జమ్మూ కాశ్మీరులో ఉగ్రవాదం
జమ్మూ కాశ్మీరులో ఉగ్రవాదం | |||
---|---|---|---|
the కాశ్మీరు ఘర్షణ లో భాగం | |||
తేదీ | 1989 జూలై 13[1] – present (35 సంవత్సరాలు, 4 నెలలు, 1 వారం , 1 రోజు) | ||
స్థలం | జమ్మూ కాశ్మీరు | ||
స్థితి | కొనసాగుతోంది | ||
పౌర ఘర్షణల్లో పాల్గొన్న పక్షాలు | |||
| |||
ముఖ్య నాయకులు | |||
| |||
Number | |||
| |||
జననష్టం | |||
| |||
20,000+ civilian deaths[29][30] |
జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదం , జమ్మూ కాశ్మీర్‌లో భారత పరిపాలనకు వ్యతిరేకంగా కొనసాగుతున్న వేర్పాటువాద ఉగ్రవాద ఉద్యమం.[14][31] దీన్ని కాశ్మీర్ ఉగ్రవాదం అని కూడా అంటారు. కాశ్మీర్ భౌగోళిక ప్రాంతపు నైరుతి భాగంలో ఈ ఉగ్రవాదం విస్తరించిఉంది. 1947 నుండి భారత పాకిస్తాన్ల మధ్య ఈ ప్రాదేశిక వివాదం ఉంది.[32][33]
జమ్మూ కాశ్మీర్, దీర్ఘకాలంగా వేర్పాటువాద ఆశయాలకు అలంబనగా ఉంది.[34] 1989 నుండి ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది.[35][31] మొదట్లో భారత పాలన, ప్రజాస్వామ్య వైఫల్యం అసంతృప్తికి మూలకారణమైనప్పటికీ, తరువాతి దానిని పూర్తిగా అభివృద్ధి చెందిన సాయుధ తిరుగుబాటుగా మార్చడంలో పాకిస్తాన్ ముఖ్యమైన పాత్ర పోషించింది.[14] కాశ్మీర్ లోని కొన్ని ఉగ్రవాద గ్రూపులు సంపూర్ణ స్వాతంత్ర్యానికి మద్దతు ఇవ్వగా, మరికొన్ని ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్‌లో చేర్చుకోవాలని కోరేవి.
మరింత స్పష్టంగా, ఉగ్రవాద మూలాలు స్థానిక స్వయంప్రతిపత్తిపై వివాదంతో ముడిపడి ఉన్నాయి. 1970 ల చివరి వరకు కాశ్మీర్‌లో ప్రజాస్వామ్య ప్రక్రియ పరిమితంగా ఉండేది. 1988 నాటికి, అప్పటి వరకు భారత ప్రభుత్వం చేసిన అనేక ప్రజాస్వామ్య సంస్కరణలు తిరగబడ్డాయి. అసంతృప్తిని వ్యక్తం చేయడానికి అహింసా మార్గాలను అనుసరించడం ఆపివేసారు. ఇది ఉగ్రవాదులకు మద్దతు నివ్వడంలో నాటకీయ పెరుగుదలకు కారణమైంది.[36] 1987 లో పూర్వపు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జరిగిన వివాదాస్పద ఎన్నికలు [37] ఉగ్రవాదానికి ఉత్ప్రేరకాన్ని అందించాయి. దాని ఫలితంగా కొందరు రాష్ట్ర శాసన సభ సభ్యులు కూడా సాయుధ ఉగ్రవాద గ్రూపులుగా ఏర్పడ్డారు. [38] 1988 జూలైలో భారత ప్రభుత్వంపై వరుస ప్రదర్శనలు, సమ్మెలు, దాడులు జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదానికి నాంది పలికాయి. 1990 లలో ఇది భారతదేశంలో అత్యంత తీవ్రమైన భద్రతా సమస్యగా మారింది.
ముస్లిం మెజారిటీ కాశ్మీరు కోసం భారత్‌తో మూడు ప్రధాన యుద్ధాలు చేసిన పాకిస్థాన్, వేర్పాటువాద ఉద్యమానికి తమ "నైతిక, దౌత్యపరమైన" మద్దతు మాత్రమే ఇస్తున్నట్లు అధికారికంగా పేర్కొంది.[39] పాకిస్తానీ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ జమ్మూ కాశ్మీర్‌లోని " ముజాహిదీన్ " ఉగ్రవాదులకు [40][41] ఆయుధాలను సరఫరా చేయడంతో పాటు శిక్షణను అందించిందని భారతదేశం, అంతర్జాతీయ సమాజం రెండూ ఆరోపించాయి.[42][41][43] 2015 లో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్, 1990 లలో కాశ్మీర్‌లోని ఉగ్రవాదం గ్రూపులకు పాకిస్థాన్ మద్దతిచ్చి శిక్షణనిచ్చిందని ఒప్పుకున్నాడు.[44] ఈ సమయంలో రాడికల్ ఇస్లామిస్ట్ అభిప్రాయాలతో అనేక కొత్త ఉగ్రవాద గ్రూపులు ఉద్భవించి, వేర్పాటువాదం నుండి ఇస్లామిక్ ఛాందసవాదానికి సైద్ధాంతిక ప్రాధాన్యతను మార్చాయి. 1980 లలో సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధం ముగిసిన తర్వాత నియంత్రణ రేఖ మీదుగా పాకిస్తాన్-నియంత్రిత భూభాగం గుండా కాశ్మీర్ లోయలోకి ప్రవేశించడం ప్రారంభించిన పెద్ద సంఖ్యలో ముస్లిం జిహాదీ తీవ్రవాదుల ప్రభావం దీనికి కొంత కారణం.[39] ఈ ప్రాంతంలో "సీమాంతర ఉగ్రవాదాన్ని" అంతం చేయాలని భారత్ పదే పదే పాకిస్తాన్‌కు పిలుపునిచ్చింది.[39]
కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు భారత భద్రతా దళాలకు మధ్య ఘర్షణ పెద్ద సంఖ్యలో ప్రాణనష్టానికి దారితీసింది; వివిధ సాయుధ ఉగ్రవాద గ్రూపులు అనేక మంది పౌరులను కూడా హతమార్చాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2017 మార్చి నాటికి ఉగ్రవాదం కారణంగా 14,000 మంది పౌరులు, 5,000 మంది భద్రతా సిబ్బంది, 22,000 మంది ఉగ్రవాదలతో సహా మొత్తం సుమారు 41,000 మంది మరణించారు. 1990 ల్లో, 2000వ దశకం ప్రారంభంలో చాలా మరణాలు సంభవించాయి.[45] మరణాల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వేతర సంస్థలు పేర్కొన్నాయి. ఉగ్రవాదం కారణంగా మైనారిటీ కాశ్మీరీ హిందువులు కాశ్మీర్ లోయ నుండి పెద్ద ఎత్తున వలస వెళ్ళవలసి వచ్చింది.[46] 2019 ఆగస్టులో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దు చేసినప్పటి నుండి, భారత సైన్యం ఈ ప్రాంతంలో ఉగ్రవాదం నిరోధక చర్యలను ముమ్మరం చేసింది.
చరిత్ర
[మార్చు]1947–1982
[మార్చు]వలస పాలన నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత భారత, పాకిస్తాన్లు జమ్మూ కాశ్మీర్ సంస్థానం విషయమై యుద్ధం చేసుకున్నాయి. యుద్ధం ముగింపులో సంస్థానపు దక్షిణ భాగంపై భారతదేశం నియంత్రణ సాధించింది. అక్కడక్కడా హింస చెలరేగినప్పటికీ, వ్యవస్థీకృతమైన ఉగ్రవాదం ఉద్యమమేమీ జరగలేదు.
ఈ కాలంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు మొదటిసారిగా 1951లో జరిగాయి. అందులో షేక్ అబ్దుల్లా సెక్యులర్ పార్టీ పోటీ లేకుండా గెలిచింది. జమ్మూ కాశ్మీరు భారతదేశంలో విలీనం కావడంలో అతను కీలకమైన పాత్ర పోషించాడు.[47][48]
అయితే, షేక్ అబ్దుల్లా కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగాను కొన్నాళ్ళు దూరంగానూ ఉంటూ ఉండేవాడు. అతని ప్రభుత్వం ఏర్పడడం, తొలగింపు, మళ్ళీ ఏర్పాటు.. ఇలా జరుగుతూ ఉండేది. అది జమ్మూ కాశ్మీర్‌లో రాజకీయ అస్థిరత, అధికారం కోసం పోరాటాలూ జరిగిన కాలం. అనేక సార్లు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన కాలం.
