కంకటపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కంకటపాలెం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం బాపట్ల
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 4,313
 - పురుషుల సంఖ్య 2,110
 - స్త్రీల సంఖ్య 2,203
 - గృహాల సంఖ్య 1,226
పిన్ కోడ్ 522317
ఎస్.టి.డి కోడ్ 08643

కంకటపాలెం, గుంటూరు జిల్లా, బాపట్ల మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన బాపట్ల నుండి 8 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1226 ఇళ్లతో, 4313 జనాభాతో 1864 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2110, ఆడవారి సంఖ్య 2203. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1010 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 266. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590472[1].పిన్ కోడ్: 522317.

బాపట్ల నుండి సుమారు 6 కి.మీ. దూరంలో ఉంటుంది. చీరాలకు 12 కి.మీ. వుంటుంది. చోళులు, పల్లవుల కాలంనాటిదిగా చెప్పే ఒక రామాలయం కూడా ఇక్కడ ఉంది. గ్రామం మధ్యలో ఒక చెరువు, ఊరి బయట పశ్చిమాన ఇంకో చెరువూ ఉన్నాయి. 19వ శతాబ్దంలో వచ్చిన ఒక సునామీ/వరదలో ఈ గ్రామంమొత్తం 2-3 కీమీల దూరం మేరకు కొట్టుకుని పోయిందని చెబుతారు.

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4487.[2] ఇందులో పురుషుల సంఖ్య 2208, స్త్రీల సంఖ్య 2279, గ్రామంలో నివాసగృహాలు 1176 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1864 హెక్టారులు.

ఇక్కడ ఇప్పటికీ ఉన్నత పాఠశాల లేదు. పిల్లలు మోకాళ్ళ లోతు బురదలో బాపట్ల వెళ్ళి చదువుకొని వచ్చే వారు. లూథరన్ చర్చికి ఆనుకొని ఎలిమెంటరీ స్కూలు ఉంది. పూర్వం దీనిని మాలబడి అనేవారు. అందులోప్రేమయ్య మాస్టారు సాక్షాత్తు క్రీస్తు స్వభావంతో పిల్లల్ని ఆణిముత్యాల్లాగా తీర్చిదిద్దారు.కంకట పాలెంలో ఇప్పటివరకు ఒకే ఒకరికి ట్రిపుల్ ఐటి సీటు వచ్చింది. N.గోపి కృష్ణ (S/O) N. శివాజి. (యాదవపాలెం).అయితే చాలామంది ఉపాధి కోసం వెదుళ్ళపల్లి, బాపట్ల, చీరాల తదితర ప్రాంతాలకు వలస వెళ్ళారు.

వసంతరావు నక్షత్రకునిగా, అర్జునరావు కృష్ణునిగా, మునాఫ్ దుర్యోధనునిగా పౌరాణిక నాటకాలు వేసి ప్రజలకు వినోదం పంచేవారు. శ్రీరామనవమి వచ్చిందంటే అడ్డగడ హనుమయ్య లాంటివాళ్ళు పోటీలుపడి భరతనాట్యం, నాటకాలు వేయించేవారు. గ్రామ కచేరీ చావడిలో సంక్రాంతి నెల పొడవునా హరికథలు చెప్పేవారు. హరిదాసులు, గంటాసాయిబులు వేకువ జాముకే వచ్చేవాళ్ళు. గొల్లలు ప్రభలు కట్టుకొని కొండపాటూరు తిరునాళ్ళకు వెళ్ళివచ్చేవారు. పోలేరమ్మకు చద్ది నైవేద్యం పెట్టేవాళ్ళు. యాదవులు, దూదేకుల కళాకారులు కలిసి "బ్రహ్మం గారి చరిత్ర " నాటకం వేసేవాళ్ళు. తిరుపతి యాత్రకుపోయే కమ్మవాళ్ళు, యాదవులు "జోగి మేళం"తో ఊరు దాటే వాళ్ళు. క్రిస్టమస్, ఈస్టర్ పండుగలకు కంకటపాలెం, మురుకొండపాడు మాలలు పోటాపోటీగా మేళతాళాలతో ఊరేగింపులు జరిపే వాళ్ళు. మంగలి వెంకటేశ్వర్లు లాంటి డోలుకళాకారులిద్దరు పోటీ పడితే ప్రేక్షకుల చెవుల తుప్పు వదిలిపోయేది. డప్పు కొట్టడంలో మాదిగ యేసేబుకు పెద్ద పేరు. ఉత్సవాలలో కర్రసాము కూడా చేసేవారు. కబడ్డీ పోటీలు జరిగేవి. కాలువల్లో మావులు వేసి పట్టిన చేపలు దొరికేవి. వరి చేలలో కూడా కోతల కాలంలో మట్టగుడిసెలు చేతికి చిక్కేవి. వర్షాకాలంలో కప్పల బెక బెకలుండేవి. నత్తలు, పుట్టగొడుగులు విస్తారంగా దొరికేవి.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి , ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి ఉన్నాయి. బాలబడి, మాధ్యమిక పాఠశాల‌లు బాపట్లలో ఉన్నాయి. సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల బాపట్లలో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు బాపట్లలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం బాపట్లలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల గుంటూరు లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

కంకటపాలెంలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలోఒక ప్రైవేటు వైద్య సౌకర్యం ఉంది. డిగ్రీ లేని డాక్టరు ఒకరు ఉన్నారు. ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. తాగునీటి కోసం చేతిపంపులు, బోరుబావులు, కాలువలు, చెరువులు వంటి సౌకర్యాలేమీ లేవు.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో మురుగునీటి పారుదల వ్యవస్థ లేదు. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామం సంపూర్ణ పారిశుధ్య పథకం కిందకు రావట్లేదు. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

కంకటపాలెంలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. పబ్లిక్ ఫోన్ ఆఫీసు ఉంది. మొబైల్ ఫోన్ గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు సౌకర్యం, ప్రైవేటు బస్సు సౌకర్యం, రైల్వే స్టేషన్, ఆటో సౌకర్యం, ట్రాక్టరు సౌకర్యం మొదలైనవి గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 18 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

కంకటపాలెంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 406 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 1457 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 1457 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

కంకటపాలెంలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

  • కాలువలు: 1457 హెక్టార్లు

ప్రభుత్వం, రాజకీయాలు[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

అప్పికట్ల గ్రామ పంచాయతీ అనేది స్థానిక స్వీయ ప్రభుత్వం.[3] ఈ పంచాయతీ 12 వార్డులుగా విభజించబడి ఉంది. ప్రతి వార్డుకు ఒక ఎన్నికైన వార్డ్ సభ్యుడు ప్రాతినిధ్యం వహిస్తారు.[4] ఈ వార్డ్ సభ్యులకు, సర్పంచి ప్రాతినిధ్యం వహిస్తారు. చుక్కా కరుణశ్రీ ప్రస్తుత సర్పంచిగా ఉన్నారు.[5]

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీపంలో జమ్ములపాలెం, వెదుళ్ళపల్లి,నరసాయపాలెం, బాపట్ల తూర్పు, బాపట్ల, ఇస్లాం పేట గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

పశ్చిమాన కారంచేడు మండలం, దక్షణాన చీరాల మండలం, పశ్చిమాన పరుచూరు మండలం, ఉత్తరాన కాకుమానుమండలం.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 4,313 - పురుషుల సంఖ్య 2,110 - స్త్రీల సంఖ్య 2,203 - గృహాల సంఖ్య 1,226

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2013-10-23.
  3. "కంకటపాలెం గ్రామ పంచాయతీ". National Panchayat Portal. Retrieved 6 May 2016.
  4. "Elected Representatives". National Panchayat Portal. Retrieved 6 May 2016.
  5. "List of elected Sarpanchas in Grampanchayat of Guntur district, 2013" (PDF). State Election Commission. Archived from the original (PDF) on 29 జూన్ 2016. Retrieved 5 June 2016. Check date values in: |archive-date= (help)