హృషీకేష్ కనిత్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హృషీకేష్ కనిత్కర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
హృషీకేష్ హేమంత్ కనిత్కర్
పుట్టిన తేదీ (1974-11-14) 1974 నవంబరు 14 (వయసు 49)
పూణే, మహారాష్ట్ర
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి offbreak
పాత్రఆల్ రౌండరు
బంధువులుHemant Kanitkar (father)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 224)1999 డిసెంబరు 26 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు2000 జనవరి 2 - ఆస్ట్రేలియా తో
తొలి వన్‌డే (క్యాప్ 109)1997 డిసెంబరు 7 - శ్రీలంక తో
చివరి వన్‌డే2000 జనవరి 30 - ఆస్ట్రేలియా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.14
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 2 34 146 128
చేసిన పరుగులు 74 339 10,400 3,526
బ్యాటింగు సగటు 18.50 17.84 52.26 35.26
100లు/50లు 0/0 0/1 33/46 6/21
అత్యుత్తమ స్కోరు 45 57 290 133
వేసిన బంతులు 6 1,006 7,753 3,476
వికెట్లు 0 17 74 70
బౌలింగు సగటు 47.23 47.91 39.64
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/22 3/21 4/35
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 14/– 85/– 49/–
మూలం: CricInfo, 2016 ఫిబ్రవరి 20

హృషికేశ్ హేమంత్ కనిత్కర్ (జననం 1974 నవంబరు 14) మాజీ భారత క్రికెటరు.

అతను ఎడమచేతి వాటం బ్యాటరు, కుడిచేతి ఆఫ్‌బ్రేక్ బౌలరు. [1] అతను 2015లో పదవీ విరమణ చేసినప్పుడు, రంజీ ట్రోఫీలో 8000-ప్లస్ పరుగులు చేసిన ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఎలైట్, ప్లేట్ లీగ్ టైటిల్‌లను సాధించిన ఏకైక కెప్టెన్.

దేశీయ కెరీర్[మార్చు]

1994-95 రంజీ ట్రోఫీలో షోలాపూర్‌లోని ఇందిరా గాంధీ స్టేడియంలో సంజయ్ మంజ్రేకర్ నేతృత్వంలోని ముంబై క్రికెట్ జట్టుపై అతను తొలి ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడాడు.

రంజీ ట్రోఫీలో మహారాష్ట్ర క్రికెట్ జట్టు కోసం సమృద్ధిగా పరుగులు చేశాడు. జాతీయ ఎంపిక కోసం పోటీ పడ్డాడు. కొంతకాలం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పటికీ కనిత్కర్, 2006 సీజన్ కోసం ఎసెక్స్‌లోని బ్రెంట్‌వుడ్ క్రికెట్ క్లబ్‌లో చేరాడు. ఈ సీజన్‌లో అతను ఇంగ్లీష్ పరిస్థితులకు అలవాటు పడ్డాడు. సీజన్ మొత్తంలో 76 సగటుతో 1000కు పైగా పరుగులు చేశాడు [2] [3]

కనిత్కర్ సీనియర్ ఆటగాడిగా రాజస్థాన్ రంజీ జట్టుకు ఆడాడు. [4] 2010-11 రంజీ ట్రోఫీ సీజన్‌లో, అతను రంజీ ట్రోఫీలో రాజస్థాన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఫైనల్స్‌లో బరోడాను ఓడించి, వారి తొలి రంజీ ట్రోఫీ విజయానికి నాయకత్వం వహించాడు. [5]


2012 డిసెంబరులో అతను 100 రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడిన 27వ క్రికెటర్ అయ్యాడు. [6] [7] [8]

2015 జూలైలో కనిత్కర్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. [9]

అంతర్జాతీయ కెరీర్[మార్చు]

ఢాకాలో జరిగిన సిల్వర్ జూబ్లీ ఇండిపెండెన్స్ కప్ ఫైనల్‌లో పాక్ క్రికెట్ జట్టుపై మసకబారిన వెలుగులో, విజయాన్ని అందుకోడానికి భారతదేశం 2 బంతుల్లో 3 పరుగులు అవసరమైనప్పుడు కనిత్కర్ ఫోర్ కొట్టి గెలిపించాడు.[1] అతను కొన్ని వన్‌డేలు మాత్రమే ఆడి, ఒక అర్ధ శతకం మాత్రమే చేశాడు. కొచ్చిలో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుతో మ్యాచ్‌లో, అతని మూడవ వన్‌డే ఇన్నింగ్స్‌లో చేసాడు.

