స్టూవర్ట్ బిన్నీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
స్టూవర్ట్ బిన్నీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
స్టూవర్ట్ టెరెన్స్ రోజర్ బిన్నీ
పుట్టిన తేదీ (1984-06-03) 1984 జూన్ 3 (వయసు 39)
బెంగళూరు
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
పాత్రAll-rounder
బంధువులు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 281)2014 జూలై 9 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2015 నవంబరు 14 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 200)2014 జనవరి 28 - న్యూజీలాండ్ తో
చివరి వన్‌డే2015 అక్టోబరు 11 - దక్షిణాఫ్రికా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.84
తొలి T20I (క్యాప్ 50)2015 జూలై 17 - జింబాబ్వే తో
చివరి T20I2016 ఆగస్టు 27 - వెస్టిండీస్ తో
T20Iల్లో చొక్కా సంఖ్య.84
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2003/04–2018/19కర్ణాటక
2007–2009హైదరాబాద్ హీరోస్
2010ముంబై ఇండియన్స్
2011–2015రాజస్థాన్ రాయల్స్ (స్క్వాడ్ నం. 84)
2016–2017రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (స్క్వాడ్ నం. 84)
2017Belagavi Panthers
2018–2019రాజస్థాన్ రాయల్స్ (స్క్వాడ్ నం. 84)
2019/20–2021నాగాలాండ్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 6 14 95 100
చేసిన పరుగులు 194 230 4,796 1,788
బ్యాటింగు సగటు 21.55 28.75 34.25 25.54
100లు/50లు 0/1 0/1 11/22 1/10
అత్యుత్తమ స్కోరు 78 77 189 107
వేసిన బంతులు 450 490 9,394 3,718
వికెట్లు 3 20 148 99
బౌలింగు సగటు 86.00 21.95 32.36 32.31
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 3 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 1 0
అత్యుత్తమ బౌలింగు 2/24 6/4 5/49 6/4
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 3/– 34/– 30/–
మూలం: Cricinfo, 30 August 2021

స్టూవర్ట్ టెరెన్స్ రోజర్ బిన్నీ (జననం 1984 జూన్ 3) భారతీయ మాజీ అంతర్జాతీయ క్రికెటరు. అతను భారత తరఫున వన్డే ఇంటర్నేషనల్స్, ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్, టెస్టులు ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. 2021 ఆగస్టు 30 న బిన్నీ, క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. [1] [2]

2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బిన్నీ 4 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు. ఇది, వన్‌డేల్లో అత్యుత్తమ బౌలింగ్ స్పెల్‌కు సంబంధించి ప్రస్తుత భారతీయ రికార్డు.[3]

ప్రారంభ జీవితం[మార్చు]

బిన్నీ భారత మాజీ టెస్ట్ క్రికెటర్ రోజర్ బిన్నీ కుమారుడు. [4] [5] అతను బెంగళూరులో జన్మించాడు. బెంగుళూరులోని ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూల్‌లో మిడిల్ స్కూల్‌లో చదివాడు. [6] సెయింట్ జోసెఫ్స్ ఇండియన్ హై స్కూల్‌లో ఉన్నత పాఠశాలలో చదివేటపుడు, అక్కడ అతని తండ్రి రోజర్ బిన్నీ ఆ పాఠశాల క్రికెట్ కోచ్‌గా ఉన్నాడు. కోచ్ ఇంతియాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో IACAలో కోచింగ్ కూడా తీసుకున్నాడు. [7]

స్టూవర్ట్ బిన్నీ 2012లో మాయంతి లాంగర్‌ను పెళ్ళి చేసుకున్నాడు.[8][9] ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018 ఎడిషన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు.

