Jump to content

అమ్మోనియం క్లోరైడ్

వికీపీడియా నుండి
(NH4Cl నుండి దారిమార్పు చెందింది)
అమ్మోనియం క్లోరైడ్
Unit cell of ammonium chloride
Powder of ammonium chloride
పేర్లు
IUPAC నామము
Ammonium chloride
ఇతర పేర్లు
Sal ammoniac, Salmiac, Nushadir salt, Sal armagnac, Salt armoniack
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [12125-02-9]
యూరోపియన్ కమిషన్ సంఖ్య 235-186-4
కెగ్ D01139
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:31206
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య BP4550000
ATC code B05XA04,G04BA01
SMILES [Cl-].[NH4+]
ధర్మములు
ClH4N
మోలార్ ద్రవ్యరాశి 53.49 g·mol−1
స్వరూపం White solid, hygroscopic
వాసన Odorless
సాంద్రత 1.5274 g/cm3[1]
ద్రవీభవన స్థానం 338 °C (640 °F; 611 K)
బాష్పీభవన స్థానం 520 °C (968 °F; 793 K)
Sublimation conditions Sublimes at 337.6 °C[2]
ΔsublHo = 176.1 kJ/mol
244 g/L (−15 °C)
294 g/L (0 °C)
283.0 g/L (25 °C)
454.4 g/L (40 °C)
740.8 g/L (100 °C)[3]
Solubility product, Ksp 30.9 (395 g/L)[4]
ద్రావణీయత Soluble in liquid ammonia, acetone, hydrazine, alcohol
Insoluble in diethyl ether, ethyl acetate[2]
ద్రావణీయత in methanol 3.2 g/100 g (17 °C)
3.35 g/100 g (19 °C)
3.54 g/100 g (25 °C)[2]
ద్రావణీయత in ethanol 6 g/L (19 °C)[1]
ద్రావణీయత in glycerol 97 g/kg[2]
ద్రావణీయత in sulfur dioxide 0.09 g/kg (0 °C)
0.031 g/kg (25 °C)[2]
ద్రావణీయత in acetic acid 0.67 g/kg (16.6 °C)[2]
బాష్ప పీడనం 133.3 Pa (160.4 °C)[5]
6.5 kPa (250 °C)
33.5 kPa (300 °C)[1]
ఆమ్లత్వం (pKa) 9.24
వక్రీభవన గుణకం (nD) 1.642 (20 °C)[2]
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
−314.43 kJ/mol[1]
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
94.56 J/mol·K[1]
విశిష్టోష్ణ సామర్థ్యం, C 84.1 J/mol·K[1]
ప్రమాదాలు
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు GHS07: Exclamation mark[5]
జి.హెచ్.ఎస్.సంకేత పదం Warning
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు H302, H319[5]
GHS precautionary statements P305+351+338[5]
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు R22, R36
S-పదబంధాలు (S2), మూస:S22
జ్వలన స్థానం {{{value}}}
Lethal dose or concentration (LD, LC):
1650 mg/kg (rats, oral)
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
none[6]
REL (Recommended)
TWA 10 mg/m3 ST 20 mg/m3 (as fume)[6]
IDLH (Immediate danger)
N.D.[6]
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Sodium chloride
Potassium chloride
Hydroxylammonium chloride
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

అమ్మోనియం క్లోరైడ్ అనునది ఒక రసాయన సమ్మేళన పదార్థం. ఇది ఒక ఆకర్బన సమ్మేళన పదార్థం .

భౌతిక రసాయనికధర్మాలు

[మార్చు]

దీని యొక్క రసాయనిక సంకేతపదం NH4Cl. అమ్మోనియం,, క్లోరిన్ మూలకాల సంయోగం వలన ఈ సమ్మేళన పదార్థం ఏర్పడినది. ఇది తెల్లని ఘన స్పటిక రూపలవణం. ఈ సమ్మేళనం నీటిలో అతిత్వరగా కరుగును. సజల అమ్మోనియం క్లోరైడ్ ద్రావణం కొద్దిగా ఆమ్ల లక్షణాలను కలిగి ఉండును. సహజసిద్ధంగా ఏర్పడిన ఖనిజ అమ్మోనియం క్లోరైడ్ ను సాల్ అమ్మోనియాక్ అని పిలుస్తారు. రాకాసి బొగ్గు నిల్వలపై స్వభావ సిద్దంగా ఏర్పడు ఈలవణము, రాకాసి బొగ్గు (coal) నుండి విడుదల అగు వాయువుల ఏర్పడును. కొన్ని రకాల అగ్ని పర్వతాల జ్వాలముఖి అంచుల వద్ద గుర్తించారు. కొన్నిరకాల మధురసాలలో మంచి సువాసనని ఇచ్చుటకు వాడెదరు. హైడ్రోక్లోరిక్ ఆమ్లం, అమ్మోనియా వాయువు యొక్క రసాయనిక చర్య వలన అమ్మోనియం క్లోరైడ్ ఉత్పత్తి అగును.

వనరులు/ఉత్పత్తి

[మార్చు]

సాల్వే విధానం (Solvay process) లో సోడియం కార్బోనేట్ ను ఉత్పత్తి చెయ్యునప్పుడు అమ్మోనియం క్లోరైడ్ కుడా ఏర్పడును.

