సీతాదేవి మందిరం (బీహార్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీతాదేవి జన్మభూమి మందిరం
జానకి ధామ్
భూమి నుండి సీతమ్మ అభివ్యక్తిని వర్ణించే చిత్రం
భూమి నుండి సీతమ్మ అభివ్యక్తిని వర్ణించే చిత్రం
భౌగోళికం
ప్రదేశంపునౌర ధామ్, సీతామఢీ, బీహార్
సంస్కృతి
దైవంసీతాదేవి
ముఖ్యమైన పర్వాలుసీతానవమి, శ్రీరామనవమి, దీపావళి, దసరా
వాస్తుశైలి
వాస్తుశిల్పిపియూష్ సోంపురా
దేవాలయాల సంఖ్య1
చరిత్ర, నిర్వహణ

సీతాదేవి జన్మభూమి మందిరం, అనేది మిథిల రాజ్యపు యువరాణి సీతాదేవి జన్మస్థలమైన బీహార్ రాష్ట్రం సీతామఢీ జిల్లా లోని సీతాకుండ్ లో నిర్మించ తలపెట్టారు. జనక మహారాజు వ్యవసాయ పొలాన్ని దున్నుతున్నప్పుడు ఒక పెట్టెలో సీతమ్మ కనిపించిన ప్రదేశంగా పునౌరా ధామ్ పరిగణించబడుతుంది.[1] అందుకని, సీతామఢీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 251 అడుగుల సీతామాత విగ్రహాన్ని నెలకొల్పాలని రామాయణ పరిశోధన మండలి ప్రతిపాదించింది.[2] [3] అయోధ్యలో రామమందిరం తరహాలో సీతామఢీలో జానకి ధామ్‌ను నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేసారు. పునౌరా ధామ్ సమీపంలో 57 ఎకరాల స్థలంలో జానకి ధామ్ పేరుతో ఈ ఆలయ సముదాయం నిర్మించబడుతుంది.[4]

నేపథ్యం

[మార్చు]

ఇక్కడ సీతమ్మకు ప్రస్తుతం ఉన్న ఆలయం సుమారు వంద ఏళ్ల క్రితమే నిర్మించబడింది. మిథిల రాజ్యంలో ఒక ఏడాది అనావృష్టితో ఇబ్బందులు ప్రజలంతా పడుతున్నారట. అప్పుడు పండితుల సూచన మేరకు జనక మహారాజు యాగం చేస్తాడు. ఇందులో భాగంగా ఇంద్రుడిని మెప్పించడానికి స్వయంగా నాగలితో పంట పొలాన్ని ఆయన దున్నుతుంటాడు. ఆ సమయంలో, జనకుడికి ఓ పెట్టెలాంటిది తగులుతుంది. తెరిచిచూస్తే చిన్నారి సీతమ్మ కనిపిస్తుంది. ఇదంతా జరిగిన ఈ ప్రాంతంలో, సీతాదేవి జన్మస్థలం గుర్తుగా ఈ మందిరాన్ని నిర్మించారట. ఏటా సీతమ్మ జయంతి ఇక్కడ ఘనంగా భక్తిప్రపత్తులతో నిర్వహిస్తారు.[5] వైశాఖమాసంలోని శుక్లపక్షం తొమ్మిదో రోజును సీతానవమిగా జరుపుకుంటారు.

నిర్మాణం

[మార్చు]

ఈ ఆలయ నిర్మాణాన్ని పాట్నాకు చెందిన మహావీర్ మందిర్ ట్రస్ట్ చేయనుంది. ఈ ఆలయాన్ని వాస్తుశిల్పి పియూష్ సోంపురా రూపొందించాడు. ప్రతిపాదిత ఆలయ నిర్మాణానికి బీహార్ స్టేట్ రిలిజియస్ ట్రస్ట్ బోర్డు నుండి అనుమతి లభించింది. ప్రతిపాదిత దైవిక ఆలయ నిర్మాణంలో అద్భుతమైన మక్రానా రాయి (Makrana marble)ని ఉపయోగిస్తారు.[6][7] 2023 డిసెంబరు 13న, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సీతామఢీలోని పునౌరధామ్ వద్ద సీతాదేవి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసాడు. పునౌరధామ్ లో భారీ ద్వారం, పరిక్రమ మార్గం, సీతమ్మ వాటిక, లవ్ కుష్ వాటిక, పెవిలియన్, పార్కింగ్ వంటి అనేక సౌకర్యాలు కూడా నిర్మించబడతాయి.[8][9] సీతామఢీలో కొత్త ఆలయ నిర్మాణం కోసం ప్రస్తుత ఆలయం చుట్టూ 50 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత ఆలయం సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్మించబడింది, కాగా కొత్త ప్రధాన ఆలయం అయోధ్య రామమందిరం రేఖలో నిర్మించబడుతుంది.[10]

