అక్షాంశ రేఖాంశాలు: 32°42′5.0″N 74°55′19.2″E / 32.701389°N 74.922000°E / 32.701389; 74.922000

2018 సుంజువాన్ దాడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2018 సుంజువాన్ దాడి
జమ్మూ నగరంలో సుంజువాన్ స్థానం
ప్రదేశంసుంజువాన్ సైనిక శీబిరం, జమ్మూ, జమ్మూ కాశ్మీరు, భారతదేశం
భౌగోళికాంశాలు32°42′5.0″N 74°55′19.2″E / 32.701389°N 74.922000°E / 32.701389; 74.922000
తేదీ10 ఫిబ్రవరి 2018 (2018-02-10)-
11 ఫిబ్రవరి 2018 (2018-02-11)
మరణాలు10 (6 గురు సైనికులు, ఒక పౌరులు, ముగ్గురు ఉగ్రవాదులు)
ప్రాణాపాయ గాయాలు
11
Assailantsజైష్-ఎ-మహమ్మద్

2018 ఫిబ్రవరి 10 తెల్లవారుజామున, జైష్-ఎ-మహ్మద్ ఉగ్రవాదులు[1] జమ్మూ కాశ్మీరు‌ రాష్ట్రం, జమ్మూలోని సుంజువాన్‌లో ఉన్న భారత సైనిక శిబిరంపై దాడి చేశారు. ఆరుగురు సైనికులు, ముగ్గురు దాడిదారులు, ఒక పౌరుడు ఈ దాడిలో మరణించారు. 14 మంది సైనికులు, ఐదుగురు మహిళలు, పిల్లల సహా 20 మంది గాయపడ్డారు.[2][3][4][5][6][7][8] ముఖ్యంగా, ఈ దాడి 2001 భారత పార్లమెంటు దాడిలో దోషిగా తేలిన అఫ్జల్ గురు [9] వర్ధంతి సందర్భంగా జరిగింది.[10][11][12][13] 2016 ఉరీ దాడి తర్వాత ఈ దాడిని అత్యంత దారుణంగా అభివర్ణించారు.[14][15] భారత సైన్యం దాడికి సూత్రధారిగా అభివర్ణించిన వ్యక్తి, జైషే మహ్మద్ కమాండర్ ముఫ్తీ వకాస్ 5 మార్చి 2018న దక్షిణ కాశ్మీర్‌లోని అవంతిపూర్‌లో జరిగిన ఆర్మీ ఆపరేషన్‌లో మరణించాడు.[16][17][18]

దాడి

[మార్చు]

శనివారం 10 ఫిబ్రవరి 2018 తెల్లవారుజామున, దాదాపు 4:10 am IST సమయంలో, సైనిక సిబ్బందితో పాటు వారి కుటుంబాలు కూడా ఉండే 36వ బ్రిగేడ్ క్యాంపుపై ముగ్గురు సాయుధ ఉగ్రవాదులు దాడి చేశారు. దాడి చేసిన వారి వద్ద AK-47 రైఫిళ్ళు, గ్రెనేడ్లు ఉన్నాయి. వారు ఇళ్ళలోకి ప్రవేశించి కాల్పులు జరపగా, నలుగురు సైనికులు మరణించారు, మహిళలు, పిల్లలతో సహా కనీసం తొమ్మిది మంది గాయపడ్డారు.[19][20][21]

ఉగ్రవాదులను ఆ నివాస సముదాయంలోనే ఒక మూలకు తరిమారు. ప్రత్యేక బలగాలను మోహరించారు. 24 గంటలకు పైగా సాగిన యుద్ధంలో చివరికి ఉగ్రవాదులందరూ హతమయ్యారు.[19] 150 భవనాలతో కూడిన సైనిక శిబిరాన్ని తొలగించారు. తదనంతరం, దాడిలో పాల్గొన్న మిగతా ఉగ్రవాదులను తుదముట్టించడానికి ఫ్లషింగ్ కార్యకలాపాలు జరిగాయి.[20][21]

