1991 గోదావరి పుష్కరాలు
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
పుష్కరాల నిర్వాహక కమిటీ
[మార్చు]- నేదురుమల్లి జనార్థన్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి)
- సంగీత వెంకటరెడ్డి (పశుగణాభివ్రుధ్ది శాఖ మంత్రి)
- పంతం పద్మనాభం (దేవాదాయ శాఖ మంత్రి)
- రణదీప్ సుదాన్ ( తూగో జిల్లా కలెక్టర్, పుష్కర కమిటీ చైర్మన్)
- బాబూరావు (పుష్కరాల ప్రత్యేకాధికారి)
- పి. కృష్ణయ్య ( పుష్కరాల పర్యవేక్షణాధికారి)
- కె.ఎస్.ఆర్. మూర్తి (రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి)
- భరత్ భూషణ్ ( రైల్వే స్పెషలాఫీసర్)
- పి. గోపీనాథ్ రెడ్డి (ఎస్పీ, తూగో జిల్లా)
- ఎ.సి.వై. రెడ్డి (శాసన సభ్యులు, రాజమండ్రి)
- జక్కంపూడి రామ్మోహన్ రావు (శాసన సభ్యులు, కడియం)
- చల్లా అప్పారావు ( మునిసిపల్ చైర్మన్)
- కె. వెంకటరెడ్డి ( మునిసిపల్ కమిషనర్)
- టి.ఎ. త్రిపాఠి ( ఏఎస్పీ, రాజమండ్రి)
1979 పుష్కరాల్లో వచ్చిన స్పందన, ప్రజల్లో వచ్చిన గుర్తింపుని చూసి రెండవసారి అనగా 1991లో కూడా ధార్మిక సేవలు అందించడానికి టి.టి.డి. ముందుకువచ్చింది. మున్సిపల్ ఆఫీసులో జిల్లాస్థాయిలో జరిగిన పుష్కర ఏర్పాట్ల విస్తృతస్థాయి సమావేశానికి టి.టి.డి తరపున డా. రావుల సూర్యనారాయణమూర్తి గారు హాజరయ్యారు. ఈ సమావేశంలో అప్పటి జిల్లా కలెక్టర్ రఫదీస్ సూడాన్, జాయింట్ కలెక్టర్ ఉమామహేశ్వరరావు, రెవెన్యూ కార్యదర్శి కె.ఎస్.ఆర్. మూర్తి, పుష్కరాల ప్రత్యేక అధికారిగా కృష్ణయ్య పాల్గొన్నారు.
సుబ్రహ్మణ్య మైదానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని సమాచార ప్రచారశాఖకు స్టాల్స్ పెట్టుకోవడానికి కేటాయించారు. టి.టి.డి. ధార్మిక సేవలకు వేరే స్థలాన్ని ఇచ్చారు. అయితే పవిత్ర గోదావరిలో స్నానంచేసి, దైవదర్శనం చేసుకొని కొంచెంసేపు ఆధ్యాత్మికంగా కాలక్షేపం చెద్దామనుకుంటున్న భక్తులకు అందుబాటులో ఉన్న స్థలం కావాలని, కాబట్టి సుబ్రహ్మణ్య మైదానాన్ని టి.టి.డి. ధార్మిక సేవలకు ఇవ్వాలని సూర్యనారాయణమూర్తి గట్టిగా పట్టుబట్టడంతో ప్రభుత్వం అంగీకరించింది.
దాంతో గత పుష్కరాల మాదిరిగానే అన్ని ఏర్పాట్లు చేశారు. పుష్కరాలకు వచ్చిన ప్రతి భక్తుడు టి.టి.డి. దేవాలయాన్ని దర్శించకుండా వెళ్లేవారుకాదు. చాలాసేపు ఆ పవిత్ర స్థలంలోనే ఉండి వెళ్లేవారు. స్వామివారి లడ్డులను కూడా విక్రయించారు.