అందరికీ మొనగాడు
అందరికీ మొనగాడు (1971 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎం.మల్లికార్జునరావు |
---|---|
తారాగణం | కృష్ణ, భారతి, ముక్కామల, ప్రభాకర రెడ్డి, రాజబాబు, విజయలలిత, జ్యోతిలక్ష్మి, గుమ్మడి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ పద్మావతీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
అందరికీ మొనగాడు 1971, ఫిబ్రవరి 13న విడుదలైన తెలుగు సినిమా. ఎం.మల్లికార్జునరావు స్వీయదర్శకత్వంలో శ్రీ పద్మావతీ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించాడు.[1]
నటీనటులు
[మార్చు]- ఘట్టమనేని కృష్ణ - గూఢచారి గోపి
- భారతి - లీల
- గుమ్మడి
- రాజబాబు
- జి.రామకృష్ణ
- మందాడి ప్రభాకర రెడ్డి - రాజా
- ముక్కామల
- విజయలలిత
- గీతాంజలి - విమల
- జగ్గారావు
- ఆనంద్ మోహన్
- నెల్లూరు కాంతారావు
- వెన్నిరాడై నిర్మల
- జ్యోతిలక్ష్మి
- విజయభాను
- సురేఖ
- శ్యామల
- జూ.భానుమతి
- రావి కొండలరావు
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాత, దర్శకుడు: ఎం.మల్లికార్జునరావు
- ఛాయాగ్రాహకుడు: వి. ఎస్. ఆర్. స్వామి
- కూర్పు: ఎన్.ఎస్.ప్రకాశం
- సంగీతం: కె.వి.మహదేవన్
- పాటలు, మాటలు: ఆరుద్ర
- నేపథ్య గాయకులు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి
- కళ: వెంకటరావు
- నృత్యం: బి.హీరాలాల్, చిన్ని - సంపత్
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలను ఆరుద్ర రచించగా కె.వి.మహదేవన్ సంగీతం సమకూర్చాడు.[2]
- అడగనా మాననా అమ్మాయి అడిగితే ఇస్తావా హాయి - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల
- ఒక పనిమీద వచ్చాను వచ్చిన పనినే మరిచాను నీమగసిరి రవ్వంత చూసి నా మనసు పూర్తిగా ఇచ్చాను - ఎల్.ఆర్.ఈశ్వరి
- ఓ కమ్మనిదొకటి దాచాను ఇమ్మన్నది నీకు ఇస్తాను చక్కనివాడా మక్కువతీరా ఉక్కిరి బిక్కిరి చేస్తాను - ఎల్.ఆర్.ఈశ్వరి
- దారంట పోయేదానా నీవెంట నేను రానా నా జంట నీవై నీ పంట నేనై పొదరింట నిను దోచుకోనా - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- బింకంలోని పెంకితనం నాదే నాదే నా పొంకంలోని వెచ్చదనం నీదే నీదే- ఎల్.ఆర్.ఈశ్వరి
కథాసంగ్రహం
[మార్చు]డాక్టర్ రాజా అనే సైంటిస్టు తయారు చేస్తున్న అమూల్యమైన పరిశోధనా పత్రాలను స్వాయత్తం చేసుకోవాలని సర్దార్ అనే దేశద్రోహి ప్రయత్నిస్తూ ఉంటాడు. రాజా వద్ద సెక్రెటరీగా పనిచేస్తున్న విమల అనే అమ్మాయి ఆ దేశద్రోహుల ముఠా చేతుల్లో చిక్కి రాజా పరిశోధనల ఫార్ములాను అందజేసి వారి చేతుల్లోనే బలై పోయింది. ఆ దేశద్రోహుల ముఠాను కనిపెట్టి వారిని మట్టుపెట్టడానికి కేంద్ర అపరాధ పరిశోధక శాఖ గోపి అనే గూఢచారి 116 ను నియమిస్తుంది. గోపి విమల చెల్లెలు లీలను రాజా వద్ద సెక్రెటరీగా నియమించి తద్వారా ఆ ముఠాను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈలోగా వారిద్దరూ ప్రేమలో పడతారు. క్షణక్షణానికీ ప్రాణాపాయ ఘటనలను ఎదుర్కొంటారు. వారిద్దరూ సర్దార్‌ను, అతని ముఠాను ఎలా ఎదుర్కొన్నారన్నదే మిగిలిన సినిమా.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ వెబ్ మాస్టర్. "Andhariki Monagadu (M. Mallikarjun Rao) 1971". ఇండియన్ సినిమా. Retrieved 14 January 2023.
- ↑ ఈశ్వర్ (13 February 1971). Andhariki Monagadu (1971)-Song_Booklet (1 ed.). p. 8. Retrieved 14 January 2023.
- ↑ సంపాదకుడు (21 February 1971). "చిత్ర సమీక్ష:అందరికీ మొనగాడు" (PDF). ఆంధ్రజ్యోతి దినపత్రిక. Archived from the original (PDF) on 14 జనవరి 2023. Retrieved 14 January 2023.
- ↑ వీరా (21 February 1971). "చిత్రసమీక్ష: అందరికీ మొనగాడు" (PDF). విశాలాంధ్ర దినపత్రిక. Archived from the original (PDF) on 14 జనవరి 2023. Retrieved 14 January 2023.
- ఘంటసాల గళామృతము బ్లాగు - సంకలనకర్త: కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- 1971 తెలుగు సినిమాలు
- ముక్కామల నటించిన సినిమాలు
- రాజబాబు నటించిన సినిమాలు
- ఘట్టమనేని కృష్ణ నటించిన సినిమాలు
- గుమ్మడి నటించిన సినిమాలు
- విజయభాను నటించిన సినిమాలు
- ప్రభాకర్ రెడ్డి నటించిన సినిమాలు
- విజయలలిత నటించిన సినిమాలు
- జ్యోతిలక్ష్మి నటించిన సినిమాలు
- రావి కొండలరావు నటించిన సినిమాలు
- కె.వి.మహదేవన్ సంగీతం కూర్చిన సినిమాలు