Jump to content

వీసీ సజ్జనార్

వికీపీడియా నుండి
వీసీ సజ్జనార్‌
వీసీ సజ్జనార్


తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
25 ఆగష్టు 2021 - ప్రస్తుతం [1]
ముందు సందీప్ శాండిల్య
తరువాత స్టీఫెన్ రవీంద్ర

అదనపు డీజీపీ
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
11 మార్చ్ 2021

వ్యక్తిగత వివరాలు

జననం (1968-10-24) 1968 అక్టోబరు 24 (వయసు 56)
హుబ్లీ
జాతీయత  భారతదేశం
తల్లిదండ్రులు చెన్నప్ప బసప్ప సజ్జనార్
(తండ్రి)
జీవిత భాగస్వామి అనుప సజ్జనార్[2]
సంతానం అదితి, నియతి
పూర్వ విద్యార్థి కర్ణాటక యూనివర్సిటీ, ధార్వాడ్.
వృత్తి పోలీస్ అధికారి

విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన అదనపు డీజీపీ హోదాలో టీజీఎస్‌ఆర్టీసీ వైస్‌చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. సజ్జనార్ ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలోని జ‌న‌గామ ఎస్పీగా త‌న కెరీర్‌ను ప్రారంభించారు.[3] 2008 వరంగల్ యాసిడ్ దాడి కేసులో ఎన్ కౌంటర్, 2019 శంషాబాద్ దిశ ఎన్ కౌంటర్‌లు సజ్జనార్‌ను దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచేలా చేశాయి.

వృత్తి జీవితం

[మార్చు]

సజ్జనార్ ఉమ్మడి వరంగల్ జిల్లా లోని జ‌న‌గామ ఏఎస్పీగా త‌న కెరీర్‌ను ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వివిధ హోదాల్లో పోలీసు అధికారిగా పని చేశారు. ఆయన పులివెందుల ఎఎస్‌పి, వరంగల్, మెదక్, నల్లగొండ, గుంటూరు, కడప లో ఎస్పీగా, ఇంటెలిజెన్స్ ఐజీగా, సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. సజ్జనార్ 25 ఆగష్టు 2021న టీజీఎస్ఆర్టీసీ ఎండీగా నియమితులవగా.. 3 సెప్టెంబర్ 2021న ఎండీగా బాధ్యతలు స్వీకరించారు. [4]

2019 దిశ నిందుతుల ఎన్‌కౌంటర్

[మార్చు]

హైదరాబాద్ శంషాబాద్ తొండుపల్లి టోల్ ప్లాజా దగ్గర 2019 నవంబర్ 27న ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెటర్నరీ డాక్టర్ దిశ పై లారీ డ్రైవర్, క్లీనర్లుగా పనిచేస్తున్న నలుగురు యువకులు హత్యాచారం చేశారు. స్కూటీకి పంక్చర్ వేసి, దానిని బాగు చేయిస్తామని చెప్పి, కిడ్నాప్ చేసి, అత్యాచారం చేసి, చనిపోయిన తర్వాత చటాన్​పల్లి బ్రిడ్జి కింద పెట్రోలు పోసి కాల్చి చంపారు. పోలీసులు ఆ నలుగురిని రీ కన్ స్ట్రక్షన్ కోపం సంఘటనా స్థలానికి తీసుకెళ్ళగా వాళ్లు తిరగబడ్డారు. అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయేందుకు యత్నించి పోలీసుల దగ్గర నుంచి ఆయుధాలు లాక్కోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు ఎన్‌కౌంటర్ చేయగా నలుగురూ నిందితులు చనిపోయారు. వరంగల్ ఎన్‌కౌంటర్‌లో స్వయంగా పాల్గొన్న సజ్జనార్ దిశ ఎన్‌కౌంటర్ ఘటనలో స్వయంగా పాల్గొనకపోయినప్పటకీ ఆయన ఆధ్వర్యంలోనే ఈ కేసు విచారణ జరిగింది.[5][6]

2008 వరంగల్ యాసిడ్ దాడి

[మార్చు]

వరంగల్‌లోని కిట్స్ కళాశాలలో బీటెక్ చేస్తున్న స్వప్నిక, ప్రణీతలపై 2008 డిసెంబర్‌ 10న యాసిడ్ దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు యువకుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్ ఎస్పీగా ఉన్న వీసీ సజ్జనార్ నేతృత్వంలోని పోలీసుల బృందం నిందితులు శాఖమూరి శ్రీనివాస్, బజ్జురి సంజయ్, పోతరాజు హరికృష్ణలను సీన్ రీకన్‌స్ట్రక్చన్‌ కోసం ఘటనా స్థలానికి తీసుకవెళ్లగా నిందితులు తమ నుంచి ఆయుధాలు లాక్కొని దాడి చేయడానికి ప్రయత్నించారని, ప్రతిదాడిలో జరిగిన ఎన్‌కౌంటర్ లో ముగ్గురిపై కాల్పులు జరపడంతో వారు చనిపోయారని పోలీసులు వెల్లడించారు.[7]

మూలాలు

[మార్చు]
  1. New Indian Express, Stephen Ravindra to take over as Cyberabad Police Commissioner after VC Sajjanar's transfer, 25 August, 2021.[1]
  2. Sakshi (19 April 2020). "వారికి సెల్యూట్‌ తప్ప ఇంకేం చేయలేం". Archived from the original on 26 March 2022. Retrieved 26 March 2022.
  3. Sakshi (25 August 2021). "సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ బదిలీ, ఆర్టీసీ ఎండీగా నియామకం". Archived from the original on 27 August 2021. Retrieved 27 August 2021.
  4. HMTV (3 September 2021). "టీఎస్‌ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్‌ బాధ్యతలు". Archived from the original on 3 September 2021. Retrieved 3 September 2021.
  5. "All 4 accused in Hyderabad veterinarian's rape and murder case shot dead in police chase". India Today. 6 December 2019. Retrieved 2019-12-06.
  6. "Encounter in Hyderabad: All four accused in Hyderabad vet rape-murder case killed in encounter". The Times of India. 6 December 2019. Retrieved 2019-12-06.
  7. "Warangal 2008 Acid Attack Suspects killed in an encounter". The Times of India. Retrieved 2019-12-06.