జమ్మూ కాశ్మీరు లైట్ పదాతిదళంలోని 1వ బెటాలియన్‌లో పనిచేస్తున్న ఐదుగురు సైనికులు ఈ దాడిలో మరణించారు: సుబే. మదన్ లాల్ చౌదరి, సుబే. మహ్మద్ అష్రఫ్ మీర్, హవ్. హబీబుల్లా ఖురాషి, Nk. మంజూర్ అహ్మద్, L/Nk. మహ్మద్ ఇక్బాల్. L/Nk. మహ్మద్ ఇక్బాల్ తండ్రి -సాధారణ పౌరుడు - కూడా మరణించాడు.[11][22] వారిలో నలుగురు కాశ్మీరీ ముస్లింలు.[23] దాడి చేసిన వారిని కరీ ముస్తాక్, మహ్మద్ ఖలీద్ ఖాన్, మహ్మద్ ఆదిల్‌గా గుర్తించారు, వీరంతా పాకిస్తాన్ జాతీయులు.[24][3]

జమ్మూలో నివసిస్తున్న కొందరు అక్రమ రోహింగ్యాలు ఈ ఉగ్రవాదులకు లాజిస్టికల్ సహాయం అందించి ఉండవచ్చని కూడా నివేదికలు ఉన్నాయి.[25]

అనంతర పరిణామాలు

[మార్చు]

జమ్మూ యూనివర్సిటీకి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగింది. దాడి తర్వాత ఈ ప్రాంతంలోని పాఠశాలలను మూసివేసారు. మొత్తం ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు.[26] దాడి అనంతరం జమ్మూకాశ్మీర్‌ శాసనసభలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.[27][28] జమ్మూలో స్థానికులు పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.[29][30]

ఈ దాడిలో నజీర్ అహ్మద్ అనే సైనికుడి భార్యకు - ఆమె గర్భవతి - వీపులో తుపాకీ గుండు దిగబడింది. ఆమెను మిలటరీ ఆసుపత్రికి తరలించగా, వెంటనే ఆమె బిడ్డకు జన్మనిచ్చింది.[31][3][32][4]

భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ గాయపడిన బాధితులను పరామర్శించింది. ఈ దాడికి ఆమె పాకిస్థాన్‌ను నిందించింది. "దుర్మార్గానికి" "పాకిస్తాన్ చెల్లిస్తుంది" అని చెప్పింది. [33] [34] [35] మరుసటి రోజు పాకిస్తాన్ ప్రతిస్పందిస్తూ ఆ ఆరోపణలను తిరస్కరించింది. భారతదేశం "యుద్ధ హిస్టీరియా" సృష్టిస్తోందని ఆరోపించింది.[36] అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ డాన్ కోట్స్ సెనేట్ సెలెక్ట్ కమిటీకి ఇచ్చిన వాంగ్మూలంలో, పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద గ్రూపులు భారతదేశంలో దాడులను ఇంకా కొనసాగిస్తాయని చెప్పాడు. ఆర్థిక, దేశీయ భద్రతా రంగాలలో భారతదేశంతో పోలిస్తే తమ పరిస్థితి "క్షీణిస్తూ ఉండడం" వలన పాకిస్తాన్‌ను అమెరికా లక్ష్యాలకు విరుద్ధంగా నడిపించిందని అతను అన్నాడు.[37]

వివాదాస్పద భారత పార్లమెంటేరియన్ అసదుద్దీన్ ఒవైసీ దాడిలో మరణించిన ఏడుగురిలో ఐదుగురు కాశ్మీరీ ముస్లింలు ఉన్నారనే వాస్తవాన్ని హైలైట్ చేశాడు. సైన్యం చేసిన త్యాగాలకు అతను ‘మత కోణం’ ఇస్తున్నాడంటూ బీజేపీ బదులిచ్చింది.[38] భారతీయ సైన్యం మతానికి అతీతమైనదనీ, "అమరవీరులకు మతాన్ని పులమకూడదనీ" అది చెప్పింది.[39][40][41]