అతను 1999/00 లో మెల్‌బోర్న్, సిడ్నీల్లో ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు వ్యతిరేకంగా రెండు టెస్టుల్లో ఆడాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌లో అతను 11, 45 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత జట్టు 180 పరుగుల తేడాతో ఓడిపోయింది. అతని రెండవ టెస్టులో కనిత్కర్, 10, 8 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత జట్టు ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో ఓడిపోయింది. కనిత్కర్ మళ్లీ టెస్టు మ్యాచ్‌లు ఆడలేదు.

కోచింగ్ కెరీర్[మార్చు]

2011లో, కనిత్కర్ కొచ్చి టస్కర్స్ కేరళకు అసిస్టెంట్ కోచ్‌గా నియమితుడయ్యాడు, అయితే IPL సీజన్ ప్రారంభం కాకముందే కాంట్రాక్ట్ నుండి వైదొలిగాడు. యజమానులతో వివాదాలే ఇందుకు కారణం.

ఒక సంవత్సరం కాంట్రాక్ట్‌తో 2015–16 రంజీ ట్రోఫీ సీజన్‌కు గోవా క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా కనిత్కర్ ఎంపికయ్యాడు. [10]

కనిత్కర్ 2016 - 2019 వరకు తమిళనాడు క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. తమిళనాడుకు కోచ్‌గా రాణించి జట్టు అదృష్టాన్ని మలుపు తిప్పిన ఘనత సాధించాడు. [11] లక్ష్మీపతి బాలాజీతో పాటు, పూర్తి సమయం బౌలింగ్ కోచ్‌గా, కనిత్కర్ జట్టులో పెద్ద మార్పు చేసిన ఘనత పొందారు. [12]

ICC మహిళల T20 ప్రపంచ కప్ 2023కి ముందు, హృషికేష్ కనిత్కర్ భారత మహిళల జాతీయ క్రికెట్ జట్టు యొక్క స్టాండ్-ఇన్ చీఫ్ కోచ్‌గా ఎంపికయ్యాడు [13]

వ్యక్తిగత జీవితం[మార్చు]

అతను రెండు టెస్టులు ఆడిన మాజీ భారత వికెట్ కీపరు, హేమంత్ కనిత్కర్ కుమారుడు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Hrishikesh Kanitkar on Cricinfo
  2. Rookies come to the party
  3. Madhya Pradesh welcome back ICL returnees
  4. Ranji Trophy Guest Players Archived 4 నవంబరు 2010 at the Wayback Machine
  5. "Dream comes true for Kanitkar". The Times of India. 2011-01-26. Archived from the original on 2012-11-04. Retrieved 2011-02-20.
  6. Yes, but is he lucky
  7. Kanitkar 'humbled' to be in final again
  8. A triumph to savour for Kanitkar
  9. "Hrishikesh Kanitkar retires from cricket". ESPNcricinfo. 1 July 2015. Retrieved 1 July 2015.
  10. Kanitkar joins Goa as coach
  11. "Hrishikesh Kanitkar: The man behind Tamil Nadu's Ranji Trophy turnaround - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-06-14.
  12. Kumar, C. Santosh (2017-01-01). "Hrishikesh Kanitkar's hand in Tamil Nadu transformation". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 2020-06-14.
  13. https://www.indiatoday.in/amp/sports/cricket/story/richa-ghosh-draws-praise-from-india-stand-in-coach-ahead-of-womens-t20-world-cup-2023-sky-is-the-limit-for-her-2333512-2023-02-11