సెల్యులైటిస్
సెల్యులైటిస్ | |
---|---|
స్కిన్ సెల్యులైటిస్ | |
ప్రత్యేకత | సంక్రమణ వ్యాధులు |
లక్షణాలు | చర్మం మీద ఎర్రటి ప్రాంతం |
కాల వ్యవధి | 7–10 రోజులు |
కారణాలు | బాక్టీరియా |
ప్రమాద కారకములు | ఊబకాయం, కాలు వాపు, వృద్ధాప్యం |
రోగనిర్ధారణ పద్ధతి | సంకేతాలు, లక్షణాలు, కణ సంవర్ధనం పరీక్ష |
చికిత్స | వ్యాధి సోకిన ప్రాంతాన్ని పైకి ఎత్తడం, మందులు |
ఔషధం | సెఫాలెక్సిన్, అమోక్సిసిలిన్ లేదా క్లోక్సాసిలిన్ వంటి యాంటీబయాటిక్స్ మందులు, ఎరిత్రోమైసిన్ లేదా క్లిండమైసిన్, డాక్సీసైక్లిన్ లేదా ట్రైమెథోప్రిమ్/సల్ఫామెథోక్సాజోల్ |
తరుచుదనము | 21.2 మిలియన్ (2015) |
మరణాలు | 16,900 (2015) |
సెల్యులైటిస్ అనేది చర్మం లోపలి పొరలలో బ్యాక్టీరియా సంక్రమణ. ఇది ప్రత్యేకంగా చర్మమును, చర్మము క్రింద కొవ్వును ప్రభావితం చేస్తుంది. ప్రధానంగా దీని సంకేతాలు లేదా లక్షణాలలో చర్మం మీద ఎర్రటి ప్రాంతం కనబడుతుంది. కొన్ని రోజులలో దీని పరిమాణం పెరిగుతుంది. ఎరుపు ప్రాంతం చుట్టూ సరిహద్దుగా ఏమి ఉండదు. కొంత చర్మం వాపు కావచ్చు. వాపు కూడా పెరుగుతుంది. నొక్కి నప్పుడు ఎరుపు చర్మం తెల్లగా మారుతుంది అయితే ఇది ఎల్లప్పుడూ అలా ఉండదు. సంక్రమణ ప్రాంతం సాధారణంగా నొప్పిగా బాధాకరంగా ఉంటుంది.[1] శోషరస నాళాలు కూడా అప్పుడప్పుడు సంక్రమణ ప్రాంతం లో ప్రభావితమవవచ్చు. ఆ వ్యక్తికి జ్వరం ఉండి అలసటగా అనిపించవచ్చు.[2][3]
లక్షణాలు
[మార్చు]సెల్యులైటిస్ శరీరంలోని ఏ భాగానికైనా సంభవించవచ్చు అయితే కాళ్ళు, ముఖం అత్యంత సాధారణంగా ప్రభావితమవుతాయి. చర్మంలో పగులు ఏర్పడిన తరువాత కాలు సాధారణంగా ప్రభావితమవుతుంది. ఊబకాయం, కాలు వాపు, వృద్ధాప్యం వంటివి ఇతర ప్రమాద కారకాలు. అయితే ముఖం మీద సంక్రమణం విషయంలో, ముందుగానే చర్మం పగలడం సాధారణంగా జరగదు. సాధారణంగా స్ట్రెప్టోకోకి, స్టెఫిలోకాకస్ ఆరియస్ అనే బ్యాక్టీరియా రకాలు ప్రభావం చూపుతాయి. సెల్యులైటిస్ వలె కాకుండా, ఎరిసిపెలాస్ అనే చర్మం ఉపరితల పొరలలో ఏర్పడే ఒక బ్యాక్టీరియా సంక్రమణం. దీనిలో ఎరుపు ప్రాంతం అంచులతో నిర్దుష్టంగా ఉంటుంది, తరచుగా జ్వరం కూడా ఉంటుంది. సంభావ్య సమస్యలలో చీము ఏర్పడటం కూడా ఉండవచ్చు [1]. అపరిశుభ్ర వాతావరణంలో గాయాలు, కోతలు, పుండ్లు ఉన్నవారిలో బ్యాక్టీరియా సులభంగా ప్రవేశిస్తుంది. ఫైలేరియా ఉన్నవారిలో ఇది త్వరగా సోకడం తోపాటు వ్యాప్తిచేందుతుంది. దోమలు లేదా ఇతర పురుగులు కుట్టినచోట ఈ బ్యాక్టీరియా ప్రవేశిస్తే సంక్రమణం జరిగి వ్యాధి ఎక్కువ అవుతుంది. వ్యాధి సోకిన ప్రాంతం వేడిగా ఉంటుంది.[4]
రోగనిర్ధారణ
[మార్చు]రోగనిర్ధారణ సాధారణంగా కనపడుతున్న సంకేతాలు, లక్షణాలపై ఆధారపడి ఉంటుంది, అయితే అరుదుగా కణ సంవర్ధనం పరీక్ష (సెల్ కల్చర్) చేయవలసి ఉంటుంది. రోగనిర్ధారణ చేయడానికి ముందు, అంతర్లీన ఎముక సంక్రమణ లేదా నెక్రోటైజింగ్ ఫాసిటిస్ వంటి మరింత తీవ్రమైన అంటువ్యాధులు కావు అని నిర్ధారణకు రావాలి.[2] వ్యాధి తీవ్రత గుర్తించడానికి రక్త పరీక్షలు చేయాలి. కొంత మందిలో మాంసకృత్తులు తక్కువై వాపు వస్తుంది. ఇది సెలులైటిస్ కాదు. [4]
నివారణ, జాగ్రత్తలు
[మార్చు]- వాపు అని నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభం లోనే వ్యాధిని గురించడం. లేకపోతే వ్యాధి శరీరమంతా వ్యాపించవచ్చు సెప్టిక్ అయే అవకాశం ఉంటుంది.
