హనుమంతు అప్పయ్యదొర
హనుమంతు అప్పయ్యదొర | |||
![]()
| |||
భారతదేశ పార్లమెంటు సభ్యులు
| |||
పదవీ కాలం 1984 – 1989 | |||
ముందు | బొడ్డేపల్లి రాజగోపాలరావు | ||
---|---|---|---|
తరువాత | కణితి విశ్వనాథం | ||
నియోజకవర్గం | శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం | ||
ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2004-2009 | |||
ముందు | కొర్ల రేవతీపతి | ||
తరువాత | కొర్ల భారతి | ||
నియోజకవర్గం | టెక్కలి శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | బెండి, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ | 1935 ఫిబ్రవరి 8||
మరణం | 2014 సెప్టెంబరు 5 విశాఖపట్నం | (వయస్సు 79)||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
నివాసం | శ్రీకాకుళం జిల్లా | ||
పూర్వ విద్యార్థి | ఆంధ్రాయూనివర్సిటీ | ||
మతం | హిందూ మతము |
హనుమంతు అప్పయ్యదొర శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాజకీయనాయకులు.తొలత టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్, చివరగా జై సమైక్యాంధ్ర పార్టీకి సేవలందించారు. రెండు సార్లు ఎంపీ, ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన 1984-89 కాలంలో శ్రీకాకుళం లోక్‌సభకు ఎంపీగా వ్యవహరించారు. అటుపై టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు.[1]
జీవిత విశేషాలు[మార్చు]
ఈయన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని బెండి గ్రామంలో ఫిబ్రవరి 81935 న నారాయణదొర, సన్యాసమ్మ దంపతులకు జన్మించారు.ఆయన ప్రాథమిక విద్య తలగాం లోనూ, హైస్కూల్ విద్య టెక్కలిలోను, విశాఖపట్నం ఎ.వి.ఎన్ కాలేజీలో బి.ఎ. డిగ్రీ తరువాత ఆంధ్రాయూనివర్సిటీలో న్యాయశాస్త్రం పట్టా చదివారు. అనంతరము సోంపేట, టెక్కలిలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసారు.
రాజకీయ జీవితం[మార్చు]
1961 లో బెండి గ్రామానికి సర్పంచ్గా ఎన్నికయ్యారు. 1981 లో బెండి సమితి ప్రసిడెంట్ అయ్యారు . 1985 లో శ్రీకాకుళం పార్లమెంట్ కు తెలుగుదేశం తరుపున ఎన్నికయ్యారు. 1994 లో ఆంధ్రప్రదేశ్ శాసన సభకు ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్ కన్సర్వేటివ్ కమిటీ కార్యదర్శిగా చేసారు.[2] ఆయన 1985-89, 1995-99 కాలాలలో ఎం.పిగా పనిచేసారు. ఆయన శ్రీకాకుళం రాజకీయాలలో తెలుగుదేశం పార్తీలోనూ అంరియు కాంగ్రెస్ లోనూ పనిచేసారు. ఆయన వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ చేరారు కానీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో వచ్చిన విభేదాల వల్ల ఆ పార్టీని వదిలిపెట్టారు.[3]
మరణం[మార్చు]
ఆయన విశాఖ లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సెప్టెంబరు 5 2014 న తుదిశ్వాస విడిచారు.[4]
మూలాలు[మార్చు]
- ↑ "మాజీ ఎంపీ హనుమంతు కన్నుమూత". Archived from the original on 2016-01-03. Retrieved 2015-07-18.
- ↑ "Appayya Dora Hanumanthu". Archived from the original on 2016-09-11. Retrieved 2015-07-18.
- ↑ Former MP Appayya Dora no more
- ↑ ormer MP Appayya Dora no more