వికీపీడియా చర్చ:2020 వికీమీడియా జాతీయ సమావేశం ప్రతిపాదన

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
The following discussion is an archived record of a request for comment. Please do not modify it. No further edits should be made to this discussion.
A summary of the debate may be found at the bottom of the discussion.

ప్రతిపాదన పై స్పందన

[మార్చు]

కాన్ఫరెన్సు నిర్వహించాలి. హైదరాబాదులో చెయ్యాలి. ఈ రెండు విషయాలే చెప్పారు. ఆ రెండూ నాకోకే. ఇతర వికీసముదాయాల్లో దీన్ని ప్రస్తావించినపుడు, వాళ్ళు వేరే స్థలాన్ని సూచిస్తే అప్పుడేం చేస్తారు? (వాళ్ళూ హై.కి సరే అనే అవకాశం చాలానే ఉందనుకోండి). __చదువరి (చర్చరచనలు) 14:45, 1 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

@Chaduvari: నమస్కారం! ఈ ప్రశ్న గురించి మేము కూడా ఆలోచించాము. ఇది ఒక జాతీయ సమావేశం అయినందున వివిధ బాషల నుండి వికీమీడియన్లు నిర్వహణ పనులలో పాల్గొంటారు. బిడ్డింగ్ విధానమును లేకపోవటానికి ముఖ్య కారణం; ఇప్పటికి మూడు సంవత్సరాలు దాటిపోయాయి, ఎవరు ముందుకు రాలేదు - ఈ మనం చేస్తాం అంటున్నాం కాబట్టి, ఎవరైనా వేరే స్థలం సూచిస్తే ఈ సంవత్సరం వాళ్ళని నిర్వహణలో భాగం చేసి, 2021కి తయారు చేయొచ్చు. ఇలాంటి సమావేశం ప్రతి సంవత్సరం జరగటం చాలా ప్రయోజనకరం మరియు అవసరం. మొదటిది ముంబైలో జరిగింది, రెండోవది చండీగఢ్ లో, ఇక్కడ హైదరాబాదుకి అన్ని రవాణా మార్గాల ద్వారా బాగా సునాయాసం, మరియు చాలా తక్కువ రేట్లకి మనకు హోటల్స్ దొరికే అవకాశం ఉంది. చివరిగా ఇప్పుడు బిడ్డింగ్ చేయటానికి తగిన సమయము లేదు; ఈ నెలాఖరికి మనకి దేశవ్యాప్తంగా తగిన మద్దతు వస్తే, వచ్చే నెలలో సర్వే చేయాలి, మరియు జనువారికి గ్రాంట్ ప్రతిపాదించాలి. ధన్యావాదాలు, KCVelaga (talk) 17:08, 1 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
2016 కు 2019 కి సమాచార వినిమయ విధానంలోను, అంతర్జాల వినియోగంలోను దేశంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినందున 2020 నాటికి ఇటువంటి జాతీయ స్థాయి సమావేశం నిర్వహించడానికి అనువైన పరిస్థితులు హైదరాబాదులో పుష్కలంగా ఉన్నాయని భావిస్తున్నాను. సమగ్రమైన ప్రణాళికను రచించడానికి తగిన సమయం ఉన్నది. తప్పక విజయవంతమౌతుందని అనుకుంటున్నాను--Ramesam54 (చర్చ) 15:14, 1 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@Ramesam54: ధన్యావాదాలు. KCVelaga (talk) 17:08, 1 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ సమావేశం నిర్వహించడానికి చదువరి, వెలగ, పవన్ మొదలైన వారి సాంకేతిక నైపుణ్యాలతో తెలుగువారు (రెండు రాష్ట్రాలవారిని కలిపి) అందరూ కలిసి చేస్తే బాగుంటుంది. హైదరాబాదు అన్నివిధాల అనువైన ప్రదేశం. మన ప్రణాళికలను సిద్ధంచేసుకోవడానికి తగినంత సమయం ఉన్నది. వికీ అన్ని మాధ్యమాలలో తెలుగు భాషకు ఒక గుర్తింపు పొందియున్నాము కాబట్టి ఇతర భారతీయ భాషల వారికి అభ్యంతరం ఉండదని భావిస్తున్నాను.--Rajasekhar1961 (చర్చ) 17:47, 1 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

