సి. వి. రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సి. వి. రెడ్డి
జననం
చప్పిడి వెంకటరెడ్డి

(1938-06-02) 1938 జూన్ 2 (వయస్సు 83)
కోనవారిపల్లి, కడప జిల్లా
వృత్తిసినీ దర్శకుడు, నిర్మాత, రచయిత
క్రియాశీల సంవత్సరాలు1938–ప్రస్తుతం

సి. వి. రెడ్డి గా పిలువబడే చప్పిడి వెంకటరెడ్డి ఒక తెలుగు సినిమా దర్శకుడు. 2017 సంవత్సరంలో ఇతడు ఆస్కార్‌ ఇండియా జ్యూరీ ఛైర్మన్‌గా ఎంపికయ్యి వార్తలలో నిలిచాడు.[1]

బాల్యము[మార్చు]

ఇతడి స్వగ్రామం కడప జిల్లా, కొండాపురం మండలం కోనవారిపల్లి. తల్లిదండ్రులు నారాయణమ్మ, లక్ష్మిరెడ్డి. 1938 జులై 1న జన్మించాడు. వీరికి వ్యవసాయమే జీవనాధారం. మెట్ట భూములు. వర్షం కురిస్తేనే పంటలు సాగయ్యేవి. కొర్ర, జొన్న, పత్తి, శనగ, కుసుమ పైర్లు సాగు చేసేవారు. చిన్నప్పటి నుంచి సామాజిక బాధ్యతతో నడుచుకోవాలనేది ఇతడి ఆశయం. బాల్యంలో ఓనమాలు వీరి వూర్లోనే దిద్దాడు. వీరు ఐదుగురు అన్నదమ్ములు. చివరి సంతానం ఇతడే.

విద్యాభ్యాసము[మార్చు]

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏడో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత చిత్తూరు జిల్లా మదనపల్లెలో మూడో ఫాం నుంచి పీయూసీ పూర్తిచేశాడు. ఇతడి సోదరుడు నారాయణరెడ్డికి ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. ఆయన మదనపల్లెలో పనిచేశాడు. దీంతో తల్లిదండ్రులు అక్కడే చదువుకోవాలని చెప్పడంతో మదనపల్లెకి వెళ్లాడు. 20 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఓ రోజు నోట మాట రాలేదు. ఎంతోమంది వైద్యులకు చూపించారు. ఎన్నో ఆలయాల చుట్టూ తిప్పారు. మాటలు మాత్రం రాలేదు. ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు. ఇతడి వైద్యానికి చాలా ఖర్చు చేశారు. భూములను కూడా అమ్మే పరిస్థితి వచ్చింది. దేవుడు చల్లని చూపుతో మళ్లీ మాటలొచ్చాయి. ఆ తర్వాత ఎంఏ పూర్తి చేశాడు. కొన్నాళ్లు ప్రైవేటుగా నాగార్జునసాగర్‌లో పనిచేశాడు. ఆ సమయంలో చిత్రరంగంపై ఆసక్తి పెరిగింది. ఉద్యోగం మానేసి మద్రాసు వైపు అడుగులేశాడు. ఇతడికి పాత తరం కథనాయకుల్లో అక్కినేని నాగేశ్వరరావు అంటే ఎనలేని అభిమానం. ఆయన చిత్రాలంటే భలే ఇష్టం. ఇతడు చిత్రసీమలోకి రావడానికి అది కూడా ఒక కారణంగా పేర్కొన్నాడు.

సినీ రంగ ప్రవేశము[మార్చు]

ఇతడికి తెలుగు, ఆంగ్లం, తమిళం, కన్నడభాషల్లో ప్రావీణ్యం ఉంది. తెలుగుభాషపై పట్టు ఉండటంతో నవల రాయాలని నిర్ణయించుకున్నాడు. 1976లో వసంత, 1982లో స్వర్గానికి వీడ్కోలు పేరుతో రెండు నవలలు రచించాడు. తర్వాత సినిమాలు తీయాలని ముందడుగు వేశాడు. సామాజిక ఇతివృత్తంతో సినిమాలు తెరకెక్కించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఇతడి రచనలకు ప్రముఖుల నుంచి మంచి ప్రశంసలు అందాయి. అవి ఇతడిలో మరింత పట్టుదలను నింపాయి. ఇతడి చిన్నతనంలో చూసిన సంఘటనలు కూడా ఇతదిని కదిలించాయి. దళితులను వూరి వెలుపల ఎందుకు ఉంచుతారనే ప్రశ్న ఇతదిని ఎంతగానో ఆలోచింపజేసింది. ఇది చాలా సున్నితమైన సామాజిక అంశం. తన నవల రచనకు దీన్నే కథా వస్తువుగా చేసుకున్నాడు. ఇదే అంశంతో తొలి చిత్రం బదిలి తెరకెక్కించాడు. తన మొదటి చిత్రానికే నంది అవార్డు వరించింది.

మొదటి చిత్రానికే నంది[మార్చు]

1993లో పెళ్లిగోల చిత్రాన్ని నిర్మించాడు. ఆ తర్వాత 1995లో స్వీయ రచన, దర్శకత్వంలో సొంతంగా బదిలీ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ చిత్రం చూసిన సినీరంగ పెద్దలంతా ఇతడిని మెచ్చుకున్నారు. ఇతని తొలి ప్రయత్నమే ఘనకీర్తిని తెచ్చిపెట్టింది. ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. మొదటి చిత్రానికే నంది పురస్కారం అందుకోవడం తనజీవితంలో ఎప్పటికీ మరచిపోలేని అనుభూతిగా చెబుతాడు.

Aaduthu Paaduthu.jpg

సినీ జాబితా[మార్చు]

నిర్మాతగా[మార్చు]

దర్శకుడిగా[మార్చు]

కథ, / లేదా స్క్రీన్ ప్లే[మార్చు]

పదవులు[మార్చు]

ఇతడు పలు చలన చిత్ర సంఘాలలో పలు పదవులు అలంకరించాడు.

  • చలనచిత్ర వాణిజ్య మండలిలో సంయుక్త కార్యదర్శిగా ఏడాదిపాటు పనిచేశాడు.
  • కార్యదర్శిగా రెండేళ్లు, నిర్మాత మండలి సంఘంలో ఉపాధ్యక్షుడిగా ఆరేళ్లు సేవలందించాడు.
  • ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చిత్రసీమ అభివృద్ధి సంస్థ (ఏపీఎఫ్‌డీసీ) డైరెక్టరుగా 2004- 2006 వరకు విధులు నిర్వహించాడు.
  • భారత చిత్రసీమకు జ్యూరీ సభ్యుడుగా 2011, 2016లో, జాతీయ చలనచిత్రాల పురస్కార ఎంపిక సభ్యుడిగా 2013, 2016లో పనిచేసిన అనుభవం ఉంది.
  • భారత చలనచిత్ర సమాఖ్య నుంచి ఆస్కార్‌ జ్యూరీ సభ్యుడిగా 2012 నుంచి సేవలందిస్తున్నాడు.

మూలాలు[మార్చు]

బయటి లంకెలు[మార్చు]