష అన్న పదం చాలా బావుంది. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 15:05, 11 మే 2015 (UTC)
'త్రిసభ్య మండలి' మరియు లక్ష్యాలు
[మార్చు]త్రిసభ్య మండలి పరిధి పూర్తిగా అర్ధం కాలేదు. ఆచరణలో వికీ సభ్యులు స్వచ్ఛందంగా పనిచేసేవారు కాబట్టి ఈ విధానంలో బలహీనతలుంటాయి. విధానాల తయారీ, అమలులో లోపం ప్రధానం కాబట్టి, దానికొరకు ఏకాభిప్రాయం నిర్ణయాలను సడలించితే (60శాతం ఆధిక్యత వుంటే చాలు లాంటి నిర్ణయాలు) మంచి ఫలితాన్ని ఇవ్వవచ్చు. 100 వ్యాసాలన్న లక్ష్యంకూడా వత్తిడిని పెంచవచ్చు. కావున ఒక ప్రధాన ప్రాజెక్టు (ఉదాహరణకు) మొదటి పేజీ నిర్వహణ ప్రాజెక్టు (వికీట్రెండ్స్ తో అనుసంధానం చేసి) చేపట్టి దాని ద్వారా వ్యాసాల నాణ్యతని పెంచడానికి ప్రయత్నించడం మంచిది. ఆ అనుభవాన్ని బట్టి, ఆతరువాత నిర్ణీత సంఖ్య తోకూడిన లక్ష్యాలు చేపట్టడం మంచిది. --అర్జున (చర్చ) 08:32, 12 మే 2015 (UTC)
- @అర్జున, త్రిసభ్యమండలి అంటే వ్యాసాల నాణ్యతపై ఒక మోస్తరు అవగాహన ఉన్న ఒక ముగ్గురు సభ్యులు ఒక వ్యాసం ఉత్తమ వ్యాసం అవ్వాలంటే ఇంకా ఏమేంచెయ్యాలి అన్నదానిపై సలహాలు, సూచనలు. అందరూ సలహాలు, సూచనలు చేయవచ్చు. కానీ ఈ ముగ్గురు మండలి సభ్యులు మాత్రం ఖచ్చితంగా ఆయా వ్యాసానికి చేయవలసిన మార్పులు సూచిస్తారు. అలాగే, ఉత్తమవ్యాసం స్థాయికి చేరిందా లేదా అనికూడా నిర్ణయిస్తారు. త్రిసభ్యమండలి ఎందుకన్నానంటే ఇక్కడ విశేష, ఉత్తమ వ్యాసాలను వ్రాసిన అనుభవం ఎవరికీ లేదు. అందువళ్ళ ఒకరు గమనించని అంశాలు, మిగిలిన ఇద్దరు గమనించే అవకాశమున్నదని. ఉత్తమ వ్యాసాలు వ్రాసిన అనుభవంతోటి భవిష్యత్తులో మరికొంతమంది ఉత్తమ వ్యాసాలు సమీక్షించగల అనుభవాన్ని గడిస్తారు. అప్పుడు పవన్ సంతోష్ ప్రతిపాదించినట్టు మండలిని ఎత్తేసి, సహచర సమీక్ష పెట్టుకోవచ్చు. మొదటి పేజీ నిర్వహణ ప్రాజెక్టును కూడా దీనితో అనుసంధానించవచ్చు. దాని వళ్ళ అధమపక్షం సాలీనా 54 ఉత్తమ వ్యాసాలు తయారౌతాయి. --వైజాసత్య (చర్చ) 03:41, 15 మే 2015 (UTC)
- @వైజాసత్య వివరణకు ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 12:23, 16 మే 2015 (UTC)
సభ్యులు మరియు 2015 లో ఆసక్తులు
[మార్చు]వికీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న సభ్యుల ఆసక్తులు ఒక చోట సమీకరిస్తే ఇటువంటి ప్రక్రియ చేపట్టటానికి తగిన బలం వుందా లేదని తెలుస్తుంది. ఈ దిశగా క్రియాశీలక సభ్యులందరు తమకు ఇష్టమైతే వారి వాడుకరి పేజీలలో 2015లో వారి ఆసక్తులు రెండు మూడు చేర్చటం ఉపయోగకరం . ఉదా: నా పేజీ విభాగం చూడండి.--అర్జున (చర్చ) 08:36, 12 మే 2015 (UTC)
- @అర్జున, మీ ఆలోచన బాగానే ఉంది. కానీ బలానికి అది సరైన అంచనా కాదేమో? వికీలో ఒక ప్రణాళిక పెట్టుకొని పనిచేసేవాళ్ళు కొంతభాగం మాత్రమే (ఉదా:సుజాత గారు, గుళ్ళాపల్లి గారు). నాలాంటి వాళ్ళు ఏదో ఒకటి వ్రాయాలని ఇక్కడికి వస్తారు. యాధృఛ్ఛిక పేజీ ఓ పదిసార్లు టపటపమనిపించి ఏదైనా ఆసక్తికరమైనది కనిపిస్తే, దాన్ని కాస్త కదిలించి వెళతారు. ఇలాంటి ప్రణాళిక లేని వాడుకరులకు ఒక లక్ష్యం ఇస్తే దానిపై బాగా పనిచేయగలరు. అయినా నేను ప్రతిపాదించినది ప్రత్యేక ప్రాజెక్టు కాదు. నేను చెప్పినట్టు ఎవరి ప్రాజెక్టులలో (ఆసక్తులు) వారు పనిచేస్తారు. కానీ ఆ కృషిని నాణ్యతాదృష్టితో, ఉత్తమవ్యాసం అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొనిచేస్తారు. ఏ ప్రాజెక్టు, ప్రణాళికా లేనివాళ్లకి వికీట్రెండ్సు ఆధారితంగా ఎంపిక చేసిన ఒక వ్యాసాన్ని అభివృద్ధి చేయమని లక్ష్యంగా ఇస్తామనమాట. ఇలా జరిగినకృషంతా మొదటి పేజీ నిర్వహణకు తోడ్పడుతుంది --వైజాసత్య (చర్చ) 03:55, 15 మే 2015 (UTC)
- @వైజాసత్య, మీరన్నదీ నిజమే, కాకపోతే, ఎవరికి వారు రాసుకున్న లక్ష్యానికి కొంత కట్టుబడి వుండవచ్చని అలాంటి సూచన చేశాను. ఇదివరకు నేను నిర్వహించిన ప్రాజెక్టులలో ఆహ్వానం మేరకు, సభ్యులు సంతకాలు పెట్టటం చేశారు కాని ఎక్కువమంది ఆశించినంతగా చేయలేకపోవటం చూశాను. ప్రతిపాదన ని అమలు చేసి మూడు నెలల తరువాత సమీక్షించితే సరియైన ఫలితం వస్తున్నదిశగా పురోగతి వుందీ లేనిది తెలుస్తుంది. --అర్జున (చర్చ) 12:26, 16 మే 2015 (UTC)