Jump to content

అమ్మోనియం క్లోరేట్

వికీపీడియా నుండి
(NH4ClO3 నుండి దారిమార్పు చెందింది)
అమ్మోనియం క్లోరేట్
Ammonium chlorate
పేర్లు
IUPAC నామము
Ammonium chlorate
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [10192-29-7]
పబ్ కెమ్ 61491
SMILES O=Cl(=O)O.N
ధర్మములు
ClH4NO3
మోలార్ ద్రవ్యరాశి 101.49 g·mol−1
స్వరూపం small colorless crystals
సాంద్రత 2.42 g/cm3
ద్రవీభవన స్థానం 380 °C (716 °F; 653 K)
ప్రమాదాలు
ప్రధానమైన ప్రమాదాలు strong oxidant, decomposes when heated
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Barium chlorate
Potassium chlorate
Sodium chlorate
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

అమ్మోనియం క్లోరేట్ ఒక రసాయనిక సమ్మేళనం..

భౌతిక లక్షణాలు

[మార్చు]

అమ్మోనియం క్లోరేట్ ఒక ఆకర్బన సమ్మేళనపదార్థం. రంగులేని చిన్న స్పటిక రూపంలో ఉండును. ఇది నీటిలో సులభంగా, త్వరితంగా కరుగు స్వభావాన్ని కలిగి యున్నది. ఈ సమ్మేళనం బలమైనఆక్సీకరణ పదార్థం. అమ్మోనియంక్లోరేట్ సజల ఆల్కహాల్ లో స్వల్పంగా కరుగుతుంది. కాని గాఢ ఆల్కహాల్ లో కరుగదు. అమ్మోనియం క్లోరేట్ బలమైన ఆక్సికరణి కావున దిని ఎటువంటి పరిస్థితి లోను మండే పదార్థాలతో కలిపి నిల్వ ఉంచరాదు.

అమ్మోనియం క్లోరేట్ యొక్క రసాయనిక సంకేతం H4ClNO3.[1] ఈ సమ్మేళనపదార్థం యొక్క సాంద్రత 2.42 గ్రాములు/సెం.మీ3[2].ఈ సమ్మేళన పదార్థం యొక్క అణుభారం101.49 గ్రాములు/. మోల్−1.[3] ద్రవీభవన స్థానం102 °C[1]

ఉత్పత్తి విధానం

[మార్చు]

క్లోరిక్‌ ఆమ్లాన్ని అమ్మోనియా లేదా అమ్మోనియం కార్బోనేట్‌తో తటస్థింకరించడంవలన అమ్మోనియం క్లోరేట్ ఏర్పడును.

, బేరియం, స్ట్రాన్షియం, లేదా కాల్షియం క్లోరేట్‌లను అమ్మోనియకార్బోనేట్ లేదా అమ్మోనియం సల్ఫేట్‌లతో చర్య జరిపించిన ఆయా మూలకాల కార్బొనేట్లులేదా సల్ఫేట్‌లు అవక్షేపంగా ఏర్పడగా, అమ్మోనియం క్లోరేట్ ద్రవరూపంలో ఏర్పడును.అమ్మోనియం క్లోరేట్ సన్నని సూదులవంటి స్పటికాలుగారుపుదిద్దుకోనును.[2]

బేరియం క్లోరెట్ ను అమ్మోనియం సల్ఫేట్ తో రసాయన చర్య జరిపించిన అమ్మోనియం క్లోరేట్+బేరియం సల్ఫేట్, నీరు ఏర్పడును.

కాల్షియం క్లోరెట్ ను అమ్మోనియం సల్ఫేట్ తో రసాయనిక చర్య జరిపించినను అమ్మోనియం క్లోరెట్ ఉత్పత్తి అగును.

రసాయన చర్యలు

[మార్చు]

వేడిచేసినప్పుడు 102C ఉష్ణోగ్రత వద్ద వియోగం చెందును. వియోగ ఫలితంగా నత్రజని, క్లోరిన్,, ఆక్సిజన్ వాయువులు వెలువడును. అమ్మోనియం క్లోరేట్ బలమైన ఆక్సికరణి అయినప్పటికీ, స్థిరమైన అక్సికరణి అగుటచే ఇది కొన్ని సందర్భాలలో, గది ఉష్ణోగ్రత వద్దకూడా తీవ్రస్థాయిలో వియోగం చెందును. అమ్మోనియం క్లోరేట్ ద్రవాలు కుడా అస్థిరమైనవే.

ఉపయోగాలు

[మార్చు]

దీనిని ప్రేలుడు పదార్థంగా (explosive), రసాయన పదార్థంగా,, ఆక్సీకరణిగా ఉపయోగిస్తారు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Ammonium Chlorate". endmemo.com. Retrieved 2015-07-14.
  2. 2.0 2.1 "Ammonium Chlorate". worldofchemicals.com. Archived from the original on 2017-11-10. Retrieved 2015-07-14.
  3. "ammonium chlorate". webqc.org. Retrieved 2015-07-15.