సిరందాసు వెంకట రామారావు
శరద్ కుమార్ | |
---|---|
జననం | 1936 గుడివాడ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం |
వృత్తి | చిత్రకారుడు |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | కళాకారుడు |
జీవిత భాగస్వామి | సుగుణ |
పిల్లలు | పద్మావతి |
పురస్కారాలు | పద్మశ్రీ లార్డ్ క్రాప్ట్ అవార్డు కామన్వెల్త్ లో ప్రతిభావంతుడైన కళాకారుడు |
సిరందాసు వెంకట రామారావు, (జ 1936) భారత సంతతికి చెందిన బ్రిటిష్ చిత్రకారుడు.[1][2][3] అకను క్యూబిస్ట్ చిత్రకళలో ప్రావీణ్యుడు.[4] 1962లో కామన్వెల్త్ ఫెలోషిప్ పొందాడు.[4] భారత ప్రభుత్వం అతనికి దేశంలోని నాల్గవ అత్యున్నత పురస్కారమైన పద్మశ్రీ యిచ్చి సత్కరించింది.[5]
జీవిత విశేషాలు
[మార్చు]అతని తండ్రి చెక్కతో శిల్పాలు చేసేవాడు. తరువాత నిర్మాణ పని చేసేవాడు.[4][6][7] వెంకట రామారావు ఆంధ్రప్రదేశ్ రాష్టంలోని కృష్ణా జిల్లాకు చెందిన గుడివాడ లో 1936లో జన్మించారు.[2][3][8][9] అకౌంటింగ్, బ్యాంకింగ్ లలో 1955లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పట్టాను పొందాడు.[6] ఆ కాలంలో కె.వేణుగోపాల్ వద్ద శిక్షణ పొందాడు.[7] తరువాత కె.శ్రీనివాసులు వద్ద శిక్షణ పొంది [3] 1955లో ఫైన్ ఆర్ట్స్ నందు ప్రభుత్వ డిప్లొమాను చెన్నైలోని కళాక్షేత్రం నుండి పొందాడు.[6] తరువాత శిక్షణ కోసం మద్రాసు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ (ప్రభుత్వ కాలేజి ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, చెన్నై) చేరాడు.[4][9] 1959లో ఫైన్ ఆర్ట్స్ డిగ్రీని పొందాడు.[6] అదే విధంగా ఎకనమిక్స్ ను అభ్యసించి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి డిగ్రీని పొందాడు.[6]
అతను చెన్నైలో ప్రసిద్ధ చిత్రకారుడు కె.సి.ఎస్.పణికేర్ తో కలసి పనిచేసాడు.[3][6][7] అతను 1959లో న్యూఢిల్లీ వెళ్ళాడు. అక్కడ భారత ప్రభుత్వ రీసెర్చ్ ఫెలోషిప్ పొంది 1962 వరకు అక్కడనే ఉన్నాడు.[6] ఆ సంవత్సరం కామన్వెల్త్ ఫెలోషిప్ పొందాడు.[3] తరువాత ఆయాన్ యునైటెడ్ కింగ్ డం కు వెళ్ళి [4] అక్కడ స్లాడ్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, యూనివర్శిటీ ఆఫ్ లండన్ లలో 1965 వరకు విలియం కోల్డ్‌స్ట్రీమ్ అద్వర్యంలో చదివాడు.[6][9] తరువాత రెండు సంవత్సరాలు లండన్ కంట్రీ కౌన్సిల్ లో పెయింటింగ్, డ్రాయింగ్ ఉపాధ్యాయునిగా పనిచేసాడు.[6][9] తరువాత 1967లో యు.ఎస్ వెళ్ళి 1969లో చిన్‌సిన్నాటి విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు.అక్కడ అతను టీచింగ్ అసిస్టెంటుగా 1969 వరకు పనిచేసాడు.[6][9] తరువాత వెస్టెర్న్ కెంటుకీ విశ్వవిద్యాలయంలో ఫైన్ ఆర్ట్స్ విభాగంలో ప్రొఫెసరుగా పనిచేసాడు.[6][9] తరువాత చిగాగో వెళ్లాడు.[4]
లండన్ లోని టాటా గ్యాలరీ, న్యూయార్క్ లోని మెట్రొపోలియన్ మ్యూజియం ఆర్ట్స్ నందు అతను చిత్రించిన చిత్రాలను చూడవచ్చు.[7] ప్రపంచంలో అనేక ఆర్ట్ గ్యాలరీలలో, మ్యూజియం లలో అతను గీసిన చిత్రాలు ఉన్నాయి.
అతను చిత్రకళ, కవిత్వం పరంగా ప్రసిద్దుడు.[4][10] సుగుణ ను వివాహమాడాడు. వారికి ఒక కుమార్తె (పద్మావతి) జన్మించింది. ఆమె భరతనాట్యంలో సుపరిచితురాలు [6] అతను 2003 లో భారతదేశానికి తిరిగి వచ్చి, తన పనిని కొనసాగిస్తాడు.[6].[4]
అవార్డులు, గుర్తింపులు
[మార్చు]- లార్డ్ క్రాప్ట్ అవార్దు - 1962 [3][7][9]
- కామన్వెల్త్ లో ప్రతిభావంతుడైన కళాకారునిగా గుర్తింపు.[6]
- పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్.
- ఆయన జీవిత చరిత్ర అమెరికా, వాషింగ్టన్ లలో ప్రతిభావంతులైన విద్యావేత్తలుగా గుర్తింపబడినది.[6]
- భారత ప్రభుత్వం చే పద్మశ్రీ పురస్కారం - 2001.[6][7][9]
మూలాలు
[మార్చు]- ↑ "Bonhams". Bonhams. 2014. Archived from the original on 10 జనవరి 2015. Retrieved 9 January 2015.
- ↑ 2.0 2.1 "Mutual Art". Mutual Art. 2014. Retrieved 9 January 2015.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "The Hindu". The Hindu. 9 August 2012. Retrieved 9 January 2015.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 4.7 "Indian Express". Indian Express. 9 September 2012. Archived from the original on 10 జనవరి 2015. Retrieved 9 January 2015.
- ↑ "Padma Awards" (PDF). Padma Awards. 2014. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 11 November 2014.
- ↑ 6.00 6.01 6.02 6.03 6.04 6.05 6.06 6.07 6.08 6.09 6.10 6.11 6.12 6.13 6.14 6.15 "Lyra Technologies" (PDF). Lyra Technologies. 2014. Archived from the original (PDF) on 10 జనవరి 2015. Retrieved 9 January 2015.
- ↑ 7.0 7.1 7.2 7.3 7.4 7.5 "Frontline". Frontline. June 2012. Retrieved 9 January 2015.
- ↑ "BBC". BBC. 2014. Retrieved 9 January 2015.
- ↑ 9.0 9.1 9.2 9.3 9.4 9.5 9.6 9.7 "Akhila Bharata Padmashali Sangam". Akhila Bharata Padmashali Sangam. 2014. Archived from the original on 30 జనవరి 2015. Retrieved 9 January 2015.
- ↑ Siramdasu Venkata Rama Rao. The Paintings of the Author. University of Cincinnati.
ఇతర లింకులు
[మార్చు]- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- పద్మశ్రీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు
- 1936 జననాలు
- కృష్ణా జిల్లా చిత్రకారులు
- ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థులు
- జీవిస్తున్న ప్రజలు
- కృష్ణా జిల్లా ఉపాధ్యాయులు