బొడ్డేపల్లి రాజగోపాలరావు
బొడ్డేపల్లి రాజగోపాలరావు | |||
| |||
భారతదేశ పార్లమెంటు సభ్యులు
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1952-57, 1957-62, 1962-67 | |||
తరువాత | ఎన్.జి.రంగా | ||
---|---|---|---|
నియోజకవర్గం | శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1971-77, 1977-80, 1980-84 | |||
ముందు | ఎన్.జి.రంగా | ||
తరువాత | హనుమంతు అప్పయ్యదొర | ||
నియోజకవర్గం | శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అక్కులపేట,ఆమదాలవలస మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ | 1923 మార్చి 12||
మరణం | 1992 ఫిబ్రవరి 22 అక్కులపేట,ఆమదాలవలస మండలం, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ | (వయసు 68)||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | సీతమ్మ | ||
సంతానం | ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె | ||
నివాసం | ఆమదాలవలస | ||
మతం | హిందూ మతము | ||
వెబ్‌సైటు | [1] |
బొడ్డేపల్లి రాజగోపాలరావు (1923 - ఫిబ్రవరి 22, 1992 ప్రముఖ రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు. వీరు శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుండి 1952 - 1984 మధ్య కాలంలో ఆరు సార్లు భారత పార్లమెంటుకు ఎన్నికయ్యారు.[1]
జీవిత విశేషాలు
[మార్చు]అతను శ్రీకాకుళం లోక్ సభ నియోజకవర్గం నుండి పార్లమెంటుకు ఆరుసార్లు ప్రాతినిధ్యం వహించాడు. అతను 1923 మార్చి నెలలో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం, అక్కులపేట గ్రామంలో అన్నపూర్ణమ్మ, సీతారామస్వామి దంపతులకు జన్మించాడు. విజయనగరంలోని ఎం.ఆర్ కళాశాలలో విద్యనభ్యసించాడు. కుటుంబానికి పెద్ద కుమారుడు కావటంతో తండ్రి తర్వాత తాళ్లవలస గ్రామ ముససబుగా బాధ్యతలు చేపట్టాడు. తన 29వ యేట 1952లో జరిగిన లోక్‌సభ మొదటి జనరల్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ మహానాయకుడు పి.ఎల్.ఎన్.రాజును ఓడించి సంచలనం సృష్టించాడు. అనంతరం కాంగ్రెస్ లో చేరి 2వ, 3వ, 5వ, 6వ, 7వ లోక్‌సభలకు ఎన్నికయ్యాడు. పార్లమెంటు సభ్యులతో ఆనాడు జరిగిన క్రికెట్ పోటీల్లో అసమాన క్రీడా ప్రతిభను ప్రదర్శించి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దృష్టిని ఆకర్షించాడు.
జిల్లా వ్యవసాయకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతో కృషిచేసాడు. వంశధార ప్రాజెక్టుకు అప్పటి ముఖ్యమంత్రి సంజీవయ్య చేత శంకుస్థాపన చేయించాడు. ఆమదాలవలసలో సుగర్ ఫాక్టరీ, పారిశ్రామికవాడ, శ్రీకాకుళంలో పారిశ్రామికవాడ, పారిశ్రామిక శిక్షణా సంస్థల స్థాపనలో ఆయనకృషి మరువరానిది. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాగా శ్రీకాకుళాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించడంలో కృషి చేసాడు. దీనివలన పరిశ్రమల స్థాపనకు, ఎన్నో రాయితీలు పొందటానికి ఈ జిల్లాకు అవకాశం కలిగింది. జిల్లాలో రాగోలు, చింతాడ, బారువలలో వ్యవసాయ పరిశోధనా సంస్థలు స్థాపనకు ప్రయత్నించి జిల్లా వ్యవసాయకంగా అభివృద్ధి చెందేందుకు తోడ్పడ్డాడు. జిల్లాలో అధిక సంఖ్యాకులైన కళింగులు అభివృద్ధి చెందిననాడు జిల్లా మొత్తం అభివృద్ధి చెందుతుందని భావించి వీరికి రిజర్వేషన్లు కేటగిరీలో చేర్చేందుకు తన వంతు కృషి చేసాడు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పనిచేసి పార్టీ పటిష్ఠతకు తోడ్పడ్డాడు. కేంద్ర సహకార బ్యాంకును అధ్యక్షునిగా, సహకార చక్కెర కర్మాగారాల సమాఖ్య అధ్యక్షునిగా పనిచేసి సహకార రంగ అభివృద్ధికి పాటుపడ్డాడు. తన అద్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన నాటికి క్లాస్ బ్యాంకుగా ఉన్న కేంద్ర సహకార బ్యాంకును ఎ. క్లాస్ బ్యాంకుగా అభివృద్ధి పరచాడు.
గుర్తింపు
[మార్చు]శ్రీకాకుళం జిల్లాలో వంశధార నదిపై నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుకు "బొడ్డేపల్లి రాజగోపాలరావు ప్రాజెక్టు"గా నామకరణం చేశారు.[2]
మరణం
[మార్చు]రాజగోపాలరావు 68 సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 22, 1992 సంవత్సరం విశాఖపట్నంలో పరమపదించారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Members of Parliament". Archived from the original on 2007-08-09. Retrieved 2008-07-28.
- ↑ The Hindu on Vamsadhara Project[permanent dead link]
- ↑ "Obituary in Parliament". Archived from the original on 2007-09-29. Retrieved 2008-07-28.