సంధ్యా అగర్వాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సంధ్యా అగర్వాల్ (Sandhya Agarwal) భారతదేశానికి చెందిన మాజీ మహిళా క్రికెట్ క్రీడాకారిణి. ఈమె మధ్యప్రదేశ్ లోని ఇండోర్ పట్టణానికి చెందిన వ్యక్తి. అగర్వాల్ భారత మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించింది. 1984 నుంచి 1995 వరకు భారత జట్టు తరఫున 13 టెస్ట్ మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించింది. ఈ కాలంలో ఆమె 50.45 సగటుతో 1110 పరుగులు సాధించింది. అందులో 4 శతకాలు కూడా ఉన్నాయి. 1986 లో ఇంగ్లాండుపై 190 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించి, 1935 లో బెట్టీ స్నోబాల్ రికార్డును అధికమించింది. మహిళా క్రికెట్ లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. 1987 లో డెనిస్ అన్నెట్స్ 193 పరుగులు చేసే వరకు ఇది ప్రపంచ రికార్డుగా కొనసాగింది. అగర్వాల్ 21 మహిళా వన్డే పోటీలను కూడా ఆడి 31.50 సగటుతో 567 పరుగులు సాధించింది.