@Rajasekhar1961: తప్పకుండా, ఇది మనం అందరం కలిసి చేసే కార్యక్రమం. ఈ రోజు దేశవ్యాప్తముగా ప్రకటించబోతున్నాం, అందరు దీనికి మద్దతు ప్రకటిస్తారని ఆశిస్తున్నాం. ధన్యావాదాలు, KCVelaga (talk) 01:49, 2 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

[User:KCVelaga|KCVelaga]],పవన్ సంతోష్ గార్లకు, డిసెంబర్ లోనే అని ఏందుకు అనుకుంటున్నారు. హైదరాబాద్ యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితులు గమనించారా?, డిసెంబర్‌కు కుదుటపడేలా ఉంటాయా?. ఇదే సమయం అని నిర్ధారణకు రాకపోతే వివరణ అవసరం లేదు. అలాగే వాడుకరుల భాగస్వామ్యం, వనరుల, సాధ్యాసాద్యాలపై మీరనుకొనే ఒక గుంపులో సంప్రదింపులు జరుపుకొని ఉంటారనుకుంటాను. చండీగడ్ లో జరిగిన సమావేశాల లోపాలనుకూడా మీరు బేరీజు వేసుకొనే ఉంటారనుకుంటాను. (ముఖ్యంగా మొదటి రోజు రాత్రి జరిగిన చేదు అనుభవం). సమయం చాలా ఉంది కనుక వీటిని పరిగణణలోకి తీసుకొని మీరు ఎలాంటి లోపాలు లేకుండా విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఆశిస్తాను. B.K.Viswanadh (చర్చ) 03:24, 2 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@B.K.Viswanadh: డిసెంబరు ఎంచుకోవడానికి పలు కారణాలు ఉన్నాయి. అంతా సక్రమంగా జరిగితే, జనువరిలో మనము వికీమీడియా ఫౌండేషన్ కు గ్రాంట్ ప్రతిపాదిస్తే, వారు సుమారుగా ఏప్రిల్ లో వారి నిర్ణయం తెలుపుతారు. పలు గ్రాంట్స్ తీసుకున్న అనుభవంతో చెప్తున్నాను, ఇది పెద్ద మొత్తం అయినందున సి.ఐ.ఎస్ -ఏ2కె ద్వారా మనము నిధులు తీసుకోవాలి. వ్యక్తులు ఇంత పెద్ద మొత్తం తీసుకొంటే పన్ను సమస్యలు వస్తాయి. ఈ ఫార్మాలిటీలు అన్ని పూర్తీ చేసుకొనే సరికి మే అవుతుంది, అప్పటి నుండి మనకి కనీసం 6-8 నెలలు అవసరం. నవంబరులో మొదటి వారములో అంతర్జాతీయ వికీ-మహిళల సమావేశం జరిగే అవకాశం ఉంది, కావున, మనము డిసెంబరు రెండు లేదా మూడో వారాలలో (క్రిస్మస్ కి ముందు) చేస్తే మంచిది అని భావించాం. మీరు అన్నట్టు గానే తగిన సమయం ఉంది కనుక, అంటువంటి తప్పిదాలు జరగకుండా చూసుకుందాం. KCVelaga (talk) 02:19, 3 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
2016లో చండీగడ్ లో జరిగిన కాన్ఫరెన్సును చూసినప్పుడు, తెవికీ తరపున కూడా ఇలాంటిది నిర్వహించే అవకాశం వస్తే బాగుండు అని ఆశపడ్డాను. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. మనందరం కలిసి దీనిని చేయగలమూ అనిపిస్తుంది. వీలైనంత తర్వగా అప్రూవల్ తెచ్చుకొని పనులను ప్రారంభింద్దాం. -- Pranayraj Vangari (Talk2Me|Contribs) 19:41, 2 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@Pranayraj1985: తప్పకుండా, ఈ నెలాఖరికి మిగతా కమ్యూనిటీస్ వారు మద్దతు తెలిపితే, వచ్చే నెల నుండి గ్రాంట్ పనులు మొదలు పెట్టవచ్చు. KCVelaga (talk) 02:19, 3 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
KCVelaga గారూ, బోయినాల్లో ఆవకాయ, ఎరగారప్పచ్చడి పెట్టించండి, ముద్దపప్పుతో సహా. వాళ్ళ వాళ్ళ వికీల్లో వీటి మీద వ్యాసాలు రాసుకునేలా ఉండాలి-ఈపాటికే లేకపోతే. అతిథులకి మళ్ళీ మీరు ఎప్పుడు కనబడినా వాటి గురించే మాట్టాడేట్టుండాలి. __చదువరి (చర్చరచనలు) 04:35, 4 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@Chaduvari: భలే మంచి మాట. KCVelaga (talk) 11:09, 4 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@చదువరి గారు నిజంగా.. పంజాబ్ లో భోజనాల దగ్గర చాల మంది ఇబ్బంది పడ్దారు. దాల్, చపాతీ పసుపు రైస్ అని అవే ఉండేవి. ఇక్కడ నార్త్, సౌత్ కలయికతో మంచి భోజనం ఇవ్వగలిగితే బావుంటుంది. @ చైతన్య గారు అలాగే, 16 కాన్ఫరెన్స్‌లో వాళ్ళు మిగతా వికీల వాళ్ళకు పంజాబ్ సంభందిత వ్యాసాలను ఆయా భాషల్లో రాయమని ఇచ్చినట్టుగా, మనమూ ఈ అవకాశాన్ని వాడుకొని అలాంటి ప్రయత్నం ద్వారా తెలుగు, ఆంధ్ర, తెలంగాణా సంభంద వ్యాసాలను వారి భాషల్లో విస్తరించే కార్యక్రమం తయారు చేయగలిగితే తెవికీ మరికొంత ప్రాచుర్యం కల్పించినట్టు ఉంటుంది అనుకుంటున్నాను...B.K.Viswanadh (చర్చ)

