హైదరాబాదులో ప్రముఖ చర్చీలు
స్వరూపం
(హైరాబాదులో ప్రముఖ చర్చీలు నుండి దారిమార్పు చెందింది)
హైదరాబాదు నగరంలో శతాబ్ధాల చరిత్ర కలిగిన చర్చీలు చాలా ఉన్నాయి.
- సెయింట్ జోసఫ్స్ కేథడ్రల్ చర్చి, హైదరాబాదు: గన్‌ఫౌండ్రి ప్రాంతంలో ఉంది.[1] ఎత్తైన రాతి కొండలాంటి ప్రదేశంలో నిర్మించిన ఈ చర్చి 1875లో క్రిస్మస్ పండుగనాడు ప్రారంభించబడింది.[2]
- సెయింట్ జాన్ చర్చి: ఈస్ట్ మారేడుపల్లిలో ఉంది. సెయింట్ జాన్ ది బాపిస్టు అనే వ్యక్తి పేరుమీద 1813లో నిర్మించిన ఈ చర్చి, సికిందరాబాదు ప్రాంతంలో ఉన్న పురాతన చర్చీల్లో ఒకటిగా పేరొందింది.[3][4]
- ఆల్ సెయింట్స్ చర్చి: సికింద్రాబాదులోని తిరుమలగిరి ప్రాంతంలో ఉంది.[5] 1947లో దక్షిణ భారతదేశపు చర్చీల సమూహంలో చేర్చబడిన ఈ చర్చీ, దక్షిణ భారతదేశంలోని చర్చీలలో ప్రత్యేకమైనది.
- సెయింట్ జార్జి చర్చి: అబీడ్స్ లో ఉంది.[6] 1844లో చర్చి మిషనరీ సొసైటీ వారిచే నిర్మించబడిన ఈ చర్చి, 1947లో దక్షిణ భారతదేశపు చర్చీల సమూహంలో చేర్చబడింది.[7]
- సెయింట్ మేరీస్ చర్చి: సికింద్రాబాద్. ఇది పురాతన రోమన్ కేతలిక్ చర్చి. సికింద్రాబాద్ లోని సెయింట్ అన్నా ఉన్నత పాఠశాల దీనికి అనుసంధానమై ఉంది.
- హోలీ ట్రినిటీ చర్చి: సికింద్రాబాదులోని బొల్లారం ప్రాంతంలో ఉంది. దీనిని 1847లో బ్రిటిష్ సైనిక అధికారుల కోసం నిర్మించారు.[2]
- విజయ మేరి చర్చి: చింతల్‌బస్తీ ప్రాంతంలో ఉంది. ఇది 1905లో స్థాపించబడింది. దీనిని ఆరోగ్యమాత చర్చి అని కూడా పిలుస్తారు.[8]
చిత్రమాలిక
[మార్చు]-
సెయింట్ జోసఫ్స్ కేథడ్రల్ చర్చి
-
సెయింట్ జాన్ చర్చి
-
సెయింట్ జార్జి చర్చి
-
సెయింట్ మేరీస్ చర్చి
-
హోలీ ట్రినిటీ చర్చి
-
విజయ మేరి చర్చి
మూలాలు
[మార్చు]- ↑ సెయింట్ జార్జి చర్చి,ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 43
- ↑ 2.0 2.1 సాక్షి, ఫీచర్స్ (25 December 2014). "క్రిస్టియన్ మిషనరీలు 100 plus". మల్లాది కృష్ణానంద్. Archived from the original on 26 March 2019. Retrieved 28 June 2020.
- ↑ The Hindu (9 February 2013). "St. John's Church turns 200". Retrieved 28 June 2020.
- ↑ సెయింట్ ఆన్ చర్చి,ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 41
- ↑ సెయింట్ జార్జి చర్చి,ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 44
- ↑ Itihas, Volume 11, 1983, p.296.[1]
- ↑ "British Empire: Resources: Articles: Churches of India: a legacy of The Imperial Raj: St George's, Hyderabad". britishempire.co.uk. Archived from the original on 5 జనవరి 2019. Retrieved 28 June 2020.
- ↑ విజయ మేరి చర్చి,ఆదాబ్ హైదరాబాదు, మల్లాది కృష్ణానంద్, 2014, హైదరాబాదు, పుట. 45