మరణించిన సైనికుల స్వస్థలాలైన అనంతనాగ్‌లోని కేవా గ్రామం, ట్రాల్‌లోని రెషిపోరా, కుప్వారా వంటి వారి చోట్ల వారి మరణాలకు సంతాపం తెలిపేందుకు వేలాది మంది స్థానికులు గుమిగూడారు. గౌరవ వందనం ఇచ్చేందుకు సైనికులు కూడా హాజరయ్యారు.[42]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Kumar, Ashwini (10 February 2018). "Jammu: Security forces kill terrorist in Sunjwan camp, one jawan injured". India Today. Retrieved 13 February 2018.
  2. "Sunjuwan attack: Body of another soldier recovered". The Hindu. 13 February 2018.
  3. 3.0 3.1 3.2 Singh, Vijaita (14 February 2018). "The long, deadly trek to Sunjuwan". The Hindu (in Indian English). Retrieved 15 February 2018.
  4. 4.0 4.1 "Sunjuwan attack: Rajnath Singh hails injured pregnant woman who delivered baby after suffering gunshots". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 13 February 2018. Retrieved 15 February 2018.
  5. "5 Soldiers, Civilian Dead in Jammu Attack, One of the Worst Since Uri: 10 Points". NDTV.com. Retrieved 11 February 2018.
  6. "Jammu army camp attack: 4 militants killed, 5 soldiers martyred as operation continues". India Today (in అమెరికన్ ఇంగ్లీష్). 11 February 2018. Retrieved 11 February 2018.
  7. "Kashmir gunfight enters second day, five soldiers dead". Al Jazeerea. Retrieved 11 February 2018.
  8. "Jammu And Kashmir: Pregnant Lady, Who Was Shot at During Sunjuwan Attack Delivers Baby Girl". India.com (in ఇంగ్లీష్). 11 February 2018. Retrieved 11 February 2018.
  9. "Jammu army camp attack: Security breached despite high alert around 'Afzal Guru day'". Hindustan Times (in ఇంగ్లీష్). 11 February 2018. Retrieved 11 February 2018.
  10. "Jammu terror attack updates: 3 JeM terrorists neutralised at Sunjuwan camp, Mehbooba Mufti meets injured LIVE News, Latest Updates, Live blog, Highlights and Live coverage – Firstpost". firstpost.com. Retrieved 11 February 2018.
  11. 11.0 11.1 "Sunjuwan attack: Five Army soldiers martyred, operation underway". The Times of India. Retrieved 11 February 2018.
  12. "Sunjuwan army camp attack | 4th terrorist neutralised, 5 soldiers killed; operation still underway | Latest News & Updates at Daily News & Analysis". dna (in అమెరికన్ ఇంగ్లీష్). 11 February 2018. Retrieved 11 February 2018.
  13. "6 killed, 11 injured in army camp attack in India-controlled Kashmir – Xinhua | English.news.cn". xinhuanet.com. Archived from the original on 11 February 2018. Retrieved 11 February 2018.
  14. "Encounter at Jammu Army Camp Over, 4 Jaish Terrorists Killed: 10 Updates". NDTV. 12 February 2018. Retrieved 12 February 2018.
  15. "Toll in J-K army camp attack rises; 5 soldiers killed, 1 civilian dead". Rediff. 11 February 2018. Retrieved 12 February 2018.
  16. Team, BS Web (2018-03-06). "Sunjuwan mastermind Mufti Waqas killed in surgical attack: Top developments". Business Standard India. Retrieved 2018-03-07.
  17. "Sunjuwan army camp attack mastermind killed in Kashmir encounter". Hindustan Times (in ఇంగ్లీష్). 2018-03-05. Retrieved 2018-03-07.
  18. "Mufti Waqas, 'powerful motivator', was brain behind 4 fidayeen attacks". Kashmir Reader (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2018-03-06. Retrieved 2018-03-07.[permanent dead link]
  19. 19.0 19.1 Yasir, Sameer (11 February 2018), "Militants Storm Indian Army Base, Killing Soldiers and a Civilian", The New York Times, retrieved 15 February 2018