1982–2004
[మార్చు]షేక్ అబ్దుల్లా మరణం తర్వాత, ఆయన కుమారుడు ఫరూక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఫరూఖ్ అబ్దుల్లా, ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం నుండి వైదొలిగగా, అతని బావ అయిన గులామ్ మొహమ్మద్ షా సహాయంతో ఇందిరా గాంధీ అతని ప్రభుత్వాన్ని పడగొట్టింది. 1986 అనంత్‌నాగ్ అల్లర్ల సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న GM షాను తొలగించి అతని స్థానంలో ఫరూక్ అబ్దుల్లాను మళ్ళీ నియమించారు.[50] ఒక సంవత్సరం తర్వాత అబ్దుల్లా, కొత్త ప్రధాని రాజీవ్ గాంధీతో ఒప్పందం కుదుర్చుకుని, 1987 ఎన్నికల కోసం భారత జాతీయ కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకున్నాడు. అబ్దుల్లాకు అనుకూలంగా ఎన్నికలలో రిగ్గింగు జరిగిందని ఆరోపణలు వచ్చాయి.
ఆ ఎన్నికలలో అన్యాయంగా ఓడిపోయిన వారు చేరడంతో సాయుధ ఉద్యమం పెరగడానికి దారితీసిందని చాలా మంది వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. పాకిస్తాన్ ఈ సాయుధ సమూహాలకు రవాణా మద్దతు, ఆయుధాలు, నియామకాలు, శిక్షణను అందించింది.
1989 రెండవ అర్ధభాగంలో భారతీయ గూఢచారులను, రాజకీయ సహకారులనూ లక్ష్యంగా చేసుకుని జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ చేసిన హత్యలు తీవ్రమయ్యాయి. ఆరు నెలలలో వంద మందికి పైగా అధికారులను చంపడంతో, ప్రభుత్వ పరిపాలనా, నిఘా యంత్రాంగం స్తంభించిపోయింది. డిసెంబరులో అప్పటి అంతర్గత వ్యవహారాల మంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్ కుమార్తెను కిడ్నాప్ చేయగా, ఆమె విడుదల కోసం నలుగురు ఉగ్రవాదులను విడుదల చేయాల్సి వచ్చింది. ఈ సంఘటన లోయ అంతటా సామూహిక వేడుకలకు దారితీసింది. జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా జగ్‌మోహన్ మల్హోత్రా నియమితులైన తర్వాత ఫరూక్ అబ్దుల్లా జనవరిలో రాజీనామా చేశాడు. తదనంతరం, రాష్ట్ర రాజ్యాంగంలోని ఆర్టికల్ 92 ప్రకారం రాష్ట్రంలో గవర్నర్ పాలన విధించారు.[51]
JKLF నాయకత్వంలో జనవరి 21-23 తేదీలలో కాశ్మీర్ లోయలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఈ పెను ఉద్రిక్త పరిస్థితికి ప్రతిస్పందనగా సరిహద్దు భద్రతా దళాన్ని, సిఆర్‌పిఎఫ్ లకు చెందిన పారామిలటరీ యూనిట్లనూ మోహరించారు. మావోయిస్ట్ తిరుగుబాటు, ఈశాన్య తిరుగుబాట్లను ఎదుర్కోవడానికి ఈ యూనిట్లను ప్రభుత్వం ఉపయోగిస్తుంది. ఈ పరిస్థితిలో వారికి సవాలు ఎదురైనది, సాయుధ ఉగ్రవాదుల నుండి కాదు, రాళ్ళు విసిరిన వారి నుండి. వారి అనుభవరాహిత్యం కారణంగా గావ్కాడల్ మారణకాండలో కనీసం 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో అండర్ గ్రౌండ్ ఉగ్రవాద ఉద్యమం సామూహిక పోరాటంగా రూపాంతరం చెందింది. పరిస్థితిని అరికట్టడానికి 1990 సెప్టెంబరులో ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు కాశ్మీరులో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (AFSPA) ను విధించారు. శాంతి భద్రతలను నెలకొల్పేందుకు గాను వారెంట్ లేకుండా చంపడానికి, అరెస్టు చేయడానికీ సాయుధ దళాలకు అధికారాలు ఇవ్వబడ్డాయి. ఈ సమయంలో 1994లో వలీ మొహమ్మద్ ఇటూ వంటి ప్రముఖ వ్యక్తులను బహిరంగ సభల్లో చంపడం, బలగాలను చర్యలోకి నెట్టడం వంటివి చేయగా, ఉగ్రవాదులను పట్టుకోకుండా ప్రజలు అడ్డుకునేవారు. కాశ్మీర్‌లో ఇలా సానుభూతిపరులు తలెత్తడం కారణంగా భారత సైన్యం కఠినమైన విధానం అవలంబించడానికి దారితీసింది.[52]
JKLF ముందంజలో ఉండటంతో అల్లా టైగర్స్, పీపుల్స్ లీగ్, హిజ్బ్-ఐ-ఇస్లామియా వంటి ఉగ్రవాద సమూహాలు పెద్ద సంఖ్యలో పుట్టుకొచ్చాయి. పాకిస్థాన్ నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు స్మగ్లింగ్ అయ్యాయి. కాశ్మీర్‌లో అష్ఫాక్ మాజిద్ వానీ, యాసీన్ భట్, హమీద్ షేక్, జావేద్ మీర్ నాయకత్వంలో JKLF పనిచేసింది. కాశ్మీర్‌లో పెరుగుతున్న ఈ పాకిస్థానీ అనుకూల సెంటిమెంటుకు కారణాన్ని భారత మీడియా, పూర్తిగా పాకిస్తాన్‌తో ముడిపెట్టింది.[53]
గుంపులను సమీకరించడానికి, వారి హింసను సమర్థించడానికీ JKLF, ప్రత్యేకమైన ఇస్లామిక్ థీమ్‌లను ఉపయోగించింది. ఖురాన్, సున్నాల ప్రకారం మైనారిటీల హక్కులు పరిరక్షించబడే, ఇస్లామిక్ సోషలిజం సూత్రాలపై ఆర్థిక వ్యవస్థను నిర్వహించే ఇస్లామిక్ ప్రజాస్వామ్య రాజ్యాన్ని స్థాపించడానికి అది ప్రయత్నించింది.[54]
భారత సైన్యం ఉగ్రవాదాన్ని నియంత్రించడానికీ, నిర్మూలించడానికీ భారత సైన్యం, ఆపరేషన్ సర్ప్ వినాష్,[55][56] వంటి వివిధ ఆపరేషన్లను నిర్వహించింది. ఇందులో లష్కరే తోయిబా, హర్కత్-ఉల్-జిహాద్-ఎ-ఇస్లామీ, అల్-బదర్, జైష్-ఎ-మహమ్మద్ వంటి సమూహాలకు చెందిన తీవ్రవాదులకు వ్యతిరేకంగా బహుళ-బెటాలియన్లతో దాడులు చేసింది. ఈ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్‌లోని పీర్ పంజాల్ ప్రాంతంలో చాలా సంవత్సరాలుగా స్థావరాలను నిర్మిస్తున్నారు.[57] ఈ కార్యకలాపాలలో 60 మంది ఉగ్రవాదులు మరణించారు.[58] జమ్మూ కాశ్మీర్‌లో దాదాపు 100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న, ఉగ్రవాదం చరిత్రలోనే అతిపెద్ద, ఉగ్రవాద స్థావరాలను వెలికితీసింది.[59][60]
సాంస్కృతిక మార్పులు
[మార్చు]కొన్ని ఉగ్రవాద గ్రూపులు సినిమా హాళ్ళను నిషేధించాయి.[61][62][63] అల్ బకర్, పీపుల్స్ లీగ్, వహ్దత్-ఇ-ఇస్లాం, అల్లా టైగర్స్ వంటి అనేక ఉగ్రవాద సంస్థలు సిగరెట్లపై నిషేధం, కాశ్మీరీ బాలికలపై ఆంక్షలను విధించాయి.[64]
2004–11
[మార్చు]2004 నుండి పాకిస్తాన్, కాశ్మీర్‌లో ఉగ్రవాదులకు తన మద్దతును ముగించడం ప్రారంభించింది.[65] పాకిస్తాన్ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్‌ను చంపడానికి కాశ్మీర్‌తో సంబంధం ఉన్న తీవ్రవాద గ్రూపులు రెండుసార్లు ప్రయత్నించినందున ఈ చర్య తీసుకున్నారు. అతని వారసుడు అసిఫ్ అలీ జర్దారీ ఈ విధానాన్ని కొనసాగించాడు. అప్పటి వరకు స్వాతంత్ర్య యోధులు అని తాము పిలిచే కాశ్మీర్ ఉగ్రవాదులను ఇపుడు "ఉగ్రవాదులు" అని వర్ణించాడు. అయితే పాకిస్తాన్ గూఢచార సంస్థ, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్, ఉగ్రవాదానికి సహాయం చేసే ఏజెన్సీయా అనేది అస్పష్టంగా ఉంది. కాశ్మీర్‌లో ఉగ్రవాదనికి మద్దతివ్వడానికే పాకిస్తాన్ కట్టుబడి ఉంది. బయటి శక్తుల మద్దతుతో సాగిన అల్లర్లు ప్రాథమికంగా దేశీయంగా నడిచే ఉద్యమంగా మారింది.
