వేదాంతం సత్యనరసింహశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేదాంతం సత్యనరసింహశాస్త్రి కూచిపూడి నాట్యాచార్యుడు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన 1982లో ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులైన వేదాంతం రాధేశ్యాం కు పెద్ద కుమారునిగా జన్మించాడు. వీరి కుటుంబం కూచిపూడి సాంప్రదాయానికి ప్రసిద్ధమైనది. ఆయన నాట్య శిక్షణను తన తండ్రివద్ద, కొన్ని నైపుణ్యాలను పద్మవిభూషణ పురస్కార గ్రహిత అయిన వెంపటి చినసత్యం, వేదాంతం రత్తయ్యశర్మ వద్ద నేర్చుకున్నాడు.

ఆయన కూచిపూడి నాట్యంలో సర్టిఫికేటు కోర్సును, యక్షగానంలో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ను శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి చేసాడు. ఆయన బి.ఎ ను తెలుగు భాష ప్రధాన విషయంగా చేసారు. ఆయన తరువాత మృదంగంలో సర్టిఫికేటు కోర్సును చేసాడు.

నాట్యకళకే పరిమితం కాకుండా ఆయన కర్ణాటక గాత్ర సంగీతం, మృదంగ వాద్యం అంరియు నట్టువాంగం కళలలో పట్టు సాధించాడు. ఆయన గాత్ర సంగీతాన్ని శిష్టు ప్రభాకర కృష్ణ శాస్త్రి, మృదంగ వాద్యాన్ని పి.సత్యనారాయణ ల వద్ద నేర్చుకున్నారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన కళాకారునిగా ఆయన నృత్యం, సంగీతం, వాద్యం కళలలో రాణిస్తూ విద్యార్థులకు శిక్షణ, కొరియోగ్రాఫ్ చేస్తుంటాడు.

ఆయన దేశ విదేశాలలో సుమారు 800 ప్రదర్శనలిచ్చాడు. ఆయనకు 2007లో యువ క్లాసికల్ డాన్స్ విభాగంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మకమైన ఉగాది పురస్కారం లభించింది. ఆయనకు ఏలూరులోని అభినవ నృత్య భారతి సంస్థ సన్మానం చేసింది. కటక్ లోని అంతర్జాతీయ థియేటర్ ఫెస్టివల్ లో ఆయనకు సన్మానం జరిగింది. ఆయనకు కళాంజలి సంస్థ "నాట్య విశారద" బిరుదుని యిచ్చి సత్కరించింది.

ఆయన తన 17వ యేట నుంచి కూచిపూడి నాట్యాన్ని అభ్యసించాడు. తరువాత ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల మంత్రిత్వశాఖ నిర్వహించే వివిధ వర్కుషాపులను నిర్వహించాడు.

ఆయన అనేక తిల్లానాలు, తరంగాలు, అన్నమాచార్య కీర్తనలు, త్యాగరాజు కీర్తనలు మొదలగు వాటిని కంపోజ్ చేసాడు. ఆయన పార్వతీ పరిణయం, రుతు సంహారం, శ్రీ పద్మావతి వెంకటేశ్వర పరిణయం, వచ్చెను అలివేలుమంగ, నవరస ధారువులు, అప్సరస పూజా నృత్యం మొదలగు ప్రదర్శనలకు కొరియోగ్రాఫ్ చేసాడు.

ఆయనకు సాంప్రదాయకమైన కూచిపూది యక్షగానం, కలాపాలు, పాగేటి వేషం గుర్తింపు తెచ్చాయి.

ఆయన వివిధ ప్రదర్శనలైన భక్త ప్రహ్లాదలో ప్రహ్లాద, హిరణ్యకసిపుడు, దవ్వారిక పాత్రలను. పార్వతీ పరిణయంలో శివుడు, బృంగేశ్వరుని పాత్రలను, ఉషా పరిణయంలో నారద పాత్రలను పోషించాడు.[2]

పురస్కారాలు[మార్చు]

  • ఆయనకు 'ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కార్ 2012' లభించింది.

మూలాలు[మార్చు]

  1. రమణీయం.. పార్వతీ కల్యాణం[permanent dead link]
  2. "Vedantam Satya Narasimha Sastry". Archived from the original on 2016-10-05. Retrieved 2016-11-12.

ఇతర లింకులు[మార్చు]