సూరజ్ రందీవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సూరజ్ రందీవ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
హేవా కలుహలముల్లగే సూరజ్ రందీవ్ కలుహలముల్లా
పుట్టిన తేదీ (1985-01-30) 1985 జనవరి 30 (వయసు 39)
మతార, శ్రీలంక
ఎత్తు6 అ. 2 అం. (1.88 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్‌బ్రేక్
పాత్రAll-rounder
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 113)2010 26 July - India తో
చివరి టెస్టు2012 25 November - New Zealand తో
తొలి వన్‌డే (క్యాప్ 139)2009 18 December - India తో
చివరి వన్‌డే2016 24 June - England తో
తొలి T20I (క్యాప్ 35)2010 3 May - Zimbabwe తో
చివరి T20I2011 25 June - England తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2004–2007Sinhalese Sports Club
2005Southern Province
2007Nondescripts Cricket Club
2008–2010Kandurata Kites
2008–Bloomfield Cricket and Athletic Club
2011–Ruhuna Rhinos
2011–2012Chennai Super Kings
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI T20I FC
మ్యాచ్‌లు 12 31 7 127
చేసిన పరుగులు 147 280 8 3,090
బ్యాటింగు సగటు 9.18 17.50 4.00 21.16
100లు/50లు 0/0 0/1 0/0 3/10
అత్యుత్తమ స్కోరు 39 56 6 112
వేసిన బంతులు 3,146 1,437 126 26,331
వికెట్లు 43 36 7 578
బౌలింగు సగటు 37.51 33.72 19.85 26.11
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 1 0 39
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 11
అత్యుత్తమ బౌలింగు 5/82 5/42 3/20 9/62
క్యాచ్‌లు/స్టంపింగులు 1/0 7/0 0/0 87/0
మూలం: Cricinfo, 2017 24 March

సూరజ్ రందీవ్ (జననం 1985, జనవరి 30)[1] శ్రీలంక మాజీ క్రికెటర్. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్‌లను ఆడాడు. సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. సూరజ్ మాతర రాహులా కళాశాలలో చదువుకున్నాడు.[2][3] ప్రస్తుతం బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.[4]

క్రికెట్ రంగం

[మార్చు]

అండర్-15, అండర్-19 స్థాయిలో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించాడు. 2003-04 అండర్-23 టోర్నమెంట్‌లో నాలుగు మ్యాచ్‌లలో 23 వికెట్లు తీసుకున్నాడు. దాంతో మార్వన్ అటపట్టు సహకారంతో సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో చేరాడు. శ్రీలంక ఎ, శ్రీలంక తరపున ఆడాడు.

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

2009, డిసెంబరులో ముత్తయ్య మురళీధరన్ స్థానంలో శ్రీలంక వన్డే జట్టులోకి వచ్చాడు. నాగ్‌పూర్‌లో జరిగిన సిరీస్‌లోని రెండవ మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. 51 పరుగులకు మూడు వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.[5]

గాయపడిన ఏంజెలో మాథ్యూస్‌కు 2011 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌కు ఎంపికయ్యాడు.[6]

5 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత 2016లో ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. అక్కడ 2016 జూన్ 24న రెండో వన్డేలో ఆడాడు.


దేశీయ క్రికెట్

[మార్చు]

2011 ఐపిఎల్ ప్లేయర్ వేలంలో రందీవ్ చెన్నై సూపర్ కింగ్స్ చేత తీసుకోబడ్డాడు. రెండు సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు.[7] 2012లో ఐపిఎల్ 5 ప్రారంభానికి ముందు విడుదలయ్యాడు. 2016లో ఉత్తర ఐర్లాండ్‌లోని కొలెరైన్ క్రికెట్ క్లబ్‌కు వారి నియమించబడిన ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఆడాడు.[8]

ఆస్ట్రేలియాకు వలస వెళ్ళిన తరువాత ఆస్ట్రేలియాలో జిల్లాస్థాయి పోటీలలో ఆడాడు. విక్టోరియా ప్రీమియర్ క్రికెట్‌తో అనుబంధంగా ఉన్న డాండెనాంగ్ క్రికెట్ క్లబ్‌కు ఆడాడు.[9][10] 2020 డిసెంబరులో భారత్‌తో స్వదేశంలో జరిగే టెస్ట్ సిరీస్ (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ)కి ముందు నెట్స్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ల వద్ద బౌలింగ్ చేయడానికి నెట్ బౌలర్‌గా తాత్కాలిక పాత్ర కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఇతన్ని ఆహ్వానించింది.[11]

క్రికెట్ తర్వాత

[మార్చు]

ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఫ్రాన్స్‌కు చెందిన అంతర్జాతీయ ప్రజా రవాణా సంస్థ ట్రాన్స్‌దేవ్‌లో బస్ డ్రైవర్‌గా పినచేస్తున్నాడు.[12]

మూలాలు

[మార్చు]
  1. "ShieldSquare Captcha". validate.perfdrive.com. Retrieved 2020-11-25.[permanent dead link]
  2. End of another battle
  3. "Suraj Randiv". ESPNcricinfo. Retrieved 2020-11-25.
  4. Former cricket players become bus drivers | 9 News Australia (in ఇంగ్లీష్), retrieved 2021-02-28
  5. "India v Sri Lanka in 2009/10". CricketArchive. Retrieved 19 December 2009.
  6. "Vaas, Randiv called up as injury cover for final". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2021-02-28.
  7. "The Hindu : Sport / Cricket : IPL auction 2011 - till lunch". The Hindu. 8 January 2011. Retrieved 9 January 2011.
  8. "NW CRICKET FINAL: Coleraine add new professional". londonderrysentinel.co.uk (in ఇంగ్లీష్). Retrieved 2020-11-25.
  9. "Heraldsun.com.au | Subscribe to the Herald Sun for exclusive stories". heraldsun.com.au. Retrieved 2021-02-28.
  10. "Former Sri Lanka cricketer Suraj Randiv opts bus driving profession in Australia to make ends meet". CricTracker (in ఇంగ్లీష్). 2021-02-28. Retrieved 2021-02-28.
  11. "Lankan national team spinner helps Australian batsmen in nets". Bdcrictime (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-12-26. Retrieved 2021-02-28.
  12. Mittal, Yash (28 February 2021). "Former Sri Lankan Cricketer Suraj Randiv Switches To Bus Driving in Melbourne" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-02-28.

బాహ్య లింకులు

[మార్చు]