వెంకటరామన్ సుబ్రమణ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వెంకటరామన్ సుబ్రమణ్య
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1936-07-16) 1936 జూలై 16 (వయసు 87)
బెంగళూరు, బ్రిటిషు భారతదేశం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 111)1965 మార్చి 19 - న్యూజీలాండ్ తో
చివరి టెస్టు1968 మార్చి 7 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 9 101
చేసిన పరుగులు 263 4,219
బ్యాటింగు సగటు 18.78 31.48
100లు/50లు 0/2 8/21
అత్యధిక స్కోరు 75 213*
వేసిన బంతులు 444 5,566
వికెట్లు 3 70
బౌలింగు సగటు 67.00 44.18
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 2/32 7/78
క్యాచ్‌లు/స్టంపింగులు 9/– 120/–
మూలం: ESPNcricinfo, 2022 నవంబరు 20

వెంకటరామన్ సుబ్రమణ్య (జననం 1936 జూలై 16) 1965 నుండి 1968 వరకు తొమ్మిది టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన భారతీయ మాజీ క్రికెటర్. అతను దూకుడుగా ఉండే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, ఉపయోగకరమైన లెగ్ స్పిన్ బౌలరు. అతను కొన్ని సంవత్సరాలు మైసూర్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. తర్వాత ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. సుబ్రమణ్యను ముద్దుగా 'కుంజు (చిన్న) మణి' అని పిలిచేవారు.

జీవితం తొలి దశలో[మార్చు]

సుబ్రమణ్య మల్లేశ్వరంలో ఉమ్మడి కుటుంబంలో పెరిగాడు. అతని తండ్రి సివిల్ ఇంజనీరు, అతను బెంగళూరులో చాలా ఇళ్ళు నిర్మించాడు. కేఆర్‌ఎస్‌ డ్యామ్‌ కట్టినప్పుడు అతని మేనమామ చీఫ్‌ ఇంజనీరుగా పనిచేసాడు. పిల్లలందరూ క్రికెట్ ఆడుకునేలా వారికి విశాలమైన కాంపౌండ్‌తో కూడిన ఇల్లు ఉండేది. సుబ్రమణ్య సోదరులలో ఇద్దరు వి. రాందాస్, వి. కృష్ణప్రసాద్ కూడా మైసూరు తరపున ఆడారు. [1]

సుబ్రమణ్య మల్లేశ్వరం ఉన్నత పాఠశాలలోను, ఆ తరువాత బసప్ప ఇంటర్మీడియట్ కళాశాలలోనూ చదివి సెంట్రల్ కాలేజీ నుండి పట్టభద్రుడయ్యాడు. అతను మల్లేశ్వరం జింఖానాలో చేరాడు. ఆ సమయంలో బొంబాయి, మద్రాస్ నగరాలలో లాగా బెంగుళూరులో పెద్ద టోర్నమెంటు లేదు. యువకులకు రేడియో ద్వారా మాత్రమే సమాచారం లభించేది. సుబ్రమణ్య, రేడియో వ్యాఖ్యానాలు వింటూ కొన్ని క్రికెట్ పాఠాలు నేర్చుకున్నాడు. [1]

రంజీ కెరీర్[మార్చు]

నిష్ణాతుడైన బ్యాట్స్‌మన్ అయినప్పటికీ, సుబ్రమణ్య తన మొదటి రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌పై 10వ స్థానంలో బ్యాటింగు మొదలుపెట్టాడు. అతను ఇలా వివరించాడు -

‘‘ఏఎస్ కృష్ణస్వామి కెప్టెన్‌. అతను అప్పటికే మైసూరు వెళ్ళిపోయాడు. అతనికి బెంగుళూరువాసులతో పెద్దగా సంబంధం లేదు. నా అరంగేట్రంపై నేను నిరాశకు గురయ్యాను. ఆటగాళ్ళు ఎవరేమిటో, వారు ఏమి చేయగలరో ASK కు తెలియదు. నా తొలి మ్యాచ్‌లో నన్ను 10వ స్థానంలో దింపాడు. ASKకి నేనెవరో తెలియదు, తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదు." [1] [2]

ఆ సంవత్సరం మైసూరు ఫైనల్‌కు చేరుకుంది. కానీ వారికి కొత్త సారథి వచ్చాడు. కెన్నింబేలి వాసుదేవమూర్తి జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. అతను ఈ క్రమంలో సుబ్రమణ్యకు బ్యాటింగులో పై స్థాయికి పదోన్నతి కల్పించాడు. బ్రాబౌర్న్ స్టేడియంలో బాంబేతో మ్యాచ్ జరిగింది. సుబ్రహ్మణ్య శతకం చేసి రాణించాడు. అయితే, మైసూరు, ఇన్నింగ్స్ 22 పరుగుల తేడాతో గేమ్‌ను కోల్పోయింది. [3]