- దోమలు పురుగులు కుట్టకుండా జాగ్రత్త వహించాలి.
- దురద ఉన్నప్పటికీ గోకగూడదు
- ఫైలేరియా ఉన్నవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.[4]
చికిత్స
[మార్చు]సాధారణ నొప్పినివారణ మందులు, పై పూతలు పనిచేయవు. యాంటీబయోటిక్ మందులు వాడవలసి ఉంటుంది.[4] చికిత్స లో సాధారణంగా నోటి ద్వారా తీసుకునే సెఫాలెక్సిన్, అమోక్సిసిలిన్ లేదా క్లోక్సాసిలిన్ వంటి యాంటీబయాటిక్స్ మందులు ఉపయోగిస్తారు.[1][5] పెన్సిలిన్ అంటే తీవ్రంగా పడకపోయేవారికి (అలెర్జీ) బదులుగా ఎరిత్రోమైసిన్ లేదా క్లిండమైసిన్ సూచించవచ్చు.[5] మెథిసిలిన్-రెసిస్టెంట్ ఎస్. ఆరియస్ (ఎం.ఆర్.ఎస్.ఎ) ఆందోళన కలిగించినప్పుడు, డాక్సీసైక్లిన్ లేదా ట్రైమెథోప్రిమ్/సల్ఫామెథోక్సాజోల్ అదనంగా సిఫారసు చేస్తారు.[1] చీము లేదా ఇంతకుముందు ఉన్న ఎం.ఆర్.ఎస్.ఎ అంటువ్యాధుల ఉనికికి సంబంధించిన ఆందోళన ఉంది[1][3]. నొప్పి నివారణ మందులతో పాటు వ్యాధి సోకిన ప్రాంతాన్ని పైకి ఎత్తడం ఉపయోగకరంగా ఉంటుంది.[2][5]
సంభావ్యత
[మార్చు]7 నుండి 10 రోజుల చికిత్స తర్వాత 95% మంది కోలుకున్నారు.[3] 10 నుంచి 15 రోజులు కూడా పట్టవచ్చు. [4]అయితే, మధుమేహం ఉన్నవారిలో తరచుగా ఈ వ్యాధి చికిత్స ఫలితాలు అనుకూలంగా ఉండవు. [6]. 2015 లో సుమారు 21.2 మిలియన్ల మందిలో సెల్యులైటిస్ సంభవించింది.[7] యునైటెడ్ స్టేట్స్లో సంవత్సరానికి ప్రతి 1,000 మందిలో 2 మందికి దిగువ కాలు ప్రభావితం చేసే కేసులు ఉంటున్నాయి.[1] 2015 లో సెల్యులైటిస్ ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 16,900 మరణాలు సంభవించాయి.[8] యునైటెడ్ కింగ్డమ్ లో, వైద్యశాలలో చేరడానికి 1.6% సెల్యులైటిస్ కారణం[5].
మందులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 Vary, JC; O'Connor, KM (May 2014). "Common Dermatologic Conditions". Medical Clinics of North America. 98 (3): 445–85. doi:10.1016/j.mcna.2014.01.005. PMID 24758956.
- ↑ 2.0 2.1 2.2 Tintinalli, Judith E. (2010). Emergency Medicine: A Comprehensive Study Guide (Emergency Medicine (Tintinalli)) (7th ed.). New York: McGraw-Hill Companies. p. 1016. ISBN 978-0-07-148480-0.
- ↑ 3.0 3.1 3.2 Mistry, RD (Oct 2013). "Skin and soft tissue infections". Pediatric Clinics of North America. 60 (5): 1063–82. doi:10.1016/j.pcl.2013.06.011. PMID 24093896.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 డా. ఎస్. ప్రవీణ్ కుమార్. వాపే కదా అనుకుంటే . .ముప్పే, ఈనాడు. 20 September 2024
- ↑ 5.0 5.1 5.2 5.3 Phoenix, G; Das, S; Joshi, M (Aug 7, 2012). "Diagnosis and management of cellulitis". BMJ. Clinical Research. 345: e4955. doi:10.1136/bmj.e4955. PMID 22872711. S2CID 28902459.
- ↑ Dryden, M (Sep 2015). "Pathophysiology and burden of infection in patients with diabetes mellitus and peripheral vascular disease: focus on skin and soft-tissue infections". Clinical Microbiology and Infection. 21: S27–S32. doi:10.1016/j.cmi.2015.03.024. PMID 26198368.
- ↑ GBD 2015 Disease and Injury Incidence and Prevalence, Collaborators (8 October 2016). "Global, regional, and national incidence, prevalence, and years lived with disability for 310 diseases and injuries, 1990-2015: a systematic analysis for the Global Burden of Disease Study 2015". Lancet. 388 (10053): 1545–1602. doi:10.1016/S0140-6736(16)31678-6. PMC 5055577. PMID 27733282.
{{cite journal}}
:|first1=
has generic name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ GBD 2015 Mortality and Causes of Death, Collaborators (8 October 2016). "Global, regional, and national life expectancy, all-cause mortality, and cause-specific mortality for 249 causes of death, 1980-2015: a systematic analysis for the Global Burden of Disease Study 2015". Lancet. 388 (10053): 1459–1544. doi:10.1016/S0140-6736(16)31012-1. PMC 5388903. PMID 27733281.
{{cite journal}}
:|first1=
has generic name (help)CS1 maint: numeric names: authors list (link)