వేదుల శకుంతల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేదుల శకుంతల
Vedula-shakuntala.jpg
జననంద్రాక్షారామం,తూర్పుగోదావరి జిల్లా
ఆంధ్రప్రదేశ్ భారత దేశం
నివాస ప్రాంతంహైదరాబాదు

వేదుల శకుంతల ప్రముఖ రచయిత్రి. ఈమె తూర్పుగోదావరి జిల్లా, ద్రాక్షారామంలో జన్మించింది. కానీ చిన్నప్పటి నుండి తెలంగాణలో పెరిగింది. ఈమె విద్యాభ్యాసం ఖమ్మం, వరంగల్లులలో కొనసాగింది. ఈమెకు సంగీతం, చిత్రలేఖనాలలో ప్రవేశం ఉంది. సఖ్యసాహితి అనే సాహిత్య సంస్థకు ప్రధానకార్యదర్శిగా పనిచేసింది. ఈమె కథలపై కేంద్రవిశ్వవిద్యాలయంలో ఎం.ఫిల్. స్థాయి పరిశోధనలు జరిగాయి.

రచనలు[మార్చు]

ఈమె రచనలు గీతాంజలి, వనిత, కృష్ణా పత్రిక, ఆంధ్రభూమి, ఆంధ్రపత్రిక, తెలుగు జ్యోతి, నవ్య, విపుల, ఆంధ్రప్రభ, పుస్తకప్రపంచం, ఆంధ్రజ్యోతి, యువ, పత్రిక, పుస్తకం, ఇండియా టుడే, ప్రజాతంత్ర, చిత్ర, విజయ, వసుధ, పల్లకి, అనామిక, విశ్వరచన మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఈమె 100కు పైగా కథలు, 20 నవలలు, 10 నాటికలు, 700కు పైగా వ్యాసాలు రచించింది. ఈమె కథలు కొన్ని మనీలా రేడియో స్టేషన్ నుండి ప్రసారమయ్యాయి. ఈమె నవలలు కొన్ని కన్నడ భాషలోనికి అనువాదమయ్యాయి.

ఈమె ప్రకటించిన పుస్తకాలు:

 1. పసిడి సంకెళ్లు (కథా సంపుటి)
 2. మనసెప్పుడూ గుప్పెడే (కథా సంపుటి)
 3. ప్రేమభిక్ష (నవల)
 4. ఆర్తి[1] (నవల)
 5. తెరచాపలు (నవల)
 6. తూర్పురేఖలు (నవల)
 7. కృష్ణాతరంగిణి[2] (వ్యాస సంపుటం)
 8. స్పందన (వ్యాస సంపుటి)
 9. శాంతి నిలయం (నవల)
 10. గ్లామర్ లెస్ గర్ల్ (నవల)
 11. ఆఫ్టరాల్ ఆడది (నవల)
 12. దీప్తి (నవల)
 13. శారదరాత్రులు (నవల)
 14. పునాదిరాళ్లు (నవల)
 15. వెలుగు వాకిలి (నవల)
 16. అరుంధతి (నవల)
 17. లయ తప్పిన విన్యాసం (నవల)
 18. రేపటి పుడమి (నవల)

పురస్కారాలు[మార్చు]

 • సాహిత్య అకాడమీ ద్వారా ఉత్తమరచయిత్రిగా వాసిరెడ్డి రంగనాయకమ్మ అవార్డు.
 • మనసెప్పుడూ గుప్పెడే కథా సంపుటానికి మాటూరి వెంకటసుబ్బారావు అవార్డు.
 • దుమారం కథకు వంశీ బర్కిలీ అవార్డు.
 • మంచు కురిసిన వేళ మమత నవ్వింది కథకు నవ్యసాహితి అవార్డు.

మూలాలు[మార్చు]