బాపట్ల పశ్చిమ (గ్రామీణ)
బాపట్ల పశ్చిమ (గ్రామీణ) | |
---|---|
అక్షాంశ రేఖాంశాలు: 15°53′N 80°25′E / 15.883°N 80.417°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | బాపట్ల |
విస్తీర్ణం | 15.9 కి.మీ2 (6.1 చ. మై) |
జనాభా (2011) | 8,719 |
• జనసాంద్రత | 550/కి.మీ2 (1,400/చ. మై.) |
అదనపు జనాభాగణాంకాలు | |
• పురుషులు | 4,412 |
• స్త్రీలు | 4,307 |
• లింగ నిష్పత్తి | 976 |
• నివాసాలు | 2,399 |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
పిన్‌కోడ్ | 522101 |
2011 జనగణన కోడ్ | 590473 |
బాపట్ల పశ్చిమ (గ్రామీణ), బాపట్ల జిల్లా బాపట్ల మండలానికి చెందిన గ్రామం. దీన్ని వెదుళ్ళపల్లిగా కూడా పిలుస్తారు. ఇది మండల కేంద్రమైన బాపట్ల నుండి 7 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2399 ఇళ్లతో, 8719 జనాభాతో 1590 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4412, ఆడవారి సంఖ్య 4307. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 322 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1066. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 590473[1].
గ్రామ చరిత్ర
[మార్చు]వెదుళ్ళపల్లి గ్రామాన్ని బాపట్ల పశ్చిమ (గ్రామీణ) అని రెవెన్యూ రికార్డుల్లో పేర్కొన్నారు. స్టూవర్టుపురం పోలీసు స్టేషను పూర్వం ఇక్కడే వుండేది. బాపట్ల, చీరాల మధ్య ఇది చాలా కీలకమైన జంక్షన్.
గణాంకాలు
[మార్చు]2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 7192. ఇందులో పురుషుల సంఖ్య 3539, స్త్రీల సంఖ్య 3653, గ్రామంలో నివాస గృహాలు 1776 ఉన్నాయి.
జన జీవనం
[మార్చు]ఇంచుమించు 50 దూదేకుల కుటుంబాలు కంకటపాలెం, కారుమూరు, తదితర ప్రాంతాలనుండి ఇక్కడకు వలస వచ్చి పాత గోనె సంచులను బాగు చెయ్యటం, పరదాలుగా కుట్టి అమ్మటం, షామియానాలు వంటపాత్రల సప్లై లాంటి వృత్తుల్లో స్థిర పడ్డారు. ఇక్కడ పాత మసీదు ఒకటుంది. 50 వరకు ముస్లిం కుటుంబాలున్నాయి. ఉర్దూ మాట్లాడే ముస్లిముల్ని తురకసాయిబులనీ, తెలుగు మాట్లాడే ముస్లిముల్ని దూదేకుల సాయిబులనీ పిలుస్తుంటారు. తురకం అంటే ఉర్దూ అనే అభిప్రాయమే దీనికి కారణం. దూదేకుల సాయిబులు గుంటూరు మస్తాన్ లాంటి ఫకీర్లకు జెండాలెత్తి గ్యార్మీ పండుగ చేస్తారు. ఊరేగించిన జెండాలను ఉంచడం కోసం అనుకూలమైన సెంటర్లో జెండా చెట్టును ఏర్పాటు చేసుకొంటారు. తురక సాయిబులు కొత్త బట్టలు నగలు కొన్నప్పుడు మసీదు బయట దర్గా మీద వాటిని పెట్టి" ఫాతిహా "అనే ప్రార్థన చేయించుకుంటారు. నూర్ బాషా రామ్ షా మసీదులో "అజాన్ " ఇస్తుంటే, నూర్ బాషా మౌలాలి (వార్డు మెంబరు) "శాయిబాబా"భక్తి కొనసాగిస్తున్నాడు.
విద్యా సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి. సమీప బాలబడి బాపట్లలో ఉంది. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల బాపట్లలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు బాపట్లలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం బాపట్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.
వైద్య సౌకర్యం
[మార్చు]ప్రభుత్వ వైద్య సౌకర్యం
[మార్చు]బాపట్ల పశ్చిమ (గ్రా)లో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
[మార్చు]గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.
తాగు నీరు
[మార్చు]గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. తాగునీటి కోసం చేతిపంపులు, బోరుబావులు, కాలువలు, చెరువులు వంటి సౌకర్యాలేమీ లేవు.
పారిశుధ్యం
[మార్చు]గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.
సమాచార, రవాణా సౌకర్యాలు
[మార్చు]బాపట్ల పశ్చిమ (గ్రా)లో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ ఉంది. జాతీయ రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
[మార్చు]గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి. ఏటీఎమ్, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, అసెంబ్లీ పోలింగ్ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.
