శ్రీ శ్రీ రవి శంకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ శ్రీ రవి శంకర్
జననం (1956-05-13) 1956 మే 13 (వయసు 68)
జాతీయతభారతీయుడు
వెబ్‌సైటుwww.srisri.org

రవిశంకర్ (జననం 1956 మే 13) భారతీయ ఆధ్యాత్మిక గురువు. అతన్ని తరచుగా " శ్రీశ్రీ " అని, గురూజీ అనీ, గురుదేవ్ అనీ పిలుస్తారు. [1] అతను 1981 లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్‌ను స్థాపించాడు. అది ప్రజలకు సామాజిక సహాయాన్ని అందించే స్వచ్ఛంద సంస్థ. 1997 లో అతను జెనీవాలో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. ఇది సహాయక చర్యలు, గ్రామీణాభివృద్ధిలో నిమగ్నమై ఉంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ శాఖలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ప్రధాన శాఖ బెంగుళూరు సమీపంలోని జక్కూరు వద్ద ఉంది. వీరు కనుగొన్న సుదర్శన క్రియ బహు ప్రసిద్దం.

జీవిత విశేషాలు

[మార్చు]

రవిశంకర్ తమిళనాడులోని పాపనాసంలో విశాలాక్షి రత్నం, ఆర్ఎస్ వెంకట రత్నం దంపతులకు జన్మించాడు. అతను భానుమతి నరసింహన్‌కు సోదరుడు. [2] అతను పుట్టినది ఆదివారం కావడంతో "రవి" అని, ఎనిమిదవ శతాబ్దపు హిందూ గురువు అయిన ఆది శంకరుడి పేరు మీదుగా"శంకర్", అనీ పెట్టారు. రవి శంకర్ పుట్టినది ఆదిశంకరుని పుట్టిన రోజునే. [3] అతని మొదటి గురువు, వేద పండితుడూ మహాత్మా గాంధీ యొక్క సన్నిహితుడూ అయిన సుధాకర్ చతుర్వేది. [4] [5] రవిశంకర్ బెంగళూరు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న సెయింట్ జోసెఫ్ కళాశాల నుండి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పొందాడు. [6] గ్రాడ్యుయేషన్ తరువాత, శంకర్ తన రెండవ గురువు మహర్షి మహేష్ యోగితో కలిసి ప్రయాణించాడు, [7] ప్రసంగాలు చెయ్యడం, వేద శాస్త్రాలపై సమావేశాలు ఏర్పాటు చేయడం, భావాతీత ధ్యానం, ఆయుర్వేద కేంద్రాలను ఏర్పాటు చేయడం వంటివి చేసాడు. [8] [9]

1980 వ దశకంలో, శంకర్ ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికతపై ఆచరణాత్మక, అనుభవపూర్వక కోర్సులను ప్రారంభించాడు. 1982 లో కర్ణాటక రాష్ట్రంలోని షిమోగాలోని భద్రా నది ఒడ్డున పది రోజుల నిశ్శబ్దం తరువాత, తన సుదర్శన క్రియ అనే లయబద్ధమైన శ్వాస సాధన తనకు చేకూరిందని చెప్పాడు. అది "ఒక పద్యం లాగా, ఒక ప్రేరణగా" తనకు వచ్చిందని చెప్పాడు. "నేను దానిని నేర్చుకున్నాను, నేర్పించడం ప్రారంభించాను" అని అన్నాడు. [10]

1983 లో, స్విట్జర్లాండ్‌లో శంకర్ తన మొట్టమొదటి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సును నిర్వహించాడు. 1986 లో, ఉత్తర అమెరికాలో మొట్ట మొదటి కోర్సు కోసం అతను అమెరికాలోని కాలిఫోర్నియాలోని యాపిల్ వ్యాలీకి వెళ్ళాడు. [11]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. Salkin, Allen (28 August 2007). "Emperor of Air". Yoga Journal. Retrieved 14 May 2018.
 2. Madhukar, Jayanthi (17 May 2004). "Sri Sri Ravi Shankar: I can't afford to be apolitical". IndiaTimes. Archived from the original on 26 సెప్టెంబరు 2018. Retrieved 26 September 2018.
 3. Kilgannon, Corey (11 April 2011). "Seeking Bliss Among the Honks and Hisses". The New York Times. Retrieved 15 September 2014.
 4. Avdeeff, Alexis (2004). "Sri Sri Ravi Shankar and the Art of Spreading Awareness over the World" (PDF). Journal of Dharma. XXIX: 321–335. ISSN 0253-7222. Archived from the original (PDF) on 14 మే 2018. Retrieved 15 September 2014.
 5. "Pandit gifted wheelchair on birthday". The Times of India. 15 March 2011. Retrieved 15 September 2014.
 6. "Scan of Degree Certificate". Bawandinesh.name. Archived from the original on 29 June 2012.
 7. Mani, Rajiv (12 February 2008). "Maharishi Mahesh Yogi cremated in Allahabad". The Times of India.
 8. Gautier (2008).
 9. Fischman, Michael (2010). Stumbling into Infinity: An Ordinary Man in the Sphere of Enlightenment. Morgan James Publishing. ISBN 978-1-60037-648-1.{{cite book}}: CS1 maint: ref duplicates default (link)
 10. Mahadevan, Ashok (February 2007). "Face to Face: Stress Free with Sri Sri". Reader's Digest. Archived from the original on 29 September 2007. Retrieved 5 June 2009.
 11. Pandit, Srimoyee (29 June 2011). "Art of living founder Ravi Shankar - First Indian to receive the Crans Montana Forum Award".