వేల్స్‌లో హిందూమతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
20015,439—    
201110,434+91.8%

వేల్స్‌లో హిందూమతం మైనారిటీ మతం. వెల్ష్ హిందువులలో సగం మంది లోపు 20వ శతాబ్దపు ద్వితీయార్ధంలో అక్కడ స్థిరపడినవారే. 2011 జనాభా లెక్కల ప్రకారం వేల్స్‌లో 10,434 మంది హిందువులు ఉన్నారు. [1] యునైటెడ్ కింగ్‌డమ్‌లో భాగమైన నాలుగు రాజ్యాల్లో వేల్స్ ఒకటి. గ్రేట్ బ్రిటన్‌లో భాగమైన మూడు రాజ్యాల్లో ఇది ఒకటి. ఇంగ్లండ్ సామ్రాజ్యంలో భాగమైన రెండు రాజ్యాల్లో వేల్స్‌ ఒకటి. [గమనిక 1]

చరిత్ర

[మార్చు]

చాలా మంది వెల్ష్ హిందువులు భారత సంతతికి చెందినవారు లేదా భారత పొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందినవారు. 1970లలో ఉగాండా నుండి భారతీయులు, ఇతర ఆసియన్లను ఇడి అమీన్ బహిష్కరించినపుడు వీరిలో చాలామంది ఇక్కడికి వచ్చారు. కొందరు దక్షిణాఫ్రికా నుండి కూడా వచ్చారు. ఇండోనేషియా మూలస్థులు కూడా కొందరున్నారు.

వీరిలో చాలా మంది పంజాబ్‌కు చెందినవారు. వారు సాధారణంగా మాట్లాడే భాషలు, ఇంగ్లీష్, వెల్ష్ లతో పాటు పంజాబీ, హిందీ, ఉర్దూ, గుజరాతీ, నేపాలీ ఉన్నాయి .

హిందూ కల్చరల్ అసోసియేషన్ (HCA వేల్స్) ను 1991 మార్చిలో స్థాపించారు. ఇది ఛారిటీ కమిషన్‌ ఫర్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ వద్ద నమోదైన స్వచ్ఛంద సంస్థ. వేల్స్‌లోని భారతీయ సమాజం దీన్ని నిర్వహిస్తుంది. పాన్-ఇండియన్ కమ్యూనిటీకి సేవ చేయడంతోపాటు భారతీయ సమాజాన్ని విస్తృత సమాజంలో ఏకీకృతం చేయడంలో సహాయపడటం కూడా దీని లక్ష్యం. [2]

జనాభా శాస్త్రం

[మార్చు]
సంవత్సరం శాతం మార్పు
2001 0.19% -
2011 0.34% +0.15%

2011 జనాభా లెక్కల ప్రకారం, వేల్స్‌లో 10,434 మంది హిందువులు ఉన్నారు. ఇది 2001 నాటి జన సంఖ్య కంటే దాదాపు రెట్టింపు. [3]

వేల్స్‌లో దాదాపు సగం మంది హిందువులు కార్డిఫ్‌లో (4,736), స్వాన్‌సీ (780), న్యూపోర్ట్ (685), రెక్స్‌హామ్ (504) లలో నివసిస్తున్నారు. [4]

దేవాలయాలు, స్థలాలు

[మార్చు]
శ్రీ స్వామినారాయణ మందిర్, కార్డిఫ్

స్కంద వాలే అనేది కార్మార్థెన్‌షైర్‌లోని లాన్‌పమ్‌సైంట్‌లో ఉన్నసంస్థ. ఇది, అనేక మంది హిందువులు పోషిస్తున్న ఒక సర్వమత ఆశ్రమం. ఈ ప్రదేశంలో మూడు దేవాలయాలు ఉన్నాయి. ఏటా 90,000 మంది భక్తులు దీన్ని సందర్శిస్తారు. [5]

వేల్స్‌లోని అతిపెద్ద హిందూ దేవాలయం, శ్రీ స్వామినారాయణ మందిరం. ఇది కార్డిఫ్‌లోని గ్రాంజ్‌టౌన్‌లో ఉంది. దీన్ని 1982లో తెరిచారు.

