శ్రీరాం వీరబ్రహ్మకవి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

19వ శతాబ్దం మలి దినాలలో దేశంలో ముఖ్యంగా ఆంధ్రదేశంలో విశ్వకర్మ వంశీయుల దుస్థితిని గుర్తించి, వారిలో చైతన్యం తీసుకుని రావటానికి నిశ్శబ్ద వుద్యమం తీసుకుని వచ్చిన తొలి తరం విశ్వకర్మ ప్రముఖుల్లో శ్రీరాం వీరబ్రహ్మాచార్యులు అగ్రగన్యులు. అవగాహన కల్పిన్చకండా వుద్యమం నడిపించి రెచ్చగొడితె, బడుగు జీవుల జీవితాల్లో మార్పు రాకపొగా పెడదారి పట్టె ప్రమాదం వుంటుందని నమ్మిన మెధావి శ్రీరాం వీరబ్రహ్మకవి.

ఏ రంగంలో దిగినా దాని లోతుపాతులు చూడకుండా వదలని పట్టువదలని విక్రమార్కుడు, శ్రీరాం వీరబ్రహ్మకవి. పుట్టినది అతి నిరుపేద కుటుంబంలో! అతి సాధారణ జీవన పరిస్ఠితులను ఎదుర్కొని స్వయం ప్రథిభతో గత శతాబ్దం తొలి దినాలలో వున్నత స్ఠానం సాధించిన అసమాన ప్రతిభావన్తుడు శ్రీరాం వీరబ్రహ్మకవి.

1887 ఫిబ్రవరిలో ఆంధ్రదేశంలోని పెదకళ్ళేపల్లి గ్రామంలో సాంప్రదాయ విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మిచినారు. అయన పాండిత్యం గురించి, ప్రతిభ గురించి లోకానికి తెలిసినంతగా అయన జీవిత విశేషాలు తెలియవు. ఆంధ్రప్రదేశ్ లో అనేక ప్రముఖుల జీవిత చరిత్రలు వ్రాసిన వీరబ్రహ్మ కవి తన జీవిత చరిత్ర ఎక్కడా వ్రాయలేదు. ఇటివల శ్రీ రేపాక ఏకాంబర ఆచార్యులు ఆంధ్రజ్యోతి లో వ్రాశారు.

చరిత్రకారుల చరిత్రలు వ్రాసిన నిజమైన చరత్రకారుడు. చరిత్ర పురుషుల జీవితాల గురించి వ్రాసిన చరితార్ధుడు శ్రీరాం వీరబ్రహ్మకవి. చరిత్ర అంటే రాచ కుటుంబాల కథనాలు, రాజ్య విస్తరణ కాంక్షతో కదనరంగంలో పాలకులు చేసిన దుందుడుకు పనుల వర్ణన కాదని, జనుల ఈతిబాధల వాస్తవ చిత్రీకరణ, ఆదర్శ పురుషుల జీవిత వివరాలు అందించి సాదారణ ప్రజలకు ఆదర్శం చూపించే రచనలే నిజమైన చరిత్రలని సందర్భం వచ్చినప్పుడల్లా ప్రపంచానికి చాటి చెప్పిన చరిత్ర సిద్ధాంత కర్త. ఏదో ప్రవక్త వలె సిద్ధాంతాలను చెప్పడం గాక తన కాలాన్ని, మేధస్సును అందుకు అంకితం చేసిన ఆచరనవాది ఆయన.