ఒకప్పుడు అత్యంత బలీయమైన కాశ్మీర్ ఉగ్రవాద సంస్థ, హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన కమాండర్లు, క్యాడర్‌లను భద్రతా దళాలు ఏరివేస్తున్నందున అది నెమ్మదిగా క్షీణిస్తోంది.[66] భద్రతా దళాలపై గ్రెనేడ్ విసరడం, స్నైపర్ కాల్పులు జరిపిన కొన్ని చిన్న సంఘటనలు ఉన్నప్పటికీ, పరిస్థితి శాంతియుతంగా, భద్రతా దళాల అదుపులోనే ఉంది. 2012 లో అమర్‌నాథ్ యాత్రికులతోపాటు రికార్డు సంఖ్యలో పర్యాటకులు కాశ్మీర్‌ను సందర్శించారు. 2012 ఆగస్టు 3 న ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని ఒక గ్రామంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పౌరులు, భద్రతా దళాలపై వివిధ దాడులకు పాల్పడిన లష్కరే తోయిబా ఉగ్రవాద కమాండర్ అబూ హంజులా హతమయ్యాడు.[67]
2012–ప్రస్తుతం
[మార్చు]రాయిటర్స్ కోట్ చేసిన ఇండియన్ ఆర్మీ డేటా ప్రకారం, 2014 లో కనీసం 70 మంది కాశ్మీరీ యువకులు తిరుగుబాటులో చేరారు. ఎక్కువ మంది 2008 ముంబై దాడులకు కారణమైన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాలో చేరినట్లు సైన్యం రికార్డులు చూపించాయి.[68] కొత్తగా నియమితులైన వారిలో ఇద్దరు డాక్టరేట్లు, ఎనిమిది మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లూ ఉన్నారని ఆర్మీ డేటా చూపించింది.[69] BBC ప్రకారం, 2006 లో పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలపై పాకిస్థాన్ నిషేధం విధించినప్పటికీ, దాని తీవ్రవాదులు భారత ఆధీనంలోని కాశ్మీర్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే భారత, పాకిస్తాన్లను విభజించే నియంత్రణ రేఖ వెంబడి నివసిస్తున్న ప్రజలు ఉగ్రవాదం గ్రూపుల కార్యకలాపాలకు వ్యతిరేకంగా బహిరంగ నిరసనలు చేయడంతో ఈ ప్రయత్నాలు తగ్గిపోయాయి.[70]
2016లో హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వానీని భద్రతా బలగాలు హతమార్చిన నేపథ్యంలో హింస చెలరేగింది. అప్పటి నుంచి జైషే మహ్మద్ గ్రూపునకు చెందిన ఉగ్రవాదులు 2016 ఉరీ దాడి, 2018 సుంజువాన్ దాడికి పాల్పడ్డారు. 2019 ఫిబ్రవరిలో జైషే మహ్మద్ ఆత్మాహుతి ఉగ్రవాది చేసిన పుల్వామా దాడిలో 40 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు మరణించారు.
2019 ఆగస్టులో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదాను భారత ప్రభుత్వం రద్దు చేసింది. దీని తర్వాత భారత సైన్యం తన ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరం చేసింది. 2020 జూన్‌లో దోడా జిల్లాను ఉగ్రవాద రహిత జిల్లాగా ప్రకటించారు. ట్రాల్‌ను హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదుల నుండి విముక్తి చేసినట్లు కూడా ప్రకటించారు.[71][72] జూలైలో, అధికారిక ట్విటర్ హ్యాండిల్ నుండి కాశ్మీర్ పోలీసు శాఖ తమ ట్వీట్‌లో, "ఇప్పుడు శ్రీనగర్ జిల్లానివాసులలో ఉగ్రవాదులెవరూ లేరు" అని పేర్కొంది.[73][74][75] 2021 జూన్ 27 న భారత ప్రధాని, జమ్మూ కాశ్మీర్ రాజకీయ నేతల మధ్య చర్చలు విజయవంతంగా పూర్తయిన ఒక రోజు తర్వాత, IAF నియంత్రణలో ఉన్న జమ్మూ విమానాశ్రయంలోని సాంకేతిక ప్రాంతంలో డ్రోన్ ఆధారిత దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి.[76] 2022 మొదటి మూడు నెలల్లో, 2021 లోని అదే కాలంతో పోలిస్తే కాశ్మీరీ ఉగ్రవాదుల చేతిలో హతమైన భారతీయ సైనికుల సంఖ్య 100% పెరిగింది.[77]
ఉగ్రవాదానికి ప్రేరణలు
[మార్చు]1987 శాసనసభ ఎన్నికల రిగ్గింగ్
[మార్చు]కాశ్మీర్ లోయలో ఇస్లామీకరణ పెరిగిన తరువాత, 1987 లో జరిగిన రాష్ట్ర ఎన్నికల సమయంలో, జమాత్-ఇ-ఇస్లామీ కాశ్మీర్‌తో సహా వివిధ ఇస్లామిక్ వ్యతిరేక స్థాపన గ్రూపులు ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ (MUF) పేరుతో ఒకే పతాకం కింద చేరువయ్యాయి. ప్రస్తుత హురియత్‌లో అధిక భాగం వీరే. MUF ఎన్నికల మ్యానిఫెస్టోలో - సిమ్లా ఒప్పందం ప్రకారం పెండింగులో సమస్యలన్నిటికీ పరిష్కారం, ఇస్లామిక్ ఐక్యత కోసం, కేంద్రం నుండి రాజకీయ జోక్యానికి వ్యతిరేకంగా పనిచేయవలసిన అవసరాన్ని నొక్కిచెప్పారు. శాసనసభలో ఖురాన్ చట్టం కావాలనేది వారి నినాదం.[78] కానీ ఎన్నికల్లో MUF కు 31% ఓట్లు వచ్చినప్పటికీ కేవలం నాలుగు సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే, ఎన్నికల్లో రిగ్గింగు జరిగిందని, రాష్ట్ర రాజకీయాల గమనాన్ని మార్చేశారనీ వారు భావించారు. 1987లో జరిగిన ఈ ఎన్నికలతో ఉగ్రవాదం మొదలైంది.[79]
ISI పాత్ర
[మార్చు]పాకిస్తానీ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఉగ్రవాదానికి మద్దతు నిస్తూ కాశ్మీర్ స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రోత్సాహం, సహాయం అందించింది. కాశ్మీర్‌లో భారత పాలన చట్టబద్ధతపై వివాదం రేపి, భారత దళాలను ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పనిచేసేందుకు వారి దృష్టిని మళ్ళించడం దాని ఉద్దేశం. తద్వారా భారతదేశాన్ని అంతర్జాతీయ ఖండనలకు గురిచెయ్యడం దాని గురి. 2014 అక్టోబరులో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ టీవీ ఇంటర్వ్యూలో ఇలా అన్నాడు, "మాకు (పాకిస్తాన్) సైన్యంతో పాటు (కాశ్మీర్‌లో) వనరులు ఉన్నాయి... కాశ్మీర్‌లో ప్రజలు పోరాడుతున్నారు. మేము వారిని రెచ్చగొడితే చాలు." [80]
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI), 2011 లో అమెరికా కోర్టులో సమర్పించిన తమ మొట్టమొదటి బహిరంగ అంగీకారపత్రంలో, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కాశ్మీర్‌లోని వేర్పాటువాద తీవ్రవాద గ్రూపులను స్పాన్సర్ చేస్తోంది, పర్యవేక్షిస్తోంది అని వెల్లడించింది.[81][82][83][84]
2019 లో పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రజలను జిహాద్ చేయడానికి కాశ్మీర్‌కు వెళ్లవద్దని బహిరంగంగా చెప్పాడు. కాశ్మీర్‌కు వెళ్లిన వారి వలన కాశ్మీరీ ప్రజలకు జరిగేది అన్యాయమే, అని అన్నాడు.[85][86] ఏళ్ల తరబడి సరిహద్దులు దాటి భారత భద్రతా బలగాల చేతికి చిక్కిన పాక్ ఉగ్రవాదుల్లో ఎక్కువ మంది పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందినవారని తేలింది.[86]
ముజాహిదీన్ ప్రభావం
[మార్చు]సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధంలో ముజాహిదీన్ విజయం తర్వాత, ముజాహిదీన్ తీవ్రవాదులు, పాకిస్తాన్ సహాయంతో జరిగిన ఆపరేషన్ టుపాక్‌లో భాగంగా, ఈ ప్రాంతంలో భారతదేశానికి వ్యతిరేకంగా జిహాద్ చేయడానికీ, తీవ్రవాద ఇస్లామిస్ట్ భావజాలాన్ని వ్యాప్తి చేసే లక్ష్యంతోనూ నెమ్మదిగా కాశ్మీర్‌లోకి చొరబడ్డారు.