@B.K.Viswanadh: భోజనం మంచిగా ఉండేలా తప్పడకుండా చూసుకుంటాం. తెలుగు, ఆంధ్ర, తెలంగాణా సంభంద వ్యాసాలను వేరే భాషలలో విస్తరించే కాంటెస్టు మనము సమావేశానికి ఒక నెల ముందు చేయవొచ్చు. దీని గురించి మనము మళ్ళి గ్రాంట్ ప్రతిపాదించేటప్పుడు (సుమారుగా డిసెంబరులో) చర్చిద్దాం. KCVelaga (talk) 05:22, 9 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ముఖ్యోద్దేశం?

[మార్చు]

అసలు ఈ జాతీయ వికీమీడియా సమావేశం నిర్వహణ యొక్క ముఖ్యోద్దేశ్యం ఏమిటి? భారతదేశంలో ఇరవైకి పైగా భాషలలో వికీమీడియా ప్రాజెక్టులున్ననూ మిగితావారు ఎందుకు నిర్వహించుట లేదు? ఇప్పటివరకు రెండుసార్లు జరిగి, గత మూడేళ్ళనుంచి నిర్వహణకు ఎవరూ ముందుకు రాకపోవడానికి కారణాలేంటి? ఈ సమావేశ నిర్వహణకు తెవికీ తరఫున ప్రతిపాదించుటకు బలమైన కారణమేమిటి? ఈ కార్యక్రమం నిర్వహిస్తే తెవికీ అభివృద్ధి చెందుతుందని ఎలా చెప్పగలగుతున్నారు? ఇదివరకు తెవికీ వార్షికోత్సవ సమావేశాలు నిర్వహించిన కొద్దీ తెవికీకి బీటలుపడి బలహీనమైన సంగతి గతానుభవాల ద్వారా నేర్చుకోలేమా? తెవికీ వార్షికోత్సవ సమావేశపు గ్రాంటుపైనే వాదవివాదాలు తలెత్తి కొందరు సీనియర్ సభ్యులు వెళ్ళిపోవడం, ఇప్పటికీ ఖర్చులెక్కలు సమూహానికి చూపకపోవడం, ఆ తర్వాత సమావేశాల నిర్వహణ లేకపోవడం, గత చర్చల ద్వారా అందరికీ అనుభవమైన విషయమే. గ్రాంటులు పొందడం, సమావేశాలు నిర్వహించడం కొందరికి సరదాగా ఉండవచ్చు కాని సమూహపు లక్ష్యాల సంగతి ఏమిటి? గ్రాంటు పొంది చేసిన ఖర్చు వివరాలపై వాదవివాదాలు జరగవని గ్యారంటి ఏమిటి? (ఇదివరకటి చర్చలను పరిశీలించండి). తెవికీలో ఏ ప్రధాన చర్చలో లేనంతగా అధిక సభ్యులు ఈ చర్చలో పాల్గొనడం సంతోషమే. వారిలో అత్యధికులు ఎప్పుడో ఒకప్పుడు ఒకట్రెండు వ్యాసాలలో పనిచేసిన అనుభవం తప్ప తెవికీకి చేసిన సేవలు నామమాత్రమేనని ఎవరైనా గమనించవచ్చు. వీరందరూ అకస్మాత్తుగా చర్చలలోకి ఎలావచ్చారు? వీరిని ప్రేరేపించినది ఎవరు? మరి వీరిని తెవికీ వ్యాసాలలో కృషిచేయమని ప్రేరేపిస్తే / ఉత్సాహపరిస్తే 2020 డిసెంబరు నాటికి తెవికీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందడం ఖాయంకాదా? సమావేశం నిర్వహణ వల్ల తెవికీకి నష్టం జరగదని ఖచ్చితమైన భరోసా ఈ చర్చా ప్రతిపాదకులు ఇవ్వగలరా? సి. చంద్ర కాంత రావు- చర్చ 19:39, 6 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

