స్టీఫెన్ ఫ్లెమింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్టీఫెన్ ఫ్లెమింగ్
స్టీఫెన్ పాల్ ఫ్లెమింగ్ (2011)
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
స్టీఫెన్ పాల్ ఫ్లెమింగ్
పుట్టిన తేదీ (1973-04-01) 1973 ఏప్రిల్ 1 (వయసు 51)
క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్
ఎత్తు188 cm (6 ft 2 in)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం-స్లో
పాత్రటాప్-ఆర్డర్ బ్యాట్స్‌మన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 188)1994 19 March - India తో
చివరి టెస్టు2008 22 March - England తో
తొలి వన్‌డే (క్యాప్ 88)1994 25 March - India తో
చివరి వన్‌డే2007 24 April - Sri Lanka తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.7
తొలి T20I (క్యాప్ 3)2005 17 February - Australia తో
చివరి T20I2006 26 December - Sri Lanka తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1991/92–1999/2000Canterbury
2000/01–2008/09Wellington
2001Middlesex
2003Yorkshire
2005–2007Nottinghamshire
2008Chennai Super Kings
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 111 280 247 460
చేసిన పరుగులు 7,172 8,037 16,409 14,019
బ్యాటింగు సగటు 40.06 32.40 43.87 35.13
100లు/50లు 9/46 8/49 35/93 22/86
అత్యుత్తమ స్కోరు 274* 134* 274* 139*
వేసిన బంతులు 29 102 35
వికెట్లు 1 0 2
బౌలింగు సగటు 28.00 15.50
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/8 1/3
క్యాచ్‌లు/స్టంపింగులు 171/– 133/– 340/– 225/–
మూలం: Cricinfo, 2017 4 May

స్టీఫెన్ పాల్ ఫ్లెమింగ్ (జననం 1973, ఏప్రిల్ 1) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్, కోచ్. న్యూజీలాండ్ జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్ గా ఉన్నాడు. న్యూజీలాండ్ జాతీయ క్రికెట్ జట్టుకు గొప్ప బ్యాట్స్‌మెన్‌గా పరిగణించబడ్డాడు. ఇతని కెప్టెన్సీలో న్యూజీలాండ్ 2000 ఐసీసీ నాకౌట్ ట్రోఫీని గెలుచుకుంది. ఇతను ఇతర కోచ్‌ల కంటే చెన్నై సూపర్ కింగ్స్‌తో 5 ఐపిఎల్ ట్రోఫీలను గెలుచుకున్నాడు.

క్రికెట్ రంగం[మార్చు]

చురుకైన వ్యూహాత్మక సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందిన ఇతను 111 మ్యాచ్‌లతో అత్యధికంగా ఆడిన న్యూజీలాండ్‌ రెండవ టెస్ట్ క్రికెటర్ గా నిలిచాడు. జట్టుకు ఎక్కువ కాలం సేవలందించిన, అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా ఉన్నాడు.[1][2] జట్టుకు 28 విజయాలకు అందించాడు. భారతదేశం, ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, జింబాబ్వేపై టెస్ట్ సిరీస్‌లను గెలుచుకున్నాడు.

2000 ఐసీసీ నాకౌట్ ట్రోఫీ విజేత కెప్టెన్, ఇది ఇప్పటివరకు వన్డే ఫార్మాట్, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో న్యూజీలాండ్ ఏకైక ఐసీసీ ట్రోఫీ.[3] 2005లో ఆస్ట్రేలియాతో జరిగిన చారిత్రాత్మకమైన మొదటి ట్వంటీ20 ఇంటర్నేషనల్‌లో ఫ్లెమింగ్ న్యూజీలాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు.[4]

2008 మార్చి 26న అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. 2008 ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున US$350,000కి సంతకం చేసిన తర్వాత ఆడాడు, 2009 నుండి జట్టు కోచ్ అయ్యాడు.[5] 2015 ఫిబ్రవరిలో బిగ్ బాష్ లీగ్ మెల్బోర్న్ స్టార్స్ కోచ్‌గా సంతకం చేసాడు.[6] 2018 జనవరి 19న 2018 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన కోచ్‌గా తన బాధ్యతలను స్వీకరించాడు. కొంతకాలం రైజింగ్ పూణె సూపర్‌జెయింట్‌కు కోచ్‌గా ఉన్నాడు.[7] ఎస్ఏ20 లీగ్ కోసం 2022లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌కు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. 2023లో మేజర్ లీగ్ క్రికెట్‌కు టెక్సాస్ సూపర్ కింగ్స్ కోచ్‌గా కూడా ఎంపికయ్యాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు అత్యుత్తమ కోచ్‌లలో ఒకడిగా నిలిచాడు.

మూలాలు[మార్చు]

  1. "Top 10 Most Successful Cricket Captains of All Time". 27 December 2013.
  2. "Fleming to end New Zealand career". BBC Sport. 14 February 2008. Retrieved 13 November 2011.
  3. "Magnificent Cairns steers New Zealand to great triumph". ESPNcricinfo. Retrieved 11 March 2017.
  4. "Ponting leads as Kasprowicz follows". ESPNcricinfo. Retrieved 11 March 2017.
  5. Article regarding New Zealand Cricketers in the IPL auction Cricinfo, retrieved 25 March 2008
  6. "Stephen Fleming named Melbourne Stars coach". 3 News. 25 February 2015. Retrieved 12 March 2015.
  7. "Stephen Fleming appointed as head coach of CSK in 2018 IPL". Deccan Chronicle. 19 January 2018.

బాహ్య లింకులు[మార్చు]