మతం
[మార్చు]జమ్మూ కాశ్మీర్‌లోని మెజారిటీ ప్రజలు ఇస్లాంను ఆచరిస్తున్నారు. భారతీయ-అమెరికన్ జర్నలిస్ట్ అస్రా నోమాని భారతదేశం లౌకిక రాజ్యమైనప్పటికీ, మొత్తం భారతదేశంలోని హిందువులతో పోల్చినప్పుడు ముస్లింలు రాజకీయంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా అట్టడుగున ఉన్నారని చెప్పింది. కాశ్మీర్ డివిజన్‌లోని అమర్‌నాథ్ ఆలయానికి సమీపంలో ఉన్న 99 ఎకరాల అటవీ భూమిని హిందూ సంస్థకు (హిందూ యాత్రికుల కోసం తాత్కాలిక ఆశ్రయాలు, సౌకర్యాల ఏర్పాటు కోసం) బదిలీ చేయాలనే ప్రభుత్వ నిర్ణయం ఈ భావాన్ని బలోపేతం చేసింది. జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన అతిపెద్ద నిరసన ర్యాలీలలో ఒకటి ఈ సందర్భంగా జరిగింది.[87]
రాళ్లు విసరడం
[మార్చు]2008 నిరసనలు, 2010 అశాంతి రోజుల నుండి, ప్రజలు, ముఖ్యంగా కాశ్మీర్ లోయలోని యువకులు తమ దూకుడును వ్యక్తం చేయడానికీ, స్వేచ్ఛను కోల్పోయినందుకు నిరసనగానూ భద్రతా దళాలపై రాళ్లు రువ్వడం మొదలుపెట్టడంతో ఈ కల్లోలం కొత్త కోణాన్ని సంతరించుకుంది. దీనికి ప్రతిగా సాయుధ సిబ్బంది గుళికలు, రబ్బరు బుల్లెట్లు, స్లింగ్ షాట్లు, టియర్ గ్యాస్ షెల్స్‌తో ఎదుర్కొన్నారు. ఇది చాలా మందికి కంటి-గాయాలు, అనేక ఇతర రకాల గాయాలకు దారితీసింది. భద్రతా దళాలు కూడా గాయాల పాలయ్యారు. కొన్నిసార్లు ఈ సంఘటనల సమయంలో వారిని పౌరులు కొట్టేవారు. వహీదా ఖాన్ ప్రకారం, 'రాళ్లతో కొట్టేవారిలో' ఎక్కువ మంది పాఠశాల, కళాశాలలకు వెళ్ళే విద్యార్థులే. ఈ సంఘటనల సమయంలో రాళ్లదాడికి పాల్పడినందుకు వీరిలో పెద్ద సంఖ్యలో అరెస్టయ్యేవారు. రాజకీయ కార్యకర్త మన్నన్ బుఖారీ ప్రకారం, కాశ్మీరీలు రాయిని, సులభంగా చేరుకోగల రక్షణ లేని ఆయుధంగా తయారు చేశారు, నిరసన కోసం వారి ఎంపిక ఆయుధం.[88][89]
కాశ్మీరీ సీనియర్ జర్నలిస్ట్ పర్వైజ్ బుఖారీ ఇలా వ్యాఖ్యానించారు:[89][90]
ప్రపంచంలోనే అత్యంత సైనికీకరించబడిన ప్రాంతమైన కాశ్మీర్‌లో, 2010 వేసవిలో, మొన్నెన్నడూ ఎరగని, ఘోరమైన పౌర అశాంతి చెలరేగింది. క్షేత్ర స్థాయిలో కొన్ని అంశాలు మాఎపుకు లోనవడం మొదలైంది. [...] అంతగా తెలియని, సాపేక్షంగా అనామకులైన ప్రతిఘటనకారులు ఉద్భవించి, రెండు దశాబ్దాల క్రితం భారత పాలనకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ ఉగ్రవాదం కంటే భీకరమైన నిరాయుధ ఆందోళనలు మొదలుపెట్టారు. 9/11 తర్వాతి ప్రపంచం గురించి అవగాహన ఉన్న కాశ్మీరీ యువత, ప్రభుత్వ సాయుధ దళాలకు వ్యతిరేకంగా రాళ్లు, పెళ్ళలను ఆయుధాలుగా చేసుకున్నారు. పాకిస్తాన్‌తో ముడిపడి ఉన్న ఉగ్రవాద ఉద్యమం అనే ట్యాగ్‌ను పక్కకు నెట్టారు.
మానవ హక్కుల ఉల్లంఘన
[మార్చు]ఇస్లామిక్ వేర్పాటువాద తీవ్రవాదులు కాశ్మీర్ ప్రజలపై హింసకు పాల్పడ్డారు.[91] [92] [93] మరోవైపు, భారత సైన్యం పెల్లెట్ గన్‌లను ఉపయోగించడం, వంటి నేరాలకు పాల్పడడంతో దానిపై అనేక కోర్టు కేసులు జరిగాయి. ఉగ్రవాదలు చాలా మంది సివిల్ సర్వెంట్లను, అనుమానిత ఇన్ఫార్మర్లను కిడ్నాప్ చేసి చంపారు. ఉగ్రవాదుల నిరంతర హింస ఫలితంగా పదివేల మంది కాశ్మీరీ పండిట్లు వలస వెళ్లవలసి వచ్చింది. వలస వెళ్ళిన పండిట్ల మొత్తం సంఖ్యపై అంచనాలు 1,70,000 నుండి 7,00,000 వరకు ఉంటాయి. ఇస్లామిక్ రాడికల్ సంస్థల లక్షిత దాడుల కారణంగా వేలాది మంది కాశ్మీరీ పండిట్లు జమ్మూకి వెళ్ళిపోవలసి వచ్చింది.[94]
ముఖ్యమైన సంఘటనలు
[మార్చు]- కాశ్మీరీ హిందువుల వలసలు
- 1989 జూలై, ఆగస్టు -ముగ్గురు సిఆర్పిఎఫ్ సిబ్బంది, రాజకీయనాయకుడు, NC/F కి చెందిన యూసుఫ్ హల్వాయ్ మొహమ్మద్ హతులయ్యారు.[95]
- 1989లో అప్పటి భారత హోంమంత్రి ముఫ్తీ సయీద్ కుమార్తె రుబియా సయీద్ను కిడ్నాప్ చేశారు.
- గావ్కదల్ ఊచకోత-సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కాశ్మీరీ ఉగ్రవాదుల బృందంపై కాల్పులు జరిపి 50 మందిని హతమార్చింది.[96]
- సోపోర్ ఊచకోత- సరిహద్దు భద్రతా దళం 55 మంది కాశ్మీరీ పౌరులను హతమార్చింది
- బిజ్బెహరా ఊచకోత-51 మంది ఉగ్రవాదులను బిఎస్ఎఫ్ ఊచకోతకు గురిచేసింది.
- 1995 జమ్మూ కాశ్మీర్లో పాశ్చాత్య పర్యాటకుల అపహరణ-అనంతనాగ్ జిల్లాకు చెందిన ఆరుగురు విదేశీ పర్వతారోహకులను అల్ ఫరాన్ అపహరించింది. ఒకరి తలను నరికివేశారు, ఒకరు తప్పించుకున్నారు, మిగిలిన నలుగురు తప్పిపోయారు, బహుశా వాళ్లను కూడా ఉగ్రవాదుక్లు చంపేసి ఉంటారు.
- 1997 సంగ్రంపోరా ఊచకోత-1997 మార్చి 22 న బుద్గాం జిల్లాలోని సంగ్రంపోరా గ్రామంలో ఏడుగురు కాశ్మీరీ పండితులను చంపేసారు.[97]
- వంధమా ఊచకోత-1998 జనవరిలో వాంధమా గ్రామంలో నివసిస్తున్న 24 మంది కాశ్మీరీ పండితులను పాకిస్తాన్ ఉగ్రవాదులు ఊచకోత కోశారు. ప్రాణాలతో బయటపడిన వారిలో ఒకరి వాంగ్మూలం ప్రకారం, ఉగ్రవాదులు భారత సైసిక అధికారుల వలె దుస్తులు ధరించి, వారి ఇళ్లలోకి ప్రవేశించి, ఆపై విచ్చలవిడీగా కాల్పులు ప్రారంభించారు. మాజీ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత పర్యటన జరిగిన సమయంలో ఈ సంఘటన జరగడంతో దానికి ప్రాముఖ్యత ఏర్పడింది. కాశ్మీర్లో పాకిస్తాన్ మద్దతుగల ఉగ్రవాదాన్ని నిరూపించడానికి న్యూ ఢిల్లీ ఈ ఊచకోతను హైలైట్ చేసింది.[98]
- 1998 ప్రాంకొటే ఊచకోత-ఉధంపూర్ జిల్లాకు చెందిన 26 మంది హిందూ గ్రామస్తులను ఉగ్రవాదులు చంపారు.