హిస్తోరోగ్రఫి అనే శాస్త్రం రుపొందని రోజుల్లోనే ఆ శాస్త్ర నియమాలన్నీ తన అంత నేత్రంతో చూచి ఆ సూత్రాలకు అనుగుణంగా చరిత్ర రచన సాగించినివాడు మన వీరబ్రహ్మ కవి గారు. తన దేశాన్ని, తన ప్రాంతాన్ని, తన జాతిని ఏ కోశానా మరిచి పోకుండా ప్రభావొంనతులను తన రచనలలో ఉగ్గడించిన స్వజాతి భాష వేశాభిమాని మన వీరబ్రహ్మ కవి గారు. సాహిత్యంలో ఆయన స్పృశించని అంశం లేదు. పద్య కావ్యాలు, వచన కావ్యాలు, నాటకాలు, వ్యాసాలూ, నవలలు, కథలు, ఎన్నో రచించారు. ఎన్ని వ్రాసినా ఆయనకు ప్రీతి పాత్రమైనది జీవిత చరిత్రల రచన. సూక్ష్మ స్థాయి చరిత్ర రచనకు పరిశోధన ఎంత అవసరమో ఆయన రాసిన నానారాజన్య విఖ్యాత జన చరిత్ర అనే మూడు సంపుటాలే నిదర్శనం. సుమారుగా ౭౦ మంది మహా పురుషులు, పదిహేను మంది జమిందారుల జీవిత చరిత్ర కళ్ళకు కట్టినట్టుగా రచించారు. ఆ రచనల్లో ౨౦౦ సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ జీవిత విధానం అద్భుతంగా గోచరిస్తుంది. అంత మంది జీవితాల వివరాలను ఎవరి సహకారం లేకుండా ఒకే వ్యక్తి సేకరించి గ్రంథస్తం చేయటం సామాన్యమైన విషయం ఏమి కాదు. ఆర్థికం అటుంచి శారీరక, మానసిక శ్రమ ఎంత పడాలో అనుభవించిన వారికి గాని తెలియదు. వీరబ్రహ్మ కవి గారు అత్యంత అద్బుధమైన పద్య కవి. అందులోను ఒక పది వేల మంది పద్య కవులలో ఒక్కరికి అలవడని చిత్ర కవిత్వం, బంధ కవిత్వం, ఆశు కవిత్వం, ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.పద్యబంధం, రథబంధం, షోడశాదల పదబంధం, సీసం లాంటి పద్య రచనలు కవిగారికి కరతలమలకాలు.

వీరబ్రహ్మకవి గారు ౧౯౨౦ కి పూర్వం ఆంధ్రదేశం లోని జమీల వివరాలు సేకరించి రాజపోషకులు, మహారాజ పోషకులు, పదనుల ఆర్థిక సహాయంతో జమీలు, అసాదారణ ప్రతిభావంతుల జీవితాల వివరాలతో మూడు సంపుటాలు వెలువరించారు కనుకనే నేడు మనకు పలువురి జీవిత విశేషాలు తెలుస్తున్నాయి. వున్నది ఉన్నట్టుగా చెప్పాలంటే ఆయన తన రచనలతో ౧౯,౨౦వ శతాబ్దాల నాటి ప్రముఖులకు చిరంజీవత్వం ప్రసాదించారు. ఆయన పుట్టి పెరిగిన దేవరకోట సంస్థానం (చల్లపల్లి జమీందారీ) చరిత్రను కళ్ళకు కట్టినట్టుగా, సమగ్రంగా సుకాల్యన్గా రాసారు. ఆయనే కనుక ఈ చరిత్ర ఇంత అద్భుతంగా రాయకపోతే చల్లపల్లి జమీందారీ గురించి ఈనాడు మనకు తెలిసే అవకాశమే లేదు.

౧౯౨౯ డిసెంబర్ ౨౧వ తేదిన చల్లపల్లి రాజా యార్లగడ్డ శివరామ ప్రసాద్ గారికి చెరుకూరి పద్మనాభ ప్రసాద్ కుమార్తె వెంకట దుర్గాంబ తో చల్లపల్లి లో వివాహం జరిగింది. ఆంధ్రదేశం లోని అత్యంత ప్రతిభావంతులైన కవి పండితులకు సన్మానం జరిగింది. కిమ్కవింద్ర ఘంటా పంచానన బిరుదాంకితులైన వెంకట శాస్త్రి, కవిసార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తి, మద్వాశ్రి. కాశీ కృష్ణాచార్యులు, జనాబ్. ఉమర్ ఆలీషా, వేటూరి ప్రభాకర శాస్త్రి లాంటి ఉద్దండ పండితులతో సమానంగా శ్రీరామ్.వీరబ్రహ్మచార్యులు గారికి సత్కారం జరిగిందంటే ఆయన ప్రతిభా పండిత్యాలు ఏపాటివో అర్థం అవుతుంది.