దేశీయ వృత్తి[మార్చు]

బిన్నీ 2003/04 సీజన్‌లో కర్ణాటకకు ఆడాఅడం మొదలుపెట్టాడు. కానీ ఫస్ట్-క్లాస్ జట్టులో స్థానాన్ని స్థిరంగా కొనసాగించలేకపోయాడు. తనను పరిమిత-ఓవర్ల స్పెషలిస్ట్‌గా అతను భావిస్తాడు. 2007లో ఇండియన్ క్రికెట్ లీగ్ ప్రారంభమైనప్పుడు, అతను సైన్ అప్ చేసి, టోర్నమెంట్ ప్రీమియర్ ఆల్-రౌండర్‌లలో ఒకరిగా తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు. రెండు సీజన్ల తర్వాత, BCCI క్షమాభిక్ష ప్రతిపాదనను అంగీకరించి, ICL నుండి నిష్క్రమించాడు. [10]

2010 ఐపిఎల్ లో, అతన్ని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది. 2011 ఐపీఎల్ లో బిన్నీని రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది. [11] 2016 ఐపిఎల్ వేలం సమయంలో, అతన్ని 2 కోట్ల ధరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది.

ఆ తర్వాత బిన్నీ దేశీయ పోటీల్లో మంచి ప్రదర్శన చేయడం ప్రారంభించాడు. అతను షిమోగాలో 283 పరుగులు చేసాడు. అతని టోర్నమెంట్ స్కోరు 76.22 సగటుతో 686 పరుగులకు చేరుకుంది, లీగ్ దశలో మూడవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

అతని పరుగులలో ఎక్కువ భాగం జట్టు కష్టాల్లో ఉన్నపుడు చేసినవే. అయినప్పటికీ వాటిని 83.55 స్ట్రైక్ రేట్‌తో సాధించాడు. ఆ సీజన్‌లో ఓ ఆటగాడు చేసిన అత్యధిక సంఖ్యలో సైక్సర్లు - 14 - ఉన్నాయి. ఈ ఏడాది ఒడిశాపై 10 వికెట్లతో సహా 20.73 సగటుతో 15 వికెట్లు తీశాడు. IPLలో పూణే వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బిన్నీ 13 బంతుల్లో 32 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రాయల్స్ 179 పరుగుల లక్ష్యాన్ని ఒక బంతి, ఐదు వికెట్లు మిగిలి ఉండగానే అందుకోవడంలో సహాయపడ్డాడు. తద్వారా జైపూర్‌లో తమ 100% రికార్డును కాపాడుకుంది.

చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బిన్నీ అజేయంగా 41 పరుగులు చేశాడు, చివరలో అతను షేన్ వాట్సన్‌తో జతకట్టి, రాయల్స్‌ను ప్లేఆఫ్స్‌లో చేర్చాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తదుపరి మ్యాచ్‌లో, రాయల్స్‌ స్కోరు 4 వికెట్లకు 28 పరుగులతో కష్టాల్లో ఉన్నపుడు, అతను అజేయంగా 37 పరుగులతో ఇన్నింగ్స్‌ను మలుపు తిప్పాడు.

2019 సెప్టెంబరులో బిన్నీ, 2019-20 రంజీ ట్రోఫీ కోసం కర్ణాటక నుండి నాగాలాండ్ క్రికెట్ జట్టుకు మారాడు. [12] 2020 ఐపిఎల్ వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ అతన్ని విడుదల చేసింది. [13]

అంతర్జాతీయ కెరీర్[మార్చు]

స్టూవర్ట్ బిన్నీ 2014 లో న్యూజిలాండ్‌లో పర్యటించే భారత వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. 2014 జనవరి 28న తన మొదటి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు. అందులో అతను ఒక ఓవర్‌ బౌలింగ్ చేసి, అందులో అతను 8 పరుగులు ఇచ్చాడు. మ్యాచ్‌లో బ్యాటింగ్ చేయలేదు. [14] అతను ఎరైజ్ ఆసియా కప్ 2014 లో కూడా ఆడి, డకౌట్ అయ్యాడు. 2014 జూన్ 17న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బిన్నీ కేవలం నాలుగు పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టి అనిల్ కుంబ్లేను అధిగమించి భారతీయ బౌలర్లలో అత్యుత్తమ బౌలింగ్ స్పెల్‌కు రికార్డు సాధించాడు. అతను బంగ్లాదేశ్‌తో జరిగిన 3వ మ్యాచ్‌లో 25* పరుగులు చేశాడు. వర్షం కారణంగా ఆ మ్యాచ్ రద్దైంది.[15] 2014 ఇంగ్లండ్ పర్యటనలో ఇంగ్లండ్‌తో జరిగిన 1వ టెస్ట్‌లో తన తొలి టెస్టు ఆడుతూ, తొలి ఇన్నింగ్స్‌లో 1 పరుగు, రెండవ ఇన్నింగ్స్‌లో 78 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో జరిగిన 2015 క్రికెట్ ప్రపంచ కప్ కోసం 15 మంది సభ్యుల జట్టులో ఎంపికయ్యాడు. అయితే, టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

