హర్యాన్వి భాష

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హర్యాన్వి
हरयाणवी
స్థానిక భాషIndia
ప్రాంతంHaryana and Delhi
స్వజాతీయతHaryanvi people
స్థానికంగా మాట్లాడేవారు
9,810,900 (2011)e24
Devanagari
భాషా సంకేతాలు
ISO 639-3bgc
Glottologhary1238
Distribution of Haryanvi speakers

హర్యాన్వి  భాష భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో ,ఢిల్లీలో కొంత వరకు మాట్లాడే ఇండో-ఆర్యన్ భాష . హర్యాన్వి పాశ్చాత్య హిందీ మాండలిక సమూహంలో భాగంగా పరిగణించబడుతుంది, ఇందులో ఖరీబోలి ,బ్రజ్ భాషలు  కూడా ఉన్నాయి. ఇది దేవనాగరి లిపిలో రాయబడింది.[1]

జనాధారణ పొందిన భాష[మార్చు]

దంగల్, సుల్తాన్, తను వెడ్స్ మను: రిటర్న్స్ వంటి బాలీవుడ్ చిత్రాలు హర్యాన్వీ సంస్కృతి భాషను తమ చిత్రాలకు నేపథ్యంగా ఉపయోగించాయి. [2] ఈ సినిమాలు భారతదేశం ,విదేశాలలో మంచి ప్రశంసలను అందుకున్నాయి. [3] [4] ఫలితంగా, మాతృభాషేతరులు కొందరు భాష నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

హర్యాన్వి భాష భారతీయ సినిమా, టీ.వి  ప్రముఖ సంగీత ఆల్బమ్‌లు & విద్యారంగంలో తన ఉనికిని చాటుకుంది. క్రీడలు, బాలీవుడ్, రక్షణ రంగాలలో హర్యానా ప్రభావంతో పారిశ్రామికీకరణ & రాజకీయాలు హర్యాన్వి  భాష ,సంస్కృతి  గణనీయమైన నిష్పత్తిలో కూడా ప్రచారం చేయబడింది.క్రీడారంగంలో ప్రసిద్ధి చెందిన  ఫొగట్ సోదరీమణులు,విజేందర్ సింగ్, సుశీల్ కుమార్, దుష్యంత్ చౌతాలా, రణదీప్ హుడా,  సతీష్ కౌశిక్ వంటి ప్రముఖులు హర్యాన్వీనిమాట్లాడుతారు.[2]

అమర్ ఉపాధ్యాయ్ పోషించిన మోల్కి (2020-ప్రస్తుతం) షోలో వీరేంద్ర ప్రతాప్ సింగ్ పాత్ర హర్యాన్వి భాష మాట్లాడుతుంది.

పాకిస్థాన్ లో[మార్చు]

భారత్ విభజన తరువాత, 1.2 మిలియన్ల హర్యాన్వి మాట్లాడే ముస్లింలు భారతదేశంలోని హర్యానా ఢిల్లీ నుండి పాకిస్తాన్‌కు వలస వచ్చారు. నేడు పాకిస్తాన్‌లో, లక్షలాది మంది మాట్లాడుతున్నారు. ములే జాట్ ,రాంఘర్ ముస్లింలకు ఇది " మాతృభాష ". పంజాబ్, పాకిస్తాన్‌లోని వేలాది గ్రామాలలో సింధ్‌లోని వందలాది గ్రామాలలో , నివసిస్తున్నారు. 1947లో పాకిస్తాన్ స్వాతంత్ర్యం పొందిన తరువాత, చాలా మంది ఉత్తర ప్రదేశ్ రాంఘర్‌లు కూడా పాకిస్తాన్‌లోని సింధ్‌కు వలస వచ్చారు. ఎక్కువగా కరాచీలో స్థిరపడ్డారు.

ప్రధానంగా మాట్లాడే ప్రాంతాలు[మార్చు]

ఈ భాష  ప్రజలు ప్రధానంగా లాహోర్, షేక్‌పురా, భక్కర్, బహవల్‌నగర్, రహీమ్ యార్ ఖాన్, (ముఖ్యంగా ఖాన్‌పూర్ తహసీల్‌లో), ఒకారా, లయ్యా, వెహారి, సాహివాల్, ఫుల్లర్వాన్, సర్గోధా పంజాబ్‌లోని ముల్తాన్ జిల్లాల్లో స్థిరపడ్డారు. వీరిలో చాలా మంది సైన్యం, పోలీసు ,సివిల్ సర్వీసెస్‌లో పనిచేస్తున్నారు.ఈ ప్రాంతాలలోని రాంఘర్‌ ప్రజలు  ఇప్పుడు ద్విభాషలు మాట్లాడుతున్నారు.  ఉర్దూ భాషను జాతీయంగా మాట్లాడుతున్నారు.[3]

మూలాలు[మార్చు]

  1. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 828: Argument map not defined for this variable: LayDate.
  2. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 828: Argument map not defined for this variable: LayDate.
  3. Lua error in మాడ్యూల్:Citation/CS1 at line 828: Argument map not defined for this variable: LayDate.