Jump to content

48వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

వికీపీడియా నుండి
48వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
Awarded forప్రపంచ ఉత్తమ సినిమా
Presented byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్

48వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అనేది 2017 నవంబరు 20 నుండి 28 వరకు గోవాలో జరిగింది. ఈ చిత్రోత్సవంలో "సెలబ్రేటింగ్ ది ఫ్యూచర్ ఆఫ్ సినిమా" పండుగ అనేది థీమ్‌గా తీసుకోబడింది. 2017 అక్టోబరు ప్రారంభంలో రిజిస్ట్రేషన్‌లు ప్రారంభించబడ్డాయి.[1]

భారతీయ పనోరమా విభాగం జ్యూరీ హెడ్‌గా నియమితులైన సినీనిర్మాత సుజోయ్ ఘోష్, చిత్రోత్సవం నిర్వహించే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ఎస్ దుర్గ, న్యూడ్ అనే రెండు సినిమాలను చిత్రోత్సవం నుండి తొలగించిందని ఆరోపిస్తూ నవంబరు 14న తన పదవికి రాజీనామా చేశాడు. ఇండియన్ పనోరమా విభాగంలో జ్యూరీచే ఎంపిక చేసినాకూడా వారిని సంప్రదించకుండా వాటిని తొలగించారు.[2][3] అపూర్వ అస్రానీ, జ్ఞాన్ కొరియా అనే మరో ఇద్దరు సభ్యులు మరుసటి రోజు జ్యూరీ నుండి వైదొలిగారు.[4]

విజేతలు

[మార్చు]
  • గోల్డెన్ పీకాక్ (ఉత్తమ చిత్రం): రాబిన్ కాంపిల్లో రచించిన బిసిఎం-బీట్స్ పర్ మినిట్
  • ఉత్తమ దర్శకుడు అవార్డు: వివియన్ క్యూ (ఏంజెల్స్ వేర్ వైట్
  • ఉత్తమ నటుడి అవార్డు: నహుయెల్ పెరెజ్ బిస్కేయార్ట్ (బిసిఎం-బీట్స్ పర్ మినిట్)
  • ఉత్తమ నటి అవార్డు: పార్వతి (టేక్ ఆఫ్)
  • ఉత్తమ తొలిచిత్ర దర్శకుడు: కిరో రస్సో (డార్క్ స్కల్)
  • సిల్వర్ పీకాక్ స్పెషల్ జ్యూరీ అవార్డు: మహేష్ నారాయణన్ (టేక్ ఆఫ్)[5]

ప్రత్యేక అవార్డులు

[మార్చు]
  • గాంధీ మెడల్: మనోజ్ కదమ్ రచించిన క్షితిజ్ ఎ హారిజన్.
  • లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు - ఆటమ్ ఎగోయన్
  • ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు: అమితాబ్ బచ్చన్[5]

మూలాలు

[మార్చు]
  1. "Registration begins for 48th IFFI". The Hindu. Retrieved 2023-05-25.
  2. "48th International Film Festival of India: Days after two films dropped from fest, jury chief Sujoy Ghosh resigns". The Indian Express. 14 November 2017. Retrieved 2023-05-25.
  3. "Sujoy Ghosh quits as IFFI Indian Panorama section jury chief after I&B Ministry drops two films from lineup". The Hindu. 14 November 2017. Retrieved 2023-05-25.
  4. "IFFI row hots up, two more jury members resign". The Economic Times. 15 November 2017. Retrieved 2023-05-25.
  5. 5.0 5.1 "IFFI 2017 complete winners list: Parvathy wins Best Actress; Amitabh Bachchan is 'Film Personality of The Year'".

బయటి లింకులు

[మార్చు]