వివేక్ ఠాకూర్
వివేక్ ఠాకూర్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 | |||
ముందు | చందన్ సింగ్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | నవాడా | ||
పదవీ కాలం 10 ఏప్రిల్ 2020 – 4 జూన్ 2024 | |||
ముందు | సీ.పీ. ఠాకూర్ | ||
నియోజకవర్గం | బీహార్ | ||
ఎమ్మెల్సీ
| |||
పదవీ కాలం 2 మే 2013 – 6 మే 2014 | |||
ముందు | బాద్షా ప్రసాద్ ఆజాద్ | ||
నియోజకవర్గం | శాసనసభ సభ్యులచే ఎన్నుకోబడతారు | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పాట్నా, బీహార్, భారతదేశం | 1969 నవంబరు 27||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | మీనాక్షి ఠాకూర్ (m. 2000) | ||
సంతానం | 2 కుమార్తెలు | ||
పూర్వ విద్యార్థి | ఢిల్లీ యూనివర్సిటీ మగద్ యూనివర్సిటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ |
వివేక్ ఠాకూర్ (జననం 27 నవంబర్ 1969) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నవాడా లోక్‌సభ నియోజకవర్గం నుండి 18వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]వివేక్ ఠాకూర్ ఢిల్లీ యూనివర్సిటీలోని కిరోరి మాల్ కాలేజీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో పిజి చేసి ఆ తరువాత ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]వివేక్ ఠాకూర్ తన తండ్రి కేంద్ర మాజీ మంత్రి సీ.పీ. ఠాకూర్ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2013లో జరిగిన శాసనసమండలికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2015లో శాసనసభ ఎన్నికలలో బ్రహ్మపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాయడు. ఆయన ఆ తరువాత భారతీయ జనతా యువమోర్చా జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేసి 2020లో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో బీహార్ నుండి రాజ్యసభకు ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[3]
వివేక్ ఠాకూర్ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో నవాడా లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి శ్రవణ్ కుష్వాహపై 67,670 ఓట్లు మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా లోక్‌సభకు ఎన్నికయ్యాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Nawada". Archived from the original on 23 June 2024. Retrieved 23 June 2024.
- ↑ The Times of India (26 April 2013). "Council polls: CP Thakur's son is BJP nominee". Archived from the original on 23 June 2024. Retrieved 23 June 2024.
- ↑ "Rajya Sabha elections: All five candidates in Bihar elected unopposed" (in ఇంగ్లీష్). 18 March 2020. Archived from the original on 23 June 2024. Retrieved 23 June 2024.
- ↑ Financialexpress (4 June 2024). "Nawada Lok Sabha Election Results 2024 Highlights: BJP's Vivek Thakur wins by over 67000 votes defeating RJD's Shravan Kushwaha" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2024. Retrieved 23 June 2024.