- 1998 చంపానారి ఊచకోత-1998 జూన్ 19న ఇస్లామిక్ ఉగ్రవాదులు 25 మంది హిందూ గ్రామస్తులను హతమార్చారు.
- 2000-అమర్నాథ్ యాత్రికుల ఊచకోత-30 మంది హిందూ యాత్రికులను ఉగ్రవాదులు ఊచకోత కోశారు.
- చిత్తిసింహ్పురా ఊచకోత-భారత భద్రతా దళాలపై కొన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ ఎల్ఈటీ ఉగ్రవాదులు 36 మంది సిక్కులను ఊచకోత కోశారు.
- 2001 జమ్మూ కాశ్మీర్ శాసనసభ బాంబు దాడి-2001 అక్టోబరు 1న శ్రీనగర్ శాసనసభలో జరిగిన బాంబు దాడిలో 38 మంది మరణించారు.[99]
- 2002 రఘునాథ్ ఆలయ దాడులు-మొదటి దాడి 2002 మార్చి 30న జరిగింది, ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు ఆలయంపై దాడి చేశారు. ముగ్గురు భద్రతా సిబ్బంది సహా పదకొండు మంది మరణించారు, 20 మంది గాయపడ్డారు. రెండవ దాడిలో, 2002 నవంబర్ 24న ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు ఆలయంపై దాడి చేసి పద్నాలుగు మంది భక్తులను చంపి, మరో 45 మందిని గాయపరిచారు.
- 2002 ఖాసిం నగర్ ఊచకోత-2002 జూలై 13న లష్కరే తోయిబాకు చెందిన సాయుధ ఉగ్రవాదులు శ్రీనగర్ ఖాసిం నగర్ మార్కెట్ వద్ద చేతి గ్రెనేడ్లను విసిరారు. ఆపై సమీపంలో నిలబడి ఉన్న పౌరులపై కాల్పులు జరిపారు, 27 మంది మరణించారు, చాలా మంది గాయపడ్డారు.[100]
- 2003 నదీమార్గ్ ఊచకోత-2003 మార్చి 23న కాశ్మీర్లోని నదీమార్గ్ లో 24 మంది హిందువులను లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమార్చారు.
- 2005 జూలై 20న శ్రీనగర్ బాంబు దాడి-శ్రీనగర్ ప్రసిద్ధ చర్చి లేన్ ప్రాంతంలో సాయుధ భారత సైన్యపు వాహనం సమీపంలో కారు బాంబు పేలుడు సంభవించింది. ఇందులో నలుగురు భారత సైనిక సిబ్బంది, ఒక పౌరుడు, ఒక ఆత్మాహుతి ఉగ్రవాది మరణించారు. ఉగ్రవాద గ్రూప్ హిజ్బుల్ ముజాహిదీన్, ఈ దాడికి బాధ్యత వహించింది.[101]
- బుద్షా చౌక్ దాడి-2005 జూలై 29న శ్రీనిగర్ నగర కేంద్రం బుద్షా చౌకులో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 2 మంది మృతి చెందగా, 17 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది మీడియా పాత్రికేయులు.[102]
- గులాం నబీ లోన్ హత్య-2005 అక్టోబరు 18న, అనుమానిత కాశ్మీరీ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ అప్పటి విద్యా మంత్రి గులాం నబీ లోన్‌ను హత్య చేశారు. అల్ మన్సురిన్ అనే ఉగ్రవాద గ్రూప్ ఈ దాడికి బాధ్యత వహించింది.[103] శ్రీనగర్‌లో జరిగిన స్మారక ర్యాలీలో ప్రముఖ ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ నాయకుడు అబ్దుల్ ఘనీ లోన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసారు. అతనికి తగినంత భద్రత కల్పించడంలో విఫలమైనందుకు భారత దళాలకు వ్యతిరేకంగా విస్తృత స్థాయిలో ప్రదర్శనలు జరిగాయి.[100]
- 2006 దోడా ఊచకోత-2006 మే 3 న, జమ్మూ కాశ్మీర్లోని దోడా, ఉధంపూర్ జిల్లాల్లో ఉగ్రవాదులు 35 మంది హిందువులను ఊచకోత కోశారు.[104]
- 2006 జూన్ 12 న జనరల్ బస్ స్టాండ్ వద్ద వైష్ణోదేవి ఆలయానికి వెళ్లే బస్సులపై ఉగ్రవాదులు మూడు గ్రెనేడ్లను విసిరినప్పుడు ఒక వ్యక్తి మరణించగా, 31 మంది గాయపడ్డారు.[105]
- 2014 కాశ్మీర్ లోయ దాడులు-2014 డిసెంబర్ 5న సైన్యం, పోలీసులు, పౌరులపై నాలుగు దాడులు జరిగాయి, ఫలితంగా 21 మంది మరణించారు, అనేక మంది గాయపడ్డారు. అప్పుడు జరుగుతున్న శాసనసభ ఎన్నికలకు అంతరాయం కలిగించడమే వారి ఉద్దేశం.[106]
- 2016 యూరీ దాడి-నలుగురు సాయుధ ఉగ్రవాదులు సైనిక శిబిరంలోకి చొరబడి, గుడారాలపై గ్రెనేడ్లను విసిరారు, దీనివల్ల భారీ కాల్పులు జరిగాయి, 19 మంది సైనిక సిబ్బంది మరణించారు.
- 2018 సుంజువాన్ దాడి-2018 ఫిబ్రవరి 10న, జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లోని సుంజువాన ఆర్మీ క్యాంప్పై దాడి చేశారు. 6 మంది భారత సైనికులు, 4 మంది ఉగ్రవాదులు, 1 పౌరుడు మరణించారు, 11 మంది గాయపడ్డారు.
- 2019 పుల్వామా దాడి-2019 ఫిబ్రవరి 14న, జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులు సిఆర్పిఎఫ్ జవాన్ల కాన్వాయ్పై దాడి చేసి 46 మంది సిబ్బందిని చంపి 20 మందిని గాయపరిచారు.
ప్రాణనష్టం
[మార్చు]ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2017 మార్చి నాటికి తిరుగుబాటు కారణంగా కాశ్మీర్ లోయ జమ్మూ ప్రాంతం రెండింటిలోనూ 14,000 మంది పౌరులు, 5,000 మంది భద్రతా సిబ్బంది, 22,000 మంది ఉగ్రవాదులతో సహా సుమారు 41,000 మంది మరణించారు. ఈ మరణాలలో అధికశాతం 1990 ల్లోను, 2000 వ దశకం ప్రారంభంలోనూ సంభవించాయి. హింసలో క్షీణత వలన మరణాల సంఖ్య 2004 నుండి గణనీయంగా తగ్గింది.[45] హ్యూమన్ రైట్స్ వాచ్ 2006 నివేదిక ప్రకారం అప్పటికి కనీసం 20,000 మంది పౌరులు ఈ ఘర్షణలో మరణించారు. [107] ఈ భూభాగంలో 2017 మార్చి వరకు దాదాపు 69,820 ఉగ్రవాద సంఘటనలను జరిగాయి.[45] 1989 - 2002 మధ్యకాలంలో హతమైన ఉగ్రవాదుల్లో దాదాపు 3,000 మంది జమ్మూ కాశ్మీరుకు బయటివారు (ఎక్కువగా పాకిస్తానీయులు, కొంతమంది ఆఫ్ఘన్‌లు). ఉగ్రవాద నిరోధక చర్యలలో నిమగ్నమైన భారత బలగాలు ఈ కాలంలో దాదాపు 40,000 తుపాకీలను, 150,000 పేలుడు పరికరాలను, 60 లక్షల మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. [108] జమ్మూ కాశ్మీర్ కోయలిషన్ ఆఫ్ సివిల్ సొసైటీ ప్రకారం 70,000 మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది పౌరులు.[109] పౌరులు, భద్రతా బలగాలు, ఉగ్రవాదులు అందరూ కలిపి 80,000 మంది మరణించినట్లు పాకిస్తాన్ అనుకూల హురియత్ గ్రూప్ పేర్కొంది.[110] కుప్వారా, బారాముల్లా, పూంచ్, దోడా, అనంత్‌నాగ్, పుల్వామా జిల్లాల్లో అత్యధిక హత్యలు జరిగాయి.[111]
సంవత్సరం | హత్య ఘటనలు | పౌరులు | భద్రతా దళాలు | ఉగ్రవాదులు | మొత్తం |
---|---|---|---|---|---|
2007 | 427 | 127 | 119 | 498 | 744 |
2008 | 261 | 71 | 85 | 382 | 538 |
2009 | 208 | 53 | 73 | 247 | 373 |
2010 | 189 | 34 | 69 | 258 | 361 |
2011 | 119 | 33 | 31 | 117 | 181 |
2012 | 70 | 19 | 18 | 84 | 121 |
2013 | 84 | 19 | 53 | 100 | 172 |
2014 | 91 | 28 | 47 | 114 | 189 |
2015 | 86 | 19 | 41 | 115 | 175 |
2016 | 112 | 14 | 88 | 165 | 267 |
2017 | 163 | 54 | 83 | 220 | 357 |
2018 | 206 | 86 | 95 | 271 | 452 |
2019 | 135 | 42 | 78 | 163 | 283 |
2020 | 140 | 33 | 56 | 232 | 321 |
2021 | 153 | 36 | 45 | 193 | 274 |
2022 | 151 | 30 | 30 | 193 | 253 |
లొంగుబాటు, పునరావాస విధానం
[మార్చు]జమ్మూ కాశ్మీర్‌లో లొంగుబాట్లను వ్యవస్థీకరించారు.[112][113][114] 1990 లలో కొన్ని లొంగుబాటు విధానాలు కనిపించగా, 2000 లలో జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఉగ్రవాదుల కోసం ఒక విధానం, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాదులకు మరొక విధానం ఉండేది.[112][113] 1995 ఆగస్టు 15న కాశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం మొదటి లొంగుబాటు విధానాన్ని ప్రారంభించారు. నక్సలైట్ల కోసం ఇప్పటికే ఉన్న విధానాన్నే ఇక్కడా అనుసరించారు.[115]
ఇవి కూడా చూడండి
[మార్చు]- 2018 సుంజువాన్ దాడి
- జమ్మూ కాశ్మీర్లోని మారణకాండల జాబితా
- ఆల్ పార్టీస్ హురియత్ కాన్ఫరెన్స్
- భారతదేశ విభజన
- ఇఖ్వాన్
మూలాలు
[మార్చు]- ↑ Specified, Not. "Chronicle of Important events/date in J&K's political history". www.jammu-kashmir.com. Archived from the original on 12 October 2017. Retrieved 29 April 2018.