విద్యుత్తు
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
[మార్చు]బాపట్ల పశ్చిమ (గ్రా)లో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 212 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 145 హెక్టార్లు
- తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 431 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 656 హెక్టార్లు
- బంజరు భూమి: 46 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 99 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 145 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]బాపట్ల పశ్చిమ (గ్రా)లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
- కాలువలు: 72 హెక్టార్లు
- బావులు/బోరు బావులు: 73 హెక్టార్లు
గ్రామంలో మౌలిక వసతులు
[మార్చు]ఆది ఆంధ్ర సహకార సొసైటీ
[మార్చు]దగ్గుమల్లివారి పాలెం ఆది ఆంధ్ర సహకార సొసైటీకి చెందిన 136 మంది నిరుపేద దళితులు పంటలు సాగు చేసుకుని జీవనోపాధి పొందడానికి బ్రిటీషు వారి కాలంలో 1926లో పడమర బాపట్ల పరిధిలో 200 ఎకరాలను కేటాయించారు. తొలుత ఒక్కొక్కరికి ఎకరంన్నర భూమిని కేటాయించారు. అప్పట్లో వారు విడివిడిగా పంటలు సాగు చేశారు. 1981లో సొసైటీకి చెందిన 30 ఎకరాల భూమిని బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలకు కేటాయించారు.ముప్పలనెని శేషగిరి రావు గారు. ఈ కళాశాలను ప్రపంచములోనే మంఛి గుర్తింవుపొందిన కళాశాలగా తీర్ఛద్దినారు.. దినిలో చాలామంది దళితులు, బడుగు బలహిన వర్గల వారికి ఉపాది కలిపించారు. మిగిలిన 170 ఎకరాల్లో కూరగాయలు, వివిధ పంటల నారును పెంచడం, పూల మొక్కలను సాగు చేస్తున్నారు. 1980లో అమలులోకి తీసుకొచ్చిన కలెక్టివ్ ఫార్మింగ్ నిబంధనల ప్రకారం సొసైటీ సభ్యులే భూముల్లో పంటలు సాగు చేపట్టాలి. వచ్చిన ఫలసాయాన్ని అందరూ పంచుకోవాలి.ప్రస్తుతం సగానికి పైగా భూములను లీజుకు తీసుకుని ఇతరులు అనుభవిస్తున్నారు. ఈ భూముల్లో పంటలు మాత్రమే పండించాలి. ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదు. కొందరు సొసైటీ భూముల్లో తవ్వకాలు చేస్తున్నారు.1995లో సహకార శాఖ అధికారులు నిర్వహించిన సెక్షన్51వ విచారణలో అనర్హులైన 105 మంది సభ్యులను తొలగించారు.[2]
గ్రామ పంచాయతీ
[మార్చు]2006 ఆగస్టులో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో మేడిబోయిన నాగేశ్వరరావు ఈ గ్రామ సర్పంచిగా 1852 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందినారు. వీరు సర్పంచిగ తన హయాంలో, 12 సిమెంటు రహదారులు, త్రాగునీటి ఓవర్ హెడ్ ట్యాంకునూ నిర్మించారు. నిస్వార్ధంగా పనిచేసి, అక్రమాలకు పాల్పడకుండా మంచిపేరు తెచ్చుకున్నారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]ఈ వూళ్ళో పాత శివాలయం కూడా ఉంది.
ప్రధానమైన పంటలు
[మార్చు]వరి. అపరాలు, కాయగూరలు
ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు
[మార్చు]- గోపాళం రవి "రవి గార్డెన్స్", "బృందావనం" అనే నర్సరీలలో, పూలమొక్కల వ్యాపారం చేస్తూ, స్థానికులకు ఉపాధి, పేద రోగులకు ఉచిత వైద్యం కల్పిస్తున్నారు. పరిసర ప్రాంతాల ప్రజలకు మేలు చేకూరుస్తూ ప్రతినెలా మొదటి ఆదివారం పక్షవాతం, మూర్చ బారినపడిన దాదాపు 800 మంది రోగులకు ఉచిత వైద్యము, భోజన వసతి కూడా సమకూరుస్తున్నారు.
- ఈ గ్రామస్థులయిన జి.ఎస్.ఆర్.ఆంజనేయులు, ఎస్.బి.ఐ.లో సి.జి.ఎం.గా పనిచేసి పదవీ విరమణ చేశారు. వీరు 1991లో తమ తల్లిదండ్రుల పేరుమీద "గోపరాజు రామచంద్రరావు, రుక్మిణమ్మ ట్రస్టు" ఏర్పాటు చేసి ఉచిత ఆసుపత్రిని ప్రారంభించి, వెదుళ్ళపల్లి, బేతపూడి, స్టువర్టుపురం గ్రామ పేదప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందించుచున్నారు. 70 మంది పేదలకు ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు చేయించారు. 80 పైగా వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి రోగులకు ఉచితంగా మందులు పంపిణీచేశారు. వెదుళ్ళపల్లి ఉన్నత పాఠశాల అభివృద్ధికి తన వంతు సాయం అందించారు.
- ఈ గ్రామానికి చెందిన శ్రీమతి కోట ఝాన్సీరాణి, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు, భర్త శ్రీ కోట వెంకటేశ్వరరెడ్డితో కలిసి, "ఘంటశాల సాంస్కృతిక చైతన్య వేదిక" ఆధ్వర్యంలో పలు విధాలా సేవలు చేస్తునారు. ఈమె సేవలను గుర్తించిన తేజా ఆర్ట్స్ సంస్థ, విజయవాడ వారు ఈమెకు "సమాజసేవారత్నమణి" అను బిరుదునిచ్చి సత్కరించారు.
గ్రామ విశేషాలు
[మార్చు]ఇటీవల కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన జాతీయ గ్రామీణ క్రీడా పోటీలలో, అంధ్రప్రదేశ్ జట్టు వాలీబాల్ పోటీలలో, విజయం సాధించింది. ఈ జట్టులో ఈ గ్రామ విద్యార్థి పిట్టు తిరుపతిరెడ్డి పాల్గొని తన ప్రతిభ ప్రదర్శించి జట్టు విజయం సాధించి, స్వర్ణపతకం సాధించడానికి తోడ్పడినాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ ఈనాడు గుంటూరు జిల్లా ఎడిషన్ 12.8.2010