  20. 20.0 20.1 "Five troops killed in held Kashmir army camp attack as operation enters second day – The Express Tribune". The Express Tribune (in అమెరికన్ ఇంగ్లీష్). 11 February 2018. Retrieved 11 February 2018.
  21. 21.0 21.1 "Indian army chief arrives in occupied Kashmir after as 'militants' attack army camp". geo.tv (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 11 February 2018.
  22. "Jammu attack LIVE UPDATES: Five soldiers, one civilian dead; Army guns down four terrorists". The Indian Express (in అమెరికన్ ఇంగ్లీష్). 11 February 2018. Retrieved 11 February 2018.
  23. "Why silence on death of Muslims in Jammu attack: Owaisi". Greater Kashmir. 13 February 2018. Retrieved 16 February 2018.
  24. "JeM, LeT synchronised recent attacks in J&K; over 300 terrorists ready to enter India, warns Army". Zee News (in ఇంగ్లీష్). 15 February 2018. Retrieved 15 February 2018.
  25. "'Illegal settlement' of Rohingya to be probed by security agencies". The Tribune. Retrieved 9 February 2018.
  26. "Jammu on High Alert, Schools Shut After Army Camp Terror Attack: Updates". NDTV.com. Retrieved 11 February 2018.
  27. "Anti-Pak protests against Jammu terror attack in J-K Assembly". India Today (in అమెరికన్ ఇంగ్లీష్). 10 February 2018. Retrieved 11 February 2018.
  28. "Operation to flush out terrorists from Army base enters 2nd day". Deccan Herald. Retrieved 11 February 2018.
  29. Pathak, Sanjay (12 February 2018). "Thousands bid adieu to braveheart". The Tribune. Archived from the original on 24 ఫిబ్రవరి 2018. Retrieved 23 February 2018.
  30. "Thousands attend funeral of soldiers killed in Jammu attack". News Nation. 14 February 2018. Retrieved 23 February 2018.
  31. "Pregnant woman shot by terrorists in Sunjwan attack saved by Army doctors, gives birth". India Today (in అమెరికన్ ఇంగ్లీష్). 12 February 2018. Retrieved 15 February 2018.
  32. "Sitharaman Meets Sunjuwan's Miracle Baby, Injured Jawans". News18. Retrieved 15 February 2018.
  33. "Nirmala Sitharaman says Pak to pay for Sunjuwan attack: Top 10 developments". Business Standard India. 13 February 2018. Retrieved 15 February 2018.
  34. Jain, Rupam (13 February 2018). "Sunjuwan attack: India says Pakistan 'will pay' for Kashmir 'misadventure'". Live Mint. Retrieved 15 February 2018.
  35. ""Pakistan Picking Soft Targets," Says Senior Army Officer on Sunjuwan Attack". NDTV.com. Retrieved 15 February 2018.
  36. "Sunjwan: Army sets camp ablaze; Pak alleges India creating 'war hysteria'". Business Standard. 12 February 2018. Retrieved 16 February 2018.
  37. "Pak.-backed militants to continue attacks in India", The Hindu, 15 February 2018, retrieved 16 February 2018
  38. "Jammu attack: Asaduddin Owaisi says five of seven killed in Surjuwan Muslim; BJP calls remarks 'shocking'", Firstpost, 13 February 2018, retrieved 16 February 2018
  39. "Asaduddin Owaisi's martyr jibe draws Army fire". The Times of India. Retrieved 15 February 2018.
  40. "Sunjuwan attack: Day after Owaisi's comment on Muslims, Army says it does not communalise martyrs". Scroll.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 15 February 2018.
  41. "We don't communalise troops, says Army". The Hindu (in Indian English). 15 February 2018. Retrieved 15 February 2018.
  42. "Thousands attend funeral of soldiers killed in Jammu attack", Kashmir Reader, 14 February 2018, archived from the original on 16 ఫిబ్రవరి 2018, retrieved 16 February 2018