- ↑ "DeM cadres lead women congregations across Kashmir". Greater Kashmir. 3 August 2016. Archived from the original on 24 December 2018. Retrieved 9 August 2016.
- ↑ Gul, Khalid (5 August 2016). "Pro-freedom rallies in Pampore, Bijbehara". Greater Kashmir. Archived from the original on 8 August 2016. Retrieved 9 August 2016.
- ↑ "DeM activists asked to make Dua-e-Majlis successful". Kashmir Reader. 2 August 2016. Archived from the original on 3 August 2016. Retrieved 9 August 2016.
- ↑ "This is people's Movement, be United: DeM". 22 July 2016. Archived from the original on 24 December 2018. Retrieved 9 August 2016.
- ↑ Until My Freedom Has Come: The New Intifada in Kashmir. Penguin Books India. 2011. ISBN 9780143416470. Archived from the original on 20 April 2023. Retrieved 12 November 2020.
- ↑ Margolis, Eric (2004). War at the Top of the World: The Struggle for Afghanistan, Kashmir and Tibet. Routledge. p. 81. ISBN 9781135955595. Archived from the original on 20 April 2023. Retrieved 12 November 2020.
- ↑ Bose, Sumantra (2009). Kashmir: Roots of Conflict, Paths to Peace. Harvard University Press. p. 107. ISBN 9780674028555. Archived from the original on 20 April 2023. Retrieved 12 November 2020.
- ↑ "insurgency" (noun), Merriam-Webster Unabridged, archived from the original on 20 January 2020, retrieved 27 November 2019 Quote: "The quality or state of being insurgent; specifically : a condition of revolt against a recognized government that does not reach the proportions of an organized revolutionary government and is not recognized as belligerency" (subscription required)
- ↑ insurgency, n, Oxford English Dictionary, archived from the original on 20 January 2020, retrieved 27 November 2019 Quote: "The quality or state of being insurgent; the tendency to rise in revolt; = insurgence n. = The action of rising against authority; a rising, revolt." (subscription required)
- ↑ Insurgency, Encyclopedia Britannica, archived from the original on 27 November 2019, retrieved 27 November 2019 Quote: "Insurgency, term historically restricted to rebellious acts that did not reach the proportions of an organized revolution. It has subsequently been applied to any such armed uprising, typically guerrilla in character, against the recognized government of a state or country." (subscription required)"
- ↑ "Al Qaeda In the Indian Subcontinent Released Video Titled 'Kashmir is our' Al Qaeda again target india". 12 October 2021. Archived from the original on 19 November 2022. Retrieved 13 October 2021.
- ↑ Elizabeth Van Wie Davis; Rouben Azizian (2007). Islam, Oil, and Geopolitics: Central Asia After September 11. Rowman & Littlefield Publishers, Incorporated. p. 281. ISBN 978-0-7425-4128-3. Archived from the original on 20 April 2023. Retrieved 13 May 2021.
The trouble was that elements of Pakistan ' s government were involved with Islamist extremists . They had protected and supported not only the Taliban but also insurgents crossing the Line of Control into Indian - held Kashmir
- ↑ 14.0 14.1 14.2 Kazi, Seema (2017), "Law, Gender and Governance in Kashmir", in Chitralekha Zutshi (ed.), Kashmir: History, Politics, Representation, Cambridge University Press, pp. 150–171, 153, ISBN 978-1-108-22612-7, archived from the original on 20 April 2023, retrieved 27 November 2019
- ↑ Kapur, S. Paul (2017), Jihad as Grand Strategy: Islamist Militancy, National Security, and the Pakistani State, Oxford University Press, pp. 84–, ISBN 978-0-19-976852-3, archived from the original on 20 April 2023, retrieved 27 November 2019
- ↑
- Swami, Praveen (2007). India, Pakistan and the Secret Jihad. New York, NY 10016, USA: Routledge. ISBN 978-0-415-40459-4.
{{cite book}}
: CS1 maint: location (link) - "Al Qaeda thriving in Kashmir in support of Pakistani intelligence against india reports Al Qaeda camps in azad kashmir Pakistan". Christian Science Monitor. 2 July 2002. Archived from the original on 12 November 2021. Retrieved 12 November 2021.
- Swami, Praveen (2007). India, Pakistan and the Secret Jihad. New York, NY 10016, USA: Routledge. ISBN 978-0-415-40459-4.
- ↑ "Al-Qaeda calls for liberation of Kashmir". YouTube. Archived from the original on 2021-12-13. Retrieved 1 August 2021.
- ↑ "Dawood is a terrorist, has 'strategic alliance' with ISI, says US". The Times of India. Archived from the original on 3 October 2017. Retrieved 2017-06-07.
- ↑ "ISIS announces new India and Pakistan provinces, casually breaking up Khorasan". The Defense Post. 15 May 2019. Archived from the original on 10 June 2020. Retrieved 4 June 2019.
- ↑ "Islamic State claims it has established province in India, calls it Wilayah of Hind: Report". 11 May 2019. Archived from the original on 18 April 2021. Retrieved 18 April 2021.
- ↑ 21.0 21.1 "Islamic State J-K chief among 4 terrorists killed in Kashmir". Rediff.com. 22 June 2018. Archived from the original on 20 December 2022. Retrieved 20 April 2023.
- ↑ News Desk (2021-09-07). "Masarat Alam is new chairman of Hurriyat Conference | Free Press Kashmir". freepresskashmir.news (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2021-10-17.
- ↑ "India imposes Kashmir lockdown, puts leaders 'under house arrest'". Archived from the original on 19 November 2022. Retrieved 29 March 2022.
- ↑ 24.0 24.1 24.2 Snehesh Alex Philip, What Imran Khan says is 9 lakh soldiers in Kashmir is actually 3.43 lakh only Archived 2 సెప్టెంబరు 2021 at the Wayback Machine, The Print, 12 November 2019.
- ↑ "India's leader makes peace overtures in Kashmir", The Times, 18 November 2004, archived from the original on 23 May 2011: "Military experts estimate that India has about 250,000 troops in the region."
- ↑ "Kashmir". Stimson Center. Archived from the original on 30 June 2006.: "Some reports estimate that India deploys approximately 400,000 combined army and paramilitary forces in Kashmir, most of which are stationed in the interior, 80,000 of which are deployed along the LoC."
- ↑ "Yearly Fatalities". SATP. Retrieved 2024-06-01.
- ↑ "Yearly Fatalities". SATP. Retrieved 2024-06-01.
- ↑ "Kashmir insurgents". Uppsala Conflict Data Program. Archived from the original on 1 October 2017. Retrieved 29 March 2017.
- ↑ "40,000 people killed in Kashmir: India". The Express Tribune. Archived from the original on 27 February 2017.
