సాల్టోరో పర్వతాలు
సాల్టోరో పర్వతాలు | |
---|---|
సాల్టోరో ముజ్‌తాఘ్ | |
అత్యంత ఎత్తైన బిందువు | |
శిఖరం | సాల్టోరో కాంగ్రి |
ఎత్తు | 7,742 మీ. (25,400 అ.) |
నిర్దేశాంకాలు | 35°24′01″N 76°50′55″E / 35.40028°N 76.84861°E |
భౌగోళికం | |
Lua error in మాడ్యూల్:Location_map at line 526: Unable to find the specified location map definition: "Module:Location map/data/Karakoram relief" does not exist.
| |
స్థానం | భారత పాకిస్తాన్‌ల మధ్య విభజన రేఖ అయిన వాస్తవ క్షేత్ర స్థితి రేఖపై |
సరిహద్దు | మాషర్బ్రమ్ పర్వతాలు |
సాల్టోరో పర్వతాలు కారకోరం శ్రేణిలో [1] ఆగ్నేయ భాగంలో ఉన్న ఒక ఉపశ్రేణి. అవి సియాచిన్ గ్లేసియర్‌కు నైరుతి వైపున ఉన్నాయి. ఇది ధ్రువ ప్రాంతాలకు వెలుపల ప్రపంచంలోని రెండు పొడవైన హిమానీనదాలలో ఒకటి. "సాల్టోరో" అనే పేరు, ఈ శ్రేణికి పశ్చిమాన ఉన్న సాల్టోరో లోయతో కూడా ముడిపడి ఉంది. ఈ లోయ సాల్టోరో శ్రేణికి పాకిస్తాన్ వైపున, వాస్తవ క్షేత్ర స్థితి రేఖ (AGPL) వెంట ఉంటుంది.
సాల్టోరో కాంగ్రీ శిఖరం, సాల్టోరో నది, సాల్టోరో లోయలు సాల్టోరో పర్వత శ్రేణి లోని లక్షణాలు. వాస్తవిక క్షేత్రస్థితి రేఖ (AGPL) ఈ ప్రాంతంలో భారతదేశం పాకిస్థాన్‌ల మధ్య సరిహద్దుగా ఉంది. సియాచిన్ ప్రాంతంలోని ఎత్తైన శిఖరాలు, కనుమలూ భారతదేశం నియంత్రణలో ఉన్నాయి. పాకిస్తాన్, దిగువ శిఖరాలు, పశ్చిమాన ఉన్న లోయలను ఆక్రమించింది.[2]
సాల్టోరో పర్వతాలు లెస్సర్ కారాకోరమ్‌లలో భాగం. సియాచిన్, బాల్టోరో, బియాఫో, హిస్పార్ గ్లేసియర్‌లతో సహా ప్రధాన కారకోరం హిమానీనదాలకు నైరుతి వైపున, తూర్పు నుండి పడమర వరకు వ్యాపించి ఉన్నాయి. కారకోరం శ్రేణి లోని ప్రాధమిక శిఖరశ్రేణి ఈ హిమానీనదాలకు ఈశాన్యాన ఉంది.
ప్రధాన శిఖరశ్రేణికి ఉన్న ఉపశ్రేణులను సాధారణంగా "ముజ్తాగ్" అని అంటారు. అయితే లెస్సర్ కారాకోరమ్‌లలోని పర్వత సమూహాలను తరచుగా వ్యక్తిగత పర్వతాలు, శ్రేణులు లేదా సమూహాలుగా సూచిస్తారు. [3]
సాల్టోరో శ్రేణిని లడఖ్ ప్రాంతంలో భాగం. కానీ పాకిస్తాన్ దీన్ని, పాక్ ఆక్రమిత గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలో భాగమని చెప్పుకుంటుంది. 1984 - 1987 మధ్య, భారతదేశం, ఈ శ్రేణి లోని ప్రధాన శిఖరాలు కనుమలపై సైనిక నియంత్రణ సాధించింది. పాకిస్తాన్ చేతిలో ఈ శ్రేణికి పశ్చిమాన ఉన్న హిమనదీయ లోయలపై నియంత్రణ మాత్రమే మిగుల్చుకోగలిగింది. అందువల్లనే, ఎత్తైన శిఖరాలతో చక్కటి పర్వతారోహణ అవకాశాలు ఉన్నప్పటికీ, సియాచిన్ ఘర్షణ కారణంగా పాకిస్తానీ సైనిక బలగాలు తప్ప ఇతరులు వాటిని సందర్శించరు.