సుబ్రమణ్య తన తొలి సీజన్‌లో సాధించిన విజయంపై కెరీర్‌ నిర్మించుకున్నాడు. తరువాతి సీజన్లలో మరిన్ని పరుగులు చేశాడు. అతను 1963లో మైసూర్ జట్టుకు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. కెప్టెన్‌గా అతని మొదటి సీజన్‌లో, అతను బెంగళూరులోని సెంట్రల్ కాలేజ్ గ్రౌండ్‌లో బాంబేతో జరిగిన సెమీ-ఫైనల్ పోటీలో జట్టును నడిపించాడు. అతను సుభాష్ గుప్తే చేతిలో 99 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. చివరి వరుస బ్యాటర్లను రక్షించుకునే ప్రయత్నంలో అతని సెంచరీని కోల్పోయాడు. [4]


నార్త్ జోన్, వెస్ట్ జోన్‌లపై సెంచరీలు చేయడం ద్వారా సుబ్రమణ్య దులీప్ ట్రోఫీలో సంచలనం సృష్టించాడు. [5] తద్వారా భారత క్రికెట్ జట్టుకు ఎంపికయ్యాడు.

అంతర్జాతీయ కెరీర్[మార్చు]

సుబ్రమణ్య 1965 - 1968 మధ్య ఆడిన కొన్ని టెస్టుల్లో ఓ మోస్తరుగా రాణించాడు. 1966-67లో మద్రాస్‌లో వెస్టిండీస్‌కు వ్యతిరేకంగా, అతను హాల్, గ్రిఫిత్‌ల బౌలింగును ఎదుర్కొని 61 పరుగులు చేశాడు. [6] అతను 1967లో ఇంగ్లండ్ పర్యటనలో పెద్దగా ఆడలేదు. అతను ఆలస్యంగా ఫామ్‌ లోకి వచ్చాడు. మొత్తం మూడు టెస్టులకు గాను రెండింటిలో ఆడాడు. మామూలుగా కొత్త బంతి వేసే బౌలర్లకు గాయాలవడంతో అతను దాడిని ప్రారంభించాల్సి వచ్చింది. అతను ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మూడో టెస్టులో జియోఫ్ బాయ్‌కాట్‌ను బౌల్డ్ చేశాడు. 1967-68లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలలో, అడిలైడ్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో పోరాడి 75 పరుగులు సాధించాడు.[7]

తర్వాతి కెరీర్[మార్చు]

సుబ్రమణ్య తర్వాత మైసూర్ జట్టుకు ఆడటానికి తిరిగి వచ్చాడు. కర్ణాటక క్రికెట్‌కు నాయకుడిగా అతని తోడ్పాటు గొప్పది. అతని నాయకత్వంలో, BS చంద్రశేఖర్, గుండప్ప విశ్వనాథ్, EAS ప్రసన్న, సయ్యద్ కిర్మాణి వంటి ప్రతిభావంతులైన క్రికెటర్లు తమ తొలి మ్యాచ్‌లు ఆడారు. అంతకుముందు లేని టీమ్ స్పిరిట్‌ని అతను పెంపొందించాడు. అతను క్లబ్ క్రికెట్ విధేయతలను విచ్ఛిన్నం చేశాడు. మైసూరు తరపున ఆడటానికి క్రికెటర్లను ప్రేరేపించాడు. [1]

సుబ్రమణ్య తన కాలానికి కంటే ముందు ఉండేవాడని పేరుతెచ్చుకున్నాడు. ఫీల్డింగ్ కసరత్తులు లేని సమయంలో, అతను జాగింగ్, స్ట్రెచింగ్, క్రాస్-ట్రైనింగ్, తీవ్రమైన ఫీల్డింగ్ పద్ధతుల రూపంలో శారీరక శిక్షణను ప్రవేశపెట్టాడు. బెంగళూరులోని ఆర్‌ఎస్‌ఐ గ్రౌండ్స్‌లో మెరుగైన ప్రాక్టీస్ సౌకర్యాల కోసం నిర్వాహకులతో పోరాడాడు. క్రికెటర్లకు సరైన ఆహారం ఉండాలని పట్టుబట్టాడు. [1]

ఆట బాగా ఆడకపోవడంతో, సుబ్రమణ్య ఆస్ట్రేలియాకు వలస వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

వారసత్వం[మార్చు]

కర్ణాటక క్రికెట్‌కు సుబ్రమణ్య అందించిన సహకారం అతను ఆట నుండి నిష్క్రమించిన తర్వాత బైటపడింది. జట్టుకు సుబ్రమణ్య మార్గనిర్దేశం ఉంటే మైసూరు చాలా ముందుగానే రంజీ ట్రోఫీని గెలుచుకోవచ్చని బ్రిజేష్ పటేల్ భావించాడు. గుండప్ప విశ్వనాథ్ మాట్లాడుతూ – "1974లో రంజీ ట్రోఫీ గెలిచిన జట్టు, మణి (సుబ్రహ్మణ్య) జట్టు. అతను జట్టును నిర్మించి, దానిని ఛాంపియన్‌షిప్-విజేత స్థాయికి తీసుకువచ్చాడు." [1]

సుబ్రమణ్య సిడ్నీలో స్థిరపడ్డాడు. అతను న్యూ సౌత్ వేల్స్ లా సొసైటీలో పనిచేస్తున్నాడు.

మూలాలు[మార్చు]