- ↑ 31.0 31.1 Slater, Joanna (28 March 2019), "From scholars into militants: Educated Kashmiri youths are joining an anti-India insurgency", The Washington Post, archived from the original on 27 November 2019, retrieved 27 November 2019
- ↑ (a) Kashmir, region Indian subcontinent, Encyclopaedia Britannica, archived from the original on 13 August 2019, retrieved 15 August 2019 (subscription required);
(b) "Kashmir", Encyclopedia Americana, Scholastic Library Publishing, 2006, p. 328, ISBN 978-0-7172-0139-6, archived from the original on 17 January 2023, retrieved 27 November 2019 C. E Bosworth, University of Manchester - ↑ Jan·Osma鈔czyk, Edmund; Osmańczyk, Edmund Jan (2003), Encyclopedia of the United Nations and International Agreements: G to M, Taylor & Francis, pp. 1191–, ISBN 978-0-415-93922-5, archived from the original on 17 January 2023, retrieved 27 November 2019 Quote: "Jammu and Kashmir: Territory in northwestern India, subject to a dispute between India and Pakistan. It has borders with Pakistan and China."
- ↑ The Editorial Board (6 August 2019), "India Tempts Fate in Kashmir, 'The Most Dangerous Place in the World'", The New York Times, archived from the original on 19 November 2022, retrieved 27 November 2019 Quote: "The Himalayan territory of Kashmir has long been the central source of friction between India and Pakistan and a hotbed of separatist aspirations."
- ↑ Ratcliffe, Rebecca (4 August 2019), "Heightened security and anxiety in Kashmir amid fears of unrest", Guardian, archived from the original on 12 December 2019, retrieved 27 November 2019 Quote: "Kashmir is claimed by India and Pakistan in full and ruled in part by both. An insurgency on the Indian-administered side has been ongoing for three decades, and tens of thousands of people have been killed."
- ↑ ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు;ucdp.uu.se
అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ "Elections in Kashmir". Kashmirlibrary.org. Archived from the original on 1 February 2017. Retrieved 2017-02-23.
- ↑ Jeelani, Mushtaq A. (25 June 2001). "Kashmir: A History Littered With Rigged Elections". Media Monitors Network. Archived from the original on 4 March 2016. Retrieved 24 February 2017.
- ↑ 39.0 39.1 39.2 "India Pakistan – Timeline". BBC News. Archived from the original on 22 February 2017. Retrieved 10 April 2015.
- ↑ Ali, Mahmud (9 October 2006). "Pakistan's shadowy secret service". BBC News. Archived from the original on 21 February 2017. Retrieved 22 February 2017.
- ↑ 41.0 41.1 Rashid, Ahmed (6 October 2006). "Nato's top brass accuse Pakistan over Taliban aid". The Daily Telegraph. Archived from the original on 22 February 2017. Retrieved 22 February 2017.
- ↑ Gall, Carlotta (21 January 2007). "At Border, Signs of Pakistani Role in Taliban Surge". The New York Times. Archived from the original on 31 December 2016. Retrieved 21 February 2017.
- ↑ Jehl, Douglas; Dugger, Celia W.; Barringer, Felicity (25 February 2002). "Death of Reporter Puts Focus on Pakistan Intelligence Unit". The New York Times. Archived from the original on 2 May 2017. Retrieved 21 February 2017.
- ↑ "Pakistan supported, trained terror groups: Pervez Musharraf". Business Standard. Press Trust of India. 28 October 2015. Archived from the original on 5 June 2017. Retrieved 21 February 2017.
- ↑ 45.0 45.1 45.2 Jayanth Jacob; Aurangzeb Naqshbandi. "41,000 deaths in 27 years: The anatomy of Kashmir militancy in numbers". Hindustan Times (in Indian English). Retrieved 18 May 2023. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "ht2017" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ Evans 2002
- ↑ "Omar Abdullah hails Sheikh Abdullah's decision to accede J-K to India". Archived from the original on 8 December 2013. Retrieved 10 November 2016.
- ↑ "Excerpts of Sheikh Abdullah's speech defending the accession". 9 August 2016. Archived from the original on 10 November 2016.
- ↑ Fatalities in Terrorist Violence 1988–2014 in Jammu & Kashmir Archived 15 జూలై 2011 at Wikiwix, South Asian Terrorism, SATP (2014)
- ↑ Tikoo, Colonel Tej K (2013). Kashmir: Its Aborigines and Their Exodus. Lancer Publishers LLC. pp. 397–. ISBN 978-1-935501-58-9.
- ↑ Behera, Navnita Chadha (2006). Kashmir Demysitified. Washington: Brookings Institution Press.
- ↑ Behera, Navnita Chadha (2006). Kashmir Demystified. Washington D.C.: Brookings Institution Press.
- ↑ Bose, Sumantra (2003). Kashmir Roots of Conflict Paths to Peace. Cambridge: Harvard University Press. pp. 146.
- ↑ Behra, Navnita Chadha (2006). Demystifying Kashmir. Washington D.C.: Brookings Institution Press. p. 150.
- ↑ "Fernandes reveals 'Sarp Vinash' toll". The Hindu. 31 July 2003. Archived from the original on 5 November 2005.
- ↑ "A Militia Against Terror | J&K: Operation Sarp Vinash - The Army Strikes Hard | South Asia Intelligence Review (SAIR), Vol. No. 1.46". www.satp.org. Archived from the original on 25 September 2016. Retrieved 2018-03-07.
- ↑ Kumar, Devesh (2003-05-24). "Operation Sarp Vinash: Army clears Hill Kaka". The Economic Times. Archived from the original on 8 March 2018. Retrieved 2018-03-07.
- ↑ "Operation 'Sarp Vinash': Over 60 terrorists killed". www.rediff.com. Archived from the original on 13 June 2017. Retrieved 2018-03-07.
- ↑ Majid, Zulfikar. "'Sarp Vinash type of operation needed to eradicate militancy in Rajuri-Poonch'". Deccan Herald (in ఇంగ్లీష్). Retrieved 2024-06-09.
- ↑ Joseph, Josy. "Operation Sarp Vinash chief pulled up". Rediff (in ఇంగ్లీష్). Retrieved 2024-06-09.
- ↑ "Cinema halls are first fatality of militancy in Kashmir". 29 October 2018. Archived from the original on 29 April 2021. Retrieved 29 April 2021.
- ↑ "Kashmir's ghost theatres". 16 March 2018. Archived from the original on 29 April 2021. Retrieved 29 April 2021.
- ↑ "Kashmir has lost its cinema halls but not its love for the movies". 19 December 2016. Archived from the original on 29 April 2021. Retrieved 29 April 2021.
- ↑ Benkin, Richard L. (2017-04-12). What Is Moderate Islam? (in ఇంగ్లీష్). Lexington Books. p. 47. ISBN 9781498537421. Archived from the original on 20 April 2023. Retrieved 12 November 2020.
- ↑ Tucker, Spencer C. (2013). Encyclopedia of Insurgency and Counterinsurgency A New Era of Modern Warfare. Santa Barbara, California: ABC-CLIO, LLC. ISBN 978-1-61069-279-3.
- ↑ "Hizbul Mujahideen almost wiped out in Kashmir". The Times of India. 19 October 2011. Archived from the original on 29 July 2012.
- ↑ "J&K: Top LeT commander killed in encounter". 3 August 2012. Archived from the original on 3 August 2012.
- ↑ "NIA :: Banned Terrorist Organisations". 2016-01-10. Archived from the original on 10 January 2016. Retrieved 2022-04-20.
- ↑ "Kashmiris join insurgency against India at highest rate in two decades". The Express Tribune. 24 February 2015. Archived from the original on 26 June 2015. Retrieved 25 June 2015.
- ↑ "Who are the Kashmir militants?". BBC News. 1 August 2012. Archived from the original on 20 February 2017. Retrieved 21 February 2017.
- ↑ "Jammu's Doda is militancy free, say cops after Hizbul terrorist Masood killed in encounter". Hindustan Times (in ఇంగ్లీష్). 2020-06-29. Archived from the original on 29 June 2020. Retrieved 2020-06-29.
- ↑ "No Hizbul militant in south Kashmir's Tral now, first time since 1989: Police". The Times of India (in ఇంగ్లీష్). 26 June 2020. Archived from the original on 28 September 2020. Retrieved 2020-06-29.
- ↑ "No resident of Srinagar in terrorist ranks after killing of top LeT commander: Kashmir IGP". The Indian Express (in ఇంగ్లీష్). 2020-07-26. Archived from the original on 27 July 2020. Retrieved 2020-07-27.
- ↑ Hussain, Ashiq (2020-07-26). "After killing of LeT man, no resident of Srinagar is in terrorist ranks: IGP". Hindustan Times (in ఇంగ్లీష్). Archived from the original on 27 July 2020. Retrieved 2020-07-27.
- ↑ Pandit, M. Saleem (26 July 2020). "Srinagar district is now terror-free: Police". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 27 July 2020. Retrieved 2020-07-27.
- ↑ "NC terms drone attack inside Jammu airport as terrorism by rogue state Pakistan". Mathrubhumi (in ఇంగ్లీష్). 28 June 2021. Archived from the original on 28 June 2021. Retrieved 2021-06-28.