నైరుతి వైపున, సాల్టోరో పర్వతాలు నిటారుగా కొండూస్, దన్‌సామ్ నదుల లోయల వైపుకు దిగిపోతాయి. ఈ రెండూ కలిసి షియోక్ నదికి ఉపనది అయిన సాల్టోరో నదిగా మారతాయి. షియోక్ నది సింధు నదిలోకి ప్రవహిస్తుంది. వాయవ్యాన, కొండూస్ హిమానీనదం పొరుగున ఉన్న మాషెర్‌బ్రమ్ పర్వతాల నుండి సాల్టోరో శ్రేణిని వేరు చేస్తుంది. ఆగ్నేయంలో గ్యోంగ్ నది, గ్యోంగ్ హిమానీనదం గ్యోంగ్ కనుమలు (గ్యోంగ్ లా) ఉత్తర సాల్టోరో పర్వతాలను దక్షిణ సాల్టోరో పర్వతాలు లేదా "కైలాస్ పర్వతాల" (టిబెట్ లోని పవిత్రమైన కైలాస పర్వతం కాదు) నుండి వేరు చేస్తాయి.
నేపథ్యం
[మార్చు]భారత-పాకిస్తాన్ సరిహద్దులు: SC, IB, LOC, AGPL
[మార్చు]భారతదేశం-పాకిస్తాన్ సరిహద్దులు 4 రకాలుగా ఉంటాయి: వివాదాస్పద సర్ క్రీక్ (SC) నదీతీర సరిహద్దు, పరస్పరం అంగీకరించిన భారతదేశం-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు (IB) సర్ క్రీక్‌కు ఉత్తరం నుండి జమ్మూ సమీపంలోని ధాలన్‌కు ఉత్తరం వరకు ఉంటుంది, నియంత్రణ రేఖ (LoC) వివాదాస్పద కాశ్మీర్ లడఖ్ ప్రాంతాలలో భారతదేశంలోని ధాలన్‌కు ఉత్తరం నుండి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీరు లోని చికెన్ నెక్‌కు పశ్చిమాన పాయింట్ NJ9842 వరకు, పాయింట్ NJ9842 నుండి సియాచిన్ మీదుగా ఇందిరా కల్ వెస్ట్ వరకు ఉన్నఅసలైన గ్రౌండ్ పొజిషన్ లైన్ (AGPL). సియాచిన్, 1963 లో చైనా-పాకిస్తాన్ ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్ చైనాకు అప్పగించిన షక్స్‌గామ్‌కు దక్షిణంగా ఉంది. అయితే ఇది తమ భూభాగం లోనిదే అని భారతదేశం వాదన.[4] భారతదేశ భూభాగమైన అక్సాయ్ చిన్‌ను 1962 నుండి చైనా ఆక్రమించి ఉంది. చైనా ఆక్రమణలో ఉన్న షక్స్‌గామ్ ట్రాక్ట్, సాల్టోరో పర్వత శ్రేణికి ఉత్తరాన, అప్సరసాస్ కాంగ్రీ శ్రేణి నుండి K2 కి వాయువ్యంగా 90 కి.మీ. దూరం వరకు ఉంది.[5]
వాస్తవ క్షేత్ర స్థితి రేఖ
[మార్చు]వాస్తవ క్షేత్ర స్థితి రేఖ (AGPL) నియంత్రణ రేఖపై పాయింట్ NJ9842 నుండి సాల్టోరో పర్వతాల వెంట లా యోంగ్మా రి, గ్యోంగ్ లా, గ్యోంగ్ కాంగ్రీ, చుమిక్ కాంగ్రీ, బిలాఫోండ్ లా, సమీపంలోని బాణా పోస్ట్, సాల్టోరో కాంగ్రీ, ఘెంట్ కాంగ్రీ, సియా లా మీదుగా భారత-పాకిస్తాన్-చైనా ట్రైజంక్షన్‌కి వాయవ్యంగా ఇందిరా కల్ వెస్ట్ వరకు ఉంది.[6][5] గయారీ క్యాంప్, చోగోలిసా, బాల్టోరో గ్లేసియర్, కాన్వే సాడిల్, [5] బాల్టోరో ముజ్తాగ్, గషెర్‌బ్రమ్ వంటి శిఖరాలూ కనుమలూ AGPL కి పశ్చిమాన పాకిస్తాన్ నియంత్రణలో ఉన్నాయి.