ఆ తర్వాత 2015 ఆగస్టులో శ్రీలంకలో జరిగిన 2వ, 3వ టెస్ట్ మ్యాచ్‌లకు బిన్నీ ఎంపికయ్యాడు. మొదటి టెస్ట్‌లో భారతీయులు శ్రీలంక చేతిలో ఓడిపోయిన తర్వాత ఇది ఆశ్చర్యకరమైన ఎంపికగా మారింది. అతను హర్భజన్ సింగ్‌ స్థానంలో వచ్చాడు. 2 ఇన్నింగ్స్‌లలో 3 వికెట్లు తీసుకున్నాడు. బ్యాటింగులో 15, 8 పరుగులు చేశాడు. [16]

బిన్నీ, 2015 జూలై 17న జింబాబ్వేపై భారతదేశం తరపున తన తొలి ట్వంటీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు [17]

మూలాలు[మార్చు]

 1. "Stuart Binny retires from all cricket". ESPNcricinfo. Retrieved 30 August 2021.
 2. "Stuart Binny announces retirement from all cricket". SportsTiger. Retrieved 30 August 2021.
 3. "When Anil Kumble sent a message to Stuart Binny after his record-breaking spell of 6/4 against Bangladesh". Times Now. 26 July 2020. Retrieved 8 August 2020.
 4. "After shedding kilos, Binny adds weight to scorecards – Indian Express". 7 May 2013. Retrieved 1 September 2016.
 5. "Archived copy". Archived from the original on 7 February 2019. Retrieved 28 December 2013.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
 6. "The Frank Anthony Public School – Notable Alumni" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2020-07-19. Retrieved 2020-08-28.
 7. "All Eyes on Stuart Binny". The New Indian Express. Retrieved 2020-08-28.
 8. "Stuart Binny still discovering himself at 29". The Times of India. Archived from the original on 14 September 2013. Retrieved 1 September 2016.
 9. "Meet Mayanti Langer, a woman who knows more about cricket than you". Retrieved 1 September 2016.
 10. Accepted BCCI's amnesty
 11. "Karnataka's Binny signs for రాజస్థాన్ రాయల్స్". www.deccanherald.com. Retrieved 2011-01-17.
 12. "Binny joins Nagaland for Ranji Trophy". Nagaland Post. Archived from the original on 2 సెప్టెంబర్ 2019. Retrieved 2 September 2019. {{cite web}}: Check date values in: |archive-date= (help)
 13. "Where do the eight franchises stand before the 2020 auction?". ESPNcricinfo. Retrieved 15 November 2019.
 14. "ఇండియా squads for New Zealand tour announced". ESPNcricinfo. Archived from the original on 2014-01-01. Retrieved 2013-12-31.
 15. "Stuart Binny breaks Kumble's 21 year old record" (in హిందీ). Patrika Group. Retrieved 18 June 2014.
 16. "Full Scorecard of India vs Sri Lanka 2nd Test 2015 – Score Report | ESPNcricinfo.com" (in ఇంగ్లీష్). ESPNcricinfo.
 17. "ఇండియా tour of Zimbabwe, 1st T20I: Zimbabwe v India at Harare, Jul 17, 2015". ESPNcricinfo. Retrieved 17 July 2015.