- ↑ "10 Jawans Killed This Year in J&K as Terrorists Ramp Up Grenade, Hit-&-Run Attacks on Security Forces". News18 (in ఇంగ్లీష్). 2022-04-22. Archived from the original on 22 April 2022. Retrieved 2022-04-22.
- ↑ Schofield, Victoria (2000). Kashmir in Conflict: India, Pakistan and the Unending War (in ఇంగ్లీష్). I.B.Tauris. p. 137. ISBN 9781860648984.
- ↑ "How Mufti Mohammad Sayeed Shaped the 1987 Elections in Kashmir". The Caravan (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-03-22. Archived from the original on 28 April 2017. Retrieved 2017-05-04.
- ↑ "Pakistan needs to incite those fighting in Kashmir: Musharraf". India Today. 16 October 2014. Archived from the original on 12 October 2017. Retrieved 22 February 2017.
- ↑ "ISI sponsors terror activities in Kashmir, FBI tells US court". Firstpost. 21 July 2011. Archived from the original on 24 September 2015. Retrieved 1 April 2015.
- ↑ Rajghatta, Chidanand (20 July 2011). "US exposes ISI subversion of Kashmir issue; FBI arrests US-based lobbyist". The Times of India. Archived from the original on 12 August 2017. Retrieved 22 February 2017.
- ↑ Kumar, Himani (7 June 2011). "ISI gives arms to Kashmir terrorists: Rana to FBI". Rediff.com. Archived from the original on 5 August 2017. Retrieved 22 February 2017.
- ↑ Agencies (20 July 2011). "ISI funneled millions to influence US policy on Kashmir: FBI". The Indian Express. Archived from the original on 24 February 2017. Retrieved 22 February 2017.
- ↑ "'Historic day': PM Imran inaugurates 24/7 border crossing at Torkham". DAWN.COM (in ఇంగ్లీష్). 18 September 2019. Archived from the original on 23 May 2022. Retrieved 27 November 2019.
- ↑ 86.0 86.1 Puri, Luv (27 November 2019). "The many faces of Pakistani Punjab's militancy". The Hindu (in Indian English). Archived from the original on 19 November 2021. Retrieved 27 November 2019.
- ↑ Gowhar Geelani. "Five reasons behind radicalisation in Kashmir". www.dailyo.in. Archived from the original on 9 March 2017. Retrieved 2017-05-24.
- ↑ Waheeda Khan, Conflict in Kashmir 2015
- ↑ 89.0 89.1 Bukhari, Mannan (2015-07-28). Kashmir - Scars of Pellet Gun: The Brutal Face of Suppression (in ఇంగ్లీష్). Partridge Publishing. p. 44. ISBN 9781482850062. Archived from the original on 20 April 2023. Retrieved 12 November 2020.
- ↑ "Summers of Unrest Challenging India". www.kashmirlife.net (in బ్రిటిష్ ఇంగ్లీష్). 20 December 2010. Archived from the original on 12 October 2017.
- ↑ "Four killed in Kashmir bomb blast". BBC News. 20 July 2005. Archived from the original on 25 August 2016. Retrieved 22 February 2017.
- ↑ Mushtaq, Sheikh. "Ten Killed in Kashmir Car Bomb Blast". ABC News. Archived from the original on 29 April 2018. Retrieved 24 February 2017.
- ↑ "K P S Gill: The Kashmiri Pandits: An Ethnic Cleansing the World Forgot – Islamist Extremism & Terrorism in South Asia". satp.org. Archived from the original on 9 March 2009. Retrieved 25 June 2015.
- ↑ Alexander Evans, A departure from history: Kashmiri Pandits, 1990–2001, Contemporary South Asia (Volume 11, Number 1, 1 March 2002, pp. 19–37)
- ↑ "Chronicle of Important events/date in J&K's political history". jammu-kashmir.com. Archived from the original on 14 June 2015. Retrieved 25 June 2015.
- ↑ "Kashmir's first blood". The Indian Express (in ఇంగ్లీష్). 2005-05-01. Archived from the original on 9 September 2021. Retrieved 2021-09-09.
- ↑ "Sangrampora killings". Archived from the original on 15 April 2005.
- ↑ "Wandhama Massacre report". Archived from the original on 9 October 1999. Retrieved 29 May 2005.
- ↑ Dugger, Celia W. (9 October 2001). "Pakistan Asks India to Revive Talks Aimed at Bringing Peace to Kashmir". The New York Times. Archived from the original on 23 February 2017. Retrieved 23 February 2017.
- ↑ 100.0 100.1 "Human Rights Watch World Report 2003: India". Archived from the original on 6 October 2010.
- ↑ "20 July 2005 Srinagar attack". Archived from the original on 18 November 2005.
- ↑ "July 29 attack in Srinagar". Archived from the original on 3 March 2007.
- ↑ "Kashmir minister killed in attack". BBC News. 18 October 2005. Archived from the original on 22 February 2017. Retrieved 22 February 2017.
- ↑ Tribune News Service (4 May 2006). "Phagwara observes bandh over J&K massacre". The Tribune. Archived from the original on 12 October 2017. Retrieved 22 February 2017.
- ↑ Sharma, S.P. (13 June 2006). "Terror in Jammu, Anantnag". The Tribune. Archived from the original on 1 October 2017. Retrieved 22 February 2017.
- ↑ "Multiple attacks rock Kashmir Valley". The Hindu: Mobile Edition. 5 December 2014. Archived from the original on 24 December 2014. Retrieved 24 December 2014.
- ↑ Everyone Lives in Fear: Patterns of Impunity in Jammu and Kashmir (PDF) (Report). Human Rights Watch. September 2006. p. 1.
- ↑ Bose, Sumantra (2003). Kashmir: Roots of Conflict, Paths to Peace. Harvard University Press. p. 3. Archived from the original on 12 October 2017.
- ↑ "Like Karadzic, Prosecute All Accused of HR Violations in Kashmir: JKCCS". Kashmir Observer. Archived from the original on 16 October 2017. Retrieved 19 October 2017.
- ↑ Sumantra Bose (2003), Kashmir : roots of conflict, paths to peace, Harvard University Press, p. 4, ISBN 0-674-01173-2
- ↑ 111.0 111.1 "datasheet-terrorist-attack-fatalities". www.satp.org. Archived from the original on 31 January 2022. Retrieved 2022-02-12.
- ↑ 112.0 112.1 Kakar, Harsha (24 November 2017). "Why Kashmir needs much more than surrender appeals". ORF. Archived from the original on 20 October 2021. Retrieved 2021-10-16.
- ↑ 113.0 113.1 Malik, Irfan Amin (2020-11-25). "Will Army's Draft 'Surrender Policy' In J&K Help Combat Militancy?". TheQuint (in ఇంగ్లీష్). Archived from the original on 20 October 2021. Retrieved 2021-10-16.
- ↑ Yasir, Sameer (2017-10-16). "Jammu and Kashmir security forces' new appeal to militants: Surrender, come home and rejoin society". Firstpost (in ఇంగ్లీష్). Archived from the original on 20 October 2021. Retrieved 2021-10-16.
- ↑ Kartha, Tara (5 June 2018). "New Age Militancy – Kashmir Youth Need Policies Encouraging Change, Not Surrender". The Wire. Archived from the original on 20 April 2023. Retrieved 2021-10-20.
ఉల్లేఖన లోపం: <references>
లో "SumantraKashmir" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references>
లో "SwamiSecret" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references>
లో "AltafElections" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references>
లో "BBCKashmir" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references>
లో "ArifShadow" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references>
లో "HasanPakistan" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references>
లో "KhanMilitants" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references>
లో "StephensJob" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references>
లో "ColeObama" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references>
లో "RediffKashmir" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references>
లో "EconomistStony" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references>
లో "EconomistGrim" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references>
లో "EconomistPlace" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references>
లో "BBCKillings" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references>
లో "HRW96" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references>
లో "YardleyPower" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references>
లో "PalloneEthnic" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references>
లో "RamaDilemma" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references>
లో "NomaniMuslims" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references>
లో "SangThink" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references>
లో "ThottamValley" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references>
లో "BBCFuture" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references>
లో "CHSurvey" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references>
లో "AbbasQaeda" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references>
లో "SmithSAS" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references>
లో "IHTKashmir" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references>
లో "HinduQaeda" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references>
లో "SmuckerQaeda" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
ఉల్లేఖన లోపం: <references>
లో "DawnQaeda" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.
<references>
లో "GuptaKashmir" అనే పేరుతో నిర్వచించిన <ref>
ట్యాగును ముందరి పాఠ్యంలో వాడలేదు.- మూలాల లోపాలున్న పేజీలు
- CS1 బ్రిటిష్ ఇంగ్లీష్-language sources (en-gb)
- CS1 Indian English-language sources (en-in)
- Webarchive template other archives
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- Flagdeco with missing country data templates
- Flag icons missing country data templates
- Articles with hatnote templates targeting a nonexistent page