సోనార్ కెల్లా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
సోనార్ కెల్లా
Sonar kella.jpg
సోనార్ కెల్లా
దర్శకత్వం సత్యజిత్ రే
నిర్మాత సమాచార, పౌర సంబంధాల శాఖ, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం
రచన సత్యజిత్ రే
కథ సత్యజిత్ రే
నటులు కుశల్ చక్రవర్తి,
సౌమిత్రీ ఛటర్జీ,
సిద్ధార్థ ఛటర్జీ
సంగీతం సత్యజిత్ రే
ఛాయాగ్రహణం సౌమేందు రాయ్
విడుదల
1974 (1974)
దేశం భారతదేశం
భాష బెంగాలీ

సోనార్ కెల్లా (బంగారు కోట) 1974లో విడుదలైన బెంగాలీ సినిమా. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన ఈ వర్ణచిత్రానికి సత్యజిత్ రే కథ, మాటలు, స్క్రీన్ ప్లే, సంగీతం సమకూర్చి దర్శకత్వం వహించాడు. 1971లో సత్యజిత్ రే వ్రాసిన నవల "సోనార్ కెల్లా" ఆధారంగా అదే పేరుతో నిర్మించబడిన సినిమా ఇది.

తారాగణం[మార్చు]

  • సౌమిత్ర ఛటర్జీ - ప్రదోష్
  • సిద్ధార్థ ఛటర్జీ
  • మాస్టర్ కుశల్ చక్రవర్తి - ముకుల్ ధర్
  • అజయ్ బెనర్జీ
  • సంతోష్ దత్తా
  • కామూ ముఖర్జీ
  • శైలేన్ ముఖర్జీ - డా.హేమాంగ్ బిజ్రా
  • హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ
  • బిష్ణుపాద రుద్రపాల్
  • హరధన్ బెనర్జీ

సాంకేతిక వర్గం[మార్చు]

  • కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు, సంగీతం, దర్శకత్వం - సత్యజిత్ రే
  • కళ : ఆశా బోస్
  • ఛాయాగ్రహణం: సౌమేందు రాయ్
  • కూర్పు : దులాల్ దత్తా
  • నిర్మాత : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం

చిత్రకథ[మార్చు]

ముకుల్ ధర్ ఆరేళ్ళ కుర్రవాడు. అంత చిన్న వయసులోనే అందంగా బొమ్మలు గీస్తూ, తన తల్లిదండ్రులను మురిపిస్తూ వుండేవాడు. మామూలుగా కోతి, పిల్లి బొమ్మలు గీస్తూ వుంటే అందులో అంతగా ఆశ్చర్యపడడానికేమీ ఉండేది కాదు. పెద్దపెద్ద మైదానాలు, రాజప్రాసాదాలు, ఉద్యానవనాలు, నెమళ్ళు అందంగా చిత్రిస్తూ అంతటితో వూరుకోక ఒక చక్కని కోట బొమ్మ వేసి 'ఇదొక బంగారు కోట. పోయిన జన్మలో నేను అందులోనే ఉన్నాను ' అనే సరికి ముకుల్ తల్లిదండ్రుల మనసుల్లో కలవరం ప్రారంభమైంది. కొన్ని రోజులైతే ఇంకా ఏమంటాడోనని కంగారుపడుతూ డాక్టర్ బిజ్రా అనే సైకియాట్రిస్టు దగ్గరకు తీసుకెళ్ళి, ముకుల్ మనస్తత్వాన్ని పరిశీలించవలసిందిగా చెప్పి అతనికి అప్పగించారు.

డాక్టర్ బిజ్రా, ముకుల్ మాటలను బొమ్మలను ఆధారంగా చేసుకుని అదే వాతావరణం ప్రతిబింబించే జోధ్‌పూర్‌కు తీసుకువెళితే ఫలితం ఉండవచ్చునని ముకుల్‌తో కలిసి ఆ ఊరికి బయలుదేరాడు. ఇంతలో వార్తా పత్రికలలో కలవరాన్ని రేకెత్తించే ఒక వార్త ప్రచురించబడింది. ఆ వార్త ప్రకారం జోధ్‌పూర్‌లో ఒక బంగారు కోట ఉందనీ, ఆ కోట ఉన్న ప్రాంతంలో నిధి నిక్షేపాలు ఉండే అవకాశాలున్నాయనీ అందరూ అనుకోసాగారు.