సౌత్ వేల్స్‌లోని హిందువుల కోసం పరేడ్ కార్డిఫ్‌లో 1985లో సనాతన్ ధర్మ మండల్ ఆలయాన్ని స్థాపించారు. సనాతన ధర్మం ఒక ప్రవర్తనా నియమావళిని, ఆధ్యాత్మిక స్వేచ్ఛ ప్రధాన అంశంగా ఉన్న విలువల వ్యవస్థనూ సూచిస్తుంది. వేల్స్‌లోని హిందువులందరికీ ప్రశాంతమైన స్థలాన్ని అందించాలనేది దీని లక్ష్యం.

హిందూ కౌన్సిల్ ఆఫ్ వేల్స్

[మార్చు]

ఇది వేల్స్‌లోని ప్రధాన హిందూ సంస్థ. వేల్స్‌లో హిందూ సంస్కృతిని, మతాన్ని, విలువలనూ ప్రోత్సహించడానికి దీన్ని 2013లో స్థాపించారు.

కార్డిఫ్‌లోని శ్రీ స్వామినారాయణ్ ఆలయం, సనాతన ధర్మ మండల దేవాలయాలు, హిందూ ధార్మిక సంస్థలు, భక్తిధామ్ వేల్స్ ఛారిటీ వంటి సామాజిక కేంద్రాలన్నీ ఈ కౌన్సిల్‌లో భాగం. [6]

గమనిక

[మార్చు]
  1. యునైటెడ్ కింగ్‌డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్దర్న్ ఐర్లండ్‌లో నాలుగు దేశాలు భాగంగా ఉన్నాయి - ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లండ్, ఉత్తర ఐర్లండ్. ఐదు వందల ఏళ్ళ పాటు జరిగిన వివిధ విలీనాలతో ఈ సామ్రాజ్యం ఏర్పడింది. 1536 లో ఇంగ్లాండ్, వేల్స్ కలిసి ఒకే రాజ్యంగా - "కింగ్‌డం ఆఫ్ ఇంగ్లండ్"గా రూపొందాయి. ఆ తరువాత, 1707 లో స్కాట్లండ్ కూడా కలిసి మూడు దేశాలతో "కింగ్‌డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్" ఏర్పడింది. 1901 లో ఐర్లండ్ కూడా కలిసి "యునైటెడ్ కింగ్‌డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ ఐర్లండ్" ఏర్పడింది. అయితే, 1922 లో ఐర్లండ్ రెండు ముక్కలై ఒక భాగం స్వతంత్ర ఐర్లండ్ దేశంగా ఏర్పడగా, రెండవ భాగమైన ఉత్తర ప్రాంతం - ఉత్తర ఐర్లండు - యునైటెడ్ కింగ్‌డమ్‌లో భాగంగానే ఉండిపోయింది. అప్పుడు దేశం పేరు "యునైటెడ్ కింగ్‌డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్ అండ్ నార్దర్న్ ఐర్లండ్" గా మారింది. ఇదే ప్రస్తుత రూపం.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "2011 Census: KS209EW Religion, local authorities in England and Wales". ons.gov.uk. Retrieved 15 December 2012.
  2. About us Archived 2009-05-01 at the Wayback Machine indiacentre.co.uk, accessed 22 Nov 2009
  3. "2011 Census: KS209EW Religion, local authorities in England and Wales". ons.gov.uk. Retrieved 9 February 2020.
  4. "Hindu Council of Wales launched at Senedd - BBC News".
  5. Davies, John; Jenkins, Nigel; Menna, Baines; Lynch, Peredur I., eds. (2008). The Welsh Academy Encyclopaedia of Wales. Cardiff: University of Wales Press. p. 503. ISBN 978-0-7083-1953-6.
  6. "Hindu Council of Wales launched at Senedd - BBC News".