సాగర్ (నటుడు)
స్వరూపం
సాగర్ | |
---|---|
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2006–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సౌందర్య (m. 2017) |
సాగర్ తెలుగు టెలివిజన్ ధారావాహికలలో పనిచేసే భారతీయ నటుడు. అతను చక్రవాకం (2006 -2009), మొగలి రేకులు (2008–2013)లలో ప్రధాన పాత్ర పోషించినందుకు ప్రసిద్ధి చెందాడు. 2009లో, ఉత్తమ నటుడిగా నంది టీవి అవార్డును ఆయన అందుకున్నాడు.[1][2]
2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో నవంబరు 6న భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు.[3]
కెరీర్
[మార్చు]సాగర్ జెమినీ టీవిలో విజయవంతమైన ధారావాహికలైన చక్రవాకం, మొగలి రేకులులలో ఆయన నటించాడు. 2021లో, దిల్ రాజు నిర్మించిన తెలుగు చిత్రం షాదీ ముబారక్లో ఆయన కథానాయకుడు పాత్ర పోషించాడు.[4] అతను స్క్రీన్ రైటర్ బి.వి.ఎస్ రవి నిర్మాణంలో ఒక చిత్రం చేసాడు.[5]
వ్యక్తిగత జీవితం
[మార్చు]సాగర్ 2017లో సౌందర్యను పెళ్లాడాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు.[6]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | నోట్స్ | మూలాలు |
---|---|---|---|---|
2001 | మనసంతా నువ్వే | ఫ్రెండ్‌షిప్ డే ఈవెంట్‌లో వక్త | గుర్తింపు లేని పాత్ర | |
2011 | మిస్టర్ పర్‌ఫెక్ట్ | శివ, విక్కీ స్నేహితుడు | [7] | |
2016 | సిద్ధార్థ | సూర్య / సిద్ధార్థ | ప్రధాన పాత్రలో అరంగేట్రం | [8] |
2018 | మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ | అభి | [9] | |
2021 | షాదీ ముబారక్ | మాధవ్ సున్నిపెంట | [7] |
గుర్తింపు
[మార్చు]Year | Award | Work | Result | Ref. |
---|---|---|---|---|
2009 | ఉత్తమ నటుడిగా నంది టీవీ అవార్డులు | మొగలి రేకులు | విజేత | [10] |
2017 | ఉత్తమ పురుష అరంగేట్రానికి సైమా అవార్డు – తెలుగు | సిద్ధార్థ | నామినేట్ చేయబడ్డాడు |
మూలాలు
[మార్చు]- ↑ "BVS Ravi's production with Mogalirekulu Sagar". Telugu Cinema (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-09-30. Retrieved 2020-10-31.
- ↑ "'మొగలిరేకులు' ఆర్కే నాయుడు విరాళం.. కేటీఆర్‌కు చెక్ అందజేత". Samayam Telugu. Retrieved 2020-10-31.
- ↑ "Mogalirekulu RK Naidu have Joined Pawan Kalyan Janasena Party - Mogalirekulu Sagar: జనసేన పార్టీలో చేరిన మొగలిరేకులు సాగర్.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు". web.archive.org. 2023-11-06. Archived from the original on 2023-11-06. Retrieved 2023-11-06.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Shaadi Mubarak Teaser: షాదీ ముబారక్ టీజర్". Zee News Telugu. 2021-02-17. Retrieved 2021-02-17.
- ↑ "BVS Ravi's production with Mogalirekulu Sagar". Telugu Cinema (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-09-30. Retrieved 2020-10-31.
- ↑ "BVS Ravi's production with Mogalirekulu Sagar". Telugu Cinema (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-09-30. Retrieved 2020-10-31.
- ↑ 7.0 7.1 "ఆర్కే నాయుడుతో దిల్‌రాజు 'షాదీ ముబారక్' - Shaadi Mubarak Sagar". TV9 Telugu. 2020-09-30. Retrieved 2021-02-17.
- ↑ "Mogali Rekulu star Sagar talks about his debut film Siddhartha". The Times of India.
- ↑ "TV actor Sagar bags another movie". The Times of India.
- ↑ "Nandi TV Awards G.O and Results 2009". APSTVFTDC.