తమ పిల్లవాడి మనస్తత్వం గురించి అప్పటికే నలుగురూ నాలుగు విధాలుగా అనుకోవడం, డాక్టరుతో ముకుల్ జోధ్‌పూర్ వెళ్ళడం, అక్కడున్నట్లు పిల్లవాడు ఊహించిన బంగారు కోట నిజంగా ఉన్నట్లు పేపర్‌లో వార్తలు రావడం - ఇవన్నీ చూస్తున్న తల్లిదండ్రులు తమ కొడుక్కి ఎటువంటి ప్రమాదం వస్తుందోనని భయపడుతూ ఆ కుర్రవాడి సంరక్షణార్థం ప్రదోష్ అనే ప్రైవేట్ డిటెక్టివ్‌ను జోధ్‌పూర్ పంపించారు.

వాళ్ళు భయపడినట్లే అయ్యింది. డాక్టర్ బిజ్రాను, ముకుల్‌ను అనుసరిస్తూ, అంతకు ముందే ఇద్దరు దొంగలు జోధ్‌పూర్ చేరుకోవడం జరిగింది. సమయం చూసి, దొంగలిద్దరూ ఆ డాక్టర్‌ను ఒక అగాధంలోకి తోసేసి, ముకుల్‌ను తమతో తీసుకు వెళ్తారు. పుర్వజన్మపు వాసనలున్న ఆ కుర్రవాడు బంగారు కోటలో ఉన్న నిధి నిక్షేపాలను గురించి చెబితే, అవి తాము పొందవచ్చని వాళ్ళ ఆశ.

ముకుల్ సంరక్షణార్థం జోధ్‌పూర్ బయలుదేరిన ప్రైవేట్ డిటెక్టివ్ ప్రదోష్‌కు రైలులో ఒక డిటెక్టివ్ కథా రచయితతో పరిచయం ఏర్పడుతుంది. ఇద్దరి ఆసక్తీ ఒకటే కావడంతో ఈ మిస్టరీని కలిసే ఛేదించాలన్న నిర్ణయానికి వస్తారు. జోధ్‌పూర్‌లో వాళ్ళకు అనుకోకుండా, తొందరలోనే ఆ ఇద్దరు దొంగలూ ముకుల్‌తో పాటు తటస్థపడతారు. తామెవ్వరో చెప్పకుండా అప్పటికప్పుడే ఓ ప్లాన్ రూపొందిస్తారు. ఆ దొంగలు వీళ్ళను అనుమానించలేక పోయినా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూనే ఉంటారు. కొన్ని కొన్ని సందర్భాలలో విడిగాను, కలిసీ ఆ నిధినిక్షేపాలను కనిపెట్టడానికి కుర్రవాడితో రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు.

ఆ ఇద్దరు దొంగలలో ఒకడు మామూలు ప్రయత్నాలతో లాభం లేదనుకుని ముకుల్‌ను హిప్నటైజ్ చేసి బంగారు కోటను గురించి అడిగే సరికి జై సల్మేర్ అనే ప్రాంతంలో అవి లభిస్తాయని చెబుతాడు. ప్రైవేట్ డిటెక్టివ్ ప్రదోష్, అతని మిత్రుడూ తమకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముకుల్‌ను అనుసరిస్తూనే వుంటారు.

ఈలోగా అగాధంలోకి తోసివేయబడ్డ డాక్టర్ బిజ్రా చావుతప్పి, కన్నులొట్టబోయిన స్థితిలో కూడా ఆశ చావక ముకుల్‌ను వెదికే ప్రయత్నంలో రైలెక్కుతాడు. ఆ ఇద్దరు దొంగలలో ఒకడు - తను ఎక్కిన కంపార్టుమెంట్లోనే ఉండడం చూస్తాడు. చనిపోయాడనుకున్న డాక్టర్ ఎదురుగా కనబడేసరికి, కంగారుపడిపోయిన ఆ దొంగ వెళుతున్న రైల్లోంచి దూకేస్తాడు.

