Jump to content

సీత (2019 సినిమా)

వికీపీడియా నుండి
సీత
దర్శకత్వంతేజ
స్క్రీన్ ప్లేపరుచూరి గోపాలకృష్ణ
నిర్మాతసుంకర రామబ్రహ్మం
తారాగణంబెల్లంకొండ శ్రీనివాస్, అభినవ్ గోమఠం[1]
ఛాయాగ్రహణంశిరీష రాయ్
కూర్పుకోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతంఅనూప్ రూబెన్స్
నిర్మాణ
సంస్థ
ఎరియల్ స్టూడియోస్
విడుదల తేదీ
24 మే 2019
సినిమా నిడివి
162 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

సీత 2019 మే 24న విడుదలైన తెలుగు చలనచిత్రం. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా నటించారు.[2][3]ఈ సినిమా తమిళం లో " ఇట్స్ మై లైఫ్ “, హిందీ లో “సీత రామ్” గా డబ్ అయినది. ఈ సినిమాలో నాయిక కాజల్ అగర్వాల్ "టైటిల్" కేరక్టర్ "సీత" గా నటించారు.


సీత‌(కాజ‌ల్ అగ‌ర్వాల్) ఓ బిజినెస్ ఉమెన్. త‌న‌కు డ‌బ్బు త‌ప్ప మ‌రేదీ ముఖ్యం కాదు. డ‌బ్బు కోసం ఏదైనా చేయ‌డానికి వెన‌కాడ‌దు. అలాంటి సీతకు వ్యాపారంలో స‌మ‌స్య వ‌స్తే ఎమ్మెల్యే బ‌స‌వ‌రాజు (సోనూ సూద్) ద‌గ్గ‌రికి వ‌స్తుంది. ఆయ‌న సెటిల్మెంట్ చేసినందుకు సీత‌ను త‌న ద‌గ్గ‌ర నెల రోజులు గ‌డ‌ప‌మ‌ని అడుగుతాడు. ఆ త‌ర్వాత సీత మాట త‌ప్పుతుంది. సీత దాని నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటుంది. అదే స‌మ‌యంలో సీత జీవితంలోకి రామ్ (బెల్లంకొండ శ్రీ‌నివాస్) వ‌స్తాడు. సీత ఆస్తికి, రామ్‌కు లింక్ పెట్టి చ‌నిపోతాడు సీత తండ్రి. దాంతో త‌ప్ప‌క రామ్‌‌తో ఉండ‌టానికి ఒప్పుకుంటుంది సీత‌. అప్ప‌ట్నుంచి ఏం జ‌రిగింది. బసవరాజు బారి నుండి సీతను రామ్ కాపాడతాడా లేదా? అనేదే మిగతా సినిమా కథ.[4]


నటీనటులు, సినిమాలోని పాత్ర పేరు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • నిర్మాత: రామబ్రహ్మం సుంకర
  • దర్శకత్వం: తేజ
  • సంగీతం: అనూప్‌ రుబెన్స్‌
  • సినిమాట్రోగఫి: శిరీష రాయ్

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రభూమి, చిత్రభూమి (28 October 2019). "అందరికీ.. అదే చెప్తున్నాం". andhrabhoomi.net. Archived from the original on 29 October 2019. Retrieved 29 October 2019.
  2. "Sita Movie Review: Kajal Aggarwal overacts, Bellamkonda Sai cannot act in pointless film".
  3. "Sita (Seetha) - Telugu Movie Review, Ott, Release Date, Trailer, Budget, Box Office & News - FilmiBeat".
  4. BBC News తెలుగు (26 May 2019). "సీతను విలన్ దగ్గరకు పంపే రఘురాముడి కథ". BBC News తెలుగు. Archived from the original on 31 మే 2021. Retrieved 31 May 2021.