@C.Chandra Kanth Rao: నమస్కారం! ఈ సమావేశం ఎందుకు జరగాలనే దాని గురించి పైన వివరించాం, మరియు ఈ మెటా పేజీలో కూడా చూడవచ్చు. ఎందుకు నిర్వహించుట లేదు అనేదానికి ప్రత్యేక కారణం ఏమి లేదు. ఇప్పుడు కారణాల కోసం ఊహించవలసి వస్తుంది- ఇలాంటి కార్యక్రమం చేయటానికి చాల సమయం కేటాయించాలి, మరియు ఎవరైనా బాధ్యత తీసుకుకోవాలి, కావున పలు కారణాలు అయ్యి ఉండవచ్చు. పైన చెప్పినట్టు గానే ఇది తెవికీ తరపున మాత్రమే కాదు, ఇది ఆంధ్ర మరియు తెలంగాణా రాష్ట్రాలలో ఉన్న వికీమీడియన్ల తరపున; దీనిలో తెలుగు ఒక్కటే కాకుండా, మిగతా ఏ వికీమీడియా ప్రాజెక్టు మరియు భాష వారైనా ఉండవచ్చు. తెవికీ అభివృద్ధి చెందటం ఒక్కటే ఈ సమావేశం యొక్క ఉద్దేశం కాదు, భారతదేశం మొత్తంలో వికీమీడియన్లు కలిసి వివిధ విషయాలు నేర్చుకోవటం మరియు భాషల మధ్యన తోడ్పాటు పెంచటం, దీని ఉద్దేశం. దానిలో తెవికీ అభివృద్ధి కూడా కలిసేఉంటుంది ఇతర భాషలు సహా. దీన్ని నిర్వహించే పనులలో తెలుగు వారు ఉంటారు కనుక వారు చాలానే విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. తర్వాతి అంశం: ఇది వరకు పలు గ్రాంట్లు పొందిన అనుభవం మరియు వికీమీడియా ఫౌండేషన్ వారి ప్రాజెక్టు గ్రాంట్స్ కమిటీలో సభ్యునిగా నా అనుభవంతో నేను చెప్పదగినది ఏమంటే ఇది పెద్ద మొత్తం కావున వ్యక్తులు దీనిని నడుపరు, వికీమీడియా ఫౌండేషన్ వారు ఫిస్కల్ స్పాన్సర్ (ఒక సంస్థను అందుకు ఎంచుకుంటారు) ద్వారా మనకి అందిస్తారు, దానితో పాటుగా ఒక ఆడిటర్, అక్కౌంటెంట్ కూడా ఉంటారు. ఖర్చు కూడా ఒకరి ఇష్టానుసారం జరగదు. ఇదే కాకుండా బడ్జెట్ ప్రతిపాదించే ముందు జాతీయ స్థాయిలో వికీమీడియన్లు సంప్రదిస్తాం. అయిపోయిన తరువాత, ఆడిట్ చేసిన పత్రాలు మరియు అన్ని బిల్స్, రసీదులు ఆన్లైన్లో ఎవరైనా చూసేలా ఉంచుతాం. ఇది అలా ఉంచితే, అకస్మాత్తుగా వీరందిరిని ప్రేరేపించారు, రాయించారు అనడం చాలా బాధాకరం. పదే పదే మేము చెప్తున్నది ఏమిటంటే ఇది ఆంధ్ర మరియు తెలంగాణ లో ఉండే వికీమీడియన్లుకు సంబంధించింది, ఒక్క తెవికీ మాత్రమే కాదు. మీరు కాస్త జాగ్రత్తగా గమనించి ఉంటే వారు కొత్త వికీమీడియన్లు కాదు, వికీడేటా, వికీమీడియా కామన్స్, ఆంగ్ల వికీపీడియా మరియు ఇతర ప్రాజెక్టులలో పాల్గొనేవారే. మీరు వారి కేంద్ర సవరణలు సమాచారం చూడవచ్చు. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాలలో తెలుగు అతి కీలకమైన భాగం కనుక ఈ చర్చని ఇక్కడ మొదలు పెట్టాం. అసలు అయితే మెటా-వికీలో జరగాల్సింది. తెలుగు వచ్చి ఏ వికీమీడియా ప్రాజెక్టులో రచనలు చేసేవారైనా ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్గొన వచ్చు. అలా కాదు అనటం సమంజసం కాదు అని నా భావన. ఎందుకంటే ఇది ఒక తెవికీ సంబంధ పాలిసీ లేదా అడ్మిన్ చర్చ కాదు, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాల వికీమీడియన్లు నిర్వహించాలని ప్రతిపాదిస్తున్న దాని గురించి చర్చ. మనకి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా యూసర్ గ్రూప్ లాంటిది లేకపోవటం బాధాకరం. ఈ చర్చ ఇక్కడే చేయడానికి అది ఒక కారణం. KCVelaga (talk) 06:35, 9 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
{ping|C.Chandra Kanth Rao}} నమస్కారం! మీరు తెవికీ లో పనిచేస్తున్నారు. అంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా రాష్ట్రాలలో ఇతర భాషా వికీపీడియన్లు లేరు అని అనుకోవడం సరికాదు. మీకు తెలియని వికీ ఉద్యమం ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా రాష్ట్రాలలో చాలా ఉంది. వికీపీడియాలో ఇతరభాషలతో పాటు, కామన్స్, వికీడేటా వంటి ఇతర వికీప్రోజెక్టుల మీద చాలామంది పనిచేస్తున్నాం. మీరు దానిని గమనిస్తే బావుంటుంది. మరొక ముఖ్య విషయము ఏమిటంటే, మేము మా కాలేజీ లో మా సొంత ఆసక్తితో కాలేజీ యాజమాన్యం తో మాట్లాడి వికీ-క్లబ్ స్థాపించి, వికీపీడియా మరియు ఇతర వికీ ప్రాజెక్టులను మా కాలేజీ లో ఉత్సాహవంతులు అయినా కొందరు విద్యార్థులకు ఇప్పటికే పరిచయం చేస్తున్నాం. మేము ముఖ్యంగా వికీడేటా, ఇంగ్లీష్ వికీపీడియా లో పాల్గొంటున్నం. మీకు బహుశా కేంద్ర సవరణలు సమాచారం మరియు గ్లోబల్ కంట్రిబ్యూషన్స్ చూడడం రాకపోతే అడిగి తెలుసుకోండి. అంతేకాని మీరు ఇలా తోటి వికీపీడియన్లను మరియాద లేకుండా కించ పరిచే విధంగా మాట్లాడడం సరికాదు. మీరు వికీపీడియా యొక్క ఐదు మూల స్తంభాలలో నాల్గవ దాన్ని ఉల్లంఘిస్తున్నారు. మీరు కొన్నాళ్ళు దూరంగా ఉండడం వల్ల, వికీడేటాలో పనిచెయ్యకపోవడం వల్ల, కొన్నాళ్ళు చర్చల్లోనే రాయడం వల్ల మీరు వికీపీడియన్ కాదంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. మీరు