251 అడుగుల ఎత్తైన సీతమ్మ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనదిగా ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణానికి విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ సహకారం, అదేవిధంగా రామాయణ పరిశోధనా మండలి ఆధ్వర్యంలో ఏర్పడిన'శ్రీభగవతి సీతా తీర్థ క్షేత్ర సమితి ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తుంది.[11][12]

ప్రధాన ఆలయం దిగువ భాగం వృత్తాకారంగా ఉంటుంది. దాని చుట్టూ సీతాదేవికి చెందిన 108 విగ్రహాలు ప్రదర్శించబడతాయి. ఆలయ నిర్మాణం కోసం 51 శక్తిపీఠాల నుండి మట్టి వస్తుంది.[13] శ్రీ సీతారాములతో అనుసంధానం ఉన్న శ్రీలంక, ఇండోనేషియా, బాలి సహా మొత్తం 51 శక్తిపీఠాల నుంచి మట్టి, నీటిని తీసుకువస్తామని రామాయణం పరిశోధన మండలి తెలిపింది. అదేవిధంగా ,

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నల్ఖెడ నుండి బగళాముఖీ దేవి జ్యోతి తీసుకురాబడుతుంది.[14]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Sitamarhi". Bihar Tourism. Archived from the original on 2023-09-27. Retrieved 2024-09-22.
  2. "सीता माता की सबसे ऊंची 251 फीट की प्रतिमा निर्माण को मिली 24.39 एकड़ भूमि की रजिस्ट्री का रास्ता साफ". Dainik Bhaskar.
  3. "Tallest Statue of Mata Sita in Sitamarhi". www.drishtiias.com. Retrieved 2023-03-28.
  4. "अयोध्या में राम मंदिर की तरह अब बिहार के सीतामढ़ी में बनेगा भव्य जानकी धाम, पीएम मोदी कर सकते हैं शिलान्यास". Prabhat Khabar (in హిందీ). 2023-12-27. Retrieved 2023-12-31.
  5. "రామ చక్కని సీతకి... | general". web.archive.org. 2024-09-22. Archived from the original on 2024-09-22. Retrieved 2024-09-22.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "पुनौराधाम में महावीर मंदिर न्यास बनाएगा जानकी जन्म स्थान मंदिर, प्रख्यात वास्तुविद् पीयूष सोमपुरा ने तैयार किया डिजाइन". news4nation.com. Retrieved 2023-03-12.
  7. "पटना में माता जानकी के जन्म स्थान पर होगा मंदिर का निर्माण दो वर्षों में बनकर तैयार होगा मंदिर". ETV Bharat News (in హిందీ). Retrieved 2023-03-12.
  8. "बिहार में क्या बीजेपी राम और जेडीयू सीता के नाम पर लड़ेंगे चुनाव?". BBC News हिंदी (in హిందీ). 2023-12-21. Retrieved 2023-12-22.
  9. "'..मेरे पास मां सीता है', जानकी मंदिर की नींव रखकर नीतीश कुमार ने राजनीति के दूसरे अध्याय की शुरुआत की". ETV Bharat News (in హిందీ). Retrieved 2023-12-22.
  10. "Ram temple fillip: Bihar acquires 50 acres in Sitamarhi for Sita temple". The Indian Express (in ఇంగ్లీష్). 2024-03-19. Retrieved 2024-03-19.
  11. "Sitamarhi News: बिहार में भारत के सबसे ऊंचे मंदिर को बनाने की तैयारी, अयोध्या राम मंदिर के आर्किटेक्ट ने किया दौरा". Navbharat Times (in హిందీ). Retrieved 2024-04-06.
  12. "रामायण रिसर्च काउंसिल: बिहार में 55 एकड़ भूमि चिह्नित; सीतामढ़ी में माता सीता के भव्य मंदिर निर्माण की योजना". Amar Ujala (in హిందీ). Retrieved 2024-04-07.
  13. "Sitamarhi News: बिहार में भारत के सबसे ऊंचे मंदिर को बनाने की तैयारी, अयोध्या राम मंदिर के आर्किटेक्ट ने किया दौरा". Navbharat Times (in హిందీ). Retrieved 2024-04-06.
  14. "रामायण रिसर्च काउंसिल: बिहार में 55 एकड़ भूमि चिह्नित; सीतामढ़ी में माता सीता के भव्य मंदिर निर्माण की योजना". Amar Ujala (in హిందీ). Retrieved 2024-04-07.