అప్పటికే జైసల్మేర్ చేరుకున్న ప్రదోష్ తన మిత్రుని సహాయంతో నేర్పుగా దొంగను పట్టుకుని - ముకుల్‌ను ఆ బంగారు కోటలోంచి తప్పించి ఇంటికి తీసుకువస్తాడు[1].

పురస్కారాలు[మార్చు]

సంవత్సరం అవార్డు విభాగము లబ్ధిదారుడు ఫలితం
1974 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ బెంగాలీ సినిమా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం విజేత
1974 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ దర్శకుడు సత్యజిత్ రే విజేత
1974 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ బాలనటుడు కుశల్ చక్రవర్తి విజేత
1974 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ ఛాయాగ్రహణం (వర్ణ) సోమేందు రాయ్ విజేత
1974 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు ఉత్తమ స్క్రీన్ ప్లే సత్యజిత్ రే విజేత

మూలాలు[మార్చు]

  1. సంపాదకుడు (1 October 1975). "సోనార్ కెల్లా". విజయచిత్ర. 10 (4): 14–15. 

బయటి లింకులు[మార్చు]

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
భారత జాతీయ చలనచిత్ర పురస్కారం : ఫీచర్ ఫిల్మ్స్
ఉత్తమ సినిమా | ఉత్తమ నటుడు | ఉత్తమ నటి | ఉత్తమ సహాయ నటుడు | ఉత్తమ సహాయ నటి
ఉత్తమ కళా దర్శకుడు | ఉత్తమ బాల నటుడు | ఉత్తమ ఛాయా గ్రహకుడు | ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ | ఉత్తమ దర్శకుడు | ఉత్తమ స్క్రీన్ ప్లే
ఉత్తమ నృత్య దర్శకుడు | ఉత్తమ గీత రచయిత | ఉత్తమ సంగీత దర్శకుడు | ఉత్తమ నేపథ్య గాయకుడు | ఉత్తమ నేపథ్య గాయని
ఉత్తమ శబ్దగ్రహణం | ఉత్తమ కూర్పు | ఉత్తమ స్పెషల్ అఫెక్ట్స్ | ఉత్తమ బాలల సినిమా | ఉత్తమ కుటుంబ కధా చిత్రం
ప్రత్యేక జ్యూరీ పురస్కారం | ఉత్తమ ఏనిమేషన్ సినిమా
ఉత్తమ అస్సామీ సినిమా | ఉత్తమ బెంగాలీ సినిమా | ఉత్తమ ఆంగ్ల సినిమా | ఉత్తమ హిందీ సినిమా
ఉత్తమ కన్నడ సినిమా | ఉత్తమ మళయాల సినిమా | ఉత్తమ మరాఠీ సినిమా
ఉత్తమ ఒరియా సినిమా | ఉత్తమ పంజాబీ సినిమా | ఉత్తమ కొంకణి సినిమా | ఉత్తమ మణిపురి సినిమా
ఉత్తమ తమిళ సినిమా | ఉత్తమ తెలుగు సినిమా
జాతీయ సినిమా పురస్కారం : విరమించిన పురస్కారాలు
ఉత్తమ ద్వితీయ సినిమా
ఇందిరా గాంధీ జాతీయ ఉత్తమ నూతన దర్శకుడు పురస్కారం
ఇందిరా గాంధీ పురస్కారం
నర్గీస్ దత్ జాతీయ ఉత్తమ సమైక్యత సినిమా పురస్కారం
నర్గీస్ దత్ పురస్కారం
జీవితకాల గుర్తింపు పురస్కారం
దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము
ఉత్తమ సినిమా పుస్తకం
ఉత్తమ సినిమా పుస్తకం