కొన్ని శిఖరాలు
[మార్చు]7,200 మీటర్లు (23,622 అ.) కంటే ఎక్కువ ఎత్తున, కనీసం 500 మీటర్లు (1,640 అ.) టోపోగ్రాఫిక్ ప్రామినెన్స్ (చుట్టూ ఉన్న ప్రాంతం కంటే ఎత్తు) ఉన్న సాల్టోరో పర్వతాలలోని శిఖరాల పట్టికను కింద చూడవచ్చు. (ఈ శ్రేణి లోని శిఖరాలను స్వతంత్ర శిఖరాలుగా గుర్తించటానికి ఇది సాధారణ ప్రమాణం.)
కొండ. | ఎత్తు (m) | ఎత్తు (ft) | సమన్వయాలు | ప్రాముఖ్యత (m) | మాతృ పర్వతం | మొదటి అధిరోహణ | అధిరోహణలు (ప్రయత్నాలు) |
---|---|---|---|---|---|---|---|
సాల్టోరో కాంగ్రీ | 7,742 | 25,400 | 35°23′57″N 76°50′51″E / 35.39917°N 76.84750°E | 2,160 | గాషర్బ్రమ్ I | 1962 | 2 (1) |
కె12 | 7,428 | 24,370 | 35°17′42″N 77°01′18″E / 35.29500°N 77.02167°E | 1,978 | సాల్టోరో కాంగ్రీ | 1974 | 4 (2) |
ఘెంట్ కాంగ్రీ (మౌంట్ ఘెంట్) | 7,401 | 24,281 | 35°31′03″N 76°48′01″E / 35.51750°N 76.80028°E | 1,493 | సాల్టోరో కాంగ్రీ | 1961 | 4 (0) |
షెర్పి కాంగ్రి | 7,380 | 24,213 | 35°27′58″N 76°46′53″E / 35.46611°N 76.78139°E | 900 | ఘెంట్ కాంగ్రీ | 1976 | 1 (1) |
ఇవి కూడా చూడండి
[మార్చు]- సరిహద్దులు
- ఘర్షణలు
మూలాలు
[మార్చు]- ↑ "Tryst With Deceit?". outlookindia.com/.
- ↑ How India realised it was at risk of losing the Siachen glacier to Pakistan, The Print, 12 April 2018.
- ↑ Mason, Kenneth (1938). "Karakoram Nomenclature". Himalayan Journal 10. Archived from the original on 2013-10-12. Retrieved 2014-02-10.
- ↑ "Pakistan: Signing with the Red Chinese". Time (magazine). 15 March 1963. Retrieved 11 January 2020.
- ↑ 5.0 5.1 5.2 R Baghela and M Nüsserab, 2015, Securing the heights: The vertical dimension of the Siachen conflict between India and Pakistan in the Eastern Karakoram, Political Geography (journal), Volume 48, Pages 24–36.
- ↑ "Manning the Siachen Glacier". Bharat Rakshak Monitor. 2003. Archived from the original on 2012-06-14. Retrieved 2011-01-27.