మా గురించి అన్నది అంతే పొరబాటు. వికీపీడియాలో ఎవరైనా స్వచ్చందంగా పనిచేయొచ్చు. మేము కాలేజీ విద్యార్థులం. మాకు ఉన్న ఇతర పనుల వలన, మా సామర్థ్యం ఎలా ఉందన్న దాని వలన వికీమీడియా ప్రపంచంలో స్వచ్చందంగా తెలుగో, ఇంగ్లీషో, వికీపీడియానో, వికీడేటానో ఏవో కొన్ని ప్రాజెక్టుల మీద పనిచేస్తాం. సమావేశం ముఖ్యఉద్దేశం కృష్ణ చైతన్య వివరంగా రాశారు. మీరు దయచేసి సంభాషణని పూర్తిగా అర్థం చేసుకొని చర్చలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. మీరు అర్ధం చేసుకున్నా కొంత సమాచారంతో ఏదంటే అది మాట్లాడడం ఏ మాత్రం సమంజసం కాదు. Nivas10798 (చర్చ) 09:59, 9 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
@ KCVelaga, నా సందేహాలకు అసలు కారణం మీరు అర్థం చేసుకున్నారో లేదో తెలియదు కాని మీ సమాధానం మాత్రం ఆ దిశగా సాగలేదు. నేను ఏదేదో అనుమానాలు పడుతున్నట్లుగా, ఊహాగానాలతో మీరు రాశారని తెలుస్తోంది. ఇదివరకటి అనుభవాలతో ఇలాంటి సమావేశాలు తెవికీకి నష్టం కలిగించాయని నేను వివరణలతో తెల్పితే (గతానుభవాలకు అనుమానాలకు తేడా ఉంటుందని గమనించండి) సమాధానాన్ని మాత్రం ఎక్కడెక్కడికో తీసుకువెళ్ళారు. అవన్నీ నేను అడగలేను (అవి నాకు తెలుసు కూడా). నా చర్చా ఉద్దేశ్యం మరియు చివరగా స్పష్టంగా చెప్పింది ఒక్కటే. ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో దానికి సమాధానం ఇవ్వగలిగితే ఇవ్వండి చాలు. సి. చంద్ర కాంత రావు- చర్చ 19:15, 9 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
సభ్యుడు:C.Chandra Kanth Rao గారి ప్రశ్నలకు సమాధానంగా గత సమావేశంలో భవిష్యత్ ప్రణాళిక చర్చ ఫలితాలను మదింపు చేసుకొని ముందుకు వెళ్లడం మంచిదే. --అర్జున (చర్చ) 03:41, 11 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సముదాయపు నిర్ణయం

[మార్చు]

చర్చ దాదాపుగా ముగిసినట్లే కనిపిస్తోంది. రేపు సాయంత్రం 8 గంటల దాకా చూసి సముదాయపు నిర్ణయాన్ని ప్రకటిస్తాను. __చదువరి (చర్చరచనలు) 14:27, 12 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

నిర్ణయాన్ని ప్రాజెక్టు పేజీలో ప్రకటించాను.__చదువరి (చర్చరచనలు) 17:13, 13 అక్టోబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.