CO2 + 2 NH3 + 2 NaCl + H2O → 2 NH4Cl + Na2CO3

ఈ సాల్వే విధానాన్ని అమ్మోనియం క్లోరైడ్ సమ్మేళనం ఉత్పత్తి చెయ్యుటకు మాత్రమే కాకుండా, పారిశ్రామిక ఉత్పత్తి పద్ధతులలో/ప్రక్రియలలో వెలువడు అమ్మోనియా పరిమాణాన్ని తగ్గించుటకై కూడా ఉపయోగిస్తారు. వ్యాపార పరంగా అమ్మోనియా (NH3) వాయువును ఈథర్ హైడ్రోజన్ క్లోరైడ్ వాయువుతో లేదా హైడ్రోక్లోరిక్ ఆమ్లం (ద్రవ స్థితి) సమ్మేళనం /సంయోగం చెందించి అమ్మోనోయం క్లోరైడ్ ను ఉత్పత్తి చేయుదురు.

NH3 + HCl → NH4Cl

రసాయనిక చర్యలు

[మార్చు]

అమ్మోనియం క్లోరైడ్ ను వేడి చేసిన ఉత్పతనం (sublime) చెందుతుంది.

NH4Cl → NH3 + HCl

అమ్మోనియం క్లోరైడ్ బలమైన క్షారాలతో చర్య జరిపినప్పుడు అమ్మోనియం వాయువును విడుదల చేయును.

NH4Cl + NaOH → NH3 + NaCl + H2O

అదే విధంగా అధిక ఉష్ణోగ్రత వద్ద క్షార లోహ కార్బోనేట్ లతో రసాయనిక చర్య జరిపి అమ్మోనియా, లోహ క్లోరైడు లను ఏర్పరచును.

2 NH4Cl + Na2CO3 → 2 NaCl + CO2 + H2O + 2 NH3

5% (బరువు ప్రకారం) అమ్మోనియం క్లోరైడ్ యొక్క pH విలువ 4.6 నుండి 6.0 వరకు ఉండును. కొన్ని రసాయన పదార్థాలతో అమ్మోనియం క్లోరైడ్ జరుపు చర్యలు ఉష్ణ గ్రాహాక (endothermic) లక్షణాన్ని కలిగి ఉండును.

ఉపయోగాలు

[మార్చు]

అమ్మోనియం క్లోరైను అధిక మొత్తంలో నత్రజని వనరుగా రసాయనిక ఎరువు లలో వాడుచున్నారు. ప్రపంచంలో ఉత్పత్తి అగు అమ్మోనియం క్లోరైడ్ లో 90 %ను రసాయనిక ఎరువులలో వాడుచున్నారు, ముఖ్యంగా ఆసియా దేశాలలో వరి, గోధుమ సాగుచేయు ప్రాంతపు ఎరువులలో. 18శతాబ్ది కాలంలో బాణసంచు (pyrotechnics) తయారీలో ఉపయోగించేవారు. కాని కాలక్రమేనా దీనికన్నా సురక్షితమైన, తక్కువ చెమ్మ పిల్చే రసాయనాలను అమ్మోనియం క్లోరైడ్ కు బదులుగా వాడటం ప్రారంభించారు. కళాయి పూత/తగరపు పూత (tin coated), గాల్వనైజింగు,, టంకం (solder) పనులలో స్రావకం (flux) గా ఉపయోగిస్తారు.

అమ్మోనియం క్లోరైడ్ ను దగ్గు మందులలో expectorant గా ఉపయోగిస్తారు. తీవ్రమైన మెటబోలిక్ అల్కలోసిస్ చికిత్సలో అమ్మోనియం క్లోరైడ్ ను అసిడిఫైయింగు కారకంగా ఉపయోగిస్తారు. సాల్ అమోనియాక్ అను పిలువబడు అమ్మోనియం క్లోరైడ్ ను పలు దేశాలలో ఫుడ్ అడిటివ్ గా చేర్చెదరు. పశువుల దానాలో పోషక సప్లిమెంట్ గా వాడెదరు.

ప్రయోగశాల లలో ఉష్ణోగ్రతను తగ్గించుట కై కూలింగ్ బాత్ లలో అమ్మోనియం క్లోరైడ్ ను ఉపయోగిస్తారు. అమ్మోనియం క్లోరైడ్ ద్రవాన్ని అమ్మోనియాతో కలిపి బఫ్ఫర్ ద్రవము (buffer solutions) గా ఉపయోగిస్తారు.

జింకు-కార్బన్ విద్యుత్తు ఘటకాలలో (batteries) ఎలాక్ట్రోలైట్ గా ఉపయోగిస్తారు. శాంపోలలో, ప్లయ్ వుడ్ ను అతికించు జిగురులలో, శుభ్రపరచు ద్రవ్యాలలో ఉపయోగిస్తారు. అమోనియం క్లోరైడ్ ను జౌళి పరిశ్రమలలో రంగుల అద్దకంలో (dyeing ), టాన్నింగ్ (tanning) తదితర ప్రక్రియల లలో వినియోగిస్తారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 Pradyot, Patnaik (2003). Handbook of Inorganic Chemicals. The McGraw-Hill Companies, Inc. ISBN 0-07-049439-8.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 2.6 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-07-23. Retrieved 2015-07-12.
  3. Seidell, Atherton; Linke, William F. (1919). Solubilities of Inorganic and Organic Compounds (2nd ed.). D. Van Nostrand Company.
    Results here are multiplied by water's density at temperature of solution for unit conversion.
  4. "Solubility Products of Selected Compounds". saltlakemetals. Salt Lake Metals. Retrieved 2014-06-11.
  5. 5.0 5.1 5.2 5.3 మూస:Sigma-Aldrich
  6. 6.0 6.1 6.2 NIOSH Pocket Guide to Chemical Hazards. "#0029". National Institute for Occupational Safety and Health (NIOSH).