వీరబ్రహ్మ కవి గారిది అత్యంత అద్భుతమైన ప్రాపంచిక విషయ పరిజ్ఞానం. ౧౯౧౭లొ ఆయన జాపనీయము అనే నాటకం రాసారు. అప్పటికే వందేమాతరం ఉద్యమం తో దేశంలో ప్రభవించిన జాతీయ ఉద్యమానికి ఆయన వ్రాసిన నాటకం మంచి ఊపు ఇచ్చింది. చిట్ట చివరికి భారత దేశానికి స్వతంత్రం కచ్చితన వస్తుందని ఎలుగెత్తి తన నాటకం ద్వారా చాటి చెప్పారు మన వీరబ్రహ్మ కవి గారు. అయ్యదేవర కాళేశ్వర రావు, ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాల కృష్ణయ్య లాంటి సీనియర్ నాయకులని సైతం జాతీయ ఉద్యమానికి వున్ముఖులుగా గావించిన నాటకం జాపనీయము. జాపనీయము నాటకం గురించి అయ్యదేవర కాళేశ్వర రావు గారు తమ జీవిత చరిత్ర నవ్యాంధ్ర - నాదేశం గ్రంథం లో విపులంగా చర్చించారు.

వీరబ్రహ్మ కవి గారు బహుముఖ గ్రంథ రచయిత. ఆ బహుముఖ ప్రజ్ఞాశాలి వ్రాసిన గ్రంథాలలో నానా రాజన్య విఖ్యాత జన చరిత్ర, తుకారామ్, పల్లవరాజు చరిత్ర, వాసంతిక, వినోదిని, ప్రియదర్శిని, మర్కందేయము, ప్రముఖమైనవి. శ్రీహర్షుడు సంస్కృతంలో వ్రాసిన ప్రియదర్శిక అనే నీతి గ్రంథాన్ని తెలుగులో స్వేచ్చానువాదం లో వ్యాఖ్యాన పద్దతిలో ప్రియదర్శిక అను నామకరణం చేసారు వీరబ్రహ్మ కవి గారు. మద్రాసు యూనివర్సిటీ పాఠ్య పుస్తక నిర్ణాయక సంఘం వారు ఈ పుస్తకాన్ని ఇంటర్మీడియట్ పాఠ్య గ్రంథంగా నిర్ణయించి ఆయనను గౌరవించింది.

వీరబ్రహ్మ కవి గారు జీవనోపాధి కోసం బందరు నోబెల్ కాలేజీ లో తెలుగు పండిట్ గా వుద్యోగం చేసి ౧౯౩౦ కి పూర్వమే పదవీ విరమణ చేసారు. ౧౯౨౩ లో బందరు మున్సిపల్ కాంసిలర్ గ వ్యవహరించారు. ఆయన తెలుగు పండితుడిగా వుద్యోగం చేసిన చరిత్ర పరిశోధకుడిగా అనన్య సాధ్యమైన రీతిలో పరిశోధన చేసారు. ఆయనే కనక పరోసోదన చేసి రాయకపోతే ఆంధ్రదేశానికి జమిందారి చరిత్ర లభ్యమయ్యేది కాదు. సర్వేపల్లి రాధా కృష్ణయ్య పండితుడు ఎవరో ఆంధ్రులకు తొలిసారిగా పరిచయం చేసిన మహానుభావుడు శ్రీరాం.వీరబ్రహ్మ కవి గారు. కేవలం సంస్థానాధిపతుల చరిత్రలను మాత్రమే రచించి ౧౮౧౮ లో ఆయన రాసిన నానా రాజన్య చరిత్ర అనే గ్రంథం నిజంగా కత్తి మీద సాము లాంటిది. జమిందారుల మధ్య ఈర్ష ద్వేషాలు ప్రబలిన కాలం అది. ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వలకూడదు అనే ఆ రోజుల్లో అందరి చేత సెహభాష్ అనిపించే రీతిలో గ్రంథ రచన చేసిన మహా రచయిత వీరబ్రహ్మ కవి గారు.